BMI
-
అధిక బరువు ఉన్నారా? ఈ బెలూన్ మింగారంటే చాలు.. 20 నిముషాల్లో..!
బరువు తగ్గడానికి అనేక మార్గాలున్నాయి. తమ ఊబకాయం అకస్మాత్తుగా ప్రాణాపాయం వంటి ప్రమాదం తెచ్చిపెట్టేంత ఎక్కువగా (మార్బిడ్ ఒబేసిటీ) ఉంటే... బేరియాట్రిక్ శస్త్రచికిత్స వంటివీ అందుబాటులో ఉన్నాయి. అయితే స్వల్ప, ఓ మోస్తరు ఊబకాయం ఉన్నప్పుడు... పొట్టను కాస్తా... పేగు స్థాయికి కోసేయడం ఇష్టపడని వారికోసం ఇప్పుడు కేవలం ఓ క్యాప్సూల్‌ను మింగించి, అది పొట్టలోకి వెళ్లాక బెలూన్లా ఉబ్బేలా చేయడం ద్వారా ఆహారం తక్కువగా తీసుకునేలా చేస్తూ, బరువు తగ్గించే పద్ధతి అందుబాటులోకి వచ్చింది. దీన్నే ‘‘స్వాలోవబుల్ గ్యాస్ట్రిక్ బెలూన్’’ అంటారు. దాని గురించి తెలిపే కథనమిది. ఎవరైనా సరే... కాస్త బొద్దుగా ఉంటే పర్వాలేదు. కానీ... అతిగా లావు పెరిగితే ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. అధిక ఊబకాయం కొన్నిసార్లు అకస్మాత్తుగా ప్రాణాపాయాన్నీ తెచ్చిపెట్టవచ్చు. ఓ వ్యక్తి బాడీ–మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) ప్రమాదకరమైన స్థాయికి చేరినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది. పట్టికలో ఉన్న బీఎమ్‌ఐని బట్టి... అది స్వల్ప, ఓ మోస్తరు స్థాయిలో ఉంటే ఆ ఊబకాయాన్ని తగ్గించడానికి ఈ ‘‘గ్యాస్ట్రిక్ బెలూన్’’ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఎలా అమర్చుతారంటే... తొలుత క్యాప్సూల్లా ఉండే ఉబ్బని బెలూన్ను ఊబకాయం ఉన్న వ్యక్తి చేత మింగిస్తారు. అది కడుపులోపలికి వెళ్లాక సరైన స్థానంలో ఉందా అని నిర్ధారణ చేసుకుం టారు. ఆ తర్వాత, దానికి అతుక్కుని ఉన్న సన్నటి ట్యూబ్ ద్వారా నీటిని పంపి, బెలూన్ను ఉబ్బేలా చేస్తారు. ఉబ్బగానే... దానికి అతుక్కుని ఉన్న ట్యూబ్‌ను మెల్లగా బయటకు లాగేస్తారు. ∙ఈ మొత్తం ప్రక్రియ 20 నిమిషాల్లో ముగుస్తుంది. ఈ బెలూన్ కడుపులో 4 – 6 నెలల పాటు ఉంటుంది. ఆ తర్వాత అది స్వాభావికంగానే జారిపోతుంది. ఎలా పని చేస్తుందంటే...? కడుపులోని ఖాళీ ప్రదేశంలో బెలూన్ ఉండటమూ, ఆహారం పట్టడానికి తక్కువ ఖాళీ ప్రదేశం ఉండటంతో కొద్దిగా తినగానే కడుపు నిండిపోయి ఆకలి తీరినట్లు అనిపిస్తుంది. కానీ ఆహారం కొద్దిగానే వెళ్లడంతో, మళ్లీ కొద్దిసేపటికే ఆకలేస్తుంది. అయినప్పటికీ రోజుమొత్తం లో తినే అన్నం పరిమాణం కంటే ఇది తక్కువే ఉండటంతో... కేవలం దేహానికీ, దేహపు జీవ క్రియలకీ అవసరమైన మేరకే తింటారు. ఫలితంగా ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే శరీరపు అదనపు బరువు తగ్గిపోతుంది. ప్రయోజనాలు బాగా అభివృద్ధి చెందిన సాంతికతతో తయారైన ఈ పాలీయూరీథేన్ బెలూన్లు చాలా మృదువుగానూ, ఉపరితలం నునుపుగానూ ఉంటాయి. కాబట్టి కడుపులోని కండరాలు గాయపడటం వంటి అనర్థాలు ఉండవు. కడుపులో ప్రసరించే ఆమ్లాన్ని (యాసిడ్‌ను) ఇది బాగా తట్టుకుంటుంది. ∙దీని సహాయంతో మొత్తం దేహపు బరువులో 15 – 25 శాతం వరకు తగ్గుతుంది. దీన్ని ఉపయోగించిన దాదాపు 95 శాతం మంది, తొలగించాక కూడా దాదాపు ఏడాది పాటు అదే దేహపు బరువు తో కొనసాగుతారు. దేహపు బరువులో కనీసం 5 శాతం తగ్గినా డయాబెటిస్, గుండెజబ్బులు, ఇతరత్రా అనర్థాలు గణనీయంగా తగ్గుతున్నందున ఇది ఉపయోగకరమనే చెప్పవచ్చు. ప్రతికూలతలు అమర్చిన కొత్తలో కడుపులో ఏదో నిండుగా బెలూన్ ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ త్వరలోనే దానికి అలవాటు పడిపోతారు. కేవలం దేహం బరువులో 15 – 25 శాతం మేరకు మాత్రమే తగ్గుతుంది. కాబట్టి మరీ ఆరోగ్యానికి అనర్థం కలిగించేంత బరువు, ప్రాణాపాయం కలిగించేంత బరువు ఉంటే బేరియాట్రిక్ చేయించాల్సి రావచ్చు. స్వల్పం నుంచి ఓ మోస్తరు బరువు వారికీ, ఆపరేషన్ చేయించుకోడానికి వెనకాడేవారికీ గ్యాస్ట్రిక్ బెలూన్ ఓ మార్గం. -
BMI: బీఎంఐతో ఆందోళన వద్దు!
బీఎంఐ... బాడీ మాస్ ఇండెక్స్.. ఈ నంబరు పెరిగితే అనారోగ్యమని నమ్ముతూ, భయపడుతూ బతుకుతున్నాం! అయితే ఆరోగ్యాన్ని బీఎంఐ ఆధారంగా అంచనా వేయడం సరికాదంటున్నారు నిపుణులు. ఆరోగ్యం గురించి ప్రాథమిక అవగాహన కల్పించే పలు కొలతల్లో బీఎంఐ ఒకటి మాత్రమేనంటున్నారు... నంబర్లు మనిషి జీవితాన్ని శాసించే స్థితికి వచ్చాయి. అటు చదువు నుంచి ఇటు ఆరోగ్యం వరకు జీవితమంతా నంబర్లాటతోనే సరిపోతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఆరోగ్యంగా ఉండాలంటే ఇన్ని కేలరీల భోజనం చేయాలి, ఇన్ని అడుగులు నడవాలి, ఇన్ని గంటలు పడుకోవాలి అంటూ ప్రతి ఒక్కరిలో జ్ఞానం పెరిగిపోయింది. ఉరుకులు పరుగుల జీవితంలో శరీరంపై శ్రద్ధ పెట్టేందుకు సమయం సరిపోనివాళ్లంతా ఇలాంటి నంబర్లను నమ్ముకొంటున్నారు. రోజుకు ఎన్ని అడుగులు నడిచాం, హృదయ స్పందన రేటు ఎలాఉంది, ఆక్సిజన్ స్థాయి ఎంత, ఎంతసేపు నిద్రించాం.. అనేవి లెక్కించడానికి స్మార్ట్ డివైజ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో ప్రతిఒక్కరం తెలియకుండానే నంబర్ల రేసులో పరిగెడుతున్నాం. ఇలాంటి నంబర్లలో అందరినీ బెంబేలెత్తించేది బీఎంఐ.. బాడీ మాస్ ఇండెక్స్. సింపుల్‌గా చెప్పాలంటే మీ ఎత్తుకు మీరెంత బరువుండాలో చెప్పే కొలత. ఇది కాస్త ఎక్కువైతే మనిషి పడే ఆరాటం అంతా ఇంతాకాదు. కానీ తాజా పరిశోధనలు మాత్రం బీఎంఐకి అంత సీన్ లేదంటున్నాయి. అసలు దీన్ని ఆరోగ్యంతో లింకు పెట్టి చూసే ధోరణి మానుకోవాలంటున్నారు పరిశోధకులు. ఇది అనేక ప్రాథమిక కొలతల్లో ఒకటని చెబుతున్నారు. ప్రభుత్వానికి సాయం కోసం బీఎంఐ అనే భావనను 1832 సంవత్సరంలో బెల్జియన్ గణాంకవేత్త లాంబెర్ట్ అడోల్ఫ్ క్విటెలెట్ రూపొందించారు. అప్పటి ప్రభుత్వానికి దేశ జనాభాలో అధిక బరువున్నవారి జనాభాను గుర్తించేందుకు క్విటెలెట్ ఈ బీఎంఐకి రూపకల్పన చేశారు. తర్వాత రోజుల్లో మనుషుల బరువు ఆధారంగా వారి బీమా ప్రీమియం లెక్కించేందుకు అవసరమైన సులభమైన కొలత అమెరికా బీమా కంపెనీలకు కావాల్సివచ్చింది. ఈ కంపెనీలు జనాభాలో సగటు బరువును లెక్కించేందుకు అనేక అశాస్త్రీయ పద్ధతులు వాడేవి. వీటితో విసుగొచి్చన యాన్సెల్ కీస్ అనే డాక్టరు దాదాపు 7వేల మందిపై క్విటెలెట్ సమీకరణంతో ప్రయోగం చేశారు. ఈ సమీకరణంతో సగటు జనాభా బరువు కనుక్కోవడం సులభమని గుర్తించి దీనికి బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) అని నామకరణం చేశారు. తర్వాత రోజుల్లో మనిషి బరువు పెరిగితే అనారోగ్యమని గుర్తించడంతో పలువురు డాక్టర్లు తమ పేషెంట్ల సాధారణ ఆరోగ్య సూచీగా బీఎంఐని వాడడం ఆరంభించారు. ప్రస్తుతం డాక్టర్ల నుంచి జిమ్ ట్రైనర్ల వరకు అంతా దీన్ని నమ్ముకొని ఆరోగ్యంపై అంచనాలు వేస్తున్నారు. అదే ఫైనల్ కాదు.. ఎందుకంటే? బీఎంఐ ఎక్కువున్నంత మాత్రాన అనారోగ్యంతో ఉన్నట్లు భావించవద్దని తాజా పరిశోధనలు సూ చిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నామనేందుకు బీఎం ఐ గుర్తించని కొన్ని అంశాలున్నాయంటున్నాయి. - బీఎంఐలో బీఎఫ్పీ (బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్– శరీరంలో కొవ్వు శాతం) లెక్కింపు ఉండదు. ఇది కేవలం శరీర బరువును సూచించే కొలత మాత్రమే! అయితే అనారోగ్యమనేది బరువు వల్ల కాదు, శరీరంలోని కొవ్వు వల్ల వస్తుందని గుర్తించాలి. బీఎంఐ కొవ్వుకు, కండకు తేడాను గుర్తించదు. ఉదాహరణకు ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ బీఎంఐ ఓవర్‌వెయిట్ రేంజ్లో, ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు టామ్ బ్రాడీ బీఎంఐ ఒబేస్ రేంజ్లో ఉన్నాయి. వీరిలో కొవ్వుకు, కండకు తేడాను బీఎంఐ గుర్తించకపోవడమే ఇందుకు కారణం. - శరీరంలో బాడీ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ (శరీరంలో కొవ్వు వ్యాప్తి)ని కూడా బీఎంఐ లెక్కించదు. శరీరంలో అన్ని కొవ్వు పదార్థాలు ఒకటి కాదు, వీటిలో చెడువి, మంచివి ఉంటాయి. ఉదాహరణకు పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవారి బీఎంఐ, తుంటి వద్ద కొవ్వు ఎక్కువగా ఉన్నవారి బీఎంఐ అధికంగానే ఉంటాయి. కానీ వీరిలో పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువున్నవారు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు అధికం. - బీఎంఐ జనాభా వైరుద్ధ్యాలు గుర్తించదు. ఆంగ్లోశాక్సన్లను ఉదాహరణగా తీసుకొని క్విటెలెట్ ఈ సమీకరణం రూపొందించారు. కానీ ప్రకృతి సహజంగా ఆయా భౌగోళిక ప్రాంతాల్లో మనుషుల మధ్య వైరుద్ధ్యాలు సహజం. ఉదాహరణకు ఆసియా జనాభాలో బీఎంఐ పెరిగితే అనారోగ్యం పాలయ్యే అవకాశాలున్నాయి, కానీ పాలినేసియన్ జనాభాలో(పసిఫిక్ సముద్రంలోని కొన్ని దీవుల సముదాయాన్ని పాలినేసియా అంటారు) అధిక బీఎంఐ ఉన్నా ఆరోగ్యంగానే ఉంటారు. అందువల్ల బీఎంఐ అనేది ఆరోగ్యానికి సింగిల్ సూచిక కాదని, అనేక ప్రాథమిక కొలతల్లో ఇదిఒకటని నిపుణులు నిర్ధారిస్తున్నారు. మీ బీఎంఐ ఓవర్‌వెయిట్ లేదా ఒబేస్ రేంజ్లో ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. అంతమాత్రాన పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం కూడా లేదు. బీఎంఐ బాగా ఎక్కువుంటే ఇతర పరీక్షలు (లిపిడ్ ప్రొఫైల్ తదితరాలు) చేయించుకొని ఆరోగ్యంపై నిర్ధారణకు రావాలి. అంతేకానీ బీఎంఐ ఎక్కువైందన్న కంగారులో అనవసర డైట్ పద్ధతులు పాటించి కొత్త అనారోగ్యాలు కొనితెచ్చుకోవద్దన్నది నిపుణుల సలహా. ఇలా లెక్కిస్తారు.. ఆన్లైన్లో బీఎంఐని లెక్కించేందుకు పలు ఉచిత అప్లికేషన్లున్నాయి. బీఎంఐ లెక్కించేందుకు మీ బరువు, ఎత్తు తెలిస్తే చాలు! బరువును కిలోల్లో, ఎత్తును మీటర్లలో అప్లికేషన్లో ఎంటర్ చేస్తే మీ బీఎంఐ ఎంతో సెకన్లలో తెలుస్తుంది. బీఎంఐ 18.5 కన్నా తక్కువుంటే అండర్‌వెయిట్ (ఉండాల్సినదాని కన్నా తక్కువ బరువు), 18.5– 24.9 ఉంటే నార్మల్, 25– 29.9 ఉంటే ఓవర్‌వెయిట్ (ఉండాల్సినదాని కన్నా అధిక బరువు), 30పైన ఉంటే ఒబేస్ (ఊబకాయం)గా వర్గీకరిస్తారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
బంపరాఫర్.. బరువు తగ్గితే సగం నెల జీతం బోనస్!
స్టార్టప్ నుంచి యూనికార్న్ కంపెనీగా ఎదిగిన జెరోదా ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. వరల్డ్ హెల్త్‌డేని పురస్కరించుకుని ఉద్యోగల మధ్య ఆసక్తికర పోటీకి ఆ కంపెనీ సీఈవో నితిన్ కామత్ తెర తీశారు. గతంలో ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు రూ. 10 లక్షలు బోనస్ అందించాడు నితిన్ కామత్. జెరోదా కంపెనీ ఫౌండర్ కమ్ సీఈవో నితిన్ కామత్ ఆది నుంచి భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. తాజాగా ఆ కంపెనీ ఉద్యోగుల మధ్య విచిత్రమైన పోటీ పెట్టారు. ఏ ఉద్యోగి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 25 కంటే తక్కువగా ఉంటుందో వాళ్లకి సగం నెల జీతం బోనస్‌గా ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుతం తమ కంపెనీ ఉద్యోగుల సగటు బీఎంఐ 25.3గా ఉందని, దీన్ని 24 కిందకు తీసుకువస్తే ఉద్యోలందరికీ అర నెల జీతం బోనస్‌గా ఇస్తానంటూ కొత్త రకం కాంపిటీషన్ ప్రారంభించారు. ఆర్యోగంగా ఉంటే మిగిలిన అన్ని సాధించవచ్చు. అయితే ఫిట్‌గా ఉండేందుకు వర్కట్లు ప్రారంభించడమే కష్టమైన పని. అందుకే ఆరోగ్యం, ఫిట్నెస్కి సంబంధించి బీఎంఐ అనేది అంత శ్రేష్టమైన కొలమానం కాకపోయినప్పటికీ.. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది తేలికైన విధానం. ఈ కారణం చేతనే బీఎంఐ పోటీ పెడుతున్నట్టు నితిన్ కామత్ వివరణ ఇచ్చారు. అంతకాదు రోజు పది వేల అడుగుల నడకతో మీ పోటీని ప్రారంభించండంటూ ఉద్యోగులకు సూచించాడు. నితిన్ కామత్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం పట్ల ఉద్యోగులు శ్రద్ధ తీసుకునేలా మోటివేట్ చేయడం మంచి నిర్ణయమని కొందరు సానుకూలంగా స్పందించారు. మరికొందరు ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుందని.. ఇలాంటి పోటీలు పెట్టడం వల్ల చివరికి మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు We are running a fun health program at @zerodhaonline. Anyone on our team with BMI -
బేరియాట్రిక్ శస్త్రచికిత్స: బరువు తగ్గడంతో పాటు కో-మొర్బిడిటిస్ వ్యాధులకు చెక్
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేక్షణ (ఎన్ఎఫ్హెచ్ఎస్) 5 ఇటీవల ప్రకటించిన ఫలితాల ప్రకారం.. తెలంగాణా రాష్ట్రంలో దాదాపు మూడోవంతు పురుషులు, మహిళలు స్థూలకాయంతో బాధపడుతున్నట్టు తేలింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో 30.1 శాతం మహిళలు అధిక బరువు లేదా స్థూలకాయం కలిగివుండగా వీరి బాడ్ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) 251 కంటే ఎక్కువ ఉంది. స్థూలకాయం అంటే? అధిక బరువు ఉండటాన్ని సాధారణంగా స్థూలకాయం అంటారు. ఈ అసాధారణ లేదా అధిక కొవ్వు శరీరంలో జమ కావడం వల్ల క్రమంగా ఆరోగ్యం పాడవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. ఆసియాలోని వ్యక్తుల స్థూలకాయం 25 కేజీ/ఎంస్కై్వర్గా ఉన్నట్టు తేలింది. స్థూలకాయం అనేది జఠిలమైన ఆరోగ్య సమస్య. ఇది వచ్చేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో వ్యక్తిగత అలవాట్లు, శరీర స్వభావం, వంశపారంపర్యం, చిరుతిండి, నిల్వ ఉంచిన ఆహారం తదితర అంశాలు కీలకం. కారణాలు ఇవే ఇటీవల ఆహారం పట్ల మోజు పెరగడంతో తినే అలవాట్లు మారిపోయాయి. లాక్డౌన్ మూలంగా వ్యాయామం లోపించడం కూడా స్థూలకాయం పెరగడంలో పాత్ర పోషించింది. స్థూలకాయం అనేది అపాయకరమైన అంశం, దీని మూలంగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఫలితంగా జీవితం దుర్భరంగా మారుతుంది. అంతేకాదు స్థూలకాయంతో బాధపడే వారికి అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహం, హృద్రోగ వ్యాధులు, హార్ట్ స్ట్రోక్, ఆస్టియోఆర్హరిటిస్, నిద్రలో శ్వాస స్థంభించడం వంటి సమస్యలు వస్తాయి. ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చేందుకు ఆస్కారం ఉంది. స్థూలకాయాన్ని నివారించడం ఎలా స్థూలకాయంతో బాధపడేవారు ఆహారం, వ్యాయామం విషయంలో జాగ్రత్తు తీసుకున్నా.. దీర్ఘకాలం పాటు వాటిని కొనసాగించడంలో విఫలమం అవుతున్నారు. ఫలితంగా స్థూలకాయంపై చేసే పోరులో కొద్ది పాటి విజయం సాధించి .. తిరిగి బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గాలని కోరిక ఉన్నా వాస్తవంలో సాధ్యం కావడం లేదు. ఈ సమస్యకు బేరియాట్రిక్ శస్త్ర చికిత్స ద్వారా చక్కని పరిష్కారం లభిస్తుంది. ఇదెంతో ప్రభావవంతమైన చికిత్స, దీనితో చెప్పుకోదగ్గ, నిలదొక్కుకునే బరువు తగ్గుతుంది. స్థూలకాయంతో సంభవించే వ్యాధులను మెరుగుపరుస్తుంది లేదా నయం చేస్తుంది. బేరియాట్రిక్తో వచ్చే ఫలితాలు శస్త్రచికిత్స అనంతరం, అత్యధిక వ్యాధిగ్రస్థులు త్వరగా బరువు తగ్గుతారని చికిత్స అధ్యయనాలలో వెల్లడయ్యింది. ఇంకా ఈ పద్ధతి తర్వాత 18 నుంచి 24 నెలలు ఇలాగే ఉంటారు. శస్త్రచికిత్స అనంతరం వ్యాధిగ్రస్థులు 30 నుంచి 35 శాతం పూర్తి బరువు తగ్గవచ్చు. ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో టైప్ 2 మధుమేహంగల 90 శాతం వ్యాధిగ్రస్థులు బేరియాట్రిక్ శస్త్రచికిత్స అనంతరం కొద్ది వారాలలోపునే అద్వితీయమైన ఫలితాలను సాధించినట్టు తేలింది. మరోవైపు 14 నుంచి 56 శాతం మాత్రమే మందుల సహాయంతో మధుమేహాన్ని నియంత్రించుకోగలిగారు. అధిక రక్తపోటుగల 70 నుంచి 80 శాతం వ్యాధిగ్రస్థులు దాన్న నియంత్రించుకునేందుకు మందులు వాడుతుంటారు. శస్త్రచికిత్స విధానంతో అధిక రక్తపోటు అపాయాన్ని 46% తగ్గించుకోవచ్చు. శస్త్ర చికిత్స తర్వాత రెండు నుంచి మూడు నెలలలోపున 80 శాతం వ్యాధిగ్రస్థులు సాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంపొందించుకున్నారు. బేరియాట్రిక్ శస్త్ర చికిత్సకు బీమా భద్రత ఉంటుందా? ఐఆర్డిఏఐవారి (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలొప్మెంట్ అథారిటి ఆఫ్ ఇండియా) ఇటీవల మార్గదర్శకాలను అనుసరించి బేరియాట్రిక్ లేదా బరువు తగ్గే శస్త్ర చికిత్సలను ఆరోగ్య బీమాలోకి చేర్చారు. దీనితో వ్యాధులతో బాధపడుతున్న అనారోగ్య స్థూలకాయ వ్యక్తులు ఉపశమనం పొందవచ్చు. బేరియాట్రిక్ సర్జరీ బీమా పరిధిలోకి రావడంతో భారతదేశంలో లక్షలాది వ్యాధిగ్రస్థులకు ఉపయోగపడనుంది. అయితే ఈ సర్జరీ చేయించుకోవాలంటే 18 ఏళ్లు లేదా ఆపైన వయసు కలిగి ఉండి బీఎమ్ఐ 40కి సమానంగా ఉండాలి. లేదా అంతకంటే తీవ్రమైన అనారోగ్యాలు కలిగించే వ్యాధులకు అనుగుణంగా 35కి సమానంగా ఉండి బరువు తగ్గే పద్ధతుల పై ఆక్రమణ జరిగి వాటి వైఫల్యం కలిగితే బేరియేట్రిక్ శస్త్రచికిత్స బీమా క్లెయిం చేసుకోవచ్చు. డాక్టర్ సలహా ప్రకారం బేరియేట్రిక్ శస్త్రచికిత్స జరిగివుండాలి మరియు వైద్య ప్రోటోకోల్స్కు అనుగుణంగా ఉండాలి.(Advertorial) ఈ వ్యాసానికి సంబంధించి ఏవైనా విచారణలు ఉంటే, సంప్రదించండి రచయిత డా. నందకిషోర్ దుక్కిపాటి, మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ బేరియాట్రిక్ సర్జియన్ లిలైఫ్ హాస్పిటల్స్, హైదరాబాద్, +91 9963061234 పైన. https://timesofindia.indiatimes.com/city/hyderabad/1-in-3-people-in-t-obese-survey/articleshow/79710887.cms https://www.who.int/health-topics/obesity#tab=tab_1 https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5571887/ https://www.cdc.gov/obesity/adult/causes.html https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4888907/ https://uihc.org/health-topics/how-effective-bariatric-surgery https://www.cdc.gov/healthyweight/effects/index.html https://www.cdc.gov/healthyweight/effects/index.html https://uihc.org/health-topics/how-effective-bariatric-surgery Disclaimer: This is a public awareness initiative sponsored by J&J (P) Ltd and TOI/BCCL. The views and opinions expressed by the Surgeons in this article are based on their independent professional judgement. The information provided in this program is for general awareness only and is not intended to be relied upon as medical advice. Please consult your respective Doctor for any medical advice. J&J (P) Ltd. and TOI/BCCL disclaims any liability for the accuracy or consequences flowing from the expert views expressed in Article. -
కరోనా: వారు మరణించే అవకాశం ఎక్కువ!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే కొన్ని దేశాల్లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా అధికంగా ఉండటం శుభపరిణామంగానే చెప్పవచ్చు. ఇక కరోనా పేషెంట్లలో కొంతమంది గంటల వ్యవధిలోనే మృత్యువాత పడుతుండగా.. మరికొంత మంది మాత్రం సులువుగానే మహమ్మారిని జయించి సాధారణ జీవితం గడుపుతున్నారు. వీరిలో కొంతమంది వృద్ధులు కూడా ఉండటం గమనార్హం. ఈ వ్యత్యాసాలకు రోగి బ్లడ్ గ్రూప్ కూడా ఓ కారణమే అంటున్నారు మేరీల్యాండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్, అమెరికన్ ఫిజీషియన్ ఫ్రాన్సిస్ కోలిన్స్. స్థూలకాయం, రోగ నిరోధక వ్యవస్థ పనితీరు కూడా కరోనా సంక్రమణలో కీలక పాత్ర పోషిస్తాయని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారికి వెంటిలేటర్‌పై చికిత్స టైప్ ఓ బ్లడ్ కలిగిన కోవిడ్ పేషెంట్‌తో పోలిస్తే టైప్ ఏ బ్లడ్ కలిగి ఉన్న పేషెంట్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సిన అవసరం 50 శాతం ఎక్కువగా ఉంటుందని ఫ్రాన్సిస్ కోలిన్స్ అభిప్రాయపడ్డారు. కరోనా రోగుల రక్తంలో చోటుచేసుకుంటున్న మార్పులను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు.. కృత్రిమ మేధను ఉపయోగించి అభివృద్ధి చేసిన పరికరం ద్వారా ఈ విషయాలు వెల్లడైనట్లు తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న కొంతమంది పేషెంట్ల నమూనాలు సేకరించగా.. దాదాపు వాటన్నింటిలో ఒకే రకమైన 22 ప్రోటీన్లు గుర్తించినట్లు తెలిపారు. కరోనా ప్రభావం అనేది వివిధ వ్యక్తులపై వివిధ రకాలుగా ఉంటుందని.. ముఖ్యంగా హోస్ట్ రోగనిరోధక శక్తిపైనే వైరస్ తీవ్రత ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. (కరోనాతో ఆటవిక తెగల యోధుడి అస్తమయం) స్థూలకాయులకు కష్టమే న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగోనే ఎపిడిమాలజిస్టు జెన్నిఫర్ లైటర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన స్థూలకాయులు మరణించే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) 30 కంటే తక్కువ ఉన్నవాళ్లతో పోలిస్తే.. 30-34 మధ్య ఉన్న వాళ్లపై (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రమాణాల ప్రకారం) కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించాల్సిన ఆవశ్యకత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇక బీఎంఐ 35 కంటే ఎక్కువ ఉన్నవాళ్లు మరణించే అవకాశం అత్యధికంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ.. సెంటర్ ఫర్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ డైరెక్టర్ కార్ల్ హెనెగన్.. 45 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్లు కరోనాతో మరణించే అవకాశం తక్కువగా ఉందన్నారు. కరోనా వ్యాపించిన తొలినాళ్ల నుంచి చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపారు. అదే విధంగా ఓ వ్యక్తి ఆరోగ్యవంతుడైతే వయసుతో సంబంధం లేకుండా కరోనాను జయించే అవకాశం ఉంటుందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో డయాబెటిస్ పేషెంట్లు అప్రమత్తంగా ఉండాలని.. షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుకోకపోయినట్లయితే ప్రమాదం తప్పదని హెచ్చరించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలని సూచించారు. అధిక బరువు ఉన్న దానిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు. -
సన్నగా ఉంటే దీర్ఘాయువు
బోస్టన్: సన్నగా ఉన్నవాళ్లు ఎక్కువకాలం జీవిస్తారని అమెరికాలోని హార్వర్డ్, టఫ్ట్స్ వర్సిటీల అధ్యయనంలో తేలింది. చిన్నతనం నుంచి మధ్య వయస్సు వరకు ఎక్కువగా బరువు పెరిగినవారు త్వరగా చనిపోయే అవకాశాలుంటాయని పరిశోధకులు చెప్పారు. శరీర పరిణామక్రమం, మరణాల మధ్య సంబంధంపై వారు పరిశోధనలు చేశారు. వీటిలో 80,266 మంది మహిళలు, 36,622 మంది పురుషులు పాల్గొన్నారు. వారంతా 5, 10, 20,30,40 ఏళ్లప్పుడు వారి శరీరాకృతులు ఎలా ఉండేవో చెప్పారు. 50 ఏళ్లప్పుడు వారి శరీర ద్రవ్యరాశి సూచిక(బీఎంఐ)ను నమోదు చేశారు. 60 ఏళ్ల తర్వాత వారిపై పరిశీలన ను కొనసాగించారు. 60 దాటిన తర్వాత మరో 15 ఏళ్లలోపు చనిపోయే అవకాశం సన్నగా ఉన్న మహిళల్లో 11 శాతం, పురుషుల్లో 20.3 శాతం. అదే లావుగా ఉన్నవారిలో ఇది పెరిగి మహిళల్లో 19.7 శాతం, పురుషుల్లో 24.1 శాతంగా నమోదైంది.