Dr Nandakishore Dukkipati, Managing Director and Chief Bariatric Surgeon Livlife Hospitals, Hyderabad
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేక్షణ (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) 5 ఇటీవల ప్రకటించిన ఫలితాల ప్రకారం.. తెలంగాణా రాష్ట్రంలో దాదాపు మూడోవంతు పురుషులు, మహిళలు స్థూలకాయంతో బాధపడుతున్నట్టు తేలింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో 30.1 శాతం మహిళలు అధిక బరువు లేదా స్థూలకాయం కలిగివుండగా వీరి బాడ్ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) 251 కంటే ఎక్కువ ఉంది.
స్థూలకాయం అంటే?
అధిక బరువు ఉండటాన్ని సాధారణంగా స్థూలకాయం అంటారు. ఈ అసాధారణ లేదా అధిక కొవ్వు శరీరంలో జమ కావడం వల్ల క్రమంగా ఆరోగ్యం పాడవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. ఆసియాలోని వ్యక్తుల స్థూలకాయం 25 కేజీ/ఎంస్కై‍్వర్‌గా ఉన్నట్టు తేలింది. స్థూలకాయం అనేది జఠిలమైన ఆరోగ్య సమస్య. ఇది వచ్చేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో వ్యక్తిగత అలవాట్లు, శరీర స్వభావం, వంశపారంపర్యం, చిరుతిండి, నిల్వ ఉంచిన ఆహారం తదితర అంశాలు కీలకం.
కారణాలు ఇవే
ఇటీవల ఆహారం పట్ల మోజు పెరగడంతో తినే అలవాట్లు మారిపోయాయి. లాక్‌డౌన్ మూలంగా వ్యాయామం లోపించడం కూడా స్థూలకాయం పెరగడంలో పాత్ర పోషించింది. స్థూలకాయం అనేది అపాయకరమైన అంశం, దీని మూలంగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఫలితంగా జీవితం దుర్భరంగా మారుతుంది. అంతేకాదు స్థూలకాయంతో బాధపడే వారికి అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహం, హృద్రోగ వ్యాధులు, హార్ట్ స్ట్రోక్, ఆస్టియోఆర్హరిటిస్, నిద్రలో శ్వాస స్థంభించడం వంటి సమస్యలు వస్తాయి. ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చేందుకు ఆస్కారం ఉంది.
స్థూలకాయాన్ని నివారించడం ఎలా
స్థూలకాయంతో బాధపడేవారు ఆహారం, వ్యాయామం విషయంలో జాగ్రత్తు తీసుకున్నా.. దీర్ఘకాలం పాటు వాటిని కొనసాగించడంలో విఫలమం అవుతున్నారు. ఫలితంగా స్థూలకాయంపై చేసే పోరులో కొద్ది పాటి విజయం సాధించి .. తిరిగి బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గాలని కోరిక ఉన్నా వాస్తవంలో సాధ్యం కావడం లేదు. ఈ సమస్యకు బేరియాట్రిక్ శస్త్ర చికిత్స ద్వారా చక్కని పరిష్కారం లభిస్తుంది. ఇదెంతో ప్రభావవంతమైన చికిత్స, దీనితో చెప్పుకోదగ్గ, నిలదొక్కుకునే బరువు తగ్గుతుంది. స్థూలకాయంతో సంభవించే వ్యాధులను మెరుగుపరుస్తుంది లేదా నయం చేస్తుంది.
బేరియాట్రిక్‌తో వచ్చే ఫలితాలు
శస్త్రచికిత్స అనంతరం, అత్యధిక వ్యాధిగ్రస్థులు త్వరగా బరువు తగ్గుతారని చికిత్స అధ్యయనాలలో వెల్లడయ్యింది. ఇంకా ఈ పద్ధతి తర్వాత 18 నుంచి 24 నెలలు ఇలాగే ఉంటారు. శస్త్రచికిత్స అనంతరం వ్యాధిగ్రస్థులు 30 నుంచి 35 శాతం పూర్తి బరువు తగ్గవచ్చు. ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో టైప్ 2 మధుమేహంగల 90 శాతం వ్యాధిగ్రస్థులు బేరియాట్రిక్ శస్త్రచికిత్స అనంతరం కొద్ది వారాలలోపునే అద్వితీయమైన ఫలితాలను సాధించినట్టు తేలింది. మరోవైపు 14 నుంచి 56 శాతం మాత్రమే మందుల సహాయంతో మధుమేహాన్ని నియంత్రించుకోగలిగారు. అధిక రక్తపోటుగల 70 నుంచి 80 శాతం వ్యాధిగ్రస్థులు దాన్న నియంత్రించుకునేందుకు మందులు వాడుతుంటారు. శస్త్రచికిత్స విధానంతో అధిక రక్తపోటు అపాయాన్ని 46% తగ్గించుకోవచ్చు. శస్త్ర చికిత్స తర్వాత రెండు నుంచి మూడు నెలలలోపున 80 శాతం వ్యాధిగ్రస్థులు సాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంపొందించుకున్నారు.
బేరియాట్రిక్ శస్త్ర చికిత్సకు బీమా భద్రత ఉంటుందా?
ఐఆర్‌డిఏఐవారి (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలొప్‌మెంట్ అథారిటి ఆఫ్ ఇండియా) ఇటీవల మార్గదర్శకాలను అనుసరించి బేరియాట్రిక్ లేదా బరువు తగ్గే శస్త్ర చికిత్సలను ఆరోగ్య బీమాలోకి చేర్చారు. దీనితో వ్యాధులతో బాధపడుతున్న అనారోగ్య స్థూలకాయ వ్యక్తులు ఉపశమనం పొందవచ్చు. బేరియాట్రిక్ సర్జరీ బీమా పరిధిలోకి రావడంతో భారతదేశంలో లక్షలాది వ్యాధిగ్రస్థులకు ఉపయోగపడనుంది. అయితే ఈ సర్జరీ చేయించుకోవాలంటే 18 ఏళ్లు లేదా ఆపైన వయసు కలిగి ఉండి బీఎమ్ఐ 40కి సమానంగా ఉండాలి. లేదా అంతకంటే తీవ్రమైన అనారోగ్యాలు కలిగించే వ్యాధులకు అనుగుణంగా 35కి సమానంగా ఉండి బరువు తగ్గే పద్ధతుల పై ఆక్రమణ జరిగి వాటి వైఫల్యం కలిగితే బేరియేట్రిక్ శస్త్రచికిత్స బీమా క్లెయిం చేసుకోవచ్చు. డాక్టర్ సలహా ప్రకారం బేరియేట్రిక్ శస్త్రచికిత్స జరిగివుండాలి మరియు వైద్య ప్రోటోకోల్స్‌కు అనుగుణంగా ఉండాలి.(Advertorial)
ఈ వ్యాసానికి సంబంధించి ఏవైనా విచారణలు ఉంటే, సంప్రదించండి రచయిత డా. నందకిషోర్ దుక్కిపాటి, మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ బేరియాట్రిక్ సర్జియన్ లిలైఫ్ హాస్పిటల్స్, హైదరాబాద్, +91 9963061234 పైన.
- https://timesofindia.indiatimes.com/city/hyderabad/1-in-3-people-in-t-obese-survey/articleshow/79710887.cms
- https://www.who.int/health-topics/obesity#tab=tab_1
- https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5571887/
- https://www.cdc.gov/obesity/adult/causes.html
- https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4888907/
- https://uihc.org/health-topics/how-effective-bariatric-surgery
- https://www.cdc.gov/healthyweight/effects/index.html
- https://www.cdc.gov/healthyweight/effects/index.html
- https://uihc.org/health-topics/how-effective-bariatric-surgery
Disclaimer: This is a public awareness initiative sponsored by J&J (P) Ltd and TOI/BCCL. The views and opinions expressed by the Surgeons in this article are based on their independent professional judgement. The information provided in this program is for general awareness only and is not intended to be relied upon as medical advice. Please consult your respective Doctor for any medical advice. J&J (P) Ltd. and TOI/BCCL disclaims any liability for the accuracy or consequences flowing from the expert views expressed in Article.
Comments
Please login to add a commentAdd a comment