Bofors case
-
బోఫోర్స్ కేసులో కాంగ్రెస్‌కు ఊరట
-
సీబీఐ ‘బోఫోర్స్’ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ: బోఫోర్స్ శతఘ్నల కొనుగోలు కుంభకోణం కేసులో 2005 నాటి ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన అదే తీర్పును సవాల్ చేస్తూ న్యాయవాది, బీజేపీ నేత అజయ్ అగర్వాల్ పిటిషన్ వేశారనీ, ఆ పిటిషన్లో∙సీబీఐ కక్షిదారుగా చేరొచ్చని కోర్టు సూచించింది. హిందుజా సోదరులు సహా బోఫోర్స్ కేసులోని నిందితులందర్నీ నిర్దోషులుగా విడుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు 2005లో తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో కేసువేసింది. సాధారణంగా హైకోర్టులో తీర్పు వెలువడిన తర్వాత 90 రోజుల్లోనే ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాల్సి ఉంటుంది. అయితే సీబీఐ 13 ఏళ్ల తీవ్ర జాప్యం తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిందనీ, ఈ ఆలస్యానికి సరైన కారణం కూడా చెప్పలేకపోయిందంటూ కోర్టు సీబీఐ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ తీవ్ర జాప్యానికి సీబీఐ తెలిపిన కారణాలతో మేం సంతృప్తి చెందడం లేదు. ఇదే కేసుకు సంబంధించి అజయ్ అగర్వాల్ పిటిషన్ ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉంది. ఆ పిటిషన్లోనే సీబీఐ కూడా కక్షిదారుగా చేరి వాదనలు వినిపించవచ్చు. విచారణను పునఃప్రారంభించేందుకు అనుమతి కోరవచ్చు’ అని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హేమంత్ గుప్తాలు సభ్యులుగా గల ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు నాటి యూపీఏ ప్రభుత్వాలు తమకు అనుమతివ్వక పోవడం కారణంగానే 13 ఏళ్ల ఆలస్యమైందని సీబీఐ వాదించింది. -
బోఫోర్స్ బెంచ్ నుంచి తప్పుకున్నారు
న్యూఢిల్లీ: బోఫోర్స్ కేసును విచారిస్తోన్న సుప్రీం కోర్టు బెంచ్ నుంచి జడ్జి జస్టిస్ ఖన్వీల్కర్ తప్పుకున్నారు. సీజేఐ జస్టిస్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనంలో భాగంగా ఉన్న ఆయన తన నిర్ణయానికి సంబంధించి ఎలాంటి కారణాల్ని పేర్కొనలేదు. రూ. 64 కోట్ల బోఫోర్స్ కుంభకోణం కేసులో అన్ని ఆరోపణల్ని కొట్టివేస్తూ 2005లో ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వగా దానిని సవాలు చేస్తూ బీజేపీ నేత అగర్వాల్ కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న సీబీఐ ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసేందుకున్న అర్హతేంటో చెప్పాలని అగర్వాల్‌ను కోర్టు ఆదేశించింది. ఆ అంశంపై ధర్మాసనం మంగళవారం విచారించాల్సి ఉంది. -
మళ్లీ తెరపైకి బోఫోర్స్
సాక్షి, న్యూఢిల్లీ : బోఫోర్స్ ముడుపుల కేసులో నిందితులపై నమోదైన అభియోగాలను తోసిపుచ్చుతూ 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ శుక్రవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో హిందుజా సోదరులు సహా నిందితులందరినీ నిర్ధోషులుగా పేర్కొంటూ 2005, మే 31న ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే 12 ఏళ్ల జాప్యం తర్వాత బోఫోర్స్ కేసుపై అప్పీల్‌కు వెళ్లడానికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ విముఖత చూపుతూ చేసిన సూచనల నేపథ్యంలో సీబీఐ ఈ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ తన వాదనకు మద్దతుగా చూపిన కీలక పత్రాలు, ఆధారాలతో న్యాయనిపుణులు సంతృప్తి వ్యక్తం చేయడంతో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేసేందుకు దర్యాప్తు సంస్థ సుప్రీంను ఆశ్రయించిందని సమాచారం. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీం తలుపుతడితే న్యాయస్ధానం పిటిషన్‌ను తోసిపుచ్చవచ్చంటూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. బోఫోర్స్ కేసులో అవినీతి నిరోధక చట్టం, మోసం, నేరపూరిత కుట్ర వంటి అభియోగాలతో ఏబీ బోఫోర్స్ అప్పటి అధ్యక్షుడు మార్టిన్ అర్డ్బో, దళారీ విన్‌చద్దా, యూరప్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు హిందుజా సోదరుపలై 1990, జనవరి 22న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
‘బోఫోర్స్’ కేసులో సీజేఐని తప్పించండి
న్యూఢిల్లీ: బోఫోర్స్ కుంభకోణం ముడుపుల కేసు విచారణ నుంచి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాను తప్పించాలని బుధవారం సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. బోఫోర్స్ కుంభకోణంలో రూ.64 కోట్ల మేర ముడుపుల కేసులో సీజేఐ పక్షపాతంతో, ఏకపక్షం గా వ్యవహరించే అవకాశముందని బీజేపీ నేత, న్యాయవాది అజయ్ అగర్వాల్ తాజా పిటిషన్లో ఆరోపించారు. బోఫోర్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేని కపిల్ సిబల్‌ను జనవరి 16న జరిగిన విచారణలో జోక్యం చేసుకోవడానికి సీజేఐ అనుమతించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. సిబల్ జోక్యాన్ని తాను వ్యతిరేకించినా సీజేఐ పట్టించుకోలేదని ఆరోపించారు. అంతేకాకుండా బోఫోర్స్ కేసులో ఫిర్యాదుదారైన తనకు తగిన సాక్ష్యాలు తెచ్చే అర్హత, సామర్థ్యం లేవన్న సిబల్ వాదనతో సీజేఐ ఏకీభవించా రన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీచేసిన అజయ్.. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో ఓటమి పాలయ్యారు. -
బోఫోర్స్ భూతం వచ్చేస్తోంది
సాక్షి, న్యూఢిల్లీ : బోఫోర్స్ కేసును తిరగదొడేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. పున్వరిచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికార వర్గాలు ధృవీకరించాయి. 2005, మే 31 న బ్రిటన్‌కు చెందిన వాణిజ్యవేత్తల కుటుంబం హిందూజా సోదరులు శ్రీచంద్, గోపీచంద్, ప్రకాశ్ చంద్‌లపై నమోదయిన అభియోగాలను కొట్టేస్తూ.. వారిని నిర్దోషులుగా ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. అయితే ఆ సమయంలో ఉన్న సీబీఐ 90 రోజుల్లో తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉండగా.. ఆ పని చేయలేదు. దీనికి ప్రభుత్వం నుంచి దర్యాప్తు విభాగంపై ఒత్తిళ్లు వచ్చాయన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో ఇప్పుడు ఆ ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం. బోఫోర్స్ కేసు.. టైమ్ లైన్ ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ యేడాది జూలైలో బిజూ జనతాదళ్ ఎంపీ భర్తృహరి మహతబ్ నేతృత్వంలోని కమిటీ పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో... బోఫోర్స్ కేసు విచారణలో చాలా లోపాలున్నాయని తెలపటం తెలిసిందే. ఆ వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ.. సుప్రీంకోర్ట్ లేదా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే భోఫోర్స్ కేసుపై పునర్విచారణ సాధ్యమవుతుందని ప్రకటించింది. దీనికి తోడు ఈ మధ్యే ప్రైవేట్ డిటెక్టివ్ మైకేల్ హెర్షమ్ బోఫోర్స్ గురించి చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటామని కూడా ప్రకటించటంతో ముప్పై ఏళ్ల బోఫోర్స్ మళ్లీ తెరపైకి వచ్చినట్లయ్యింది. ఈ మధ్యలో బీజేపీ నేత అజయ్ కుమార్ అగర్వాల్ పునర్విచారణ కోసం దాఖలు చేసిన ఓ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు.. అక్టోబర్ 30 తర్వాత విచారణ చేపడతామని ప్రకటించింది కూడా. 1986 మార్చి 24న భారత ప్రభుత్వం 410 యూనిట్ల 155 ఎంఎం హవిట్జర్ గన్స్ కొనుగోలుకు స్వీడన్‌కు చెందిన ఏబీ భోఫోర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.1,437.72 కోట్లు. అయితే మరసటి ఏడాదే స్వీడిన్ రేడియో భారతదేశంలోని కొందరు రాజకీయ నాయకులకు లంచం ఇచ్చి బోఫోర్స్ సంస్థ ఈ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించి సంచలనాలనికి తెరలేపింది. 1989 నాటికి ఆ ఆరోపణలు భారీ కుంభకోణంగా రూపాంతరం చెందింది. -
మళ్లీ తెరపైకి బోఫోర్స్ కేసు
-
మళ్లీ తెరపైకి బోఫోర్స్ కేసు
న్యూఢిల్లీ : రాజకీయంగా పెను ప్రకంపనలు రేపిన బోఫోర్స్ కేసును తిరిగి విచారించనున్నట్టు సీబీఐ శుక్రవారం పార్లమెంటరీ కమిటీకి సంకేతాలు పంపింది. బోఫోర్స్ కేసు పునర్విచారణ చేపట్టాలని, సుప్రీంకోర్టు ముందు నివేదించాలని పలువురు పార్లమెంటరీ కమిటీ సభ్యులు కోరిన మీదట ఈ మేరకు సీబీఐ బదులిచ్చింది. సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్‌కు మద్దతిస్తామని కూడా సీబీఐ పేర్కొంది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే...1986 మార్చి 24న భారత సైన్యం కోసం 400 అత్యాధునిక తుపాకుల సరఫరా నిమిత్తం స్వీడిష్ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్, భారత ప్రభుత్వం మధ్య రూ.1437 కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందుకోసం ఏబీ బోఫోర్స్.. భారత్‌లో ప్రముఖ రాజకీయ నాయకులు, రక్షణ అధికారులకు భారీగా ముడుపులు చెల్లించినట్టు 1987 ఏప్రిల్ 16న స్వీడిష్ రేడియో ప్రకటించడంతో దుమారం రేగింది. దీంతో 1990లో సీబీఐ అప్పటి బోఫోర్స్ ప్రెసిడెంట్ మార్టిన్, దళారీ విన్ చద్దా, హిందుజా సోదరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేసు విచారణ క్రమంలో పలువురు నిందితులు ఖత్రోచి, విన్ చద్దా, భట్నాగర్, మార్టిన్లు మరణించారు. ఇక 2005 మే 31న బోఫోర్స్ కేసులో హిందుజా సోదరులు శ్రీచంద్, గోపీచంద్, ప్రకాష్ చంద్‌లపై అన్ని అభియోగాలను ఢిల్లీ హైకోర్టు జడ్జి ఆర్ఎస్ సోధి కొట్టివేశారు. 2004 ఫిబ్రవరి 4న ఢిల్లీ హైకోర్టు మరో జడ్జి బోఫోర్స్ కేసులో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీపై నమోదైన అభియోగాలను తోసిపుచ్చారు. బోఫోర్స్ కంపెనీపై కుట్రపూరిత మోసం అభియోగాలను మోపాలని ఆదేశించారు. -
ఓటమి స్వయంకృతాపరాధం
నాగపూర్: యూపీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు, కుంభకోణాలపై ఎప్పటికప్పుడు దీటుగా స్పందించకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని గురువారం ఆ పార్టీ సీనియర్ నాయకుడు మణి శంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు. యూపీఏ సర్కార్‌పై, కాంగ్రెస్ నాయకులపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలు, కుంభకోణాల ఆరోపణలను తమ పార్టీ నాయకులు సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. దీంతో ఆయా విమర్శలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాక, ప్రజల్లో కూడా పార్టీపై వ్యతిరేకత పెరిగేందుకు అవకాశమిచ్చినట్లయ్యిందని విశ్లేషించారు. ‘కాంగ్రెస్‌పై వచ్చిన విమర్శలపై మా పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు సమర్థవంతంగా స్పందించకపోవడంతో ప్రజలు మాకు ఓటు వేసేందుకు ఇష్టపడలేద’ని అయ్యర్ అభిప్రాయపడ్డారు. ఎంపీసీసీ మాజీ అధ్యక్షుడు రంజిత్ దేశ్‌ముఖ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్‌పై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి అయిన అయ్యర్ మీడియాతో మాట్లాడారు. పార్టీలో నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ‘ప్రతి రాజకీయపార్టీకి గెలుపోటములు సహజం. ఈ ఎన్నికల్లో ఓటమితో మేం కుంగిపోవడంలేదు. మళ్లీ మేం పుంజు కుంటాం. ఆ ధీమా మాకుంది. సోనియా, రాహుల్ నాయకత్వంలోనే తిరిగి ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటాం..’ అని స్పందించారు. కుంభకోణాల ఆరోపణలపై తమ పార్టీ నాయకులు స్పందించిన తీరును ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘రూ.1.76 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ కుంభకోణంపై కాగ్ ఇచ్చిన నివేదికపై అప్పటి టెలికాం మంత్రి అయిన కపిల్ సిబాల్ వెంటనే స్పందించకుండా మూడు నెలల తర్వాత మాట్లాడారు. ఆ వ్యవధిలో పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆరోపణలపై బాధ్యులెవరూ స్పందించకపోవడంతో అవి నిజమేనేమోనన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీని ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడింది. అలాగే కొన్ని లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంలో జరిగిన జాప్యం కూడా పరాజయానికి కారణమైందని చెప్పొచ్చు. ఉదాహరణకు తమిళనాడులోని ద క్షిణ చెన్నై స్థానానికి నామినేషన్ల ఘట్టం ఇంకో రెండు గంటల్లో ముగుస్తుందనగా పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించారు. అలాంటి సందర్భాల్లో పార్టీ ప్రజల మద్దతును ఎలా కూడగట్టుకోగలుగుతుంది..’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘అలాగే ‘బోఫోర్స్’ కేసులో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పేరును అన్యాయంగా ఇరికించారు. ఆ ఆరోపణలు అవాస్తవమని తర్వాత బయటపడింది. సదరు ఒప్పందంలో రాజీవ్ గాంధీకి ఎటువంటి సంబంధంలేదని నాకు వ్యక్తిగతంగా తెలుసు..’ అని అయ్యర్ వివరించారు.