బోఫోర్స్‌ భూతం వచ్చేస్తోంది | CBI SPL Petition to reopen Bofors case | Sakshi
Sakshi News home page

బోఫోర్స్‌ పునర్విచారణ కోసం సీబీఐ పిటిషన్‌

Published Sat, Oct 21 2017 8:55 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

CBI SPL Petition to reopen Bofors case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బోఫోర్స్‌ కేసును తిరగదొడేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. పున్వరిచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికార వర్గాలు  ధృవీకరించాయి. 

2005, మే 31 న బ్రిటన్‌కు చెందిన వాణిజ్యవేత్తల కుటుంబం హిందూజా సోదరులు శ్రీచంద్‌, గోపీచంద్‌, ప్రకాశ్‌ చంద్‌లపై నమోదయిన అభియోగాలను కొట్టేస్తూ.. వారిని నిర్దోషులుగా ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. అయితే ఆ సమయంలో ఉన్న సీబీఐ 90 రోజుల్లో తీర్పు సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాల్సి ఉండగా.. ఆ పని చేయలేదు. దీనికి ప్రభుత్వం నుంచి దర్యాప్తు విభాగంపై ఒత్తిళ్లు వచ్చాయన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో ఇప్పుడు ఆ ఆదేశాలను ఛాలెంజ్‌ చేస్తూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం. 

బోఫోర్స్‌ కేసు.. టైమ్‌ లైన్‌

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ యేడాది జూలైలో బిజూ జనతాదళ్‌ ఎంపీ భర్తృహరి మహతబ్‌ నేతృత్వంలోని కమిటీ పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో... బోఫోర్స్‌ కేసు విచారణలో చాలా లోపాలున్నాయని తెలపటం తెలిసిందే. ఆ వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ.. సుప్రీంకోర్ట్‌ లేదా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే భోఫోర్స్‌ కేసుపై పునర్విచారణ సాధ్యమవుతుందని ప్రకటించింది. దీనికి తోడు ఈ మధ్యే ప్రైవేట్‌ డిటెక్టివ్‌ మైకేల్‌ హెర్షమ్‌ బోఫోర్స్‌ గురించి చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటామని కూడా ప్రకటించటంతో ముప్పై ఏళ్ల బోఫోర్స్‌ మళ్లీ తెరపైకి వచ్చినట్లయ్యింది. ఈ మధ్యలో బీజేపీ నేత అజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ పునర్విచారణ కోసం దాఖలు చేసిన ఓ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు.. అక్టోబర్‌ 30 తర్వాత విచారణ చేపడతామని ప్రకటించింది కూడా.

1986 మార్చి 24న భారత ప్రభుత్వం 410 యూనిట్ల 155 ఎంఎం హవిట్జర్‌ గన్స్‌ కొనుగోలుకు స్వీడన్‌కు చెందిన ఏబీ భోఫోర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.1,437.72 కోట్లు. అయితే మరసటి ఏడాదే స్వీడిన్‌ రేడియో భారతదేశంలోని కొందరు రాజకీయ నాయకులకు లంచం ఇచ్చి బోఫోర్స్‌ సంస్థ ఈ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించి సంచలనాలనికి తెరలేపింది. 1989 నాటికి ఆ ఆరోపణలు భారీ కుంభకోణంగా రూపాంతరం చెందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement