bojja dashrtharami reddy
-
సీమకు అన్యాయం చేయొద్దు
నంద్యాల: దేశంలోని అత్యంత కరువు ఎదుర్కొంటున్న రాయలసీమకు అన్యా యం చేయవద్దని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం నంద్యాల పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమలోని వెనుకబాటు తనాన్ని తాగు, సాగునీటి సమస్యలను రాజకీయ సమస్యలుగా సృష్టించి కరువు సీమకు అన్యాయం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. శ్రీశైలం జలాశయంలో డెడ్ స్టోరేజ్‌కి చేరుకున్న నీటిని తరలించుకొని పోవడం బాధాకరమన్నారు. ఎంత సేపు రాజకీయ లబ్ధి కోసం సీమను వాడుకుంటున్నారే తప్ప సీమకు శాశ్వత ప్రయోజనాలను చేకూర్చడంలో ప్రభత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుండి సాగునీటి విడుదలపై ఉన్న విధానాలను రాయలసీమ హక్కులుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రతి ఏడాదీ 500టీఎంసీల నీరు సముద్రంలోకి పోతున్నా రాయలసీమలో తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. నాగార్జునసాగర్ కుడి, ఎడమల కాల్వలకు కృష్ణా డెల్టాకు కేటాయించిన నీటి కేటాయింపులు మాత్రమే శ్రీశైలం రిజర్వాయర్ నుండి నాగార్జునసాగర్‌కు విడుదల చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 872అడుగులకు పైన నీరు ఉన్నప్పుడే సాగర్‌కు నీటిని విడుదల చేయాలన్నారు. గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించడం ద్వారా ఆదా అయ్యే 45టీఎంసీల కృష్ణా జలాలను హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులకు కేటాయించే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు కేటాయించిన 60టీఎంసీల క్యారిఓవర్ నీటిని రాయలసీమ అవసరాలకు కేటాయించాలన్నారు. రాయలసీమ నీటి అవసరాల పరిష్కారం కోసం సీమ సాగునీటి కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. విభజన బిల్లులో పేర్కొన్న విధంగా ఎస్సార్బీసీ ప్రధాన కాల్వను పూర్తి చేయాలని బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర అసంపూర్తి నిర్మాణాలను, హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్, వెలుగొండ ప్రాజెక్టుల అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరారు. -
ఎస్పీవెరైడ్డి.. ఇన్నాళ్లు అధికార పార్టీలో లేరా?
నంద్యాల, న్యూస్‌లైన్: నంద్యాల పార్లమెంట్ సభ్యుడిగా పదేళ్లు అధికార పార్టీలో కొనసాగి ఏమీ అభివృద్ధి చేశారో ప్రజలకు వివరిస్తావా అంటూ రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి ఎంపీ ఎస్పీవెరైడ్డిని ప్రశ్నించారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఆయన నివాసంలో రైతు సంఘం నాయకుడు రామచంద్రారెడ్డి, విద్యార్థి సంఘం నాయకుడు రాజునాయుడుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ నుంచి నంద్యాల ఎంపీగా గెలుపొంది ప్రమాణస్వీకారం చేయకముందే నంద్యాల అభివృద్ధి కోసం తాను పార్టీ మారినట్లు చెప్పడం ఆయన దగాకోరు రాజకీయానికి నిదర్శనమన్నారు. వ్యాపారాల కోసమే పదవిని తాకట్టు పెట్టాడని దశరథరామిరెడ్డి నిప్పులు చెరిగారు. గెలుపొందిన పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వ్యాపారం చేసుకోవాలని ఎస్పీవెరైడ్డికి సూచించారు. గతంలో అధికార పార్టీలో కొనసాగి రైతులకు ఏం చేశారో వివరించాలని క్రింది ప్రశ్నలను సంధించారు. పదేళ్లుగా ఎంపీగా అధికార పార్టీలో కొనసాగుతూ 2009 నుంచి 2014 వరకు నేషనల్ వాటర్ రిసోర్స్ స్టాండింగ్ కమిటీలో మెంబర్‌గా ఉండి నంద్యాల పార్లమెంట్‌కు చేసిన అభివృద్ధి ఏమిటి? స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా శ్రీశైలం రిజర్వాయర్‌ను ఎన్ని సార్లు సందర్శించారు.. ఒకవేళ సందర్శించి ఉంటే రిజర్వాయర్ అభివృద్ధికి మీరు చేసిన ప్రతిపాదనలు? 2009లో రిజర్వాయర్‌పై వరదనీరు ఉప్పొంగితే దాని రక్షణకు మీరు ఎలాంటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారో తెలియజేయాలి? నంద్యాల పార్లమెంట్లో గుండెకాయ లాంటి కేసీ కెనాల్ ప్రాజెక్టు స్థిరీకరణ కోసం ఏం పోరాటం చేశారు. ఏదైనా ప్రాజెక్టుకు ప్రతిపాదనలు పంపారా? కేసీ కెనాల్ స్థిరీకరణకు గుండ్రేవుల రిజర్వాయర్ కో సం తుంగభద్ర హక్కుల కమిటీ పోరాటం చేసి ప్రాజెక్టును సాధిస్తే మీరు ఇచ్చిన సహకారం ఏమిటి? జిల్లా ఎంపీగా కర్నూలును రాజధానిగా ప్రకటించాలని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తో ఏమైనా హామీ పొందారా? అని బొజ్జా ప్రశ్నించారు. వీటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు