Bollinger
-
రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ క్రికెటర్
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలర్ డగ్ బొలింగర్(36) సోమవారం రిటైర్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరపున 12 టెస్టులు ఆడి 25.92 యావరేజ్‌తో 50 వికెట్లు పడగొట్టాడు. 2010లో న్యూజిలాండ్‌పై 5/28 అత్యుత్తమ ప్రదర్శన సాధించాడు. అలాగే 39 వన్డే మ్యాచ్‌లు ఆడి 23.90 యావరేజ్‌తో 60 వికెట్లు పడగొట్టాడు. 9 టీట్వంటీ మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు సాధించాడు. 2009లో ఆస్ట్రేలియా తరపున టెస్టు అరంగ్రేటం చేసిన బొలింగర్ చివరి మ్యాచ్ 2010లో ఇంగ్లాండ్‌తో ఆడాడు. అలాగే చివరి వన్డే మ్యాచ్ 2011లో దక్షిణాఫ్రికాతో ఆడాడు. మీడియాతో మాట్లాడుతూ..తన జీవితంతో ఎంతో గొప్ప వ్యక్తులను కలిశానని, అలాగే ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రపంచ క్రికెట్లో గొప్ప కెప్టెన్లుగా పేరొందిన స్టీవ్‌వా, రికీ పాంటింగ్, మైకేల్ క్లార్ నాయకత్వంలో తాను ఆడటం మరిచిపోలేని అనుభూతన్నారు. తన మిగతా సమయాన్ని భార్య, పిల్లలతో గడుపుతానని చెప్పారు. -
నేను నిన్ను చంపేస్తా?
సిడ్నీ: దాదాపు రెండేళ్ల క్రితంనాటి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ విషాద మరణాన్ని ఎవరూ మరచిపోలేదు. మైదానంలో బంతి తగిలిన అతను ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. అయితే ఇప్పుడు ఆ ఘటనపై సోమవారం నుంచి న్యాయ విచారణ జరుపుతుండంతో అతని మరణం మళ్లీ వార్తల్లో నిలిచింది. హ్యూస్కు సీన్ అబాట్ బౌన్సర్ విసిరిన ఆ మ్యాచ్‌కు సంబంధించి ప్రత్యర్థి జట్టు వ్యూహ ప్రతివ్యూహాలు, స్లెడ్జింగ్‌కు సంబంధించి అతి చిన్న విషయాలపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. అతనిపై పదే పదే షార్ట్ పిచ్ బంతులు విసరాలని న్యూ సౌత్‌వేల్స్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ చెప్పినట్లు విచారణలో తేలింది. ఒకదశలో హ్యూస్ వద్దకు వచ్చి బొలింజర్ ’నేను నిన్ను చంపబోతున్నాను’ అని కూడా వ్యాఖ్యానించినట్లు మరో క్రికెటర్ విచారణలో వెల్లడించాడు. అయితే బొలింజర్ దీనిని ఖండించాడు. సరిగ్గా ఇవే కారణాలు హ్యూస్ మృతికి కారణమని చెప్పకపోయినా... విచారణ అధికారులు మాత్రం తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.