నేను నిన్ను చంపేస్తా? | Hughes alerted Bollinger | Sakshi
Sakshi News home page

నేను నిన్ను చంపేస్తా?

Published Tue, Oct 11 2016 7:48 AM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM

నేను నిన్ను చంపేస్తా?

నేను నిన్ను చంపేస్తా?

సిడ్నీ: దాదాపు రెండేళ్ల క్రితంనాటి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ విషాద మరణాన్ని ఎవరూ మరచిపోలేదు. మైదానంలో బంతి తగిలిన అతను ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. అయితే ఇప్పుడు ఆ ఘటనపై సోమవారం నుంచి న్యాయ విచారణ జరుపుతుండంతో అతని మరణం మళ్లీ వార్తల్లో నిలిచింది. హ్యూస్‌కు సీన్ అబాట్ బౌన్సర్ విసిరిన ఆ మ్యాచ్‌కు సంబంధించి ప్రత్యర్థి జట్టు వ్యూహ ప్రతివ్యూహాలు, స్లెడ్జింగ్‌కు సంబంధించి అతి చిన్న విషయాలపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు.

అతనిపై పదే పదే షార్ట్ పిచ్ బంతులు విసరాలని న్యూ సౌత్‌వేల్స్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ చెప్పినట్లు విచారణలో తేలింది. ఒకదశలో హ్యూస్ వద్దకు వచ్చి బొలింజర్ ’నేను నిన్ను చంపబోతున్నాను’ అని కూడా వ్యాఖ్యానించినట్లు మరో క్రికెటర్ విచారణలో వెల్లడించాడు. అయితే బొలింజర్ దీనిని ఖండించాడు. సరిగ్గా ఇవే కారణాలు హ్యూస్ మృతికి కారణమని చెప్పకపోయినా... విచారణ అధికారులు మాత్రం తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement