ఆస్ట్రేలియా క్రికెట్ మరోసారి ఉలిక్కిపడింది. బంతి తలకు తగిలి 26 ఏళ్ల విల్ పుకోస్కీ అనే క్రికెటర్ గాయపడ్డాడు. అదృష్టవశాత్తు ఎలాంటి హాని జరగనప్పటికీ... ఈ ఉదంతం దివంగత ఫిల్ హ్యూస్ విషాదాన్ని గుర్తు చేసింది.
2014లో హ్యూస్ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు అదే షెఫీల్డ్ షీల్డ్‌లో ఇంచుమించు అలాంటి ఘటనే జరగడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఉలిక్కిపడింది.
పుకోస్కీకి తగిలిన గాయం తీవ్రమైంది కానప్పటికీ అతను మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రిలే మెరిడిత్ వేసిన బంతి పుకోస్కీ హెల్మెట్‌ను బలంగా తాకడంతో కొద్దిసేపు అతను నొప్పితో విలవిలలాడిపోయాడు.
పుకోస్కీ ఆస్ట్రేలియా తరఫున ఓ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌లు ఆడి 72 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. మ్యాచ్ విషయానికొస్తే.. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టస్మానియా టైగర్స్-విక్టోరియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.
పుకోస్కీ విక్టోరియాకు.. మెరిడిత్ టస్మానియాకు ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో విక్టోరియా విజయానికి దగ్గరగా ఉంది. మరో 69 పరుగులు చేస్తే ఈ జట్టు విజయం సాధిస్తుంది. చేతిలో మరో రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో విక్టోరియా కలవరపడుతుంది. కెప్టెన్ సదర్‌ల్యాండ్ (17), టాడ్ మర్ఫీ (0) క్రీజ్‌లో ఉన్నారు. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పుకోస్కీ (0) మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది.
టస్మానియా 240 & 307
విక్టోరియా 106 & 373/8
Comments
Please login to add a commentAdd a comment