Will Pucovski
-
క్రికెటర్ సంచలన నిర్ణయం.. 26 ఏళ్లకే ఆటకు వీడ్కోలు!
ఆటను ఆస్వాదించేకాలం కెరీర్లో కొనసాగుతానని కొందరు, ప్రపంచకప్ గెలిచేదాకా విశ్రమించను, వీడ్కోలు చెప్పనని ఇంకొందరు భీషి్మంచుకు కూర్చుంటారు క్రికెట్లో! టీనేజ్లోనే అరంగేట్రం చేసినా... ఆటపై తనివితీరని ప్రేమో లేదంటే వ్యామోహమో గానీ కొందరైతే 36 నుంచి 38 ఏళ్లదాకా సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగించిన వారూ ఉన్నారు. కానీ ఆస్ట్రేలియన్ బ్యాటర్ పకొవ్స్కీది విచిత్రమైన పరిస్థితి. అతను అరంగేట్రం చేసింది క్రికెట్ ప్రపంచానికే కాదు... ఆస్ట్రేలియా దేశంలోనే సరిగ్గా తెలియదు. కానీ ఇంతలోనే 26 ఏళ్లకే రిటైరవడం ద్వారా వార్తల్లో సంచలన వ్యక్తిగా ఇప్పుడు ప్రపంచానికి తెలిసొచ్చాడు. అతను 2021 జనవరిలో టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. ఒకే ఒక టెస్టు.. టీమిండియాతో భారత్‌తో సిడ్నీలో ఆడిన టెస్టే మొదటిది... ఇప్పుడు అదే ఆఖరుది! నిజం... అతను అంతర్జాతీయ క్రికెట్లో ఆడింది ఒకే ఒక టెస్టు మాత్రమే! తర్వాత వన్డే సంగతే ఎరుగడు. టీ20 ఆడింది లేదు. పకోవ్‌స్కీ పేరుకు టాపార్డర్ ప్లేయర్ అయినప్పటికీ ‘కన్కషన్’ (స్పృహ తప్పడం) ప్లేయర్‌గా స్థిరపడ్డాడు.72 పరుగులు మైదానంలో తరచూ తలకు దెబ్బలు తగిలించుకొని నెలల తరబడి సిరీస్‌లకే దూరమవడం అతని కెరీర్లో నిత్యకృత్యం. భారత్‌పై ఆడిన టెస్టులో ఒక అర్ధసెంచరీ చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో కేవలం రెండు ఇన్నింగ్స్‌లకే పరిమితమైన ఈ అరుదైన క్రికెటర్ 72 పరుగులు చేశాడంతే! విక్టోరియా తరఫున 36 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన తను 2350 పరుగులు చేశాడు. మరీ విడ్డూరం ఏమిటంటే... నేటి తరం క్రికెటర్లలో ఆసీస్‌లోని సుప్రసిద్ధ బిగ్‌బాష్ లీగ్ సహా ఏ స్థాయిలోనూ టీ20 క్రికెట్ ఆడని ఏకైక క్రికెటర్ బహుశా ఇతనొక్కడే ఉంటాడేమో! -
ఉలిక్కిపడ్డ ఆసీస్ క్రికెట్.. బంతి తగిలి క్రికెటర్‌కు గాయం
ఆస్ట్రేలియా క్రికెట్ మరోసారి ఉలిక్కిపడింది. బంతి తలకు తగిలి 26 ఏళ్ల విల్ పుకోస్కీ అనే క్రికెటర్ గాయపడ్డాడు. అదృష్టవశాత్తు ఎలాంటి హాని జరగనప్పటికీ... ఈ ఉదంతం దివంగత ఫిల్ హ్యూస్ విషాదాన్ని గుర్తు చేసింది. 2014లో హ్యూస్ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు అదే షెఫీల్డ్ షీల్డ్‌లో ఇంచుమించు అలాంటి ఘటనే జరగడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఉలిక్కిపడింది. పుకోస్కీకి తగిలిన గాయం తీవ్రమైంది కానప్పటికీ అతను మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రిలే మెరిడిత్ వేసిన బంతి పుకోస్కీ హెల్మెట్‌ను బలంగా తాకడంతో కొద్దిసేపు అతను నొప్పితో విలవిలలాడిపోయాడు. పుకోస్కీ ఆస్ట్రేలియా తరఫున ఓ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌లు ఆడి 72 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. మ్యాచ్ విషయానికొస్తే.. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టస్మానియా టైగర్స్-విక్టోరియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. పుకోస్కీ విక్టోరియాకు.. మెరిడిత్ టస్మానియాకు ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో విక్టోరియా విజయానికి దగ్గరగా ఉంది. మరో 69 పరుగులు చేస్తే ఈ జట్టు విజయం సాధిస్తుంది. చేతిలో మరో రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో విక్టోరియా కలవరపడుతుంది. కెప్టెన్ సదర్‌ల్యాండ్ (17), టాడ్ మర్ఫీ (0) క్రీజ్‌లో ఉన్నారు. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పుకోస్కీ (0) మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. టస్మానియా 240 & 307 విక్టోరియా 106 & 373/8 -
పాపం పకోవ్‌స్కీ.. మళ్లీ ఔట్!
ఏ ముహుర్తానా ఆసీస్- భారత్‌ల మధ్య సిరీస్ ప్రారంభమైందో తెలియదుగాని ఆది నుంచి చూసుకుంటే ఇరు జట్లలో ఎవరు ఒక ఆటగాడు గాయపడుతూనే వస్తున్నారు. ఇప్పటికే టీమిండియా నుంచి ఆరుగురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమవగా.. అటు ఆసీస్‌లోనూ గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. తాజాగా ఆస్ట్రేలియన్ యువ ఓపెనర్ విల్ పకోవ్‌స్కీ గాయపడిన సంగతి తెలిసిందే. విల్ పకోవ్‌స్కీ.. టెక్నిక్‌గా చూస్తే మంచి ప్రతిభావంతుడు. కానీ చిన్నప్పటి నుంచి గాయాలు అతన్ని వేధిస్తూనే ఉన్నాయి. టీమిండియాతో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆడిన తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 64, 8 పరుగులు చేశాడు. (చదవండి: ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే) అయితే సిడ్నీ టెస్టులో ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్ సమయంలో పకోవ్‌స్కీ డైవ్ చేయగా అతని భుజానికి బలమైన గాయమైంది. అతని భుజం ఎముక పాక్షికంగా పక్కకు జరగడంతో నొప్పితో బాధపడుతున్నాడని.. ప్రస్తుతం అతను విశ్రాంతి తీసుకుంటున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. దీంతో అతను ఇరు జట్లకు కీలకంగా మారిన బ్రిస్బేన్ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు అతని ఫిట్నెస్ను పరీక్షించి నాలుగో టెస్టుకు ఎంపిక చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సీఏ తెలిపింది. కాగా జనవరి 15 నుంచి టీమిండియా- ఆసీస్‌ల మధ్య బ్రిస్బేన్ వేదికగా నాలుగో టెస్టు మొదలుకానుంది.(చదవండి: 'ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు నేను సిద్ధం')