రిటైర్‌మెంట్ ప్రకటించిన డగ్ బొలింగర్
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలర్ డగ్ బొలింగర్(36) సోమవారం రిటైర్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరపున 12 టెస్టులు ఆడి 25.92 యావరేజ్‌తో 50 వికెట్లు పడగొట్టాడు. 2010లో న్యూజిలాండ్‌పై 5/28 అత్యుత్తమ ప్రదర్శన సాధించాడు. అలాగే 39 వన్డే మ్యాచ్‌లు ఆడి 23.90 యావరేజ్‌తో 60 వికెట్లు పడగొట్టాడు. 9 టీట్వంటీ మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు సాధించాడు. 2009లో ఆస్ట్రేలియా తరపున టెస్టు అరంగ్రేటం చేసిన బొలింగర్ చివరి మ్యాచ్ 2010లో ఇంగ్లాండ్‌తో ఆడాడు.
అలాగే చివరి వన్డే మ్యాచ్ 2011లో దక్షిణాఫ్రికాతో ఆడాడు. మీడియాతో మాట్లాడుతూ..తన జీవితంతో ఎంతో గొప్ప వ్యక్తులను కలిశానని, అలాగే ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రపంచ క్రికెట్లో గొప్ప కెప్టెన్లుగా పేరొందిన స్టీవ్‌వా, రికీ పాంటింగ్, మైకేల్ క్లార్ నాయకత్వంలో తాను ఆడటం మరిచిపోలేని అనుభూతన్నారు. తన మిగతా సమయాన్ని భార్య, పిల్లలతో గడుపుతానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment