Bomb Cyclone
-
ప్రమాదకరంగా పైపైకి.. శరవేగంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు
వాతావరణ మార్పులు, తద్వారా నానాటికీ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రపంచాన్ని నానాటికీ ప్రమాదపుటంచులకు నెడుతున్నాయి. వీటి దుష్పరిణామాలను 2022 పొడవునా ప్రపంచమంతా చవిచూసింది. ఆస్ట్రేలియా మొదలుకుని అమెరికా దాకా పలు దేశాల్లో ఒకవైపు కార్చిచ్చులు, మరోవైపు కనీవినీ ఎరగని వరదలు, ఇంకోవైపు తీవ్ర కరువు పరిస్థితులు, భరించలేని వేడి గాలుల వంటివి జనానికి చుక్కలు చూపాయి. ఆర్కిటిక్ బ్లాస్ట్ దెబ్బకు ఇంగ్లండ్‌తో పాటు పలు యూరప్ దేశాలు గత 40 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరగనంతటి చలి, మంచు వణికించాయి. ఆ వెంటనే అమెరికాపై విరుచుకుపడ్డ బాంబ్ సైక్లోన్ ‘శతాబ్ది మంచు తుపాను’గా మారి దేశమంతటినీ అతలాకుతలం చేసి వదిలింది. 2023లో కూడా ఇలాంటి కల్లోలాలు, ఉత్పాతాలు తప్పవని పర్యావరణ నిపుణులు ఇప్పటినుంచే హెచ్చరిస్తుండటం మరింత కలవరపెడుతోంది. వీటికి తోడు మరో పెను సమస్య చడీచప్పుడూ లేకుండా ప్రపంచంపైకి వచ్చిపడుతోంది. అదే... సముద్ర మట్టాల్లో అనూహ్య పెరుగుదల! ప్రపంచవ్యాప్తంగా అన్ని తీర ప్రాంతాల్లోనూ ఈ ప్రమాదకర పరిణామం చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్యదరా ప్రాంతంలో సముద్ర మట్టాలు మరీ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న వైనాన్ని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచ్చింది. ఇదిప్పుడు పర్యావరణవేత్తలందరినీ కలవరపెడుతోంది! 20 ఏళ్లలో 8 సెంటీమీటర్లు! సముద్ర మట్టాల్లో పెరుగుదల తాలూకు దుష్పరిణామాలు మధ్యదరా తీర ప్రాంతాల్లో కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో ఇటలీలోని అమ్లాఫీ తీరం వద్ద సముద్ర మట్టం స్పెయిన్‌లోని కోస్టా డెల్‌సోల్‌తో పోలిస్తే రెండింతలు పెరిగినట్టు పరిశోధకులు తేల్చారు. ‘‘మధ్యదరా పరిధిలో కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే అడ్రియాటిక్, ఎజియన్, లెవంటైన్ సముద్రాల తీర ప్రాంతాల్లో నీటి మట్టం 20 ఏళ్లలో ఏకంగా 8 సెంటీమీటర్లకు పైగా పెరిగింది. పైగా ఈ పెరుగుదల రేటు ఇటీవలి కాలంలో బాగా వేగం పుంజుకుంటుండటం మరింత ప్రమాదకర పరిణామం’’ అని వారు వెల్లడించారు! తమ అధ్యయనంలో భాగంగా అలలు, ఆటుపోట్ల గణాంకాలతో పాటు మంచు కరిగే రేటుకు సంబంధించి ఉపగ్రహ ఛాయాచిత్రాలు తదితరాలను లోతుగా విశ్లేషించారు. 1989 తర్వాత నుంచీ మధ్యదరా సముద్ర మట్టం శరవేగంగా పెరుగుతోందని తేల్చారు. పరిశోధన ఫలితాలు అడ్వాన్సింగ్ అర్త్ స్పేస్ సైన్సెస్ జర్నల్ తాజాగా ప్రచురితమయ్యాయి. అతి సున్నిత ప్రాంతం నిజానికి మధ్యదరా ప్రాంతం వాతావరణ మార్పులపరంగా ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి. వరదలు, క్రమక్షయం వంటివాటి దెబ్బకు ఇప్పటికే ఈ ప్రాంతంలోని ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఏకంగా 86 శాతం దాకా లుప్తమయ్యే ముప్పును ఎదుర్కొంటున్నాయి. 2022 మొదట్లో జరిగిన మరో అధ్యయనం కూడా ఇలాంటి ప్రమాదకరణ పరిణామాలనే కళ్లకు కట్టింది. మధ్యదరాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా సముద్రమట్టాలు గతంలో భావించిన దానికంటే చాలా వేగంగా పెరుగుతున్నాయన్న చేదు వాస్తవాన్ని వెల్లడించింది. గ్రీన్లాండ్ బేసిన్లో పరుచుకున్న అపారమైన మంచు నిల్వలు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఊహాతీత వేగంతో కరిగిపోతుండటం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. దానివల్ల అపారమైన పరిమాణంలో నీరు సముద్రాల్లోకి వచ్చి చేరుతోందని వివరించింది. అంతేకాదు, గ్రీన్లాండ్ మంచు ఇదే వేగంతో కరగడం కొనసాగితే 2100 కల్లా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ప్రస్తుతం ఊహిస్తున్న దానికంటే ఏకంగా ఆరు రెట్లు ఎక్కువగా పెరిగిపోతాయని కూడా హెచ్చరించింది. పెను ప్రమాదమే...! సముద్ర మట్టాలు పెరిగితే సంభవించే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు... ► తీర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి ► చిన్న చిన్న ద్వీప దేశాలు ఆనవాళ్లు కూడా మిగలకుండా సముద్రంలో కలిసిపోతాయి ► షికాగో మొదలుకుని ముంబై దాకా ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాల్లో అలరారుతున్న అతి పెద్ద నగరాలు నీట మునుగుతాయి ► వందలాది కోట్ల మంది నిర్వాసితులవుతారు. ► ఇది ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఆర్థిక, సామాజిక సమస్యగా పరిణమిస్తుంది ► సముద్రపు తాకిడి నుంచి ప్రధాన భూభాగాలకు రక్షణ కవచంగా ఉండే చిత్తడి నేలలతో కూడిన మడ అడవులు అంతరిస్తాయి ► వాటిలో నివసించే పలు జీవ జాతులు అంతరించిపోయే ప్రమాదముంది ► నేల క్రమక్షయానికి లోనవుతుంది. సాగు భూమి పరిమాణమూ తగ్గుతుంది ► భారీ వర్షాలు, అతి భారీ తుఫాన్ల వంటివి పరిపాటిగా మారతాయి – సాక్షి, నేషనల్ డెస్క్ -
తేరుకుంటున్న బఫెలో
బఫెలో: వారానికి పైగా వణికించిన మంచు తుఫాను బారినుంచి అమెరికా క్రమంగా తేరుకుంటోంది. విమాన సేవలు తదితరాలు గాడిలో పడుతున్నాయి. ముఖ్యంగా తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో సిటీలో పరిస్థితి కుదుట పడుతోంది. ప్రయాణాలపై నిషేధం ఎత్తేశారు. తుఫానులో చిక్కిన వారికోసం ఇంటింటి గాలింపు ఇంకా కొనసాగుతోంది. నగరంలో ఇప్పటిదాకా కనీసం 40 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో తుఫాను కారణంగా ఎటుచూసినా అడుగుల కొద్దీ పేరుకుపోయిన మంచు శరవేగంగా కరుగుతోంది. ఇది వరదలకు దారి తీసే ఆస్కారమున్నందున ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మంచు తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా కనీసం 540 కోట్ల డాలర్ల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బీమా కంపెనీలు అంచనా వేస్తున్నాయి. -
హమ్మయ్య.. సూర్యుడు కనిపించాడు
న్యూయార్క్: అమెరికాలో గత కొద్ది రోజులుగా మంచు తుఫాన్‌కు అల్లాడిపోయిన న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో సిటీలో ఎట్టకేలకు సూర్యరశ్మి కనిపించింది. గురువారం ఉదయం సూర్యుడి రాకతో కాసేపు వాతావరణం వెచ్చగా మారడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రజల క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి నేషనల్ గార్డ్ అధికారులు ఇంటింటికి వెళ్తున్నారు. విద్యుత్ సౌకర్యం పోయిన ఇళ్లకి వెళ్లి వారు ఎలా ఉన్నారో వాకబు చేస్తున్నారు. తీవ్రమైన మంచు కురుస్తున్నప్పుడు కరెంట్ పోయిన సమయంలో ఆక్సిజన్ వెంటిలేషన్ మీద ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సహాయం అందక కొందరు మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రహదారులపై కొన్ని అడుగుల మేర పేరుకుపోయిన మంచు కరిగితే ఇంకా ఎన్ని మృతదేహాలు బయటకు వస్తాయోనన్న ఆందోళనైతే నెలకొంది. బఫెలో నగరంలో రాకపోకల్ని పునరుద్ధరించారు. భారీ యంత్రాల సాయంతో రహదారులపై ముంచెత్తిన మంచుని తొలగించే పని యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని బఫెలో నగర మేయర్ బైరన్ బ్రౌన్ వెల్లించారు. అత్యవసరమైతే తప్ప ఇంకా ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆయన నగర ప్రజలను హెచ్చరించారు. అమెరికాలోని మరికొన్ని రాష్ట్రాల్లో మంచు ముంచేయడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో నీటి పైపులు పగిలిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులుగా కుదిపేసిన మంచు తుఫాన్ కాస్త శాంతించినట్టే కనిపిస్తోంది. -
Bomb Cyclone: శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైన మంచు తుపాన్.. కోలుకోని అమెరికా (ఫొటోలు)
-
Viral: జారిపోతున్న కార్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాన్ 'బాంబ్ సైక్లోన్' విధ్వంసం సృష్టిస్తోంది. రక్తం గట్టకట్టే చలిలో ప్రజలు వణికిపోతున్నారు. వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ మంచు తుఫాన్ కారణంగా క్రిస్మస్ పండుగను కూడా సరిగా జరుపుకోలేకపోయారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా మంచు భారీగా కురవడంతో అమెరికాలోని అనేక ప్రాంతాలు మంచు దిబ్బల్లా మారాయి. రోడ్లు, ఇళ్లు శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి ఈ మంచు కారణంగా అనేక ప్రమాదాలు కూడా జరిగాయి. A drone has captured incredible footage of entire houses encased in ice after a bomb cyclone hit the US and parts of Canada. Read more: https://t.co/jMSLhhH6kY pic.twitter.com/wdLzJUuUJA — Sky News (@SkyNews) December 28, 2022 #bombcyclone2022 #snowstorm #BombCyclone ravages East America,death toll rises to 60 The worst damage was in the #Buffalo area of #NewYork.Severe impact on electricity services. Due to the blizzard,nearly 200,000 residents eastern #USA haven't Electricity in the extreme cold pic.twitter.com/GFhGbitYGA — Kaustuva Ranjan Gupta (@GuptaKaustuva) December 28, 2022 మంచు తుఫాన్ వల్ల అమెరికాలో ఇప్పటివరకు 70 మందికిపైగా చనిపోయారు. కొందరు మంచులోనే గడ్డకట్టి కన్నుమూశారు. మరికొందరు వివిధ ప్రమాదాల్లో మరణించారు. That’s happened during a Historic Bomb Cyclone after a Decades. pic.twitter.com/uy10cJFfSM — Adeel Ali (@AdeelAl03137938) December 25, 2022 Bomb Cyclone Light house, Michigan City, 🇺🇸 pic.twitter.com/0BUQWIgMFR — Earth & beyond (@umadevipavuluri) December 26, 2022 పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. మరోవైపు దొంగలు రెచ్చిపోయారు. స్టోర్లలోకి వెళ్లి దొంగతనాలకు పాల్పడ్డారు. దొరికిన కాడికి నగదు, వస్తువులు దోచుకెళ్లారు. Bomb Cyclone Buffalo, NY, 🇺🇸 Many stores were under theft pic.twitter.com/rT0E0mGToJ — Earth & beyond (@umadevipavuluri) December 26, 2022 అమెరికాలో మంచు తుఫాన్‌కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రోడ్లపై కార్లు జారుకుంటూ వెళ్లడం, వేడి నీటిని గాల్లోకి విసిరితే మంచులా మారడం వంటి వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. The view out my parents garage in Prince Edward County. The drift is up to their second story patio #ONstorm #BombCyclone pic.twitter.com/ocbD9KPuZF — Smith (@RileyZSmith) December 25, 2022 Shouldn't laugh but..........#ice #blizzard #WinterStorm #BombCyclone #Elliott #wind #snow #Ice #WeatherBomb video:@kayokayla pic.twitter.com/jJyswxJDkd — Volcaholic (@CarolynnePries1) December 24, 2022 Bomb Cyclone ! Ashtoshing Scenas, Drone Camera Work , Shows Hudge Snow Mountains in NY. Buffalo, NY, 🇺🇸 #BombCyclone #BombCylonebyDrone #BuffaloNY #BuffaloStorm2022 pic.twitter.com/LxKa0oKM5b — Top Viral Videos (@ManojKu40226010) December 26, 2022 Amid plunging temperatures, one person in Montana decided to throw some boiling water in the air and make more snow. The huge winter storm pummelling the US has intensified into a "bomb cyclone", with 60% of the population under a winter weather warning.https://t.co/4DalHHz9Lj pic.twitter.com/ADu80WBRKP — Sky News (@SkyNews) December 24, 2022 Snow plows at work as Mammoth winter storm unleashes chaos in #Vancouver Extremely Dangerous travel conditions, due to freezing rain @TranBC @MainroadLM#BritishColumbia #BCStorm #Canada #Elliott #ColdWave #BombCyclone #Weather #Climate #GlobalWarming #BCSnow #PortMannBridge pic.twitter.com/ZGyHRQejuP — Earth42morrow (@Earth42morrow) December 23, 2022 చదవండి: రిటైర్డ్ పోప్ బెనెడిక్ట్16 ఆరోగ్యం విషమం -
‘బాంబ్’ కోరల నుంచి బయటపడని అమెరికా.. కనీవినీ ఎరగని విధ్వంసం
బఫెలో: ఈ శతాబ్దంలోకెల్లా అత్యంత తీవ్రమైన మంచు తుపాన్ (Bomb Cyclone) కోరల నుంచి అమెరికా ఇంకా బయట పడలేదు. గత వారం రోజులతో పోలిస్తే హిమపాతం కాస్త తగ్గినా దేశవ్యాప్తంగా అతి శీతల వాతావరణం కొనసాగుతోంది. రోడ్లపై దట్టంగా పేరుకున్న మంచును తొలగించడంతో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దాంతో తుఫాన్ విధ్వంసం తాలూకు తీవ్రత క్రమంగా వెలుగులోకి వస్తోంది. మంచులో కూరుకుపోయిన కార్లలో నిస్సహాయంగా మరణించిన వారి శవాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. మంచు తుఫాన్ ధాటికి కనీసం 100 మందికి పైగా మృత్యువాత పడ్డట్టు భావిస్తున్నారు. దీన్ని తరానికి ఒక్కసారి మాత్రమే సంభవించే మహోత్పాతంగా వాతావరణ శాఖ అభివర్ణిస్తోంది. మెరుగవని రవాణా వ్యవస్థ దేశవ్యాప్తంగా వారం రోజులుగా దాదాపుగా స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ ఇంకా కుదురుకోలేదు. మంగళవారం కూడా 6,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. బుధవారం బయల్దేరాల్సిన 3,500 పై చిలుకు విమానాలను ముందస్తుగానే రద్దు చేశారు. దాంతో విమానాశ్రయాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. చిక్కుబడిపోయిన ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బయటికెళ్లే పరిస్థితి లేక ప్రయాణికులంతా టెర్మినల్స్‌లోనే కాలం గడుపుతున్నారు. డిసెంబర్ 22 నుంచి రద్దయిన విమానాల సంఖ్య 25 వేలు దాటింది. సకాలంలో సేవలను పునరుద్ధరించడంలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ వైఫల్యం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది. సంస్థకు చెందిన వేలాది విమాన సర్వీసులు వరుసగా ఆరో రోజూ రద్దవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆగ్రహించారు. ఎయిర్‌లైన్స్ నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయాలని ప్రయాణికులకు సూచించారు! కానీ పరిస్థితి చక్కబడేందుకు కనీసం ఇంకో వారం పట్టొచ్చని సౌత్‌వెస్ట్ ప్రకటించింది. యథేచ్ఛగా లూటీలు రవాణా వ్యవస్థ స్తంభించడంతో అమెరికాలో చాలా ప్రాంతాల్లో నిత్యావసరాలు తదితరాల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో చాలా రాష్ట్రాల్లో ఆకలి కేకలు విన్పిస్తున్నాయి. బయటికెళ్లే పరిస్థితి లేక జనం రోజుల తరబడి ఇళ్లకే పరిమితం కావడంతో ఆహార పదార్థాలు నిండుకున్నాయి. నాలుగైదు రోజులుగా దుకాణాలూ తెరిచుకోక సమస్య మరింతగా విషమించింది. ఫలితంగా మొన్నటిదాకా బఫెలో నగరంలోనే వెలుగు చూసిన లూటీ ఉదంతాలు ఇప్పుడు పలు రాష్ట్రాల్లోనూ నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాల కోసం దుకాణాల్లోకి చొరబడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న లక్షలాది మంది తెలుగువాళ్లు కూడా నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కెనడాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువ నమోదవున్నాయి! వరద ముప్పు క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అమెరికా ఇప్పుడు వరద ముప్పును ఎదుర్కొంటోంది. మంచు శరవేగంగా కరగడం వల్ల ఊహాతీత వేగంతో ఆకస్మిక వరదలు ముంచెత్తవచ్చని పలు రాష్ట్రాలను వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. పూర్తిగా మంచులో కూరుకుపోయిన బఫెలో వంటి ప్రాంతాలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. బఫెలో.. దయనీయం! పశ్చిమ న్యూయార్క్‌లోని బఫెలో నగరంలో ఇంకా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. చాలాచోట్ల ఇంకా 8 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. దాంతో అవసరాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు అత్యవసర సర్వీసులు కూడా సకాలంలో చేరుకోలేని పరిస్థితి! నగరంలోకి వెళ్తుంటే యుద్ధరంగంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉందని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచల్ వాపోయారు. నగరం, పరిసరాల్లో రోడ్డు ప్రయాణాలపై నిషేధం ఇంకా అమల్లోనే ఉంది. దాని అమలుకు మిలిటరీ పోలీసులు రంగంలోకి దిగారు. పొరుగు రాష్ట్రం న్యూజెర్సీ నుంచి ఎమర్జెన్సీ సేవల సిబ్బంది న్యూయార్క్‌కు తరలుతున్నారు. చాలామంది కార్లలోనే చిక్కుకుపోయి ఉన్నారు. 30కి పైగా మృతదేహలను వెలికితీసినట్టు చెబుతున్నారు. ఇంతటి ప్రతికూల వాతావరణాన్ని తమ సర్వీసులోనే ఎన్నడూ చూడలేదని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో భాగంగా సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు. చావు అంచుల దాకా వెళ్లాం మంచు తుఫాను బారిన పడి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డవాళ్లు తామెదుర్కొన్న కష్టాలను కథలుగా చెబుతున్నారు. మేరీలాండ్కు చెందిన డిట్జక్ ఇలుంగా అనే వ్యక్తి తన ఆరు, పదహారేళ్ల కూతుళ్లతో కలిసి కార్లో హామిల్టన్ వెళ్తూ బఫెలో వద్ద తుఫానులో చిక్కాడు. చూస్తుండగానే కారు చుట్టూ మంచు పేరుకుపోవడంతో గంటల తరబడి కారు ఇంజన్ ఆన్‌లో ఉంచి బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ‘‘చివరికి ప్రాణాలకు తెగించాం. ధైర్యం చేసి కష్టమ్మీద కారు దిగాం. చిన్న కూతుర్ని వీపున వేసుకుని, పెద్దమ్మాయీ నేనూ భయానక వాతావరణంలో అతికష్టమ్మీద షెల్టర్ హోమ్ దాకా వెళ్లాం. లోపలికి అడుగు పెడుతూ నేనూ నా పిల్లలూ ఒక్కసారిగా ఏడ్చేశాం. ఇంతటి భయానక అనుభవం జీవితంలో ఎన్నడూ ఎదుర్కోలేదు. ఒక్క అడుగూ వేయడానికి ప్రాణాలన్నీ కూడదీసుకోవాల్సి వచ్చింది. కానీ సాహసం చేయకపోతే కార్లోనే నిస్సహాయంగా మరణించేవాళ్లం’’ అంటూ డిట్జక్ గుర్తు చేసుకున్నాడు. -
గడ్డకట్టిన నయాగరా జలపాతం.. అద్భుత దృశ్యాలు
న్యూయార్క్: అమెరికాలో మంచు తుపాను(Bomb cyclone) విలయం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ ఎరుగనటువంటి చలి గాలులు, విపరీతంగా కురుస్తోన్న మంచు ధాటికి దేశమంతా అతలాకుతలమైంది. 4వేలకుపైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా 60 మందికిపైగా మరణించారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవటంతో పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. ముఖ్యంగా న్యూయార్క్, బఫెలో కౌంటీలో నెలకొన్న దుర్భర పరిస్థితులను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న చిత్రాలు, వీడియోలు చూపుతున్నాయి. బఫెలో కౌంటీలో వాహనాల్లోనే గడ్డకట్టుకుపోయి మరణించిన సంఘటనలూ ఉన్నాయి. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. దీంతో నయాగరా జలపాతం గడ్డకట్టుకుపోయింది. దీంతో పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు. నయాగరాకు 25 మైళ్ల దూరంలో బఫెలో ఉంటుంది. అయితే, నయాగరాలో కొన్ని ప్రదేశాల్లో నీరు గడ్డకట్టినా.. ప్రవాహం కారణంగా కొన్ని చోట్ల మాత్రం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గట్టకట్టుకుపోయిన నయాగరా జలపాతం ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నయాగరా ఫాల్స్ న్యూయార్క్ స్టేట్ పార్క్ ప్రకారం ప్రతి సెకనుకు 3,160 టన్నుల నీరు జలపాతం నుంచి పడుతుంది. ఈ నీరు ప్రతి సెకనుకు 32 అడుగుల వేగంతో ప్రయాణిస్తుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయిన సందర్భాల్లో నయాగరా నదిపై మంచు గడ్డకడుతుందని అధికారులు తెలిపారు. ఇలా మంచుతో ఏర్పడిన బ్రిడ్జ్‌పై నడవటాన్ని నిషేధించారు. 1912, ఫిబ్రవరి 4 నయాగరా నదిపై ఏర్పడిన మంచు వంతెనపైకి వెళ్లి ముగ్గురు చనిపోయిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. The day after the great freeze, my family and I went to #NiagraFalls. The #NiagraRiver below it had ice thick enough for you *to technically* get to #Buffalo, #NewYork by foot! Was it an intriguing and surreal Arctic experience for a kid from California, yes! pic.twitter.com/MAC8IIfjZc — Escondido Weather Observer (CoCoRaHs: CA-SD-197) (@KCAESCON230) December 23, 2022 ఇదీ చదవండి: Bomb Cyclone: అమెరికాలో కొనసాగుతున్న మంచు విలయం -
అమెరికా మంచు తుపానులో గుంటూరు దంపతులు మృతి
పెదనందిపాడు(గుంటూరు జిల్లా): అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. న్యూజెర్సీలో నివాసముంటున్న గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు సరస్సు దాటుతున్న క్రమంలో గల్లంతయ్యారు. ఈ ఘటనలో భార్య హరిత మృతదేహం లభ్యమైంది. ఆమె భర్త నారాయణ, అతడి స్నేహితుడు ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులు అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తమ ఇద్దరు పిల్లలు, స్నేహితుడితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఫీనిక్స్‌లో ఉన్న సరస్సు దాటే క్రమంలో మంచు ఫలకలు కుంగాయి. దీంతో నారాయణ, ఆయన భార్య హరిత, స్నేహితుడు సరస్సులో పడిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనలో హరిత మృతదేహం లభించింది. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని అమెరికాలోని నారాయణ స్నేహితులు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా ఈ ఘటనలో చిన్నారులకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదని తెలిపారు. పాలపర్రుకు చెందిన ముద్దన వెంకట సుబ్బారావు, వెంకటరత్నం దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో కుమారుడు నారాయణ పెద్దవాడు. కష్టపడి చదివి విదేశాల్లో స్థిరపడిన కుమారుడు కుటుంబానికి అసరాగా ఉంటున్న సమయంలో విధి ఇలా చేస్తుందని అనుకోలేదని అతడి తల్లిదండ్రులు, తోబుట్టువులు రోదిస్తున్నారు. కనీసం కడసారి చూపులకైనా మృతదేహాలను స్వగ్రామానికి తరలించేలా ప్రభుత్వం కృషి చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విన్నవించారు. ఇదీ చదవండి: బయల్దేరే సమయానికి మంచు తుపాను...ఏకంగా 18 గంటల పాటు కారులో -
Bomb Cyclone 2022: తీరం దాటని తుపాను బాంబు
చలి... నీళ్ళు కాదు మనుషులే నిలువునా గడ్డకట్టే చలి. మైనస్ 8 నుంచి మైనస్ 48 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతతో ఇళ్ళను కప్పేసిన హిమపాతం. గింయుమనే ఈదురుగాలులు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేరు... వెచ్చగా ఇంట్లో ఉందామంటే కనీసం కరెంట్ లేదు. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా విహార యాత్రలకు వెళదామంటే, మంచుతో హైవేలు మూత బడ్డాయి. వేల కొద్దీ సర్వీసులు రద్దయి, విమానాలు నడవడం లేదు. తీవ్ర మంచు తుపాను రకమైన ‘బాంబు సైక్లోన్’ దెబ్బతో అమెరికాలోని అనేక రాష్ట్రాలు, కెనడాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. సర్వసాధారణంగా సమశీతోష్ణంగా ఉండే అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లోనూ కనివిని ఎరుగని స్థితి. ఇప్పటికి మరణాల సంఖ్య యాభై లోపే అంటున్నా, మోకాలి లోతు మంచులో కూరుకుపోయిన ఇళ్ళూ వాకిళ్ళనూ శుభ్రం చేసి, విద్యుత్ సరఫరాను సక్రమంగా, అందరికీ అందుబాటులోకి తెచ్చేలోగా ఇంటాబయటా ఇరుక్కుపోయిన మరెందరికి ప్రాణం మీదకు వస్తుందో చెప్పలేం. అత్యవసర వాహనాలు సైతం కదలడానికి కష్టమవుతున్న ప్రాణాంతక రోడ్లతో మరో వారం పరిస్థితులు ఇలానే ఉంటాయన్న వార్తలు భీతి గొల్పుతున్నాయి. కెనడా సరిహద్దు నుంచి మెక్సికో సరిహద్దు వరకు 3 వేల కిలోమీటర్ల పైగా ఇదే దుర్భర వాతావరణం. అమెరికా జనాభాలో 60 శాతం మందికి ఏదో రకమైన ఇబ్బందులు. న్యూయార్క్ రాష్ట్రం బఫలో నగరం మంచు తుపాను గాలులు, హిమపాతంతో స్తంభించిపోయింది. నయాగరా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 43 అంగుళాల ఎత్తున మంచు పేరుకుంది. మరిగే నీటిని గాలిలోకి విసిరితే, తక్షణమే మంచుగడ్డగా మారుతున్న పరిస్థితి చూశాక, ఇది ‘తరానికి ఒకసారి వచ్చే’ మంచు తుపానని ఎందుకన్నదీ అర్థమవుతుంది. అట్లాంటిక్ మహాసముద్ర తుపానులు, చక్రవాతాల సీజన్ అమెరికాకు కొత్త కాదు. ఉష్ణమండల ప్రాంతాల్లో వేడెక్కిన సముద్ర జలాల వల్ల వేసవిలో చక్రవాతాలు ఏర్పడతాయి. ఆ తుపానులు తెచ్చే వరదల జలవిలయం ఒక ఎల్తైతే, తాజాగా విరుచుకుపడ్డ శీతకాలపు మంచు తుపాను మరో ఎత్తు. 24 గంటల్లో 24 మిల్లీ బార్స్, అంతకన్నా ఎక్కువగా వాతావరణ పీడనం ఒక్కసారిగా చకచకా పడిపోయి, బలమైన తుపానుగా మారితే ‘బాంబు సైక్లోన్’ అంటారు. బాంబు పేలినట్టు పీడనం హఠాత్తుగా పడిపోవడాన్ని దృష్టిలో పెట్టుకొని అలా పిలుస్తారు. ఈదురుగాలులు, కన్ను పొడుచుకున్నా కనిపించని తీవ్ర హిమపాతం ఈ తుపానుతో అనూహ్య పరిణామాలు. ఒంటిపై ఏమీ లేకుండా 5 నిమిషాలుంటే, మనిషి మొద్దుబారి పోతాడు. ఇవెంత ప్రమాదకరమో చెప్పేందుకు 1980లో శాస్త్రవేత్తలు బాంబు సైక్లోన్ అనే మాట సృష్టించారు. ఇలియట్ అని పేరుపెట్టిన తాజా మంచు తుపాను దెబ్బకు ఒక దశలో 17 లక్షల మందికి పైగా విద్యుత్ సరఫరా లేక ఇక్కట్ల పాలయ్యారు. సోమవారానికి ఆ సంఖ్య 2 లక్షల లోపు నకు రావడం ఒకింత సాంత్వన. 2021లో టెక్సాస్‌లో భీకర హిమపాతంతో పవర్‌గ్రిడ్ విఫలమై, 200 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్న విషాదం లాంటివి పునరావృతం కాకపోవడం ఊరట. అమెరికాలో 13.5 కోట్ల మందిని కడగండ్ల పాల్జేసిన మంచు తుపానుతో పంటలు, పశువులు, చివరకు రైల్వేలైన్లు దెబ్బ తినిపోతున్నాయి. నిరుడు ఇలాగే శీతకాలపు మంచులో రైతులు తమ పశువులకు దాణా, నీళ్ళు అందించలేక తిప్పలు పడ్డారు. ఈసారి నిన్నటి దాకా దుర్భిక్షంతో అల్లాడిన పంటలకు ఇది కొత్త దెబ్బ. ఈ తుపానుండేది కొద్ది రోజులైనా, ఆహారధరలు పెరగడం సహా ప్రభావం దీర్ఘకాలికమే. మరోపక్క వారం రోజులుగా ఉత్తర జపాన్‌లో శీతకాలపు సగటుకు దాదాపు మూడు రెట్లు ఎక్కువ మంచు కురిసి, ప్రాణహాని జరిగింది. అమెరికా లానే జపాన్‌లోనూ రైళ్ళు, విమాన సేవల రద్దు, కరెంట్ కష్టాలు. ఇవన్నీ ఇప్పుడు మేలుకొలుపులు. ప్రకృతిపై మనం సాగించిన తీవ్ర విధ్వంసానికి అనుభవిస్తున్న ఫలితాలు. పర్యావరణ మార్పులు మనపై చూపుతున్న ఆగ్రహానికి ప్రతీకలు. అరుదుగా వస్తాయనే బాంబు సైక్లోన్లు ఆ మధ్య 2019లో, మూడేళ్ళకే మరోసారి ఇప్పుడూ రావడం గమనార్హం. ఆందోళనకరం ఏమిటంటే, పర్యావరణ మార్పుల పుణ్యమా అని భవిష్యత్తులో మరిన్ని బాంబు సైక్లోన్లు వస్తాయట. ఒక్క బఫలో నగరంలోనే∙1976 నాటి రికార్డ్‌కు రెట్టింపు హిమపాతం గత శుక్రవారం జరిగింది. 1878 తర్వాత గత 144 ఏళ్ళలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. ఇవన్నీ పదే పదే మనకు చెబుతున్నది ఒక్కటే... ఇక ఆలస్యం చేస్తే ప్రపంచానికి ముప్పు. ఇప్పటికే ఋతువులు గతులు తప్పాయి. ఈ ఏడాది బ్రిటన్, యూరప్‌లలో కనివిని ఎరుగని వడగాడ్పులు, సతతం పారే నదులు ఎండిపోవడం చూశాం. ఎండ, వాన, చలి – ప్రతిదీ గరిష్ఠానికి చేరుతున్న కాలంలోకి వచ్చేశాం. మనం చేస్తున్న ప్రకృతి విధ్వంసం, విడుదల చేస్తున్న గ్రీన్హౌస్ వాయువులే ఇప్పుడు శాపాలయ్యాయి. నామమాత్ర ‘కాప్’ సదస్సుల లాంటివి పెట్టి, ఊకదంపుడు ఉపన్యాసాలిస్తే ఉపయోగం లేదు. అగ్రరాజ్యాల అలక్ష్యం సహా అనేక కారణాలతో పర్యావరణ పరిరక్షణకు పెట్టుకున్న లక్ష్యాలను ప్రపంచం చేరుకున్న దాఖలాలూ లేవు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత వర్ధమాన దేశాలదేనని తప్పించుకోజూస్తే కష్టమే. ప్రకృతి హెచ్చరికల్ని విస్మరిస్తే, మూల్యం చెల్లించుకోక తప్పదు. అగ్రరాజ్యంలో తాజా మంచు తుపాను బీభత్సం అచ్చంగా జగత్ప్రళయ సినిమాల్లోని దృశ్యాల్లా ఉన్నాయని పలువురి వ్యాఖ్య. ఇకనైనా కళ్ళు తెరవకుంటే భూతాపోన్నతితో వచ్చేది అచ్చంగా ప్రళయమేనని గుర్తించాలి. ప్రపంచ దేశాలన్నీ తగు చర్యలకు నడుం బిగించాలి.