బఫెలో: వారానికి పైగా వణికించిన మంచు తుఫాను బారినుంచి అమెరికా క్రమంగా తేరుకుంటోంది. విమాన సేవలు తదితరాలు గాడిలో పడుతున్నాయి. ముఖ్యంగా తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో సిటీలో పరిస్థితి కుదుట పడుతోంది. ప్రయాణాలపై నిషేధం ఎత్తేశారు. తుఫానులో చిక్కిన వారికోసం ఇంటింటి గాలింపు ఇంకా కొనసాగుతోంది. నగరంలో ఇప్పటిదాకా కనీసం 40 మరణాలు నమోదయ్యాయి.
మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో తుఫాను కారణంగా ఎటుచూసినా అడుగుల కొద్దీ పేరుకుపోయిన మంచు శరవేగంగా కరుగుతోంది. ఇది వరదలకు దారి తీసే ఆస్కారమున్నందున ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మంచు తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా కనీసం 540 కోట్ల డాలర్ల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బీమా కంపెనీలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment