Snow strom
-
మంచుచరియల కింద సజీవ సమాధి
గిల్గిట్: పాకిస్తాన్లో మంచు చరియలు విరిగి పడిన ఘటనలో చిన్నారి సహా 10 మంది సజీవ సమాధి కాగా, మరో 25 మంది గాయపడ్డారు. ఆక్రమిత కశ్మీర్‌లోని కెల్ ప్రాంతంలోని సంచార గిరిజనులు మేకలను మేపుకుంటూ పక్కనే గిల్గిట్–బల్టిస్తాన్ ప్రాంతంలోని ఎస్తోర్‌కు వెళ్లారు. శనివారం తిరిగి వస్తుండగా షౌంటర్ పాస్‌లోని చంబేరి వద్ద వారిపై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మహిళలు, నాలుగేళ్ల బాలుడు సహా 10 మంది చనిపోయారు. మరో 25 మంది వరకు గాయపడ్డారు. అననుకూల వాతావరణంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. -
తేరుకుంటున్న బఫెలో
బఫెలో: వారానికి పైగా వణికించిన మంచు తుఫాను బారినుంచి అమెరికా క్రమంగా తేరుకుంటోంది. విమాన సేవలు తదితరాలు గాడిలో పడుతున్నాయి. ముఖ్యంగా తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో సిటీలో పరిస్థితి కుదుట పడుతోంది. ప్రయాణాలపై నిషేధం ఎత్తేశారు. తుఫానులో చిక్కిన వారికోసం ఇంటింటి గాలింపు ఇంకా కొనసాగుతోంది. నగరంలో ఇప్పటిదాకా కనీసం 40 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో తుఫాను కారణంగా ఎటుచూసినా అడుగుల కొద్దీ పేరుకుపోయిన మంచు శరవేగంగా కరుగుతోంది. ఇది వరదలకు దారి తీసే ఆస్కారమున్నందున ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మంచు తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా కనీసం 540 కోట్ల డాలర్ల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బీమా కంపెనీలు అంచనా వేస్తున్నాయి. -
అమెరికాను ముంచేసిన మంచు.. 60 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలో హిమోత్పాతం దేశాన్ని గజగజ వణికిస్తోంది. మంచు తుపానులో చిక్కుకొని ఇప్పటివరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో న్యూయార్క్ వాసులే 27 మంది ఉన్నారు. పశ్చిమ న్యూయార్క్‌లో కొన్ని ప్రాంతాలు 8 అడుగుల మేర మంచులో కూరుకుపోయాయి. ఏకధాటిగా మంచు కురుస్తూ ఉండడంతో ప్రజలు రోడ్లపైకి రావడం అసాధ్యంగా మారిందని న్యూయార్క్ గవర్నర్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 15 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో చికాగో, డెన్వర్, డెట్రాయిట్, న్యూయార్క్, అట్లాంటా విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. One car tried to drive my hill and Queen Anne and hit all these parked cars who clue down the hill… insane. DON’T DRIVE. #seattle pic.twitter.com/wJsor6byDa — Kaybergz (@kay0kayla) December 23, 2022 కొలరాడో, కన్సాస్, కెంటకీ, మిస్సోరీ, ఓహియోలో ప్రాణనష్టం అధికంగా ఉంది. అమెరికాలో తూర్పు రాష్ట్రాలన్నీ డీప్ ఫ్రిజ్‌లో పెట్టినట్టుగా ఉన్నాయని అమెరికా నేషనల్ వెదర్ సర్వీసెస్ (ఎన్‌డబ్ల్యూఎస్) తెలిపింది. ఈ రాష్ట్రాల జనాభాలో 2 లక్షలకు మందికి పైగా విద్యుత్ సదుపాయం లేక విలవిలలాడిపోతున్నారు. ప్రజలు ఇల్లు కదిలి బయటకు రావద్దని ఎన్‌డబ్ల్యూఎస్ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలోని 48 రాష్ట్రాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు తుఫాన్ హెచ్చరికలు జారీ అయిన ప్రాంతాల్లో కోటి మంది వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లోని బఫెల్లో ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కార్లలో ప్రయాణిస్తున్న వారిపై విపరీతంగా మంచుకురవడం వల్ల ఆ వాహనంలో మంచులో కూరుకుపోయి మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకి రావడంపై ఆ ప్రాంతంలో నిషేధం విధించారు. విద్యుత్ సబ్ స్టేషన్లు 18 అడుగుల మంచులో కూరుకుపోవడంతో ఎప్పటికి కరెంట్ వస్తుందో తెలీని పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్కిటిక్ బ్లాస్ట్‌తో అమెరికా ఈ శీతాకాలంలో గడ్డకట్టుకుపోయింది. My dads places in Crystal Beach after the winter storm pic.twitter.com/BnntAihoMz — Bat Boy Slim (@TerjeOliver) December 26, 2022 -
మంచు గుప్పెట్లోనే అమెరికా.. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనం
బఫెలో: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనమవుతున్నాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్యే పౌరులు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు. న్యూయార్క్ తదితర రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇంత దారుణమైన వాతావరణ పరిస్థితులను రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ చూడలేదని న్యూయార్క్‌వాసులు చెబుతున్నారు. బఫెలో తదితర చోట్ల హరికేన్లను తలపించే గాలులు ప్రజల కష్టాలను రెట్టింపు చేస్తున్నాయి. రోడ్లు, రన్‌వేలపై ఏకంగా 50 అంగుళాలకు పైగా మంచు పేరుకుపోయింది. దాంతో పలు విమానాశ్రయాలను రెండు రోజుల పాటు మూసేశారు. శని, ఆదివారాల్లో కూడా వేలాది విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా కరెంటు సరఫరాలో అంతరాయాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. అయితే పలుచోట్ల పరిస్థితిని అధికారులు క్రమంగా చక్కదిద్దుతున్నారు. బహుశా ఒకట్రెండు రోజుల్లో పరిస్థితులు కాస్త మెరుగు పడొచ్చని భావిస్తున్నారు. -
అమెరికాను గజగజలాడిస్తున్న బాంబ్ సైక్లోన్
చలికాలంలో వణుకు సహజం. కానీ, ఆ వణుకు ప్రాణంపోయేలా, క్షణాల్లో మనిషిని సైతం గడ్డకట్టించేదిగా ఉంటే!. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం.. తన దేశ పౌరులను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శీతాకాలపు తుపాను వేగంగా వస్తున్నందున క్రిస్మస్కు కుటుంబ సభ్యులను, స్నేహితులను సందర్శించడానికి వెళ్లాలనుకునే అమెరికన్లు వెంటనే బయలుదేరాలని ఆయన హెచ్చరించారు. మంచు తుపాను బలం పుంజుకోవడంతో.. అత్యంత అరుదైన పరిణామం ‘బాంబ్ సైక్లోన్’గా బలపడొచ్చని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అమెరికా మంచు తుపాన్‌తో వణికిపోతోంది. -39(మైనస్) డిగ్రీల సెల్సియస్‌కు మెర్క్యూరీ మీటర్లు పడిపోతున్నాయి. అర్కిటిక్ బ్లాస్ట్.. విపరీతమైన చలిని, హిమపాతాన్ని, చల్లని గాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటిదాకా ఐదుగురు మృత్యువాత చెందారు. గత నలభై ఏళ్లలో ఎన్నడూ ఇంత ఘోరమైన పరిస్థతి ఎదుర్కొలేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డు, రైల్వే మార్గాలు సైతం మంచు ప్రభావానికి గురికాగా.. క్రిస్మస్పై ఈ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. ఇది ప్రమాదకరమైనది. మీరు చిన్నప్పుడు చూసిన మంచులాంటిది కాదు. ప్రాణాలకు ముప్పు కలిగించేది. చాలా తీవ్రమైన వాతావరణం.. ఓక్లహోమా నుంచి వ్యోమింగ్, మైనే వరకు కొనసాగనుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరూ దయచేసి స్థానిక హెచ్చరికలను పట్టించుకోవాలని ఒవల్ కార్యాలయం నుంచి జాతిని ఉద్దేశించి బైడెన్ కోరారు. మధ్య అమెరికా నుంచి తూర్పు వైపు వీచే ఈ శీతలగాలుల ప్రభావంతో.. 135 మిలియన్ల(సుమారు పదమూడు కోట్ల మంది) జనాభాపై ప్రభావం పడనుందని తెలుస్తోంది. గురువారం ఒక్కరోజే.. 60 మిలియన్ల మందిపై ఇది ప్రభావం చూపెట్టింది. బాంబ్ సైక్లోన్ అంటే.. బాంబ్ సైక్లోన్ అనేది మధ్య-అక్షాంశ తుపాను. దీనిలో కేంద్ర పీడనం గంటకు ఒక మిల్లీబార్ వద్ద కనీసం 24 గంటల పాటు వేగంగా పడిపోతుంటుంది. అయితే, తుపాను ఎక్కడ ఏర్పడుతుందనే అనే దాని ఆధారంగా మిల్లీబార్ రీడింగులు మారే అవకాశం ఉంటుంది. వాయు పీడనం అనేది వాతావరణం యొక్క బరువు ద్వారా ప్రయోగించే శక్తిని కొలవడం. ఈ పీడనం ఎంత తక్కువగా ఉంటే తుపాను అంత బలంగా ఉంటుందన్న మాట. అమెరికా జాతీయ వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే.. ఉష్ణోగ్రతలు ఇప్పుడున్న దానికంటే 11 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చట. అలాగే గాలి పీడనం 1003 మిల్లీబార్ల నుంచి 968 మిల్లీబార్లకు పడిపోవచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ . బాంబు తుపాన్ ఎలా ఏర్పడుతుందంటే.. వివిధరకాల వాయు ద్రవ్యరాశి (చల్లని, పొడి) గాల్లో కలిసినప్పుడు. వెచ్చని గాలి పెరిగేకొద్దీ, అది గాలి ఒత్తిడిని తగ్గించే క్లౌడ్ వ్యవస్థను సృష్టిస్తుంది. అల్పపీడన ప్రాంతం చుట్టూ అపసవ్య దిశలో ప్రసరించే తుఫానుగా ఏర్పడుతుంది. జనావాసాలపై బాంబ్ సైక్లోన్ ప్రభావం ఊహించని రీతిలో ఉంటుంది. మనుషుల ప్రాణాలు తీయడంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంటుంది. గట్టిగా గాలి పీల్చినా.. మాట్లాడినా సరే ఆ చలికి తెమడ పట్టేసి.. ప్రాణాలకు తీసుకొస్తుంది. 1979 నుంచి 2019 మధ్య.. ఉత్తర అమెరికాలో ఏడు శాతం మంచు తుపానులు బాంబ్ సైక్లోన్లుగా మారాయి. 1980లో బాంబ్ సైక్లోన్ అనే పదాన్ని ఉపయోగించారు. బాంబ్ సైక్లోన్ స్థితి చలికాలంలోనే కాదు.. అరుదుగా సమ్మర్‌లోనూ నెలకొంటుంది. వీటి ప్రభావంతో ఇప్పటిదాకా వందల నుంచి వేల మంది మరణించారు!. బాంబు సైక్లోన్ తుపాను అనేది.. చల్లని గాలుల తీవ్రతను బట్టి ఉంటుంది. దీంతో అమెరికాలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితి మరింత దిగజారవచ్చు. టెంపరేచర్లు.. సున్నా కంటే చాలా తక్కువ ప్రమాదకరమైన కనిష్ట స్థాయికి పడిపోవచ్చు. అంటే.. ఏదైనా సరే నిమిషాల్లో గడ్డకట్టుకుపోతుంది. క్రిస్మస్ తర్వాత నుంచి నెమ్మదిగా మొదలై.. కొత్త సంవత్సరం మొదటిరోజు నాటికి ఈ పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీగా కురుస్తోన్న మంచు(Snow), చలిగాలులకు.. స్థానిక ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోయాయి. క్రిస్మస్ దగ్గర పడుతున్న వేళ.. ప్రయాణాలకు ఈ వాతావరణం అవరోధంగా మారింది. గురువారం ఒక్కరోజే వేలాది విమానాలు రద్దయినట్లు సమాచారం. కెంచుకీ, జార్జియా, నార్త్ కరోలినా, ఒక్లాహోమాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. మేరీల్యాండ్, మిస్సోరీలు.. అత్యవసర పరిస్థితులకు సిద్దంగా ఉనన్నాయి. మిన్నెసొటాలో జంట నగరాలు స్నో ఎమర్జెన్సీలను ప్రకటించుకున్నాయి. ఈశాన్య వాతావరణంతో పోలిస్తే.. బాంబ్ సైక్లోన్ ప్రభావం మరీ ఘోరంగా ఉంటుంది. -
అమెరికాలో మంచు తుఫాన్.. వందేళ్ల రికార్డు బ్రేక్.. అంధకారంలో ప్రజలు
మంచు తుఫాన్ దాటికి ఉత్తర అమెరికా గడ్డకట్టుకుపోతుంది. చలి గాలుల తీవ్రత, భారీగా కురుస్తున్న మంచుతో వందళ ఏళ్ల రికార్డులు బ్రేకవుతున్నాయి. జనజీవనం ఎక్కడిక్కడ స్థంభించిపోయింది. అమెరికాలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న పది రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కిటీకీలు, తలుపులు తెరవడానికి వీలులేనంతగా మంచు పేరుకుపోయి గడ్డకట్టిపోతుంది. చలి గాలులు బలంగా వీస్తుండటంతో సముద్రం పోటెత్తుతోంది. చాలా వరకు తీర ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. దీనికి తోడు ఉత్తర అమెరికాలో చాలా చోట్ల కరెంటు కోత కూడా మొదలైంది. దీంతో సహాయం చేయాలంటూ ఎమర్జెన్సీ సర్వీస్‌లకు కాల్స్ పోటెత్తుతున్నాయి. మసాచుసెట్స్ ఏరియాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సుమారు పది లక్షల మంది ప్రజలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. – న్యూయార్క్ సెంట్రల్ పార్కులో వందేళ్ల రికార్డు బద్దలైంది. ప్రసిద్ది చెందిన ఈ పార్కులో గతంలో అత్యధిక మంచు 1904 జనవరి 29న 4.7 అంగులాల మందం కురిసింది. ఇప్పటి వరకు ఇదే హయ్యస్ట్‌గా కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుత మంచు తుఫాను దాటికి ఇప్పటికే 7.3 ఇంచుల మందంతో మంచు పేరుకుపోయింది. – న్యూజెర్సీలో 1987లో అత్యధికంగా 20.3 అంగులాల మంచు కురిసింది. ఆ తర్వాత 2014లో 7.4 ఇంచులు మంచు కురిసింది. ఈసారి ఏకంగా 33.2 ఇంచులు మందంతో మంచు పేరుకుపోయింది. న్యూజెర్సీలో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. – ఫిలడేల్ఫియాలో 1904లో 5 ఇంచుల మంచు కురవడం ఇప్పటి వరకు రికార్డుగా ఉండగా తాజాగా 5.8 ఇంచుల మంచుతో పాత రికార్డుకు పాతర పడింది. ⚡️More than 114,000 people are reported to be without power after a severe storm in Massachusetts, USA. New York City: According to a storm warning issued by the National Weather Service shortly before, the city could receive between 20 and 30 centimeters of snow@TheDailyHint pic.twitter.com/7nYtwiHDXZ — 🇺🇸Texas Tweetheart🇺🇸 (@MechelleChristy) January 30, 2022 మంచు తీవ్రత దాటికి పొలాలు, ఊర్లు, చెరువులు, గుట్టలు అంతా తెల్లగా మారిపోవడంతో విమాన సర్వీసులు నిలిచిపోతున్నాయి. అమెరికాకు చెందిన ఫ్లైట్అవేర్ డాట్ కామ్ అందించిన వివరాల ప్రకారం ఇప్పటికే 5000లకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. చదవండి:నార్త్ అమెరికాలో మంచు తుఫాను.. ప్రమాదకరంగా మారిన పరిస్థితులు -
అమెరికాలో విచిత్ర ఘటన.. ప్రాణాలతో ఉన్నా చనిపోయినట్టుగా..
ఉత్తర అమెరికా చలి గుప్పిట్లో చిక్కుకుని గజగజ వణికిపోతుంది. చలి గాలుల తీవ్రత, మంచు తుఫాను దాటికి జనజీవనం స్థంభించి పోయింది. సుమారు 1400 ఫ్లైట్లు రదయ్యాయి. రోడ్ల మీదికి వాహనాలతో రావొద్దంటూ ఎమర్జెన్సీ ప్రకటించాయి పలు రాష్ట్రాలు. స్నోస్ట్రోమ్ ఎఫెక్ట్‌తో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో ఇగ్వానస్ అనే ఉసరవెల్లి తరహా జీవులు సజీవ శవంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఫ్లోరిడా రాష్ట్రంలో ఇవి ఎక్కడ పడితే అక్కడ ప్రాణంతో ఉన్నా శవాల్లా పడిపోతున్నాయి. దీంతో యూఎస్ వాతావరణ శాఖ అక్కడి ప్రజలకు పలు కీలక సూచనలు జారీ చేసింది. శవాల్లాగే ఇగ్వానస్ శరీరంలో చల్లని రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఉష్ణోగ్రత్తలు మైనస్ 4 సెల్సియస్ డిగ్రీల నుంచి మైనస్ 10 సెల్సియస్ డిగ్రీల మధ్య ఉంటే ఇవి తట్టుకోలేవు. ఉన్న పళంగా అచేతనంగా మారిపోతాయి. ప్రాణం పోదు కానీ చచ్చిన శవంలా ఎక్కడివక్కడే సుప్త చేతనావస్థ స్థితికి చేరుకుంటాయి. ఈ పరిస్థితి కారణంగా ప్రస్తుతం ఫ్లోరిడా రాష్ట్రంలో రోడ్ల మీద ఇళ్ల పక్కన, పార్కుల్లో ఇవి ఎక్కడ పడితే అక్కడ చనిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ ఒక్క సారి ఉష్ణోగ్రత పెరిగితే ఇవి సాధారణ స్థితికి చేరుకుంటాయి. కాబట్టి వాటికి ఎటువంటి హానీ తలపెట్టవద్దంటూ స్థానిక అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడివి కాదు జీవవైవిధ్యం కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇగ్వానస్లను ఫ్లోరిడాకి తీసుకువచ్చని జీవ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గటుగా అవి ఇంకా పూర్తిగా ఎవాల్వ్ కాలేదని చెబుతున్నారు. అందువల్లే ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు అవి అచేతన స్థితికి చేరుకుంటున్నాయని చెబుతున్నారు. అతిశీతల పరిస్థితులకు అలవాటు పడ్డ ద్రువపు ఎలుగుబండ్లు ముందుగానే అనువైన చోటు ఎంపిక చేసుకుని సుప్తచేతనావస్థ స్థితిలోకి వెళ్తాయంటున్నారు. It’s officially raining iguanas in South Florida pic.twitter.com/9ecBQELUUE — Cristian Benavides (@cbenavidesTV) January 30, 2022 గతంలో పూర్తిగా ఎదిగిన ఇగ్వౌనస్ సుమారు 1.5 మీటర్ల పొడవుతో 7.5 కేజీల బరువు వరకు పెరుగుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఉత్తర అమెరికాలో 2010లో ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు ఇగ్వౌనస్లు ఇదే తరహా ప్రమాదం ఎదుర్కొన్నాయి.. ఇవి చనిపోయినట్టుగా ప్రజలు భావించడంలో.. ఆ ఏడాది ఇగ్వౌనస్లు పెద్ద మొత్తంలో తుడిచిపెట్టుకుపోయాయి. మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదని.. ప్రజలు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. -
మంచు తుఫానుకు గజగజ వణికిపోతున్న ఉత్తర అమెరికా
మంచు తుఫానుతో నార్త్ అమెరికా గజగజమణి వణికిపోతుంది. నార్త్ ఈస్ట్, మిడ్ అట్లాంటిక ప్రాంతాల్లో ఊర్లు, పొలాలు, రోడ్లు, వాహనాలను మంచు దుప్పటి కప్పేసింది. రెండు అడుగుల మేర మంచు పేరుకు పోవడంతో రోడ్లన్ని ప్రమాదకరంగా మారాయి. అత్యవసర పనుల మీద రోడ్ల మీదకు వస్తున్న వాహనాలు స్కిడ్ అవుతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. శుక్రవారం సాయంత్రం నుంచి శీతలగాలుల తీవ్రతతో కరొలినాస్, అప్పలాంచియా ప్రాంతాల్లో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో చలి గాలులు వీస్తున్నాయి. దీంతో స్థానిక అధికారులు స్నో ఎమర్జెన్సీ ప్రకటించారు. బహిరంగ పార్కింగ్‌లను నిషేధించారు.ప్రయాణాలకు మానుకోవాలని సూచించారు. జనవరి ఆరంభంలో వర్జీనియాలో వచ్చిన మంచు తుఫాను సందర్భంగా జరిగిన వందలాది రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ హెచ్చరికలు జారీ చేశారు. మంచు తుఫాను ధాటికి ఏకంగా వెయ్యికి పైగా విమాన సర్వీసులు రద్దవగా మరో 2500 విమానాలు రీ షెడ్యూల్ అయ్యాయి. న్యూయార్క్, షికాగో, బోస్టన్ ఎయిర్‌పోర్టులు మంచు తుఫానులో చిక్కుకున్నాయి. రవాణా వ్యవస్థ స్థంభించి పోవడంతో నిత్యవసర వస్తువులు నిండుకున్నాయి. సూపర్ మార్కెట్లు సైతం అవసరమైన వస్తువులే కొనండి.. మిగిలిన వాళ్లకు మిగల్చండి అంటూ కస్టమర్లకు సూచిస్తున్నాయి. -
టెక్సాస్‌పై మంచు దుప్పటి
డల్లాస్: అమెరికా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా టెక్సాస్ మంచు పంజా బారినపడి గజగజలాడుతోంది. తీవ్రంగా వీస్తున్న మంచు తుఫాను గాలుల ధాటికి టెక్సాస్‌లో పవర్ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రం నుంచి పలు విమానాలను రద్దు చేశారు. డల్లాస్, హూస్టన్ నగరాలల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ల్లోకి పడిపోయాయి. హిమపాతం సమయంలో ఇతర ప్రమాదాలు నివారించేందుకు టెక్సాస్ విద్యుత్ శాఖ(ఎర్కాట్) పలు ప్రాంతాల్లో కరెంటు కోతలను ఆరంభించింది. ప్రజలు సురక్షితంగా ఉండడమే ప్రధానమని, ఈ సమయంలో విద్యుత్ వాడకం తగ్గించేందుకే కోతలు విధిస్తున్నామని తెలిపింది. విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించకుండా ఉండేందుకే ఈ కోతలని తెలిపింది. కోతల కారణంగా దాదాపు 23 లక్షల మంది ప్రభావితమయ్యారని వెబ్సైట్లు పేర్కొన్నాయి. రాష్ట్రంలోని పలు నగరాల్లో కరెంటు కోతలు, ట్రాఫిక్ కష్టాలపై అధికారులు ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 254 కౌంటీలకు గవర్నర్ గ్రెగ్ అబాట్ డిజాస్టర్ డిక్లరేషన్ జారీ చేశారు. ఎక్కడికక్కడ నేషనల్ గార్డ్ యూనిట్లను సమాయత్తం చేశారు. టెక్సాస్‌లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు జోబైడెన్ ఆదివారం రాత్రి ప్రకటించారు. -
మంచు చరియలు పడి ఐదుగురు మృతి
శ్రీనగర్: కశ్మీర్‌లోని లడఖ్ పరిధిలోని ఖర్దంగ్‌లో శుక్రవారం మంచు చరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందగా మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో 10 మందితో ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు ఖర్దంగ్లాకు చేరుకుంది. అదే సమయంలో ఆ ట్రక్కుమీదుగా ఒక్కసారిగా మంచుతో కూడుకున్న కొండచరియలు విరిగిపడటంతో ట్రక్కులో ప్రయాణిస్తున్న ఐదుగురూ మరణించారు. మరో ఐదుగురి జాడ తెలియలేదు. శిథిలాల్లో కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీశారు. కనిపించకుండా పోయిన వారి కోసం సహాయక చర్యలు చేపట్టినట్లు బోర్డర్ రోడ్ల ఆర్గనైజేషన్ అధికారులు మీడియాకు వెల్లడించారు. -
త్యాగాల శిఖరం!
ప్రపంచంలోనే అతి ఎత్తయిన, అతి భయంకరమైన యుద్ధ క్షేత్రం సియాచిన్ మంచు పర్వత శ్రేణి మరోసారి చర్చల్లోకి వచ్చింది. వారంరోజుల క్రితం హఠాత్తుగా విరుచుకుపడిన మంచు తుపానులో చిక్కుకుని తొమ్మిదిమంది భారత సైనికులు మృత్యువాతపడటం... వారితోపాటే మంచు దిబ్బల్లో కూరుకుపోయినా ఆరు రోజుల తర్వాత సజీవంగా బయటపడిన మరో సైనికుడు లాన్స్ నాయక్ హను మంతప్ప ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించడం అందరిలోనూ విషాదాన్ని నింపింది. మృత్యువు ఎలా ఉంటుందో చూసిన వారెవరూ ఉండరు.... కానీ సియాచిన్ మంచు పర్వతశ్రేణిపై దేశ రక్షణలో నిమగ్నమై ఉండే సైనికులు అనుక్షణమూ దాన్ని బహుళ రూపాల్లో దర్శిస్తుంటారు. అది శత్రు సైనికుల మెరుపుదాడిగా ఉండొచ్చు... గంటకు 170 కిలోమీటర్లు లేదా అంతకన్నా పెను వేగంతో విరుచుకుపడే తుపాను రూపంలో ఉండొచ్చు... కొద్దిసేపటి ముందు వరకూ నడవడానికి, సేద తీరడానికి అనువైన ప్రాంతమనుకు న్నది కాస్తా పూనకం వచ్చినట్టు విరిగిపడి మింగేసే మంచుఖండం రూపంలోనైనా రావొచ్చు. వరదగా పోటెత్తి కబళించవచ్చు. చావుకీ, బతుక్కీ మధ్య వెంట్రుకవాసి దూరం మాత్రమే ఉండే సియాచిన్‌లో మృత్యువు ఏ రూపంలోనైనా పలకరించ వచ్చు. ఏ క్షణమైనా కాటేయవచ్చు. వలస పాలన భారత్, పాకిస్తాన్లకు వదిలివెళ్లిన అనేకానేక చిక్కుముడుల్లో సియాచిన్ ఒకటి. కశ్మీర్ విషయంలో ఏదో మేర అంగీకారం కుదిరి అక్కడ నియంత్రణ రేఖ అంటూ ఒకటి ఉందిగానీ సియాచిన్ మంచు పర్వతశ్రేణిపై ఆ మాత్రం స్పష్టత కూడా లేదు. ఇరుగుపొరుగు దేశాలతో మనకున్న దాదాపు 15,200 కిలోమీటర్ల సరిహద్దుల్లో కశ్మీర్వైపే 1,600 కిలోమీటర్లకు పైగా సరిహద్దు ఉంది. అందులో ఈ మంచు పర్వతశ్రేణి అత్యంత కీలకమైనది. తొలినాళ్లలో రెండు దేశాలూ పట్టించుకోని ఈ ప్రాంతం కేవలం పాకిస్తాన్ చర్యల కారణంగా మూడు దశాబ్దాల తర్వాత ప్రాముఖ్యతను పొందింది. ఎక్కడా ప్రస్తావనకు రాలేదు గనుక తమదేనన్న ధోరణితో సియాచిన్‌ను తమ మ్యాప్‌లలో చూపడం, ఆ ప్రాంతాన్ని సందర్శించగోరే పర్వతారోహకులకు అనుమతులనీయడంవంటి చర్యలతో అది మన దేశాన్ని రెచ్చగొట్టింది. ఆ తర్వాత చాన్నాళ్లకు 1984లో మన దేశం ‘ఆపరేషన్ మేఘదూత్’ పేరిట సైనిక చర్య నిర్వహించి దాన్ని స్వాధీనంలోకి తీసుకోవాల్సి వచ్చింది. మన ధాటికి పాక్ సైన్యం వెనక్కి తగ్గాల్సివచ్చింది. సియాచిన్‌లో మనమూ ఉన్నామంటూ తమ పౌరులకు పాక్ చెప్పుకోవచ్చుగానీ...భారత్, పాక్, చైనా సరిహద్దులు కలిసే సాల్టోరా పర్వత శిఖరంలో ఆ మూల ఇందిరా కాల్ మొదలుకొని ఇటు గ్యోంగ్ లా వరకూ గల విస్తారమైన ప్రాంతమంతా మన సైన్యం అధీనంలోనే ఉంది. ఈ పర్వత శిఖరానికి దిగువన మాత్రమే పాకిస్తాన్ సైనిక శిబిరాలుంటాయి. ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో సియాచిన్‌లో కర్త్యవ నిర్వహణకు అంకితమయ్యే జవాన్లకు అవసరమైన సదుపాయాలు ఉండటం లేదని 2008లో కాగ్ నివేదిక బయటపెట్టినప్పుడు అందరిలోనూ ఆగ్రహావేశాలు కలిగాయి. ముఖ్యంగా సైనికులకు పంపే దుస్తులు చినిగి ఉంటున్నాయని...వాడి పారేసిన వాటినే రీసైకిల్ చేసి అందిస్తున్నారనీ ఆ నివేదిక వెల్లడించాక అప్పటి యూపీఏ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలెట్లింది. తక్కువ ఎత్తుగల ప్రాంతాల్లో జవాన్లకు కఠోరమైన శిక్షణనిచ్చి, అందులో ప్రావీణ్యం సంపాదించినవారినే సియాచిన్‌కు పంపించడం, దీర్ఘకాలం వారిని అక్కడ ఉండకుండా చూడటంవంటి చర్యలతో తొలినాళ్లతో పోలిస్తే మరణాల సంఖ్య, అనారోగ్యంబారిన పడేవారి సంఖ్య కాస్త తగ్గింది. అయితే ప్రకృతి తీసే దొంగ దెబ్బనుంచి తప్పించుకోవడం మాత్రం జవాన్లకు సాధ్యం కావడంలేదు. దాదాపు 20,000 అడుగుల ఎత్తులో, ఎప్పుడూ -45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉండే ఈ ప్రాంతం మనుషులుండటానికి అసాధ్యమైనది. శత్రు భయం లేనట్టయితే... వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది కానట్టయితే పట్టించు కోనవసరం లేని ప్రాంతం. అటు పాకిస్తాన్‌తోనూ, ఇటు చైనాతోనూ ఎన్నో చేదు అనుభవాలున్నాయి గనుక దీన్ని అలా వదిలేయడం సాధ్యం కావడం లేదని మన ప్రభుత్వం చెబుతున్న మాట. కార్గిల్, తంగ్ధార్ ప్రాంతాల్లో మన ఉదాసీనత ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందో, ఎంతమంది జవాన్లు ప్రాణాలు కోల్పోవలసివచ్చిందో అందరికీ తెలుసు. అధీన రేఖ వద్ద నిత్యం అడపా దడపా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. అలాగే 1992 తర్వాత చొరబాట్లు పెరిగి కశ్మీర్లో ఉగ్రవాదం పెచ్చరిల్లింది. సియాచిన్‌లో శత్రు దాడిలో మరణించేవారి సంఖ్య కన్నా అతి శీతల గాలులకు తట్టుకోలేకా, మంచు చరియలు విరిగి పడటంవల్లా చనిపోయేవారి సంఖ్యే ఎక్కువ. సియాచిన్‌లో ఏటా సగటున పదిమంది సైనికులు మరణిస్తారని గణాంకాలు చెబుతున్నాయి. మనకంటే దిగువన ఉన్నా పాక్ సైనికుల మరణాలు సగటున 30 వరకూ ఉన్నాయి. గత నాలుగేళ్లలో మన సైనికులు 869 మంది అక్కడ మృత్యువాతపడ్డారు. ఇదే కాలంలో అక్కడి సైనిక కార్యకలాపాల కోసం మొత్తంగా రూ. 7,505 కోట్లు ఖర్చయిందని గణాంకాలు చెబుతున్నాయి. నాలుగేళ్లక్రితం మంచు దిబ్బల్లో కూరుకుపోయి 130మంది పాక్ సైనికులు మరణించినప్పుడు ఈ ప్రాంతంలో అసలు సైనిక స్థావరాలే లేకుండా ఇరు దేశాలూ ఒక అవగాహనకు రావాలన్న ప్రతిపాదన బలంగా వచ్చింది. అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ ఆష్ఫాక్ కయానీ సైతం దీన్ని ప్రతిపాదించారు. అయితే పరస్పర అపనమ్మకం, గత అనుభవాలు దీన్ని సాకారం కానీయడం లేదు. ఇరు దేశాలమధ్యా ఉన్న సంబంధాలు మెరుగుపడకపోగా అంతకంతకూ క్షీణిస్తుండటం మరో కారణం. ఒక దశలో సియాచిన్, సర్‌క్రీక్ వంటి చిన్న చిన్న వివాదాలను పరిష్కరించుకుందామని కూడా పాకిస్తాన్ సూచించింది. అయితే కశ్మీర్, ఉగ్రవాదం వంటి పెను సమస్యలు పరిష్కారమైనప్పుడే సియాచిన్ కూడా ఒక కొలిక్కి వస్తుందన్నది మన దేశం అభిప్రాయం. అయినవాళ్లకి దూరంగా, ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయక సియాచిన్‌లో జవాన్లు చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివి. అక్కడ సైన్యం అవసరంలేని శాంతియుత పరిస్థితులు నెలకొనాలని అందరూ ఆశిస్తారు. -
మంచుతుపాను: నేడు 2800 విమానాలు రద్దు
► అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను ► 19కి చేరిన మృతుల సంఖ్య ► ఎమర్జెన్సీని ప్రకటించిన పది రాష్ట్రాలు ► నేడు 2,800 విమనాలు రద్దు చేసిన అమెరికా ► నిన్న 5,100 విమాన సర్వీసులు రద్దు వాషింగ్టన్: అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దేశ రాజధాని వాషింగ్టన్లో ఒక్క రోజే 30 అంగుళాల మంచు కురిసింది. దీని కారణంగా ఇప్పటివరకు మృతుల సంఖ్య19కి పెరిగిందని అధికారులు వెల్లడించారు. నార్త్ కరోలినాలో మంచు కారణంగా కారు ప్రమాదాల్లో 13 మంది మృతిచెందగా, వర్జీనియాలో ఇద్దరు, మేరీలాండ్‌లో ఒకరు, న్యూయార్క్‌లో ముగ్గురు మృతిచెందారు. పది లక్షల మంది మంచులో ఇరుక్కున్నట్లు అధికారులు ప్రకటించారు. జార్జియా, ఉత్తర కరోలినా, టెన్నెస్సీ, మేరీలాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్, కెంటకీ రాష్ట్రాలు మంచు తుపానుకు విలవిల్లాడిపోతున్నాయి. 10 రాష్ట్రాలు స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. న్యూయార్క్ గవర్నర్ ఆడ్రివ్ క్యూమో సహా ఇతర రాష్ట్రాల గవర్నర్లు కూడా తమ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. న్యూయార్క్ నగరాల్లోని రోడ్లపైకి వాహనాలను నిషేదించారు. వాహనాలు రాకుండా న్యూజెర్సీలోని బ్రిడ్జీలు, సొరంగ మార్గాలను ఆదివారం ఉదయమే మూసివేసినట్టు మేయర్ బిల్ ది బ్లాసియో తెలిపారు. అమెరికాలో మంచు కారణంగా నిన్న(శనివారం) 5,100 విమానాలు రద్దు చేయగా, ఈ రోజు 2,800 కి పైగా విమానాలను రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. వర్జీనియాలోని గురుద్వారాలు, ఆలయాల్లో మంచులో చిక్కుకుపోయిన వారికి పునరావాసం కల్పిస్తున్నారు. ఈ తుపాను వల్ల దాదాపు లక్షా ఇరవై వేల ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు వంద బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ పరిస్థితిలో మార్పు రాదని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది. -
6 వేల విమాన సర్వీసులు రద్దు
-
మంచుతో 6 వేల విమాన సర్వీసులు రద్దు
అమెరికా: అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అమెరికా ఈశాన్య ప్రాంతంలో ఎడతెగకుండా కుండపోతగా మంచు కురుస్తోంది. ప్రధాన నగరాల్లో రోడ్లపైన రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. మంచు తుపాను కారణంగా 8.5 కోట్లమందిపై తీవ్ర ప్రభావం పడుతోంది. 20 రాష్ట్రాలు అతలాకుతలమైయ్యాయి. దాంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వాహనాలు బయటకు తీస్తే ఎక్కడ మంచులో ఇరుక్కుపోతామోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు పేరుకుపోయిన మంచును తొలగించే పనిలో నిమగ్నమైయ్యారు. అమెరికాలోని ఆర్కాన్సాస్, కరోలినా, న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో విపరీతంగా మంచు పడుతోంది. మంచు ప్రభావంతో కోటిమందికి పైగా ప్రజలకు ఇళ్లల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. మంచు తుపాను కారణంగా 6 వేలకు పైగా విమాన సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.