మంచు తుఫానుతో నార్త్ అమెరికా గజగజమణి వణికిపోతుంది. నార్త్ ఈస్ట్, మిడ్ అట్లాంటిక ప్రాంతాల్లో ఊర్లు, పొలాలు, రోడ్లు, వాహనాలను మంచు దుప్పటి కప్పేసింది. రెండు అడుగుల మేర మంచు పేరుకు పోవడంతో రోడ్లన్ని ప్రమాదకరంగా మారాయి. అత్యవసర పనుల మీద రోడ్ల మీదకు వస్తున్న వాహనాలు స్కిడ్ అవుతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు.
శుక్రవారం సాయంత్రం నుంచి శీతలగాలుల తీవ్రతతో కరొలినాస్, అప్పలాంచియా ప్రాంతాల్లో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో చలి గాలులు వీస్తున్నాయి. దీంతో స్థానిక అధికారులు స్నో ఎమర్జెన్సీ ప్రకటించారు. బహిరంగ పార్కింగ్‌లను నిషేధించారు.ప్రయాణాలకు మానుకోవాలని సూచించారు. జనవరి ఆరంభంలో వర్జీనియాలో వచ్చిన మంచు తుఫాను సందర్భంగా జరిగిన వందలాది రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ హెచ్చరికలు జారీ చేశారు.
మంచు తుఫాను ధాటికి ఏకంగా వెయ్యికి పైగా విమాన సర్వీసులు రద్దవగా మరో 2500 విమానాలు రీ షెడ్యూల్ అయ్యాయి. న్యూయార్క్, షికాగో, బోస్టన్ ఎయిర్‌పోర్టులు మంచు తుఫానులో చిక్కుకున్నాయి. రవాణా వ్యవస్థ స్థంభించి పోవడంతో నిత్యవసర వస్తువులు నిండుకున్నాయి. సూపర్ మార్కెట్లు సైతం అవసరమైన వస్తువులే కొనండి.. మిగిలిన వాళ్లకు మిగల్చండి అంటూ కస్టమర్లకు సూచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment