book presentation
-
జబర్దస్త్ నటులకు భక్తి గ్రంథాన్ని అందించిన రోజా
తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమైన షో ‘జబర్దస్త్’. అయితే దసరా సందర్భంగా జరిగిన జబర్దస్త్ షూటింగ్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఏపీఐఐసీ చైర్మన్ రోజా.. జబర్దస్త్ నటులకు ‘శ్రీ పూర్ణిమ’ భక్తి గ్రంథాన్ని దసరా కానుకగా అందజేశారు. ఈ బుక్ అందుకున్న వారిలో అప్పారావు, రాకేశ్, సుధాకార్, ఆది, రాఘవ, చంటి, రాజు తదితరులు ఉన్నారు. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన ఈ గ్రంథానికి రోజా ప్రచురణకర్తగా వ్యవహరించారు. అయితే శ్రీనివాస్ గతంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో అత్యంత కీలక పదవి చేపట్టారు. శ్రీశైలం క్షేత్రానికి కూడా ప్రత్యేక సలహాదారుడిగా వ్యవహరించారు. రోజా సమర్పించిన ఈ గ్రంథంలో శ్రీనివాస్.. తనకు ఆత్మ బంధువులైన వారాహి చలనచిత్ర అధినేతలు సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి దంపతుల పేర్లను కృతజ్ఞతాపూర్వకంగా ప్రకటించారు. ఈ గ్రంథానికి విశేష స్పందన లభిస్తోంది. తిరుమల, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, అహోబిలం, యాదాద్రి మొదలుకొని.. పలు మహా శైవ వైష్ణవ ఆలయాల అర్చకులకు, వేద పండితులకు, వేదపాఠశాలలకు రోజా స్వయంగా ఈ గ్రంథాన్ని సమర్పించారు. దీంతో వారు రోజాను ప్రశంసించారు. తాజాగా దసరా సందర్భాన్ని పురస్కరించుకుని జబర్దస్త్ టీం అందరికీ రోజా ‘శ్రీ పూర్ణిమ’ గ్రంథాన్ని అందించడంతో జబర్దస్త్ నటులు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. దీనికి రోజా.. అమ్మవారి అనుగ్రహంతో ఈ బుక్ ఇస్తున్నానని, ఖాళీ సమయాల్లో ప్రార్థనకై ఇది చాలా ఉపయోగపడుతుందని వారికి బదులిచ్చారు. -
పుస్తకం.. ఓ మంచి దోస్త్
సాక్షి, హైదరాబాద్: మనిషికి పుస్తకానికి మించిన దోస్తులు ఉండరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ 31వ జాతీయ పుస్తక మహోత్సవం ఆదివారం ముగిసింది. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని శాసిస్తున్నా.. పుస్తకాలను మాత్రం శాసించలేకపోతోందని అన్నారు. పుస్తకం అనేది ఒక చిరంజీవి అని, సీఎం కేసీఆర్ పుస్తకప్రియుడని, పుస్తకం కేసీఆర్‌ను నడిపిస్తుంటే కేసీఆర్ తెలంగాణ ప్రజలను నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమంలో సాహిత్యం కీలక పాత్ర పోషించిందని, సాహిత్యం రుణాన్ని తీర్చుకోలేమన్నారు. భావితరాలకు పుస్తక విజ్ఞానాన్ని అం దించాలని పిలుపునిచ్చారు. పిల్లలను ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచి పుస్తకానికి చేరువ చేయాలని సీపీఎం నేత బీవీ రాఘవులు సూచించారు. ఆఖరి రోజు కిటకిట.. 11 రోజులపాటు నిర్వహించిన ఈ పుస్తక ప్రదర్శనను సుమారు 9 లక్షల మంది పుస్తకప్రియులు సందర్శించారు. ఆదివారం ఆఖరిరోజు కావడంతో కిటకిటలాడింది. నచ్చిన పుస్తకం కోసం నగరవాసులు అన్వేషిం చారు. ఈ ఏడాది సుమారు 133 స్టాళ్లను ఏర్పాటు చేశారు. అనేక అంతర్జాతీయ, జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. పిల్లల కోసమే 50 స్టాళ్లను ఏర్పాటు చేశారు. పఠనం పట్ల అభిరుచిని పెంచేందుకు, నేటితరం యువతీ యువకుల్లో, పిల్లల్లో సాహిత్యాభిరుచిని పెంపొందించేందుకు హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ కమిటీ 12 సాహిత్య సమాలోచనలను నిర్వహించింది. వేడుకల్లో భాగంగా పలువురు రచయితలు రాసిన 65 పుస్తకాలను ఆవి ష్కరించారు. పుస్తక ప్రదర్శనలో పిల్లల కోసం ప్రత్యేకంగా 25 కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు బుక్ ఫెయిర్ కమిటీ ప్రతినిధి చంద్రమోహన్ తెలిపారు. వైవిధ్యాన్ని చాటుకున్న స్టాళ్లు.. పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లు వైవిధ్యాన్ని చాటుకున్నాయి. ఆధ్యాత్మికం, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యక్తిత్వవికాసం, ప్రముఖుల జీవిత చరిత్రలు, ఆత్మకథలు వంటి పుస్తకాలతో పాటు తెలుగు సాహిత్యం, కథలు, నవలలు, విశ్లేషణాత్మక గ్రంథాలకు చక్కటి ఆదరణ లభించింది. మేనేజ్మెంట్, కెరీర్ రంగానికి సంబంధించిన పుస్తకాలు, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలతో పాటు ఆధ్యాత్మిక గ్రంథాలు పెద్ద ఎత్తున అమ్ముడైనట్లు నిర్వాహకులు తెలిపారు. -
పుస్తక ప్రదర్శనలో ఎస్‌ఐబీఎఫ్
న్యూఢిలీ ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ఢిల్లీ పుస్తక ప్రదర్శన (డీబీఎఫ్)లో షార్జా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన (ఎస్‌ఐబీఎఫ్) కూడా పాలుపంచుకుంటోంది. ఈసారి సరికొత్త హంగులతో ప్రగతి మైదాన్‌లో కొనసాగుతున్న ఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన- 2014 ఆదివారంతో ముగుస్తుంది. దాదాపు 54 వేల చదరపు మీటర్ల భారీ వైశాల్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునెస్కో, ప్రపంచబ్యాంకు సహా దేశవిదేశాలకు చెందిన 1,070 ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. ఎస్‌ఐబీఎఫ్ ప్రతినిధి అహ్మద్ బిన్ రక్కడ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘మిగతా దేశాల సంస్కృతుల గురించి తెలుసుకొని, వాటితో సత్సం బంధాలు పెంపొందించుకోవడానికే యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం డీబీఎఫ్‌లో పాల్గొనాలని నిర్ణయించింది. ఈ ఏడాది షార్జా ‘ఇస్లామిక్ సంస్కృతి రాజధాని’గా ఎంపికయినందున, మా నగరానికి సాంస్కృతిక కేంద్రంగా గుర్తింపు తేవడానికి, మా సంస్కృతిని చాటిచెప్పడానికి కూడా ఈ ప్రయత్నం ఉపకరిస్తుంది. భారత్‌తో సత్సంబంధాలు పెంపొందించుకోవడంలో భాగంగా ఇది వరకు మేం జైపూర్ సాంస్కృతిక ఉత్సవంలోనూ పాలుపంచుకున్నాం. షార్జాలో నవంబర్ 5-15 తేదీల్లో జరిగే పుస్తక ప్రదర్శనలో పాల్గొనాల్సిందిగా భారతీయ ప్రచురణ సంస్థలను కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం’ అని ఆయన వివరించారు.