boots
-
గిరిజన మహిళపై థర్డ్‌డిగ్రీ..
నాగోలు: ఒంటరిగా ఉన్న ఓ గిరిజన మహిళను అనుమానించారు. అంతటితో ఆగకుండా బలవంతంగా అర్ధరాత్రివేళ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రంతా స్టేషన్లో నిర్బంధించి లాఠీలు, బూటు కాళ్లతో తంతూ చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగ్గా, ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పడమటిపల్లితండాకు చెందిన వడిడ్త్యా లక్ష్మి, భర్త శ్రీను చనిపోవడంతో ముగ్గురు పిల్లలతో మీర్‌పేటలోని నందిహిల్స్‌కు వచ్చింది. స్థానికంగా ఇళ్లలో పనికి కుదిరి ఇక్కడే నివాసముంటోంది. ఇటీవల లక్ష్మి పెద్ద కూతురుకు పెళ్లి సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఈనెల 30న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి ఖర్చుల కోసమని దేవరకొండలోని బంధువుల ఇంటికి ఈ నెల 15వ తేదీన వెళ్లింది. వారి వద్ద రూ.3లక్షల నగదు అప్పుగా తీసుకుంది. అక్కడి నుంచి ఎల్బీనగర్కు బస్సులో వచ్చింది. అప్పటికే అర్ధరాత్రి అయ్యింది. మీర్‌పేటకు వెళ్లేందుకు ఆటోలు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఎల్బీనగర్ చౌరస్తాలో రోడ్డు పక్కన లక్ష్మి నిలబడింది. అదే సమయంలో పెట్రోలింగ్ వాహనం ఆమె వద్దకు వచ్చి ఆగింది. ఎక్కడకు వెళుతున్నావు...చేతిలో డబ్బు ఎక్కడిదని పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. ఊరి నుంచి వస్తున్నానని, ఆటో కోసం ఎదురుచూస్తున్నానని చెప్పినా పోలీసులు వినలేదు. కూతురు పెళ్లికార్డు చూపించినా పట్టించుకోలేదు. అర్ధరాత్రి వేళ లక్ష్మిని ఎల్బీనగర్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో లక్ష్మికి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకే ఎదురు మాట్లాడతావా అంటూ లక్ష్మిపై హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలత, మరో ఇద్దరు సిబ్బంది లాఠీలు, బూటు కాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం ఆటోలో పోలీసులు లక్ష్మిని ఇంటికి పంపించారు. లక్ష్మి నడవలేని పరిస్థితిని గమనించిన ఆమె కుటుంబసభ్యులు స్థానిక వైద్యుడిని ఇంటికి పిలిపించి వైద్యం చేయించారు. పూజ ఫిర్యాదు.. పోలీసులపై అట్రాసిటీ కేసు లక్ష్మి కూతురు వడ్త్యా పూజ ఫిర్యాదు మేరకు దాడి చేసిన పోలీసులపై ఎల్బీనగర్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. పూజ ఫిర్యాదు ప్రకారం...ఈనెల 15వ తేదీన తల్లి లక్ష్మి తన పెళ్లికి కోసం రూ. 3లక్షల అప్పుగా తేవడానికి మేనమామ చంద్రుని వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. సాయంత్రం వరకు నేనే నా తమ్ముడు అమ్మకోసం ఎదురుచూశాం. కానీ ఆమె రాలేదు. 16వ తేదీన ఎల్బీనగర్ స్టేషన్ అమ్మ ఉన్నట్టు సమాచారం తెలిసి కొంతమందితో కలిసి వెళ్లాను. అమ్మ గురించి పోలీసులను అడిగితే తనను కులం పేరుతో దూషించారని, తల్లిపై పోలీసులు తొడలు, మోకాలు ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కొట్టి గాయాలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన తల్లి వద్ద ఉన్న రూ. 3లక్షల నగదు, బంగారు చెవి రింగులు కూడా కనిపించడం లేదని ఆ ఫిర్యాదులో వివరించింది. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు 354, 324, 379,సెక్షన్3(1) (ఆర్)(ఎస్), 3(2)(వీఏ), అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. లక్ష్మికి సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తా.. గాయపడిన లక్ష్మి వైద్య ఖర్చులు మొత్తం తానే భరిస్తానని ఎల్బీనగర్ ఏసీపీ జానకిరెడ్డి తెలిపారు. లక్ష్మిని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామన్నారు. డబ్బు, ఆభరణాలు లాక్కొన్నారు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, రాత్రంతా అక్కడే ఉంచి చితకబాదారు. తన చేతిలోని నగదు, మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ పోలీసులు బలవంతంగా తీసుకున్నారు. ఈ క్రమంలో వారితో వాగ్వాదం జరిగింది. నాపై దాడి చేసిన ఎస్ఐపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – బాధితురాలు లక్ష్మి అర్ధరాత్రి ముఠాగా సంచరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ముఠాగా ఏర్పడి అర్ధరాత్రి ఎల్బీనగర్ చౌరస్తాలో సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు పెట్రోలింగ్ సమయంలో పోలీసులు గుర్తించారు. దీంతో వారిపై ఐపీసీ సెక్షన్ 290 కింద కేసు నమోదు చేసి ఈనెల 16న రిమాండ్‌కు తరలించారు. అయితే మర్నాడు ఉదయం లక్ష్మి మినహా మిగిలిన నిందితులు జరిమానా చెల్లించారని ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు. – ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి ఇద్దరి సస్పెన్షన్.. జరిగిన సంఘటనపై ప్రాథమిక విచారణ చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతలను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని, ఇతరుల పాత్ర రుజువైతే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: మాజీ మంత్రి రవీంద్రనాయక్ గిరిజన సంఘాల నేతలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు గురువారం బాధితురాలు లక్ష్మితో కలిసి ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ జరిగిన ఘటనపై గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. దాడి చేసిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గణేష్, ప్రధానకార్యదర్శి బాలు, ఆల్ ఇండియా బంజారాసేవా సంఘం రాష్ట్ర అధ్య క్షుడు రాజు, గిరిజన విద్యార్థి నేత వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రిటన్ కంపెనీపై ముఖేష్ అంబానీ కన్ను! అదే నిజమైతే!
లండన్: కొన్నాళ్ల క్రితం ఆటబొమ్మల రిటైల్ సంస్థ హామ్లీస్‌ను కొనుగోలు చేసిన దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా మరో బ్రిటన్ కంపెనీపై కన్నేసింది. ఫార్మసీ చెయిన్ ’బూట్స్’ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్తో కలిసి సంయుక్తంగా బిడ్ వేయాలని ఆర్ఐఎల్ భావిస్తున్నట్లు బ్రిటన్ వార్తాపత్రిక ది ఫైనాన్షియల్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. ఈ డీల్ సాకారమైతే.. బూట్స్ కొత్తగా భారత్, మధ్య ప్రాచ్య, ఆగ్నేయాసియా మార్కెట్లలోకి కూడా కార్యకలాపాలు విస్తరించేందుకు వీలుంటుందని పేర్కొంది. బ్రిటన్‌లో పేరొందిన ఫార్మసీ చెయిన్ అయిన బూట్స్‌కు అమెరికాకు చెందిన వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ మాతృ సంస్థ. తమ దేశంలో హెల్త్‌కేర్ వ్యాపారంపైనే పూర్తిగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో బూట్స్‌ను వాల్గ్రీన్ బూట్స్ గతేడాది డిసెంబర్లో అమ్మకానికి పెట్టింది. బిడ్ల దాఖలుకు మే 16 ఆఖరు రోజు. బూట్స్‌కు బ్రిటన్‌లో 2,000 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయి -
సమస్యాత్మకం 342
జిల్లా పోలీసు యంత్రాంగం శాసనసభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించే పనిలో నిమగ్నమైంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఆ శాఖ.. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిపేందుకు.. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట ప్రణాళికలు రూపొందించి.. అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి.. భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. పోలింగ్ బూత్‌లవారీగా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో మొత్తం 1,303 పోలింగ్ బూత్‌లు ఉండగా.. కొత్తగా మరో మూడు బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇటీవల ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టగా.. పెరిగిన ఓటర్లను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు వాటిని ఏర్పాటు చేశారు. రెండు పోలింగ్ బూత్‌లను ఖమ్మం నియోజకవర్గంలో.. ఒకటి పాలేరు నియోజకవర్గం లోనూ ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో 1,306 బూత్‌లున్నట్లు అయింది. ఈ లెక్క ప్రకారం ఖమ్మంలో 296 పోలింగ్ బూత్‌లు, పాలేరు 266, మధిర 251, వైరా 229, సత్తుపల్లిలో 264 పోలింగ్ బూత్‌లున్నాయి. మొత్తం పోలింగ్ బూత్‌లను పరిశీలించిన అనంతరం సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. 342 సమస్యాత్మక కేంద్రాలు జిల్లాలో మొత్తం 342 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో సమస్యాత్మకం, అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూత్‌లను లెక్కించిన అధికార యంత్రాంగం ఈసారి సమస్యాత్మక బూత్‌లను మాత్రమే గుర్తించింది. గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలు, ఘర్షణల ఆధారంగా సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. 342 సమస్మాత్మక కేంద్రాల్లో ఖమ్మం నియోజకవర్గంలో 65, పాలేరు 93, మధిర 69, వైరా 49, సత్తుపల్లి 66 ఉన్నాయి. వీటిలో...అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో 93 పోలింగ్ బూత్‌లున్నాయి. ఈ నియోజకవర్గంలో గతంలో పలు సంఘటనలు జరగడం వల్ల వీటిని సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల జాబితాలో చేర్చారు. కూసుమంచి మండలం చేగొమ్మ, పోచారం, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు, ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు, ముత్తగూడెం తదితర గ్రామాల్లో గతంలో ఎన్నికల సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఈ పోలింగ్ బూత్‌లను సమస్యాత్మక కేంద్రాల పరిధిలోకి తెచ్చారు. పాలేరు తర్వాత మధిర, సత్తుపల్లి, ఖమ్మం కేంద్రాల్లో సమస్యాత్మక కేంద్రాలున్నట్లు గుర్తించారు. వైరా నియోజకవర్గంలో తక్కువగా 49 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతోపాటు సాధారణ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ యంత్రాంగంతోపాటు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. గట్టి నిఘా ఏర్పాటు.. జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 342 పోలింగ్ బూత్‌లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి నుంచే అక్కడ చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికే బైండోవర్లను ముమ్మరం చేశారు. ఇక సమస్యాత్మక కేంద్రాలున్న ప్రాంతాల్లో బైండోవర్ల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎన్నికలకంటే ముందు నుంచి పోలీస్ బందోబస్తును పటిష్టం చేశారు. ఎప్పటికప్పుడు పోలీసుల నిఘా.. పర్యవేక్షణ ఉండేలా చూస్తున్నారు. అలాగే ఘర్షణలు జరగకుండా అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. -
జవాన్లకు యాంటీ–మైన్ బూట్లు
జమ్మూ: జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో టెర్రరిస్టులు పాతిపెడుతున్న మందుపాతరలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆర్మీ నడుం బిగించింది. జవాన్ల రక్షణే ధ్యేయంగా నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తున్న భద్రతా బలగాల కోసం మందుపాతర నిరోధక బూట్ల (యాంటీ–మైన్ బూట్స్)ను కొనుగోలు చేసినట్లు ఆర్మీ ఉన్నతాధికారి లెఫ్టినెంట్ జనరల్ పరమ్‌జీత్‌సింగ్ తెలిపారు. ప్రత్యేక నిధులతో వీటిని కొనుగోలు చేసినట్లు ఆదివారం వెల్లడించారు. అక్రమ చొరబాటుదారులను, తీవ్రవాద ప్రాంతాల్లో రహస్యంగా దాచిన పేలుడు పదార్థాలను గుర్తించే డిటెక్టర్ల (డీప్ సెర్చ్ మెటల్ డిటెక్టర్లు)ను కూడా కొనుగోలు చేశామన్నారు. వీటితో పాటు అధునాతన గాడ్జెట్లు, నైట్ విజన్ ఉపకరణాలను బలగాలకు సమకూర్చినట్లు చెప్పారు. సరిహద్దు ప్రాంతాలు, ఎల్వోసీతో సహా మొత్తం 250 కి.మీ. మేర ఉన్న మైదానం, పొదల్లో మందుపాతర ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నారు. వీటిని ఎదుర్కోవడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చలికాలంలో మంచు కురుస్తున్నా కొత్త దారుల్లో ఉగ్రవాదులు చొరబడే అవకాశముందని, వారిని నివారించేందుకు అన్ని కోణాల్లో చర్యలు చేపడుతున్నట్లు సింగ్ చెప్పారు. -
బబుల్ గమ్‌తో బూట్లు..!!
లండన్ : మీ చెప్పులకు ఎప్పుడైనా బబుల్ గమ్ అంటుకుందా?. చాలా మందికి ఈ అనుభవం ఉండి ఉంటుంది. అలా జరిగినప్పుడు చాలా చిరాకు పడి కూడా ఉంటారు. మరి అదే బబుల్ గమ్‌ను మీ కాళ్లకు తొడుక్కోవాల్సి వస్తే?. అవును. బబుల్ గమ్‌తో బూట్లను తయారు చేశారు యూకేకు చెందిన ఓ వ్యాపారవేత్త. బబుల్ గమ్‌ను రబ్బర్‌గా మలచిన అన్నా బుల్లస్ అనంతరం దానితో బూట్లను తయారు చేశారు. బుల్లస్కు యూకేలో గమ్‌డ్రాప్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించారు. వినియోగించిన బబుల్ గమ్‌తో రోజూవారి అవసరాలకు ఉపయోగించే వస్తువులను ఈ కంపెనీ తయారు చేస్తుంది. పెన్సిల్స్, రబర్లు, కంటైనర్లు, దువ్వెనలు, రెయిన్ బూట్లు, డిజైనర్ బూట్లు తదితరాలను ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న వాటిలో ఉన్నాయి. వినియోగించిన బబుల్ గమ్ సమస్యే తనను ఈ కంపెనీ ప్రారంభించేలా చేసిందని అన్నా బుల్లస్ పేర్కొన్నారు. బబుల్ గమ్ ఎలా తయారవుతుంది.. బబుల్ గమ్ కూడా ఓ సింథటిక్ రబ్బరే. బ్యుటైల్ రబ్బర్ నుంచి దీన్ని తయారు చేస్తారు. బ్యుటైల్ రబ్బర్ కారణంగానే బబుల్‌ను ఊదినపుడు సాగుతూ గాలి బుడగ నోటి నుంచి బయటకు వస్తుంది. నమిలిన అనంతరం ఊసేసిన బబుల్ గమ్ భూమిలో కలసిపోదు. ఎంతకాలమైనా అది అలానే ఉంటుంది. ప్రత్యేకమైన పరికరాలతో దాన్ని రీ-సైకిల్ చేయొచ్చు. ఇలా వేస్ట్‌గా పడివుంటున్న బబుల్ గమ్‌ను వినియోగించడానికి అనువుగా మార్చేందుకు అన్నా బుల్లస్ దాదాపు 8 నెలల పాటు పరిశోధనా శాలలో గడిపారు. ఓ రోజు అందులో విజయం సాధించారు. అనంతరం దానికి బుల్లస్ రీ-సైకిల్డ్ గమ్ పాలీమర్(బీఆర్జీపీ) అని నామకరణం చేశారు. -
బూట్లపై వివరణ ఇవ్వండి: హైకోర్టు
- సింగరేణి కాలరీస్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు హైదరాబాద్: సింగరేణి బొగ్గు గని కార్మికులకు నాణ్యత లేని బూట్లు సరఫరా చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు కేందర గనులశాఖ కార్యదర్శి, భారత ప్రమాణాల డైరెక్టర్ జనరల్, సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్, రాష్ట్ర గనులశాఖ ముఖ్యదర్శి, బూట్ల సరఫరా కంపెనీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి టి. రజనీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.సింగరేణి కాలరీస్ లిమిటెడ్(ఎస్సీసీఎల్) అధికారులు, బూట్లు సరఫరా చేసే కంపెనీల ప్రతినిధులు కుమ్మకై నాణ్యత లేని బూట్లను సరఫరా చేస్తున్నారంటూ కార్మిక సంఘం ‘ఎ సోషల్ బాడీ ఫర్ మైనింగ్ వర్కర్స్’ అధికార ప్రతినిధి ఓం శాంతి బృహన్నల హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను పిల్‌గా పరిగణించిన ధర్మాసనం విచారణ జరిపింది.