botch satya narayana
-
‘కాసుల కోసం కక్కుర్తి పడ్డారు’
సాక్షి, తూర్పుగోదావరి: ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్నారని, ప్రతి అంశంలో తొందరపాటు కనిపిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. కేబినెట్ మీటింగ్‌లో ఈసీ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని, ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాడానికి అవకాశం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టుకు అసలు కార్యరూపం తీసుకువచ్చింది దివంగత వైఎస్సార్ మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు జీవనాడైన పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. ప్రాజెక్టు ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు కాసుల కక్కుర్తే కారణమన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటైన వెంటనే పోలవరాన్ని పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. పర్యవరణ, ఇతర అనుమతులను వైఎస్సార్ హయాంలోనే 4500 కోట్లు ఖర్చు చేశారని, 2019 కల్లా ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని మర్చిపోయారని మండిపడ్డారు. కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే పట్టిసీమను నిర్మించారని బొత్స ఆరోపించారు. పోలవరం అంచనాల వ్యయాన్ని రూ.16వేల కోట్ల నుంచి 55వేల కోట్లకు పెంచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 2019లో గ్రావిటీ ద్వారా నీరందిస్తామని తప్పుడు మాటలు చెప్పి.. ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు 2020 వరకు నీరు ఇవ్వడం సాధ్యంకాదని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అభ్యర్థులేరీ..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం వేట ప్రారంభించింది. అభ్యర్థుల ఆశావహుల జాబితాతో హైదరాబాద్ రావాలని జిల్లా నాయకులకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నుంచి పిలుపు రావడంతో జిల్లా నుంచి నేతలు హైదరాబాద్‌కు బయలుదేరారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు కరువవడంతో తృతీయ శ్రేణి నాయకుల జాబితాతో జిల్లా నేతలు వెళ్లినట్లు తెలిసింది. డీసీసీ అధ్యక్షునిగా ఉన్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ప్రస్తుత ఒంగోలు నగర అధ్యక్షునిగా ఉన్న జడా బాల నాగేంద్రం డీసీసీ ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాల నాగేంద్రం, పీసీసీ కార్యదర్శి కోలా ప్రభాకర్ గురువారం హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. వీరు బొత్సతో శుక్రవారం భేటీ అయి మునిసిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. వారికే బీఫామ్‌లు కూడా ఇచ్చి అభ్యర్థులను పోటీకి దింపాలని బొత్స కోరనున్నట్లు సమాచారం. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలోనే ఆదుకోవాలని, ఇతర నేతల్లాగా పార్టీలు మారడం సరికాదని వీరికి నచ్చజెప్పే యత్నం కూడా బొత్స చేయనున్నారు. జిల్లాలో పార్టీ చతికిలపడిందనే భావన రాకుండా, అన్ని వార్డుల్లో అభ్యర్థులుండేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిసింది. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో చైర్మన్ అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ హయాంలో వైభవాన్ని చాటిన కాంగ్రెస్ పార్టీ, నేడు అభ్యర్థులను వెతుక్కోవాల్సి వస్తోందని ఆ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారనుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా పార్టీ వీడే ఆలోచనలో ఉండటంతో జిల్లాలో పార్టీకి దశ, దిశ కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా పూర్తి స్థాయి డీసీసీ అధ్యక్షుడిగా బాల నాగేంద్రంని నియమించే అవకాశ ం ఉన్నట్లు తెలిసింది. జిల్లా పూర్తి బాధ్యతలను ఆయనకు అప్పగించడానికి బొత్స నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
ఎమ్మెల్యేలను కిరణ్, బొత్స మోసగించారు
విభజన సమాచారం వారికి ముందే తెలుసు కాంగ్రెస్‌ను సీమాంధ్ర ప్రజలు క్షమించరు పార్టీకి రాజీనామా చేస్తా... ఎమ్మెల్యేగా కొనసాగుతా.. తిరువూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మజ్యోతి తిరువూరు, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు రాష్ట్ర విభజనపై ముందుగానే స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలకు తెలియజేయకుండా మోసగించారని తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి అన్నారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా చేసిందని ఆమె విమర్శించారు. గురువారం కృష్ణా జిల్లా తిరువూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర ప్రజలు క్షమించరని చెప్పారు. విభజన తీరుకు నిరసనగా పార్టీ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసినప్పటికీ తాను మాత్రం చివరివరకు ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు. గతంలో సీడబ్ల్యూసీలో రాష్ట్ర విభజనకు ఆమోదం తెలిపినప్పుడే రాజీనామా చేద్దామని తనతో సహా పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కోరినప్పటికీ వారు ఉదాసీనంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, కాంగ్రెస్‌ను వీడిన తదుపరి రాజకీయాల్లో కొనసాగాలా, వద్దా, ఏ పార్టీలో చేరాలనే విషయాలను నిర్ణయించుకుంటానని ఆమె వివరించారు. -
వీర బొబ్బిలి కోటలో ఎన్నికల సమర శంఖం
ప్రజలే బుద్ధి చెబుతారు విభజనలో ఆయన పాత్ర కూడా ఉంది వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయం:పెనుమత్స బొబ్బిలిలో ఎన్నికల శంఖారావం పూరించిన నాయకులు బొబ్బిలి, న్యూస్‌లైన్: మంత్రి బొత్స సత్యనారాయణ కు ఈసారి జరిగే ఎన్నికలతో రాజకీయ సన్యాసం తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు అ న్నారు. తొమ్మిదేళ్లుగా జిల్లాలో బొత్స దుర్మార్గపు పాల నను ప్రజలు చూశామని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పారు. బొబ్బిలి కోట లోని దర్బార్ మహాల్లో బుధవారం ఆ పార్టీ నాయకులు వేలాది మందితో ఎన్నికల శంఖారావం పూరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొత్స బొబ్బి లి నియెజకవర్గం ఇచ్చిన మెజార్టీతో రెండు సార్లు ఎంపీగా గెలిచారని, ఈసారి అదే భారీ మెజార్టీతో ఆయన్ను ఓడించి రాజకీయ సన్యాసం చేయించాల న్నారు. 30 ఏళ్లపాటు వర్గాలుగా ఉన్న తెర్లాం, బాడం గి మండలవాసులు పునర్విభజనలో పార్టీలకతీతతం గా బొబ్బిలి రాజులు వెంట నడవడం ఎన్నటికీ మరువలేమన్నారు. వచ్చే మూడు నెలలు చాలా కీలకమని నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చే యూలని పిలుపునిచ్చారు. పార్టీ అధికారంలోకి రాగా నే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుం దామని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివ రాజు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి కష్టకాలంలో ఉన్నప్పుడు బొబ్బిలి ఎమ్మెల్యేగా సుజయ్ కృష్ణ రం గారావు అండగా నిలబడ్డారన్నారు. జిల్లాలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా బేబీనాయన అండగా నిలుస్తున్నారని తెలిపారు. విజయనగరం ఎం పీతో పాటు జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలను అఖండ మెజార్టీతో గెలిపించాలని కో రారు. అందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అరుకు పార్లమెంటు పరిశీలకుడు ఆర్వీ ఎస్‌కేకే రంగారావు(బేబీనాయ న) మాట్లాడుతూ మరో బొబ్బిలి యుద్ధానికి నాయకు లు, కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. ఈ యుద్ధంలో బొబ్బిలికే విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు రాజకీయ గురువు అని, తమను ఇంతవారిని చేసిన ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన నైతిక బాధ్యత తమపై ఉందన్నారు. రాజ కీయంలో ఉన్నంత వరకూ జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. అనంతనం అర్బన్ బ్యాం కు మాజీ చైర్మన్ గునాన వెంకటరావు, సుజయ్ యువసేన చీఫ్ చెలికాని మురళీకృష్ణ, ఎన్జీఓ సంఘ నాయకుడు రౌతు రామ్మూర్తి, మాజీ ఎంపీపీ తమ్మిరెడ్డి దా మోదరరావు, బెవర సూర్యనారాయణ, బంకురు బా బూరావు, చింతల రామకృష్ణ, కిర్ల అప్పలరాం, పెద్దిం టి రామారావు, బోను శ్రీనివాసరావు మాట్లాడారు. పార్టీలో చేరిన పర్తాపు ఈ సందర్భంగా పట్టణంలోని మూడో వార్డుకు చెంది న టీడీపీ రాష్ట్ర యువత సభ్యుడు పర్తాపు చంద్రశేఖర్ 500 కుటుంబాలతో వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స కండువా వేసి స్వాగతం పలికారు. బొబ్బిలి మండలం సీతయ్యపేటమాజీ సర్పంచ్ బోను సత్యంనాయుడు, బాడంగి మండలం పినపెంకి వార్డు సభ్యుడు అల్లు సీతంనాయుడు కూడా తమ అనుచరులతో పార్టీలో చేరారు. పెనుమత్సకు సత్కారం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పెనుమత్స సాంబశివరాజు రెండోసారి కూడా ఎన్నిక కావడంతో బొబ్బిలి రాజులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. అలాగే పంపాన శ్రీనివాసరావు, బోను శ్రీనివాసరావు, బొబ్బిలి అప్పారావు కూడా సత్కరించారు. సమావేశంలో నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు పెనుమత్స సురేష్‌బాబు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆదాడ మోహనరావు, సేవా దళ్ జిల్లా అధ్యక్షుడు తూముల రాంసుధీర్, నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో 27 శాతం ఐఆర్
ఫిబ్రవరి వేతనంతో నగదు రూపంలో చెల్లించేందుకు అంగీకారం పెంపుతో ఏటా రూ.380 కోట్ల భారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 27 శాతం మధ్యంతర భృతి ఇవ్వటానికి ఆ సంస్థ యాజమాన్యం అంగీకరించింది. ఈమేరకు రవాణా మంత్రి బొత్స సత్యనారాయణతో కార్మికులు ఆదివారం రాత్రి జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో.. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె ఆగిపోయింది. 32 శాతం ఐఆర్ ఇవ్వాలని తొలుత కార్మిక సంఘాలు డిమాండ్ చేయగా.. ఆర్టీసీ యాజమాన్యం 21 శాతం మాత్రమే చెల్లిస్తామని చెప్పింది. దీంతో 27వ తేదీ (సోమవారం) నుంచి సమ్మె చేపడతామని గుర్తింపు పొందిన ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్లతో పాటు.. నేషనల్ మజ్దూర్ యూనియన్ కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఓ మెట్టు దిగొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాదిరిగా ఆర్టీసీ కార్మికులకు 27 శాతం ఐఆర్ ఇవ్వటానికి అంగీకరించింది. దీనిని ఫిబ్రవరి నుంచే అమలు చేసి.. మార్చి ఒకటో తేదీన ఇచ్చే వేతనంతో కలిపి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఆదివారం ఉదయం బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో కార్మిక సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. కేవలం 22 శాతం ఐఆర్ మాత్రమే ఇస్తామని యాజమాన్యం చెప్పింది. దీంతో కార్మిక నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, మంత్రి వద్దనే ఈ సంగతి తేల్చుకుంటామని తెగేసి చెప్పారు. ఆదివారం రాత్రి రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ జె.పూర్ణచందర్రావు తదితరులతో జరిగిన చర్చల్లో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పద్మాకర్, దామోదర్‌రావు, రాజిరెడ్డి, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే 19 శాతం తక్కువ వేతనాలు ఉన్నాయని, కనీసం 32 శాతం ఐఆర్ ఇవ్వాలని కార్మికులు కోరారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 27 శాతం ఐఆర్ ప్రకటిస్తే తప్ప.. సమ్మె నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున కార్మికులు సహకరించాలని బొత్స సర్దిచెప్పే యత్నం చేసినా.. కార్మికులు ససేమిరా అనడంతో వారి డిమాండ్‌కు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. 27 శాతం ఐఆర్‌తో ఆర్టీసీపై ఏటా రూ.380 కోట్ల అదనపు భారం పడుతుందని సంస్థ అధికారులు వివరించారు. లక్షకుపైగా ఉన్న కార్మికులకు దీంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. విజయం సాధించాం: కార్మిక సంఘాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు కూడా మధ్యంతర భృతి ఇప్పించడంలో విజయం సాధించామని ఈయూ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, పద్మాకర్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి తదితరులు పేర్కొన్నారు. సోమవారం నుంచి విజయోత్సవ సంబరాలు జరుపుకోనున్నామన్నారు. వేతన సవరణ చేయాలి: ఎన్ఎంయూ కార్మికులకు మధ్యంతర భృతితోనే సరిపెడతారేమోనని నేషనల్ మజ్దూర్ సంఘ్ నాయకులు నాగేశ్వర్రావు, మహమూద్‌లు అనుమానం వ్యక్తం చేశారు. కేవలం మధ్యంతర భృతితో సరిపెట్టకుండా వేతన సవరణ చేయాలని వారు డిమాండ్ చేశారు.