వీర బొబ్బిలి కోటలో ఎన్నికల సమర శంఖం | elections time in bobbili | Sakshi
Sakshi News home page

వీర బొబ్బిలి కోటలో ఎన్నికల సమర శంఖం

Published Thu, Feb 20 2014 2:30 AM | Last Updated on Fri, May 25 2018 9:39 PM

వీర బొబ్బిలి కోటలో ఎన్నికల సమర శంఖం - Sakshi

వీర బొబ్బిలి కోటలో ఎన్నికల సమర శంఖం


 ప్రజలే బుద్ధి చెబుతారు
 విభజనలో ఆయన పాత్ర కూడా ఉంది
 వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర
 సమన్వయకర్త సుజయ్‌పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయం:పెనుమత్స
 బొబ్బిలిలో ఎన్నికల శంఖారావం పూరించిన నాయకులు
 
 బొబ్బిలి, న్యూస్‌లైన్: మంత్రి బొత్స సత్యనారాయణ కు ఈసారి జరిగే ఎన్నికలతో రాజకీయ సన్యాసం తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు అ న్నారు. తొమ్మిదేళ్లుగా జిల్లాలో బొత్స దుర్మార్గపు పాల నను ప్రజలు చూశామని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పారు. బొబ్బిలి కోట లోని దర్బార్ మహాల్‌లో బుధవారం ఆ పార్టీ నాయకులు వేలాది మందితో ఎన్నికల శంఖారావం పూరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొత్స బొబ్బి లి నియెజకవర్గం ఇచ్చిన మెజార్టీతో రెండు సార్లు ఎంపీగా గెలిచారని, ఈసారి అదే భారీ మెజార్టీతో ఆయన్ను ఓడించి రాజకీయ సన్యాసం చేయించాల న్నారు. 30 ఏళ్లపాటు వర్గాలుగా ఉన్న తెర్లాం, బాడం గి మండలవాసులు పునర్విభజనలో పార్టీలకతీతతం గా బొబ్బిలి రాజులు వెంట నడవడం ఎన్నటికీ మరువలేమన్నారు. వచ్చే మూడు నెలలు చాలా కీలకమని నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చే యూలని పిలుపునిచ్చారు. పార్టీ అధికారంలోకి రాగా నే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుం దామని చెప్పారు.
 
 పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివ రాజు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి కష్టకాలంలో ఉన్నప్పుడు బొబ్బిలి ఎమ్మెల్యేగా సుజయ్ కృష్ణ రం గారావు అండగా నిలబడ్డారన్నారు. జిల్లాలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా బేబీనాయన అండగా నిలుస్తున్నారని తెలిపారు. విజయనగరం ఎం పీతో పాటు జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలను అఖండ మెజార్టీతో గెలిపించాలని కో రారు. అందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అరుకు పార్లమెంటు పరిశీలకుడు ఆర్‌వీ ఎస్‌కేకే రంగారావు(బేబీనాయ న) మాట్లాడుతూ మరో బొబ్బిలి యుద్ధానికి నాయకు లు, కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. ఈ యుద్ధంలో బొబ్బిలికే విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు రాజకీయ గురువు అని, తమను ఇంతవారిని చేసిన ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన నైతిక బాధ్యత తమపై ఉందన్నారు. రాజ కీయంలో ఉన్నంత వరకూ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. అనంతనం అర్బన్ బ్యాం కు మాజీ చైర్మన్ గునాన వెంకటరావు, సుజయ్ యువసేన చీఫ్ చెలికాని మురళీకృష్ణ, ఎన్‌జీఓ సంఘ నాయకుడు రౌతు రామ్మూర్తి, మాజీ ఎంపీపీ తమ్మిరెడ్డి దా మోదరరావు, బెవర సూర్యనారాయణ, బంకురు బా బూరావు, చింతల రామకృష్ణ, కిర్ల అప్పలరాం, పెద్దిం టి రామారావు, బోను శ్రీనివాసరావు మాట్లాడారు.
 
 పార్టీలో చేరిన పర్తాపు
 ఈ సందర్భంగా పట్టణంలోని మూడో వార్డుకు చెంది న టీడీపీ రాష్ట్ర యువత సభ్యుడు పర్తాపు చంద్రశేఖర్ 500 కుటుంబాలతో వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స కండువా వేసి స్వాగతం పలికారు. బొబ్బిలి మండలం సీతయ్యపేటమాజీ సర్పంచ్ బోను సత్యంనాయుడు, బాడంగి మండలం పినపెంకి వార్డు సభ్యుడు అల్లు సీతంనాయుడు కూడా తమ అనుచరులతో పార్టీలో చేరారు.  
 
 పెనుమత్సకు సత్కారం
 పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పెనుమత్స సాంబశివరాజు  రెండోసారి కూడా ఎన్నిక కావడంతో బొబ్బిలి రాజులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. అలాగే పంపాన శ్రీనివాసరావు, బోను శ్రీనివాసరావు, బొబ్బిలి అప్పారావు కూడా సత్కరించారు. సమావేశంలో నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు పెనుమత్స సురేష్‌బాబు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆదాడ మోహనరావు, సేవా దళ్ జిల్లా అధ్యక్షుడు తూముల రాంసుధీర్, నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement