Boulders
-
భయంకర దృశ్యాలు.. కొండచరియలు విరిగి కార్లపైకి దూసుకొచ్చి..
నాగాలాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగి రోడ్డుపై పడటంతో ఆ దారిలో వెళ్తున్న రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. చుమౌకెడిమా జిల్లాలోని జాతీయ రహదారి 29పై మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం వెలుగుచూసింది. భారీ వర్షాల కారణంగా దిమాపూర్ నుంచి కోహిమా మధ్యరోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో వాహనాలు నిలిచిపోయాయి. ఇంతలో పక్కనే ఉన్న ఎత్తైన కొండపై నుంచి భారీ బండరాయి రోడ్డు మీదకు దూసుకురావడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో కొహిమా నుంచి వస్తున్న రెండు కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. సంఘటన స్థలంలోనే ఓ వ్యక్తి మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ‘పాకలా పహార్’ అని పిలుస్తారని తెలుస్తోంది. అయితే ఆ ప్రదేశంలో ఎక్కువగా కొండచరియలు విరిగిపడటం, రాళ్లు జారిపడటం తరుచుగా జరుగుతుంటాయి. మరోవైపు ఈ దుర్ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో విచారం వ్యక్తం చేశారు. Un desprendimiento de rocas en Nagaland, India, deja 2 muertos y 3 heridos tras aplastar un coche. 😳😳 pic.twitter.com/3cCqKT0y0k — Momentos Virales (@momentoviral) July 4, 2023 ఈ మేరకు ట్విటర్లో స్పందిస్తూ.. ‘దిమాపూర్, కోహిమా మధ్యనున్న జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం 5 గంటలకు బండరాయి పడిపోవడంతో ఇద్దరు మృతి చెందడంతోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు అత్యవసర సేవలు, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. Oo god😭 #Nagaland pic.twitter.com/uzpnawW3Ej — Tradeholics (@Tradeholics) July 4, 2023 -
సెల్లార్లో బండరాళ్లొస్తే?
సాక్షి, హైదరాబాద్ : నగరానికి చెందిన ఓ నిర్మాణ సంస్థ నివాస ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. సెల్లార్ తవ్వే క్రమంలో పెద్ద బండరాళ్లు వచ్చాయి. దాన్ని తొలగించేందుకు ఓ కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ పనిని మరో సబ్–కాంట్రాక్టర్‌కు అప్పజెప్పారు మొదటి కాంట్రాక్టర్. బ్లాస్టింగ్ చేయాలని నిర్ణయించుకొని పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి నిర్మాణ స్థలానికి తీసుకొచ్చాడు సబ్–కాంట్రాక్టర్. అంతే! సమాచారం ఎవరందించారో తెలియదు గానీ క్షణాల్లో టాస్క్‌ఫోర్స్ చేరుకోవటం, సబ్–కాంట్రాక్టర్‌ను నిలదీయడంతో అతను నిర్మాణ సంస్థ యజమాని పేరు చెప్పడం, పోలీసులు యజమాని మీద కేసు నమోదు చేయడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి. వాస్తవానికి ఈ సంఘటనతో డెవలపర్‌కు ఎలాంటి సంబంధం లేదు. బ్లాస్టింగ్ చేయమని గానీ లేదా తవ్వకం పనిని సబ్–కాంట్రాక్ట్‌కు ఇవ్వమని గానీ ఒప్పందమేమీ చేసుకోలేదు. ...పై సంఘటన నగరంలోని చాలా మంది డెవలపర్లకు అనుభవమే. డెవలపర్, కేసు, సబ్–కాంట్రాక్టర్ విషయాలను పక్కన పెడితే.. అసలు చర్చించాల్సిన అంశం.. ‘‘సెల్లార్ తవ్వకంలో అడ్డువచ్చే బండరాళ్లను తొలగించే క్రమంలో పేలుడు జరపాల్సి వచ్చినప్పుడు వాటి అనుమతులు ఎవరిస్తారనే దాని గురించి!’’ భూమి లోపల 10 అడుగుల లోతు కంటే ఎక్కువ సెల్లార్ తవ్వే క్రమంలో పెద్ద బండరాళ్లు వస్తుంటాయి. సాధ్యమైనంత వరకు సంబంధిత కాంట్రాక్టర్లు వీటిని కూలీలు, పనిముట్ల సహాయంతో తొలగిస్తుంటారు. పెద్ద పెద్ద బండరాళ్లు, కఠినమైన రాళ్లు వచ్చిన సందర్భాల్లో మాత్రం పేలుళ్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇదే డెవలపర్లకు నరకంగా మారింది. ఎందుకంటే బ్లాస్టింగ్ అనుమతులు ఏ ప్రభుత్వ విభాగం ఇస్తుంది? ఎన్ని రోజుల్లో అనుమతులొస్తాయి? అసలు ఫీజు ఎంత? ఎలాంటి పత్రాలను జత చేయాలి? వంటి విధివిధానాలేవీ లేవని ఓ డెవలపర్ ‘సాక్షి రియల్టీ’తో వాపోయారు. చేతులు తడిపితేనే అనుమతులు.. బ్లాస్టింగ్ అనుమతుల కోసం కాళ్ల చెప్పులరిగేలా తిరిగితే తప్ప రాని పరిస్థితి. పైగా చేతి చమురూ వదులుకోవాల్సిందే. స్థానిక పోలీసులు, అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి పని చేసుకోవాల్సి వస్తుందని.. దీంతో అనవసరంగా అవినీతి పెరుగుతుందని డెవలపర్లు చెబుతున్నారు. ఒక్క ప్రాజెక్ట్‌కు బ్లాస్టింగ్ అనుమతుల కోసం ఆరేడు నెలల దాకా వేచి ఉండాల్సి వస్తుందని వాపోయారు. విధివిధానాలుండాల్సిందే.. ♦ పేలుళ్లకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ కోసం ప్రత్యేకంగా విభాగం, అధికారులు ఉండాలి. పేలుళ్లు జరిపే క్రమంలో పర్యవేక్షణ జరపాలి. ♦ మున్సిపాలిటీలోనే నిర్మాణ అనుమతులతోనే పేలుడుకు సంబంధించిన అనుమతులు ఇస్తే బాగుంటుంది. ♦ అన్ని సందర్భాల్లోనూ పేలుడు పదార్థాలను వినియోగించకుండా రసాయనాలను వినియోగించే వీలుండాలి. ♦ స్థానికంగా ఉన్న ఇతర భవనాలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ ఏర్పాట్లు తీసుకోని డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. -
చంపేసి.. మృతదేహంపై రాళ్లు పేర్చి
తాండూరు రూరల్: దుండగులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి.. అనంతరం మృతదేహంపై బండరాళ్లు పేర్చారు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన తాండూరు పట్టణంలోని సీతారాంపేట్‌లో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. పట్టణ సీఐ వెంకట్రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బం ట్వారం మండలం కల్కోడ గ్రామానికి చెందిన చాకలి శ్రీను(30) కొన్నేళ్ల క్రితం పాతతాండూరుకు చెందిన లక్ష్మిని పెళ్లి చేరుకొని అత్తగారివద్ద ఉంటున్నాడు. స్థానికంగా రోజు వారి కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా పట్టణంలోని సీతారాంపేట్‌లో ఉన్న శ్మశానవాటికలో ఓ యువకుడి(30) మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న తాండూరు పట్టణ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ నాగార్జున సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదే న్ని పరిశీలించారు. మృతుడిని చాకలి శ్రీనుగా గుర్తించారు. దుండగులు అతడిని చంపేసిన అనంతరం మృతదేహంపై బండరాళ్లు పేర్చారు. ముఖంపై రాళ్లతో మోదడంతో పూర్తి ఛిద్రమైపోయింది. వెంటనే పోలీసులు వికారాబాద్ నుంచి డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంల ను రప్పించారు. పోలీసు జాగిలం సంఘటనా స్థలం నుంచి సీతారాంపేట్‌లో పలు వీధుల మీదుగా క్లాసిక్గార్డెన్ సమీపంలో ఉన్న ఓ పాలిషింగ్ యూనిట్ వద్దకు వెళ్లి ఆగింది. మృతదేహం వద్ద క్లూస్ టీం సిబ్బంది వివరాలు సేకరించారు. దుండగులు బండరాళ్లతో శ్రీను తలపై మోది హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహానికి సమీపం లో ఓ ముళ్లచెట్లు వద్ద ఖాళీ మద్యం సీసాలు పడి ఉన్నాయి. దీంతో హతుడికి తెలిసిన వారే చంపేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చేందుకు తీసుకొచ్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈక్రమంలోనే మృతదేహంపై బండరాళ్ల పేర్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మొదటగా హతుడి వివరాలు తెలియరాలేదు. సీతారాంపేట్‌లో వ్యక్తి దారుణ హత్య విషయం తెలుసుకున్న పట్టణవాసులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ విషయం దావానలంలా పట్టణంలో వ్యాపించడంతో తీవ్ర కలకలం రేగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, హతుడికి కుమార్తె విజయ (3), కొడుకు లక్కీ(1) ఉన్నారు. కేసు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్రామయ్య పేర్కొన్నారు. -
యాత్రికుల గుండెల్లో రాయి
కూలుతున్న బండరాళ్లు.. పట్టించుకోని టీటీడీ అధికారులు నిపుణుల హెచ్చరికలను గాలికి వదిలిన వైనం భయపడుతున్న ప్రయాణికులు తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణం యాత్రికులను భయపెడుతోంది. పెద్దపెద్ద బండరాళ్లు పడుతుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. రక్షణ చర్యలు చేపట్టాలని నిపుణులు ముందస్తుగా హెచ్చరించినా టీటీడీ ఇంజినీర్ల చెవికి ఎక్కలేదు. ఫలితంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. రెండో ఘాట్‌లో ప్రమాద సంకేతాలు.. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌లో తరచూ బండరాళ్లు కూలుతున్నాయి. ఎనిమిదో కిలోమీటర తర్వాత నుంచి తిరుమలకు చేరే వరకు కొండ చరియలు విరి గిపడే అవకాశాలు ఉన్నా యి. చివరి ఐదు మలుపుల (హెయిర్‌పిన్ కర్వ్స్) వద్ద ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. రెండు రోజులుగా మోస్తరు వర్షం కురుస్తుండడంతో భారీ స్థాయిలో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. దశాబ్దం క్రితం త్రోవ భాష్యకార్ల సన్నిధి సమీపంలోని మలుపు వద్ద భారీగా కొండ చరియలు విరిగిపడటంతో అప్పట్లో ప్రత్యేకంగా ఇంజినీరింగ్ నిపుణులను రప్పించి తొలగించారు. అక్కడే భారీ ఇనుపరాడ్లను కొండ బొరియల్లోకి దించారు. ప్రత్యేకంగా ఇనుప కంచె (ఫెన్సింగ్) నిర్మించారు. చివరి మలుపు వద్ద రెండేళ్ల క్రితం రాక్‌బౌల్టర్ ట్రాప్ (ఇనుప కంచె) నిర్మించారు. తద్వారా బండరాళ్లు దొర్లినా ఇనుప కంచెలో పడుతుండటంతో ప్రమాదాలు తప్పుతున్నాయి. ఎనిమిదో కిలోమీటర్ వద్ద గత ఏడాది డిసెంబరు 17వ తేదీన భారీ స్థాయిలో కొండరాళ్లు కూలాయి. తాజాగా దానికి వందమీటర్ల దూరంలోనే భారీ కొండచరియ కూలింది. హెచ్చరిక లు పట్టని ఉన్నతాధికారులు తిరుమల రెండో ఘాట్‌లో కొండ చరియలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని గత ఏడాది 20వ తేదీన ఐఐటీ ప్రొఫెసర్ నరసింహారావు టీటీడీని హెచ్చరించారు . ప్రమాద సంకేతాలు చూపే ప్రాంతాల్లోని బండరాళ్లను వెంటనే తొలగించాలని ఆయన సూచించారు. అధికారులు పట్టించుకోకపోగా కోట్లు ఖర్చుపెట్టి కొండలను కూల్చాల్సిన అవసరం ఏముందని కొట్టిపారేశారు. బండరాళ్లు కూలిన సందర్భాల్లో హడావుడి చేసి తర్వాత గాలికి వదిలేస్తున్నారు. నైరాశ్యంలో ఇంజినీరింగ్ విభాగం ఏడాది కాలంగా ఇంజినీరింగ్ శాఖలో నిర్లిప్తత చోటు చేసుకుంది. అవసరమైన పనుల అనుమతి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. శ్రీవారి బ్రహ్మోత్సవంతో ముడిపడిన పనులు తప్పిస్తే మిగిలిన వాటికి అనుమతుల రావడం లేదనే విమర్శలున్నాయి. దీంతో ఇటు ఇంజినీర్లలో, అటు కాంట్రాక్టర్లలో నైరాశ్యం ఆవహించిందని ప్రచారం సాగుతోంది.