Boyfriend died
-
దారుణం: ప్రియుడిని చంపి ఆ భాగాలతో బిర్యానీ..
రబాత్: ఉత్తర ఆఫ్రికాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మరో యువతితో పెళ్లికి సిద్దమైన ప్రియుడిని హత్య చేసిన మహిళ అనంతరం అతడి ప్రైవేటు భాగాలను బిర్యాని వండిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అంతేగాక ఆ బిర్యానినీ భవన నిర్మాణ కార్మికులకు పెట్టిన ఈ సంఘటన విని పోలీసులు సైతం విస్తుపోయారు. వివరాలు.. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోకు చెందిన 30 ఏళ్ల మహిళ ఏడేళ్లుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో అతడు మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు ఆమె అనుమానించింది. ఇదే విషయం ప్రియుడిని అడుగగా అతడు ఆ యువతిని పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆ మహిళ ప్రియుడితో గొడవపడింది. ఈ క్రమంలో అతడిని హత్య చేసింది. అయితే ఈ విషయం బయటరాకుండా ఉండేందుకు అతడి మృతదేహాన్ని మాయం చేయాలనుకుంది. దీంతో అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి అతడి ప్రైవేటు భాగాలు(పురుషాంగం, వృషణాలు)తో బిర్యానీ వండింది. దానిని పక్కనే భవన నిర్మాణం పనులు చేస్తున్న కూలీలకు వడ్డించింది. ఆ తర్వాత మిగిలిన శరీరా భాగాలను కుక్కలకు వేసింది. అయితే ఆ వ్యక్తి ఎంతకి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావడంతో మృతుడి కుటుంబ సభ్యులు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఆచూకి కనిపించకపోవడంతో సదరు మహిళపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు మహిళ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు మిక్సీలో దంతాలు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షించగా అవి మృతుడివే అని తేలడంతో పోలీసుల ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితురాలు చెప్పిన విషయాలకు పోలీసులు కూడా షాకయ్యారు. దీంతో సదరు మహిళపై కేసు నమోదు చేసి ఆమె మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చదవండి: సంబంధం పెట్టుకోవాలని కానిస్టేబుల్ వేధింపులు డబ్బు వివాదం: కుటుంబంతో కలిసి భర్త హత్య -
ప్రియురాలు దక్కదేమోనని ఆత్మహత్య
సాక్షి, తెనాలి: ప్రియురాలు తనకు దక్కదేమోనన్న ఆందోళనతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఐతానగర్ లంకదిబ్బకు చెందిన చేబ్రోలు దినేష్‌కుమార్(24) డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసి, పెయింట్ పనులకు వెళుతున్నాడు. పాండురంగపేటకు చెందిన యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. దినేష్ మరో యువతితో చాటింగ్ చేస్తున్నాడంటూ ఇటీవల ఆ యువతి ప్రశ్నించడంతో గత వారం రోజులుగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ప్రియురాలు తనకు దక్కదని ఆందోళన చెందిన దినేష్ తెనాలి మండలం తేలప్రోలు పరిధిలోని పొలం వెంబడి చెట్టుకు మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు మృతదేహం వేలాడుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలాన్ని రూరల్ పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ప్రేమ వ్యవహారం కారణంగానే దినేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రాథమికంగా తెలుస్తోందని, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పి.ఉదయ్‌బాబు తెలిపారు. -
ప్రియుడి మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య
టీ.నగర్: ప్రియుడు మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తిరువొత్తియూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నై తిరువొత్తియూరు, గోపినగర్‌కు చెందిన నటరాజన్ లారీ ట్రాన్స్‌పోర్టు నడుపుతున్నారు. ఇతని కుమార్తె అశ్విని (20) లా విద్యార్థిని. ఈమె కొన్నేళ్లుగా వేదారణ్యం శెట్టిపురానికి చెందిన తెన్నవన్‌ను ప్రేమిస్తోంది. గత మే 3వ తేదీ నటరాజన్ కుటుంబీకులు బంధువుల ఇంటి శుభకార్యంలో పాల్గొనేందుకు కేరళకు వెళ్లారు. వారితో అశ్విని వెళ్లకుండా ఇంట్లో ఒంటరిగా గడిపింది. ఆ సమయంలో తెన్నవన్ ఓ రోజు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తెన్నవన్‌కు గుండెపోటు రావడంతో మృతిచెందాడు. దీనిపై తిరువొత్తియూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రియుడు మృతిచెందడంతో అశ్విని మనస్తాపం చెందింది. ఈ క్రమంలో తిరువొత్తియూరు శివశక్తినగర్‌లోని పెదనాన్న ఇంట్లో మూడు నెలలుగా అశ్విని ఉంటోంది. శుక్రవారం రాత్రి అశ్విని పెదనాన్న, కుటుంబీకులు బయటికి వెళ్లిన సమయంలో అశ్విని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న సాతాన్‌గాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అశ్విని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
సంచలనం రేపిన వివాహేతర సంబంధం
►ప్రేయసి, ప్రియుడు ఆత్మహత్యా యత్నం ► ప్రియుడు మృతి ► అనాథలైన పిల్లలు ► చావుబతుకుల మధ్య ప్రియురాలు శ్రీకాకుళం జిల్లా : వివాహేతర సంబంధం ఇద్దరిని ఆత్మహత్యా యత్నానికి ప్రేరేపించింది. వీరిలో ఒకరి ప్రాణం తీసింది. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మృతుడి పిల్లలను అనాథను కూడా చేసింది. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఇద్దరికీ వివాహం కావడం, వివాహేతర సంబంధం విషయం వారి ఇళ్లల్లో తెలిసిపోయి కుటుంబ సభ్యులు నిలదీయడంతో మనస్తాపానికి గురై చివరకు ఇద్దరూ తమ వారిని మరచి ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం వారిలో ప్రియుడు మృతి చెందడం మంగళవారం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే....మండలంలోని మకరాంపురం గ్రామానికి చెందిన వజ్జ సురేష్(30), అదే గ్రామానికి చెందిన ఎలుసూరి స్రవంతి మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గ్రామానికి దూరంగా ఉన్న కంకర గోతులు వద్ద గల జీడితోటలో మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ప్రియురాలి తరఫు కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌లో సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. ప్రియుడు రమేష్‌ను అక్కడే విడిచిపెట్టేయడంతో అతని కుటుంబ సభ్యులు బైక్‌పై సోంపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఆసుపత్రికి తీసుకొచ్చిన కొద్దిసేపటికే రమేష్ ప్రాణాలు కోల్పోయూడు. అంతకు ముందు ప్రియురాలు స్రవంతి సోంపేట సీఐ సూరినాయుడు, కంచిలి ఎస్ఐ ఆర్.వేణుగోపాల్ వద్ద వాంగ్మూలం ఇచ్చింది. ఆ వివరాలిలా ఉన్నాయి. స్రవంతి మాటల్లో...తనకు ప్రియుడు రమేష్‌తో 16 ఏళ్ల కిందట నుంచి ప్రేమ సాగుతోందని, పదేళ్ల కిందట తనకిష్టం లేకపోయినా మేనమామతో వివాహం చేశారని చెప్పింది. తరువాత ప్రియుడు రమేష్ సిలగాం గ్రామానికి చెందిన గాయిత్రిని ప్రేమించి వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపింది. తనకు కూడా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని ఇటీవల కాలంలో ప్రేమికులమైన తాము తరచూ కలుస్తూ ఉండేవాళ్లమని చెప్పింది. రెండు నెలల కిందట గ్రామానికి చెందిన దేవాలయంలో రమేష్‌తో మళ్లీ వివాహం చేసుకున్నట్టు తెలిపింది. మా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు తెలిసిపోవడంతో అందరూ నానా మాటలు అనడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డామని చెప్పింది. ఇదిలా ఉండగా రమేష్ మృతి చెందడంతో భార్య గాయిత్రి, మూడేళ్ల కుమారుడు అనాథలుగా మిగిలారు. మరోవైపు చావుబతుకుల్లో ఉన్న స్రవంతిని చూసి భర్త, ముగ్గురు పిల్లలు ఆందోళన చెందుతున్నారు. కాగా మృతుని సోదరుడు సురేష్ ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్ఐ ఆర్.వేణుగోపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ మృతదేహానికి సోంపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.