అన్యమత ప్రచారాన్ని ఆపండి
చంద్రగిరి : టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల సమయంలో అన్యమత ప్రచార సభలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి సంరక్షణ సమితి తిరుపతి డివిజన్ కార్యదర్శి పాదిరి ధనుంజయరెడ్డి కోరారు. ఈ మేరకు స్థానిక చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 3వ తేది నుంచి టీటీడీ బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోందన్నారు. అయితే అదే సమయంలో తిరుపతి పరిసరాల్లో అన్యమత ప్రచార సభలు జరపడం అభ్యంతకరమని తెలిపారు. అనంతరం డీటీ గుణశేఖర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు సీఎం కేశవులు(బుజ్జి), కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, రామ్మూర్తి నాయుడు, నటరాజ ఆచారి, కోలా అనిల్, రాజశేఖర్, గురునాథ్, జగన్, రూపకుమార్ తదితరులు పాల్గొన్నారు.