Bravery
-
బుల్లెట్ల వర్షం కురుస్తున్నా..సాహసంతో తరిమికొట్టింది!
తుపాకీతో కాల్పులు జరుపుతున్న నలుగురు దుండగులను ధైర్యంగా ఎదిరించిందో మహిళ. కేవలం పొడవాటి చీపురు కర్ర (దులుపు కర్ర)సాయంతో షూటర్లను తరిమి కొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. హర్యానాలో భివానీలోని ఈ ఘటన చోటు చేసుకుంది. షాకింగ్ దృశ్యాలకు సంబంధించిప వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్యానాలో వానీలోని డాబర్ కాలనీలో హరికిషన్ తన ఇంటికి వెళ్ళే గేటు పక్కనే నిలబడి ఉన్నాడు. రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు వచ్చారు. బండిపై నుంచి దిగిన పిలియన్ రైడర్లు ఇద్దరు హరికిషన్‌పై కాల్పులు జరపడంతో, అతను లోపలికి పోయి, తప్పించుకున్నాడు. ఇంతలో పక్కనుంచి వచ్చిన మహిళ చాలా ధైర్యసాహసాలు ప్రదర్శించింది. కాల్పులు మోత మోగుతున్నాఏ మాత్రం వెనకడుగు వేయలేదు. షూటర్ల మీదికి కొబ్బరి పుల్లలతో కట్టిన దులుపు కర్రతో ఎటాక్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో వారు ఆ ప్రదేశంనుంచి ఉడాయించిక తప్పలేదు. ఈ క్రమంలో ఆ మహిళపై కూడా కాల్పులు జరిపారు. కానీ ఆమె తప్పించుకుంది. ముష్కరులు తొమ్మిది రౌండ్లు కాల్పులు జరపగా, హరికిషన్‌కు నాలుగు బుల్లెట్ గాయాలయ్యాయి. మహిళ హరికిషన్ కుటుంబసభ్యులా లేక పొరుగింటి మహిళా అనేది స్పష్టత లేదు. బాధితుడిని చికిత్స నిమిత్తం పీజీఐఎంఎస్ రోహ్తక్కు తరలించినట్లు పోలీసు అధికారి దీపక్ మీడియాకు తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేస్తున్నారని, షూటర్లను, వారితో పాటు వచ్చిన ఇద్దరు రైడర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇది ఇలా ఉండగా రవి బాక్సర్ హత్య కేసులో హరికిషన్ నిందితుడు.ఇతనికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. హరికిషన్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. అతడిపై దాడికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్న ఐదుగురిని మూడు నెలల క్రితం భివానీ పోలీసులు అరెస్టు చేశారట. Bravery. Haven't EVER seen anything close to this! 4 armed men, on a shooting spree, being chased by a middle aged woman, with a BROOM. pic.twitter.com/fbbboLW9jU — CA Mayank Parakh (@Mayank_Parakh) November 28, 2023 -
సూపర్‌హీరో మరో ఔదార్యం, నెటిజన్లు ఫిదా
సాక్షి, ముంబై: ప్రాణాలకు తెగించి మరీ పట్టాలపై పడి పోయిన బాలుడిన కాపడిన రైల్వే పాయింట్‌మ్యాన్ మయూర్ షెల్కే తన ఔదార్యంతో మరోసారి రియల్ హీరోగా నిలిచారు. తనకు బహుమతిగా వచ్చిన డబ్బులో సగం భాగాన్ని తాను రక్షించిన బాలుడికి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. అతని కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న తరువాత మయూర్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని భావించారు. ఆ బాలుడి చదువు, సంక్షేమం నిమిత్తం కొంత సొమ్మును దానం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అతని పెద్దమనసుకు నెటిజనులు హ్యాట్యాఫ్ అంటున్నారు. మా మనసులను ఎన్నిసార్లు గెల్చుకుంటావ్ భయ్యా అంటూ షెల్కేకు ఫిదా అవుతున్నారు. (సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్) I'll give half of the amount, given to me as token of appreciation, for that child's welfare & education. I came to know that his family isn't financially strong. So I decided this: Mayur Shelkhe, pointsman who saved a child who fell on tracks at Vangani railway station on 17.04 pic.twitter.com/IWdacY0DFf — ANI (@ANI) April 22, 2021 pic.twitter.com/C62xQVXnCy — thejadooguy (@JadooShah) April 22, 2021 In these dark days for humanity, ray of hope 🙏 — Bharateeya (@AntiCaste_Hindu) April 22, 2021 -
సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్
-
సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్
సాక్షి, ముంబై: అత్యంత సాహసంతో బాలుడి ప్రాణాలను కాపాడిన రైల్వే ఉద్యోగిపై ప్రశంసల జల్లుకురవడమే కాదు విలువైన బహుమతులు కూడా లభిస్తున్నాయి. ప్రమాదవశాత్తూ రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయిన బాలుడిని రక్షించిన మయూర్ షెల్కేని స్వయంగా రైల్వే శాఖమంత్రి పియూష్ గోయల్ అభినందించారు. రైల్వే మంత్రిత్వ శాఖ బహుమతిని కూడా ప్రకటించింది. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ఈ కోవలో నిలిచింది. సమయానుకూలంగా స్పందించి, ప్రాణాలను పణంగా పెట్టి మరీ బాలుడిని కాపాడి హీరోగా నిలిచిన షెల్కేకు జావా మోటార్ సైకిల్‌ను గిఫ్ట్‌గా ప్రకటించింది. మయూర్ షెల్కే ధైర్యసాహసాలు ప్రశంసనీయమంటూ క్లాసిక్ లెజెండ్స్ చీఫ్ అనుపమ్ థరేజా అభినందించారు. మొత్తం జావా కుటుంబం ఆయనను అభినందిస్తోందన్నారు. రైలు దూసుకొస్తున్నప్పటికీ బాలుడిని సురక్షితంగా కాపాడిన తీరు తమను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందని థరేజా పేర్కొన్నారు. జావా హీరోస్ ఇనీషియేషన్‌లో భాగంగా ఈ అవార్డు ఇస్తున్నామన్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఇలాంటి హీరోలను గుర్తించి జావా హీరోస్ పేరుతో సత్కరించనున్నామని వెల్లడించారు. దీనిపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. మూవీల్లోని సూపర్ హీరోలను మించిన హీరోగా మెరుగైన ధైర్య సాహసాలను ప్రదర్శించారంటూ ట్వీట్ చేశారు. జావా కుటుంబంలో మనమందరం అతనికి సెల్యూట్ చేద్దామన్నారు. అలాగే క్లిష్ట సమయాల్లో ఎలా ప్రవర్తించాలో షెల్కే మనకు చూపించారంటూ ఆయన ప్రశంసించారు.(పట్టాలపై చిన్నారి..దూసుకొస్తున్న రైలు.. ఇంతలో) కాగా ఏప్రిల్ 17న వంగని రైల్వే స్టేషన్లో మయూర్ షెల్కే అత్యంత సాహసంతో బాలుడిన కాపాడిన వైనం చోటు చేసుకుంది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలను రైల్వే శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. సెంట్రల్ రైల్వేలో పాయింట్స్‌మన్‌గా పని చేస్తున్నమయూర్ షెల్కేకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ.50 వేలు బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సముద్రంలో 'అసాధారణ శౌర్యం'!
న్యూఢిల్లీః ఆమె ధైర్య సాహసాలు ప్రపంచదృష్టినే ఆకట్టుకున్నాయి. భారత షిప్పింగ్ కార్పొరేషన్ అధికారంలోని 'సంపూర్ణ స్వరాజ్య' ఆయిల్ ట్యాంకర్ హెల్మ్ గా పనిచేస్తున్న సమయంలో ఆమె.. సముద్రంలో ప్రదర్శించిన ఆసాధారణ సాహసాన్ని, శౌర్యాన్ని గుర్తించిన ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్... ఆమెను అవార్డుతో సత్కరించనుంది. దీంతో రాధికా మీనన్ ప్రపంచంలోనే సముద్ర శౌర్యానికి అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళ కానుంది. మునిగిపోతున్న పడవనుంచీ ఏడుగురు జాలర్ల జీవితాలను రక్షించి, ఒడ్డుకు చేర్చిన అత్యంత శౌర్యశాలిగా రాధికా మీనన్ ను ఇంటర్నేషనల్ మారిటైం గుర్తించింది. ఐదేళ్ళ క్రితం ఇండియన్ మర్చంట్ నేవీ లో మొదటి మహిళా కెప్టెన్ గా గుర్తింపు పొందిన మీనన్.. ఇప్పుడు ప్రపంచంలోనే సముద్రంలో శౌర్యాన్ని ప్రదర్శించిన మొదటి మహిళగా అవార్డు అందుకోనుంది. గతేడాది జూన్ సమయంలో ఉన్నట్లుండి వచ్చిన తుఫానుతో సముద్రంలో ఏడుగురు జాలర్లతో చేపల వేటకు వెళ్ళిన 'దుర్గమ్మా' అనే ఫిషింగ్ బోట్ ఇంజన్ ఫెయిల్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నుంచి ఒడిశాలోని గోపాల్పూర్ వైపు వెళ్ళిన పడవ.. సముద్రంలో మునిగిపోతుండటాన్ని రాధికా మీనన్ బృందం గుర్తించింది. అప్పటికే జాలర్లంతా చనిపోయి ఉండొచ్చని భావించిన వారి కుటుంబ సభ్యులు ఏకంగా వారి అంతిమ సంస్కారాలకు సైంతం సిద్ధమైపోయారు. అదే సమయంలో సముద్రంలోని నేవీ బృందం అద్భుతంగా వారిని రక్షించినట్లు వినిపించిన వార్త.. మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం నింపింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని సంపూర్ణ స్వరాజ్య ఆయిల్ ట్యాంకర్ నావికురాలుగా పనిచేస్తున్న కేరళ కొడుంగల్లూర్ కు చెందిన మీనన్.. తనకు అందిన గౌరవానికి, గుర్తింపునకు ఈ మెయిల్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. ఓ నావికురాలుగా, ఓడలోని నావికులకు గురువుగా ఉంటూ సముద్రంలో మునిగిపోతున్నవారి జీవితాలను రక్షించడం తన బాధ్యత, విధి నిర్వహణలో ఓ భాగం అంటూ తెలిపింది. -
సాహసబాలలకు జాతీయ పురస్కారాలు ప్రదానం
-
దొంగను పట్టించిన సమయస్పూర్తి
మహిళ మెడలో గొలుసు తెంపుకుని పారిపోతున్న దుండగులను పట్టిచ్చిన యువకుడిని పోలీసులు అభినందించారు. అనంతపురం నగరంలోని మారుతీనగర్‌కు చెందిన ఎం.పద్మావతి (48) సోమవారం నడిచి వెళ్తుండగా ఇద్దరు యువకులు బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో గొలుసును తెంపుకొని పోయారు. దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో ఎదురుగా బైక్‌పై వస్తున్న గీతాప్రసాద్ అనే యువకుడు ఆమె కేకలు విని దుండగుల బైక్‌ను తన బైక్‌తో ఢీకొట్టించాడు. దీంతో ఆగంతకులు పడిపోయారు. వెంటనే చుట్టుపక్కల వారు వారిద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. నిందితులను నగరానికి చెందిన షేక్ సర్వర్ వలీ, మహ్మద్ అలీగా గుర్తించారు. గీతాప్రసాద్ సమయస్ఫూర్తిని ఎస్పీ రాజశేఖర్‌బాబు మెచ్చుకున్నారు. గీతాప్రసాద్‌కు రూ.5 వేలు రివార్డు అందజేశారు. గీతా ప్రసాద్ సాహస కృత్యాన్ని జాతీయ అవార్డుకు సిఫారసు చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు. -
ఆయనే లేకపోతే ఏమయ్యేదో...
ముంబై: కారుతో సహా నీటిలో మునిగిపోతున్న ఓ వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడాడు ముంబైకు సమీపంలోని ఓ దాబా యజమాని. ఈ మధ్యనే వివాహం చేసుకున్న ముంబైకి చెందిన కార్ల వ్యాపారి శేఖర్ తన భార్యను కలవడానికి గుజరాత్ వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. పక్కనే ఉన్న ఆకాష్ దాబా యజమాని అతణ్ని రక్షించాడు. లేదంటే ఒక నవవధువు తన భర్తను కోల్పోయి ఉండేది వివరాల్లోకి వెళితే. శేఖర్ (35) తన భార్యను కలవడానికి గుజరాత్ బయలుదేరాడు. అతను నడుపుతున్న కారు టైర్ అకస్మాత్తుగా పేలడంతో వాహనం అదుపు తప్పింది. బ్రిడ్జిపై నుంచి సుమారు 25 అడుగుల లోతున్న కాలవలోకి పడిపోయింది. చుట్టూ జనం పోగయ్యారు. మునిగిపోతున్న కారును జనం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవరూ సాహసం చేయడానికి ముందుకు రాలేదు. కానీ దాబా యజమాని మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా నీటిలోకి దూకేశాడు. శేఖర్‌ను కొన ఊపిరితో బయటకు లాక్కొచ్చాడు. వెంటనే జనం అతన్ని స్థానిక ఆసుప్రతిలో చేర్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న శేఖర్ బంధువులు..వెన్నెముక విరిగి, రెండు కాళ్లలో చలనంలేని స్థితి, మెదడులో రక్తస్రావం లాంటితీవ్ర గాయాలతో ఉన్న శేఖర్ ను మెరుగైన చికిత్స కోసం ముంబైలోని కెమ్ ఆసుపత్రికి తరలించారు. మెదడులో రక్తస్రావాన్ని ఆపగలిగామని, ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు తెలిపారు. అతను సీటు బెల్టు పెట్టుకొని ఉండకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేదని కెమ్ డీన్ అవినాష్ సుపె తెలిపారు. ప్రస్తుతం శేఖర్ స్పృహలోనే ఉన్నాడని, ప్రాణాలకు ప్రమాదమేమీ లేదన్నారు. అయితే తన భర్త రాక కోసం ఎదురు చూస్తున్న తాను ప్రమాద వార్త విని చాలా భయపడ్డానని , దాబా యజమాని కాపాడి ఉండకపోతే తన భర్త బతికే ఉండేవాడు కాదని బాధితుని భార్య ప్రియ అంటోంది. ఆయనకు జన్మజన్మలకు ఋణపడి ఉంటామని తెలిపింది. ఆయన అంత సాహసం చేసి ఉండక పోతే ఏమయ్యేదో అంటూ దాబా యజమానికి బంధువులు ధన్యవాదాలు తెలిపారు. -
జ్యోతి కాదు..అపరకాళిక
కత్తితో దాడికి యత్నించిన దుండగుడిపై తిరగబడిన యువతి కళ్యాణదుర్గం : దుండగుడు కత్తితో దాడి చేసినా ఆ యువతి వెరవలేదు. భయపడలేదు. అందరి ఆడపిల్లల్లా దౌర్జన్యానికి తలొగ్గలేదు. ఎవరో వచ్చి కాపాడుతారని ఎదురు చూడలేదు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించింది. చాకచక్యంగా దుండగుడి చేతిలోని కత్తి లాక్కొని అపరకాళికగా మారింది. దీంతో దుండగుడు కాళ్లకు పనిచెప్పాల్సి వచ్చింది. కళ్యాణదుర్గంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని దొడ్డగట్టరోడ్డులో నాగరాజు, లక్ష్మిదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. నాగరాజు పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి కుమార్తె జ్యోతి డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న జ్యోతి.. దొడ్డగట్ట రోడ్డులోని పూర్ణానంద స్వామి ఆశ్రమం వద్దకు రోజు పాలు ఇచ్చి ఇంటికి వచ్చేది. రోజువారి తరహాలోనే శనివారం సాయంత్రం ఆశ్రమంలో పాలు ఇచ్చి బయల్దేరింది. ఇంటి సమీపంలోనే గుర్తు తెలియని యువకుడు ముఖానికి ఖర్చీఫ్ కట్టుకుని కత్తితో దాడికి ప్రయత్నించాడు. ప్రతిఘటించిన జ్యోతి..ఆ వ్యక్తిని ఒక చేత్తో గొంతుపట్టుకుని మరో చేతితో కత్తి గుంజుకుంది. దీంతో దుండగుడు జ్యోతి నుంచి తప్పించుకొని పక్కనే ఉన్న కంపచెట్లలోకి పరుగులు తీశాడు. అనంతరం జ్యోతి టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.