breathlessness
-
రాజ్యసభ ఎంపీ మహేంద్రప్రసాద్ కన్నుమూత
న్యూఢిల్లీ: జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్రప్రసాద్ (81) ఢిల్లీలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. ఆయన మృతికి ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సంతాపం ప్రకటించారు. అరిస్టో ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడైన మహేంద్రప్రసాద్‌కు పార్లమెంట్ సభ్యుల్లో అత్యంత ధనికుల్లో ఒకరిగా పేరుంది. మహేంద్ర బిహార్ నుంచి 7 పర్యాయాలు రాజ్యసభకు, ఒక విడత లోక్‌సభకు ఎన్నికయ్యారు. (చదవండి: చండీగఢ్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు) -
నిలకడగా పాశ్వాన్ ఆరోగ్యం
పట్నా : అస్వస్థతకు గురైన కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ఆర్యోగం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్వాసకోస ఇబ్బందులతో ఆయనను నిన్న రాత్రి ఢిల్లీలోని పరాస్ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. పాశ్వాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి కార్డియాలస్ట్ హెడ్ డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. పాశ్వాన్‌కు ఐసీయూలోనే చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు పాశ్వాన్ ఆరోగ్యం మెరుగు పడగానే వైద్యుల సిఫార్సు మేరకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఓఎస్డీ ఆర్సీ మీనా తెలిపారు. -
ముషర్రఫ్‌కు తీవ్ర అస్వస్థత
కరాచీ: తీవ్రమైన రక్తపోటుతో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ ఆస్పత్రిలో చేరారు. కరాచిలోని స్వగృహంలో ముషర్రఫ్ విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా రక్తపోటు పెరిగి స్పృహ కోల్పోయారు. వెంటనే అయనను కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ముషర్రఫ్ చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముషర్రఫ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.