Brijesh Kumar Tribunal Verdic
-
'కృష్ణా జలాలపై న్యాయం జరిగే వరకూ పోరాటం'
-
'కృష్ణా జలాలపై న్యాయం జరిగే వరకూ పోరాటం'
న్యూఢిల్లీ : కృష్ణా జలాల పంపిణీపై న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని అఖిలపక్షం స్పష్టం చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేయాలంటూ అఖిలపక్ష నేతలు శుక్రవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిశారు. అరగంటపాటు జరిగిన ఈ చర్చల్లో రాష్ట్రానికి జరిగే అన్యాయంపై ప్రధానికి వివరణ ఇచ్చారు. కృష్ణా మిగుల జలాలపై హక్కు కల్పించాలని అఖిలపక్ష నేతలు కోరారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పును పునఃపరిశీలించాలని ప్రధానికి అఖిలపక్ష నేతల వినతి పత్రం సమర్పించారు. భేటీ అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బ్రిజేష్ తీర్పుతో రాష్ట్రానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని ప్రధానికి చెప్పామన్నారు. తీర్పు వల్ల దేశానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పామని, తమ విజ్ఞప్తిపై ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు. ట్రిబ్యునల్ తీర్పును పునఃపరిశీలించేలా సీడబ్ల్యూసీని కోరతామని ప్రధాని చెప్పారని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం జరగకుండా జోక్యం చేసుకోవాలని ప్రధానికి చెప్పామని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు నీటిని కేటాయించిలా న్యాయం చేయాలని కోరినట్లు నాగం జనార్థన్ రెడ్డి తెలిపారు. -
బ్రిజేష్ తీర్పుపై ప్రధానితో అఖిలపక్ష నేతల భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్రానికి అన్యాయం జరిగేలా కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలు నిలపివేయాలని కోరుతూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో అఖిలపక్ష నేతలు శుక్రవారం ఉదయం సమావేశం అయ్యారు. ప్రధాని నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి కేంద్రమంత్రి హరీష్ రావత్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి , భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మరో ముగ్గురు మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటే శ్వర్లు, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, టీడీపీ నుంచి కోడెల శివప్రసాదరావు, రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, శాసనసభాపక్ష నాయకుడు గుండా మల్లేశ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నేత, మా జీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, పార్టీ నేత ప్రొఫెసర్ శేషగిరిరావు తదితరులున్నారు.