'కృష్ణా జలాలపై న్యాయం జరిగే వరకూ పోరాటం' | We will fight for justice over Krishna water, all party leaders | Sakshi
Sakshi News home page

'కృష్ణా జలాలపై న్యాయం జరిగే వరకూ పోరాటం'

Published Fri, Dec 20 2013 11:24 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

'కృష్ణా జలాలపై న్యాయం జరిగే వరకూ పోరాటం' - Sakshi

'కృష్ణా జలాలపై న్యాయం జరిగే వరకూ పోరాటం'

న్యూఢిల్లీ : కృష్ణా జలాల పంపిణీపై న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని అఖిలపక్షం స్పష్టం చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేయాలంటూ అఖిలపక్ష నేతలు శుక్రవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలిశారు. అరగంటపాటు జరిగిన ఈ చర్చల్లో రాష్ట్రానికి జరిగే అన్యాయంపై ప్రధానికి వివరణ ఇచ్చారు. కృష్ణా మిగుల జలాలపై హక్కు కల్పించాలని అఖిలపక్ష నేతలు కోరారు. బ్రిజేష్ ట్రిబ్యునల్‌ తీర్పును పునఃపరిశీలించాలని ప్రధానికి అఖిలపక్ష నేతల వినతి పత్రం సమర్పించారు.

భేటీ అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బ్రిజేష్ తీర్పుతో రాష్ట్రానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని ప్రధానికి చెప్పామన్నారు. తీర్పు వల్ల దేశానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పామని, తమ విజ్ఞప్తిపై ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు. ట్రిబ్యునల్ తీర్పును పునఃపరిశీలించేలా సీడబ్ల్యూసీని కోరతామని ప్రధాని చెప్పారని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం జరగకుండా జోక్యం చేసుకోవాలని ప్రధానికి చెప్పామని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలకు నీటిని కేటాయించిలా న్యాయం చేయాలని కోరినట్లు నాగం జనార్థన్ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement