కృష్ణాజలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో అఖిలపక్ష నేతలు శుక్రవారం ఉదయం సమావేశం అయ్యారు.
న్యూఢిల్లీ : రాష్ట్రానికి అన్యాయం జరిగేలా కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలు నిలపివేయాలని కోరుతూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో అఖిలపక్ష నేతలు శుక్రవారం ఉదయం సమావేశం అయ్యారు. ప్రధాని నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి కేంద్రమంత్రి హరీష్ రావత్ హాజరయ్యారు.
ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి , భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మరో ముగ్గురు మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటే శ్వర్లు, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, టీడీపీ నుంచి కోడెల శివప్రసాదరావు, రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, శాసనసభాపక్ష నాయకుడు గుండా మల్లేశ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నేత, మా జీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, పార్టీ నేత ప్రొఫెసర్ శేషగిరిరావు తదితరులున్నారు.