Brooklyn
-
న్యూయార్క్‌లో కాల్పుల కలకలం!
Brooklyn Subway Attack Details: అమెరికాలో న్యూయార్క్ నగరం కాల్పులతో ఉలిక్కి పడింది. బ్రూక్లిన్ సబ్ వే స్టేసన్ వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురి ప్రయాణికులపై ముసుగులో వచ్చిన ఆంగతకుడు విచ్చగల విడిగా కాల్పులు జరిపాడు. అంతకు ముందు స్మోకింగ్ గ్రెనేడ్‌తో దాడి చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ దాడిలో 13 మంది గాయపడినట్లు సమాచారం. ఎవరైనా చనిపోయారా? అన్నది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. బ్రూక్లిన్‌లోని సన్‌సెట్ పార్క్‌లోని 36వ స్ట్రీట్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. అయితే.. రైల్వే స్టేషన్లో భారీ పేలుడు కూడా సంభవించినట్లు కథనాలు వస్తున్నాయి. ఘటనలో ఆరుగురు మరణించారని, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ కథనాలను అధికారులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు. అలాగే పేలుడు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పలేదు. కానీ, న్యూయార్క్‌లో హైఅలర్ట్ మాత్రం ప్రకటించారు. ఇదిలా ఉంటే.. బ్రూక్లిన్ ఫోర్త్ ఎవెన్యూ 36వ స్ట్రీట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సబ్వే నుంచి భారీగా పొగలు వస్తుండడం, సహాయక చర్యల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఉగ్రదాడేనా? కాదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్వై 1 న్యూస్ మాత్రం.. అనుమానితుడు కన్స్ట్రక్షన్ వర్కర్ ముసుగులో గ్యాస్ మాస్క్‌తో దాడికి పాల్పడినట్లు కథనం ప్రచురించింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో రక్తపు మడుగులో ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. In regard to the multiple people shot at the 36th Street subway station in Brooklyn, there are NO active explosive devices at this time. Any witnesses are asked to call @NYPDTips at #800577TIPS. Please stay clear of the area. More provided information when available. pic.twitter.com/8UoiCAXemB — NYPD NEWS (@NYPDnews) April 12, 2022 Very dramatic video from the incident as the subway arrived at 36th St Sunset Park in Brooklyn. #brooklyn #shooting #nyc pic.twitter.com/5cOdeYPIb1 — Kristoffer Kumm (@Kristofferkumm) April 12, 2022 🚨 Breaking 🚨 #Brooklyn subway shooting pic.twitter.com/0J2kcy0rXP — Malcom Boyce (@MeetMalcom) April 12, 2022 -
అమెరికాలో ఒకే రోజు 2 వేల మంది మృతి
న్యూయార్క్/వాషింగ్టన్: అది న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్ అపార్ట్మెంట్. దాని ఎదురుగానే వైకాఫ్ హైట్స్ అనే ఆస్పత్రి ఉంటుంది. ఆ అపార్ట్మెంట్లో నివసించే ఒక జంట ప్రతీ రోజూ కిటికీలోంచి ఆస్పత్రి వైపే చూస్తూ ఉంటారు. ఇప్పుడు దాని ఎదుట మృత దేహాలను తీసుకువెళ్లడానికి వచ్చే ఏసీ ట్రక్కులు బారులు తీరి కనిపిస్తున్నాయి. ఈ దృశ్యం చూస్తుంటే మనసు కలిచి వేస్తోందని అలిక్స్ మోంటాలెనె అన్నారు. ఆమె రాయిటర్స్ వార్తా సంస్థతో స్కైప్‌లో మాట్లాడారు. ‘‘మా కిటికీ లోంచి బయటకి చూస్తే ఏం జరుగుతుందో కనిపిస్తూ ఉంటుంది. వాతావరణం చాలా గందరగోళంగా ఉంది. అంటే ఆస్పత్రి లోపల ఎంత ఘోరంగా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. రోజుకు ఎన్ని మృతదేహాలు వస్తున్నాయో లెక్క పెట్టడం మానేశాం. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది’’అని చెప్పారు. కరోనా వైరస్ ధాటికి న్యూయార్క్ అల్లకల్లోలంగా మారింది. కేవలం న్యూయార్క్‌లోనే కేసుల సంఖ్య లక్షా 50 వేలు దాటితే, 6 వేలకి పైగా మరణాలు నమోదైనట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కోవిడ్–19తో జనం పిట్టల్లా రాలిపోతూ ఉండడంతో పెద్ద పెద్ద ఏసీ ట్రక్కుల్ని తాత్కాలిక మార్చురీల కింద మార్చేశారు. ఎవరైనా మరణిస్తే వాటిల్లో భద్రపరిచి, తమ వంతు వచ్చినప్పుడు ఖననం చేస్తున్నారు. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 4.50 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 16 వేలకు చేరింది. యువకుల్ని కాటేస్తోంది కోవిడ్–19 రోగులు కళ్ల ముందే మరణిస్తూ ఉండడంతో వైద్య సిబ్బంది కూడా హడలెత్తిపోతున్నారు. ఏ విపత్తు కూడా అమెరికాను ఈ స్థాయిలో ఇప్పటివరకు వణికించకపోవడంతో ఏం జరుగుతోందో, దీనిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయారు. ‘మా నగరంలో వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. ప్రతీ ఒక్కరినీ కాపాడడమే ఇప్పుడు మా ముందున్న లక్ష్యం. వచ్చే రెండు వారాల్లో వైరస్‌ని అదుపులోకి తెస్తాం’ అని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో అన్నారు. ఈ వైరస్ కేవలం వృద్ధుల్ని, వేరే వ్యాధులతో బాధపడుతున్న వారినే కాదు, యువకుల్ని కూడా కాటేస్తోంది. ‘అప్పటివరకు ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. కోలుకుంటున్నారు కదా అనుకుంటాం. హఠాత్తుగా కళ్ల ముందే తుది శ్వాస విడుస్తున్నారు. యువతీ యువకులు కూడా దీనికి అతీతమేమీ కాదు’అని మౌంట్ సినాయ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు డయానా టోరెస్ అన్నారు. ఈ అంకెలు గురువారం రాత్రి 11 గంటలకు.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు: 15,69,002 మరణాలు :92,109 కోలుకున్న వారు :3,45,917 11 మంది భారతీయులు మృతి మరో 16 మందికి సోకిన వైరస్ అమెరికాలో కరోనా విధ్వంసం కొనసాగుతోంది. 24 గంటల్లోనే 2 వేల మంది మృతి చెందడం ఆందోళనకు దారి తీస్తోంది. రోజు రోజుకి మృతుల సంఖ్య పెరిగిపోతోంది. మృతి చెందిన వారిలో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. వీరిలో 10 మంది పురుషులే. వీరంతా న్యూయార్క్, న్యూజెర్సీకి చెందిన వారు. న్యూయార్క్‌లో మరణించిన భారతీయుల్లో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారని సమాచారం. ఫ్లోరిడాలో మరొక ఇండియన్ చనిపోయినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇక మరో 16 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు పరీక్షల్లో తేలింది. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియాలో ఈ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాధిగ్రస్తులు భారత్‌లోని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందినవారు. అమెరికాలో భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులు, వివిధ ఎన్నారై సంస్థలతో కలిసి కరోనా సోకిన భారతీయులకు కావల్సిన సాయాన్ని అందిస్తున్నారు. -
‘సైతాన్ ఆవహించింది.. అందుకే హత్య చేశా’
న్యూయార్క్ : బ్రూక్లీన్‌కు చెందిన ఇద్దరు చిన్నారులను అతి కిరాతంగా పొడిచి.. ఓ చిన్నారి చావుకు కారణమైన కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు నిచ్చింది. చిన్నారులను కత్తితో విచక్షణా రహితంగా పొడవడాన్ని అత్యంత హేయమైన చర్యగా కోర్టు అభివర్ణించింది. నిందితుడు డేనియల్ సేయింట్ హాబర్ట్ మాట్లాడుతూ.. తనను సైతాను ఆవహించిందని, ఆ సమయంలో ఏం చేస్తున్నానో తెలియక చేశానని కోర్టు విచారణలో తెలిపాడు. వివరాల్లోకి వెళితే.. 2014 సంవత్సరంలో బ్రూక్లీన్‌కు చెందిన ప్రిన్స్ జోషువా అవిట్టో (6), మికైలా (7) ఇంటి సమీపంలోని ఆట స్థలంలో ఆడుకున్న తర్వాత ఇంటికి బయలు దేరారు. అదే ప్రాంతానికి చెందిన సెయింట్ హాబర్ట్ వారిని వెంబడించాడు. మెట్ల మీదుగా భవంతి పైఅంతస్థులో ఉన్న తమ ఇంటికి వెళుతుండగా.. లిఫ్టులో వెళితే బాగుంటుందని చెప్పి లోపలికి ఎక్కించాడు హాబర్ట్. లిఫ్టు లోపల మాట్లాడుకుంటున్న చిన్నారులను అల్లరి చేయవద్దని హాబర్ట్ వారించాడు. అయినా వాళ్లు వినకపోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ప్రిన్స్‌ను 16 సార్లు పొడిచాడు. ఆ తర్వాత మికైలాను కూడా 12 సార్లు పొడిచాడు. పిల్లల అరుపులు విని చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో కత్తి అక్కడే పడేసి పరారయ్యాడు. కత్తిపోట్లతో రక్తమోడుతున్న చిన్నారులిద్దరినీ స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఉన్న ప్రిన్స్ ప్రాణాలతో పారాడుతూ తొమ్మిది రోజుల తర్వాత ప్రాణాలు విడిచాడు. మికైలా మాత్రం ప్రాణాలతో బయట పడింది. నాలుగు రోజుల తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కత్తి మీద ఉన్న రక్తపు మరకల్లోని డీఎన్ఏ సహాయంతో అతడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు నిర్ధారించారు. కోర్టు శిక్ష విధించిన అనంతరం ప్రిన్స్ తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హాబర్ట్కు జీవితఖైదు విధించడంతో తమ కుమారుడి ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. -
‘నా జీవితంలో భయంకరమైన రాత్రి అదే’
న్యూయార్క్: భారత సంతతి నటుడు, కమెడియన్ అజీజ్ అన్సారీ చిక్కుల్లో పడ్డాడు. 23 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అన్సారీతో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని బ్రూక్లిన్కు చెందిన ఫొటోగ్రాఫర్ గ్రేస్(ఇది అసలు పేరు కాదు) మీడియాకు వెల్లడించింది. అతడితో జరిగిన చాటింగ్‌ను కూడా ఆమె బయటపెట్టింది. అన్సారీ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తన జీవితంలో భయంకరమైన రాత్రి గడిపానని ‘బేబ్.నెట్’ వెబ్‌సైట్‌తో చెప్పింది. ‘2017 ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవంలో మొదటిసారి అతడితో పరిచయమైంది. తర్వాత ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. సెలబ్రిటీ కావడంతో ఒకసారి అతడితో డేట్‌కు వెళ్లాను. ఆ రాత్రి నాకు పీడకలను మిగిల్చింది. డిన్నర్ అయిన తర్వాత ఫ్రాంక్లిన్ స్ట్రీట్‌లోని తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడి వెళ్లిన తర్వాత నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బూతులు మాట్లాడుతూ అసహజ శృంగారానికి ఒత్తిడి తెచ్చాడ’ని వెల్లడించింది. గ్రేస్ చేసిన ఆరోపణలపై అన్సారీ ఇంకా స్పందించలేదు. 34 ఏళ్ల అజీజ్ అన్సారీ ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్నాడు. టీవీ సిరీస్‌లో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ‘ద మాస్టర్ ఆఫ్ నన్’ కామెడీ సిరీస్‌లో నటనగానూ అతడికి ఈ అవార్డు వచ్చింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో అజీజ్ అన్సారీ -
అమెరికా : క్షణాల్లో భారీ వంతెనను కూల్చేశారు
న్యూయార్క్ : రెప్పపాటులోనే భారీ బ్రడ్జిని నేలమట్టం చేశారు. న్యూయార్క్ మహానగరంలో అతిపెద్ద కౌంటీలైన బ్రూక్లిన్, క్వీన్స్‌లను కలుపుతూ 78 ఏళ్ల కిందట నిర్మించిన కిజ్కియాస్కో వంతెనను అధికారులు ఆదివారం ఉదయం పేల్చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈస్ట్ నదికి ఉపనది అయిన న్యూటౌన్ క్రీక్‌పై కట్టిన కిజ్కియాస్కో బ్రిడ్జి పొడవు 1.8 కి.మీలు. వెడల్పు 38 మీటర్లు. 1939, ఆగస్టు 23న ప్రారంభమైన ఈ బ్రాడ్జిని నాటి అంచనాల దృష్ట్యా రోజుకు 10వేల కార్లు ప్రయాణించగల సామర్థ్యంతో నిర్మించారు. కానీ క్రమంగా కిజ్కియాస్కోపై రోజుకు ప్రయాణించే వాహనాల సంఖ్య 1.8 లక్షలకు పెరిగింది. దీంతో ప్రమాద అవకాశాలను గుర్తించిన అధికారులు ఈ ఏడాది(2017) ప్రారంభం నాటికి కిజ్కియాస్కోకు సమాంతరంగా అధునాతన మీకర్ అవెన్యూ బ్రిడ్జిని నిర్మించారు. 2017, ఏప్రిల్, 27నుంచి పాత వంతెనపై రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. అప్పటి నుంచి కొనసాగుతోన్న కూల్చివేత ప్రక్రియ ఆదివారం నాటి పేల్చివేతతో చివరిదశకు చేరింది. శక్తిమంతమైన డిటోనేటర్లతో జరిపిన పేలుడుకు వంతెనకు సమీపంలోని ఇళ్లు వణికిపోయాయి. కూల్చివేసిన వంతెన స్థానంలో 2020 నాటికి సరికొత్త బ్రిడ్జిని నిర్మించబోతున్నట్లు న్యూయార్క్ గవర్నర్ వెల్లడించారు. -
ట్రంప్ టవర్స్ సీక్రెట్ ల్యాప్‌టాప్ చోరి
-
ట్రంప్ టవర్స్ సీక్రెట్ ల్యాప్‌టాప్ చోరి
న్యూయార్క్: ట్రంప్ టవర్ కు సంబంధించిన ఎంతో కీలకమైన సమాచారమున్న సీక్రెట్ సర్విస్ ల్యాప్‌టాప్ దొంగతనానికి గురైంది. సీక్రెట్ సర్విస్ ఏజెంట్స్ కారు నుంచి బ్రూక్లిన్ లో దీని చోరి జరిగింది. ఈ ల్యాప్ టాప్ లో ట్రంప్ టవర్ కు సంబంధించిన ఫ్లోర్ ప్లాన్స్ తో పాటు ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించిన హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ మెయిల్స్ వాడకానికి చెందిన క్రిమిషనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు కూడా ఉన్నాయని మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. దేశ భద్రతకు సంబంధించిన వివరాలు దానిలో ఉన్నాయని గార్డియన్ రిపోర్టు చేసింది. గురువారం ఉదయం ఏజెంట్ వాహనం నుంచి ఈ ల్యాప్ టాప్ దొంగతనానికి గురైంది. అప్పటినుంచి అధికారులు దీని వెతుకులాటలో నిమగ్నమై ఉన్నారు. కానీ ఇప్పటి వరకు దాని ఆచూకీ లభ్యం కాలేదు. ల్యాప్ టాప్ తో పాటు మరికొన్ని వస్తువులను కూడా దొంగలు తస్కరించారు. కాయిన్స్, బ్లాక్ బ్యాగ్ వంటిని వారు తీసుకెళ్లారు. కానీ అవి రికవరీ అయినట్టు తెలిసింది. పోప్ ఫ్రాన్సిస్ కు చెందిన పలు ముఖ్యమైన డాక్యుమెంట్లు దానిలో ఉన్నాయి. అయితే కట్టుదిట్టమైన భద్రతతో ఈ ల్యాప్ టాప్ ను సీక్రెట్ సర్వీసు జారీచేస్తోంది. ఫుల్ డిస్క్ ఎన్స్క్రిప్షన్ ఇది కలిగి ఉంటుందని సీక్రెట్ సర్వీసు అధికార ప్రతినిధి కేథి మిల్హోన్ తెలిపారు. -
కొడుకు డేటింగ్‌పై తల్లి ఆందోళన!
లండన్: ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బేక్హమ్, ఫ్యాషన్ ఐకాన్ విక్టోరియా బేక్‌హామ్ దంపతుల పెద్ద కొడుకు బ్రూక్లిన్ అప్పుడే ప్రేమలో మునిగిపోయాడు. 16 ఏళ్ల ఈ కుర్రాడు ఫ్రెంచ్ మోడల్ సొనియా బెన్ అమ్మర్ (16)తో డేటింగ్ చేస్తున్నాడు. బీచ్‌లో వారిద్దరు ప్రణయసల్లాపాలు సాగిస్తున్న ఫొటోలను తాజాగా బ్రూక్లిన్ ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. అంతేకాకుండా 'ద ఫిఫ్త్ వేవ్' నటి కోల్ గ్రేస్ మోరెట్జ్ తోనూ సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ భామ గతవారం లండన్‌లో తన సినిమా ప్రమోషన్‌కు వచ్చినప్పుడు ఈ ఇద్దరు కలుసుకున్నారు. సహజంగానే తన కొడుకు డేటింగ్ వ్యవహారం తల్లి విక్టోరియాకు ఆందోళన కలిగిస్తున్నదని డేవిడ్ పేర్కొన్నాడు. 'వయస్సులో చిన్నవాడైన కొడుకు బయటకు వెళ్లి డేటింగ్ చేయడాన్ని చూడటం నా కన్నా తల్లికే కష్టంగా ఉంది' అని ఓ టీవీ షోలో ఆయన పేర్కొన్నాడు. తమ కూతురు పెద్దదై.. తను కూడా డేటింగ్ చేస్తుందన్న ఆలోచనే తమకు భరించడం కష్టంగా ఉందని ఆయన అన్నాడు. అప్పటికీ తమ దృక్పథంలో మార్పు రావచ్చునని చెప్పాడు. -
ఆవిష్కరణం: ఏసీ తయారీకి రైలు స్ఫూర్తినిచ్చింది!
వేసవి వస్తే చాలు... ఏసీ కావాల్సిందే! ఒక్కక్షణం దాన్ని ఆపినా, ఉక్కపోతతో ఉడికిపోతాం. మలయ పవనాలను మించిన చల్లదనాన్ని అందించే ఏసీ ఆవిష్కరణ ఎలా జరిగిందో తెలుసా! విల్లీస్ హ్యావిల్యాండ్ క్యారియర్ అమెరికాలోని బ్రూక్లీన్ ముద్రణా సంస్థలో పది డాలర్ల జీతానికి పనికి చేరాడు. అతి వేడిమి కారణంగా ఇలా ముద్రించగానే అలా తేమ తగ్గిపోయి రంగులు అల్లుకుపోతుండేవి. మళ్లీ మళ్లీ ముద్రించాల్సి వచ్చేది. దాంతో విసిగిపోయి, ఎలాగైనా గాలిని చల్లబరిచే మార్గం కనిపెట్టాలనుకున్నాడు. కష్టపడి సంవత్సరం తిరిగేలోపు ఓ యంత్రాన్ని తయారుచేసి తన యజమానికి చూపించాడు. అదే మొట్టమొదటి ఏసీ. 1906లో ఏసీ మీద పేటెంటును పొందాడు విల్లీస్. అయితే వేడిని నియంత్రిం చడంపై పూర్తి స్పష్టత లేకపోవడంతో దానిపై పరిశోధనలు కొనసాగించాడు. ఓ మంచు కురుస్తున్న రాత్రి రైలు కోసం ఎదురుచూస్తున్నాడు విల్లీస్. రైలు వచ్చింది. వెంటనే అప్పటివరకూ ఉన్న చల్లదనం మాయమై వేడిగాలి ఆక్రమించింది. అప్పుడే వేడి, తేమ, మంచుల మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించాడు విల్లీస్. వేడిగాలి కారణంగా మంచు చెదిరిపోతుంది. ఆ సమయంలో చల్లగాలిని వేగంగా పంపిస్తే వేడి తగ్గుతుంది అని కనిపెట్టాడు. రేషనల్ సైక్రోమెట్రిక్ అనే ఓ కొత్త సూత్రాన్ని కనుగొని, అమెరికాలోని ఓ ఇంజినీరింగ్ సొసైటీకిచ్చాడు. దాని ఆధారంగా వాళ్లు అందమైన ఏసీని తయారు చేశారు. తర్వాత విల్లీస్ పరిశ్రమల కోసం ఆరోగ్యానికి హాని కలిగించని సెంట్రీఫ్యూగల్ రిఫ్రిజిరేషన్ యంత్రాన్ని, ఆ పైన ఇంట్లో వాడుకోవడానికి వెదర్ మేకర్ని తయారు చేశాడు. అవన్నీ ఇప్పటికీ మనకు చల్లదనాన్ని పంచుతూనే ఉన్నాయి!