brothels
-
Photojournalist Smita Sharma: ఉయ్ క్రై ఇన్ సైలెన్స్
ఈ పరిశోధనాత్మక ఛాయాచిత్ర పుస్తకంలో ‘అయ్యో!’ అనిపించే జీవితాలు ఉన్నాయి. కన్నీటి సముద్రాలు ఉన్నాయి. ఏడు సంవత్సరాల పాటు ఎన్నో ప్రాంతాలు తిరిగి, పరిశోధించి దిల్లీకి చెందిన ఫొటో జర్నలిస్ట్ రూపొందించిన ఈ పుస్తకం బాధిత హృదయానికి నిలువుటద్దం... దిల్లీలోని ఒక వ్యభిచార గృహం నుంచి పదిహేడు సంవత్సరాల యువతిని కాపాడారు పోలీసులు. ఆ అమ్మాయితో మాట్లాడిన ఫొటో జర్నలిస్ట్ స్మితాశర్మకు ‘తెలుసుకోవాల్సి విషయాలు చాలా ఉన్నాయి’ అనిపించింది. అలా తన పరిశోధన మొదలైంది. ఏడు సంవత్సరాలు ఎన్నెన్నో కష్టాలు పడి, ఎంతో పరిశోధించి ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ అనే ఫొటోబుక్ తీసుకువచ్చింది. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషలలో ఈ పుస్తకం ప్రచురితం అయింది. తన పరిశోధనలో భాగంగా స్మిత తెలుసుకున్న ముఖ్యవిషయం ఏమిటంటే, చాలా కేసుల్లో మానవ అక్రమ రవాణా అనేది బెదిరింపులతో బలవంతంగా జరగడం లేదు. అమ్మాయిల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని రకరకాల మోసాలతో ఉచ్చులోకి దించుతున్నారు. ఉదాహరణకు మీనా(పేరు మార్చడమైనది) ఒక రోజు మీనాకు ఒక యువకుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకసారి కలవాలనుకుంటున్నాను’ అన్నాడు. రెండోరోజు మీనా దగ్గరకు వచ్చి ‘ వీరు మా అమ్మా,నాన్నలు’ అంటూ ఇద్దరిని పరిచయం చేసి పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆ అద్దె తల్లిదండ్రులు కూడా తమ నటనతో రెచ్చిపోయారు. ‘నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం’ అని నమ్మించారు. తన సోదరికి దిల్లీలో వస్త్రవ్యాపారం ఉందని, ఇద్దరం అక్కడే పనిచేద్దాం అన్నాడు యువకుడు. వీరి మాయమాటలు నమ్మి దిల్లీకి చేరిన మీనా దుర్మార్గుల బారిన పడింది. బంగ్లాదేశ్‌కు చెందిన 12 సంవత్సరాల బాలికకు కుటుంబ పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయడం అనివార్యం అయింది. తమ కుటుంబంతో కాస్త పరిచయం ఉన్న ఒక వ్యక్తి ‘ముంబైలో ఉద్యోగం ఇప్పిస్తాను’ అంటూ తీసుకెళ్లి బ్రోతల్ హౌస్‌కు అమ్మేశాడు. రెండు సంవత్సరాల తరువాత ఈ అమ్మాయి పోలీసుల సహాయంతో విముక్తి అయింది. ఒక ఆశ్రయంలో చేరింది. కొద్దిరోజులకు ఆమెకు ఒక మహిళ పరిచయం అయింది. ‘మీ దేశం తీసుకెళతాను’ అని నమ్మించి పశ్చిమ బెంగాల్‌లోని నమ్‌ఖానా అనే ఊరిలోని బ్రోతల్కు అమ్మేసింది... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో ఎందరో బాధితులు ఉన్నారు. యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్స్, లాయర్లు, పోలీస్ అధికారుల సహాయంతో మీనాలాంటి ఎంతోమంది అమ్మాయిలతో మాట్లాడింది స్మిత. దీనివల్ల అమ్మాయిల అమాయకత్వం, నేరగాళ్లు ఎన్ని రకాలుగా నమ్మిస్తారు? ఆ తరువాత ఎలా తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటారు? ఎలా మోసం చేస్తారు? మానవ అక్రమ రవాణా నేరవ్యవస్థ మూలాలు ఏమిటి?... ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగింది స్మిత. కొన్ని ప్రాంతాలలో అమ్మాయిలు ఇల్లు ఎందుకు విడిచి పెట్టాలనుకుంటున్నారనే విషయానికి వస్తే కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచి నీళ్లు తేవడం, వంట వండడం, బట్టలు ఉతకడం, పొలానికి వెళ్లి పనులు చేయడం... పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఈ అంతులేని బండచాకిరీతో తమకు తెలియకుండానే ఇల్లు, ఊరు దాటే స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఈ సమయంలోనే మోసగాళ్ల బారిన పడుతున్నారు. ‘సున్నితమైన అంశంపై పనిచేస్తున్నాను’ అనే ఎరుకతో కెమెరాను చాలా జాగ్రత్తగా ఉపయోగించింది స్మిత. బాధితుల ముఖాలు కనిపించకుండా స్పాట్లైట్లు, షాడోస్... ఇతరత్రా క్రియేటివ్ మెథడ్స్‌ను ఉపయోగించింది. ‘లైట్లు, షాడోస్ నా ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించాయి’ అంటుంది స్మితా శర్మ. హైదరాబాద్‌లో జరిగిన ‘ఇండియన్ ఫొటో ఫెస్టివల్–2022’లో పరిశోధనాత్మక ఫొటోబుక్ ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ ఆవిష్కరణ జరిగింది. -
వ్యభిచార గృహంపై దాడి: నలుగురు అరెస్ట్
కడప: వైఎస్ఆర్ జిల్లా గోపవరం సీపీకుంటలోని వ్యభిచార గృహంపై బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు యువకులతోపాటు ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ ప్రైవేటు విద్యాసంస్థలు వ్యభిచార కొంపలట
బెంగళూరు: అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకునే కర్ణాటక సంక్షేమశాఖ మంత్రి హెచ్ ఆంజనేయ మరోసారి అనూహ్య వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ వ్యభిచార గృహాల్లా మారాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యాహక్కు చట్టం లేకుంటే ఏ మధ్యతరగతి విద్యార్థికానీ, పేద విద్యార్థిగానీ ఈ విద్యాసంస్థల్లో చదవలేడని చెప్పారు. కర్ణాటక ప్రైవేటు విద్యాసంస్థల సమాఖ్యను ఈ సందర్భంగా ఆయన ఏకీపారేశారు. 'విద్య పేరిట ప్రజల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న ఈ ప్రైవేటు విద్యాసంస్థలన్నీ వ్యభిచార కొంపలు. అయితే, కొన్ని మంచి ప్రైవేటు స్కూల్స్ కూడా ఉన్నాయి. కొన్ని మతపరమైన విద్యాసంస్థలు కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం లేకుండా కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పేదవారు అస్సలు చదువుకోలేకపోయేవారు. బలవంతంగా అధికమొత్తం ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలన్నీ వ్యభిచారం చేస్తున్నట్లే' అంటూ ఆయన మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా హెచ్ ఆంజనేయ వెంటనే తమకు క్షమాపణలు చెప్పాలని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. -
వ్యభిచార గృహంపై దాడి
హైదరాబాద్: ఓ వ్యభిచార గృహంపై బాలానగర్ పోలీసులు దాడిచేసి వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు, నిర్వాహకురాలు, బ్రోకర్లను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ మోహన్‌రెడ్డి తెలిపిన మేరకు..ఐడీపీఎల్ సౌభాగ్యనగర్‌లో ఓ అపార్టుమెంట్లో జ్యోతి వ్యభిచారం నిర్వహిస్తుంది. బ్రోకర్ రాజు సహయంతో విటులను ఆక ర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మంగళవారం రాత్రి ఆ ఫ్లాట్‌పై దాడిచేశారు. వ్యభిచారిని ప్రియా, విటుడు దుర్గాప్రసాద్, నిర్వాహకురాలు జ్యోతి, బ్రోకర్ రాజులను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. -
వ్యభిచారం డిస్కౌంట్ ఆఫర్లపై నిషేధం!
దేశంలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళలకు ప్రభుత్వం తరఫున అందిస్తున్న డిస్కాంట్లను నిలుపుదల చేయాలని జర్మనీలోని రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. అందుకు సంబంధించిన ప్రణాళికులు సిద్ధం చేసినట్లు సెంటర్ లెఫ్ట్ సోషల్ డెమెక్రటిక్స్ పార్టీ అధికార ప్రతినిధి అంజ స్ట్రయిడర్ ఇక్కడ వెల్లడించారు. త్వరలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కలసి ఆ విషయంపై సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. 2002 వ సంవత్సరంలో దేశంలో వ్యభిచారాన్ని జర్మనీ ప్రభుత్వం చట్టబద్దం చేసింది. దాంతో వ్యభిచారం పేరుతో నిర్వహకులు దోపిడి పాల్పడుతున్నారని, ఆ క్రమంలో వ్యభిచార గృహాల నిర్వహకులు ఆగడాలు శృతి మించుతున్నాయని దేశ్యవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో రాజకీయపార్టీలు జర్మనీ రాజధాని బెర్లిన్‌లో సోమవారం సమావేశమైనాయి. దాంతో దేశం వ్యభిచారానికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీ (డిస్కోంట్) నిలిపివేయాలని ఆ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఆ ఆమోదాన్ని సాధ్యమైనంత త్వరలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు అందజేయనున్నాయి.