BS-4
-
బీఎస్–3, బీఎస్–4 వాహనాల తేడాలివే..
పశ్చిమ గోదావరి జిల్లా : కాలుష్యపరంగా వాహన ప్రయాణాలు పెంచడం, రహదారుల ప్రమాదాలకు నివారణకు సుప్రీంకోర్టు చర్యల్లో భాగంగా(బీఎస్)–3 వాహనాల అమ్మకాలు మార్చి 31వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఎస్–3 ద్విచక్ర వాహనాలను మార్చి 31 తర్వాత కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ చేయవద్దని సుప్రీంకోర్టు అదేశాలతో ద్విచక్ర వాహన కంపెనీలు ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు ఇచ్చి డీలర్ల వద్ద ఉన్న వాహనాల విక్రయాలు ఆగమేఘాల మీద పూర్తిచేశాయి. ఇక ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్(బీఎస్)–4 వాహనాలు మాత్రమే విక్రయించాలని సుప్రీంకోర్టు సూచనల మేరకు అన్ని షోరూముల్లో కొత్తగా మార్పు చేసిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అసలు బీఎస్–3, బీఎస్–4 వాహనాలు అంటే ఏమిటి..? వాటి తేడాలు ఏమిటి..? వాటి ప్రత్యేకతలు ఏమిటి..? వంటి సమాచారం తెలుసుకుందాం. వాహన ఉద్గార నిబంధనలు ఇలా.. భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్స్ అనే సంస్థ వాహనాల్లోని వాయు కాలుష్యం, ఇంజిన్‌లోని అంతర్గత ప్రమాణాలు, స్పార్క్–ఇంజన్ ఇగ్నిషన్ తయారీలో కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి ఆధ్వర్యంలో వాహన ప్రమాణాలను పర్యవేక్షిస్తుంది. ఈ భారత్ స్టేజ్‌ని బీఎస్‌గా వ్యవహరిస్తున్నారు. వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యంమే ముఖ్యంగా బీఎస్–3 వాహనాలు కోర్టు ఆదేశాల మేర నిలిపివేశారు. బీఎస్–3 అనేది వాహన ఉద్గార ప్రమాణాలకు సంబం«ధించిన అంశాల్లో ప్రధానమైంది. దీని ద్వారా వాహనాల నుంచి వెలువడే కాలుష్యం ఎంత స్థాయి వరకు ఉండాలో నిర్ణయిస్తారు. వాయు కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్‌ను పరిశీలించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. బీఎస్–3 నుంచి వచ్చే ఉద్గారాల కంటే బీఎస్–4లో విడువలయ్యే ఉద్గారాల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఉద్గారాల బట్టే కాలుష్య ప్రభావం ఆధారపడి ఉంటుంది. బీఎస్–3లో కిలోమీటర్‌కు 2.30 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ వెలువడేందుకు అనుమతి ఉంది. బీఎస్–4లో కిలోమీటర్‌కు గ్రాము కార్బన్ డయాక్సైడ్ వెలువడేందుకే పరిమితం చేశారు. దేశమంతా ఒకే విధానం కోసం.. ఇప్పటికే బీఎస్–4 ప్రమాణాలు కలిగిన వాహనాల వినియోగం కొన్ని నగరాల్లో దీన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ç2010 నుంచి ఢిల్లీ, నోయిడాతోపాటు 13 నగరాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీఎస్–4 విధానాన్ని తీసుకువస్తే వాయు కాలుష్యాన్ని లెక్కించవచ్చు. తద్వారా వాహనచోదకులు దేశంలో ఇతర ప్రాంతాల్లో దీన్ని దుర్వినియోగం చేయకుండా వాహన కాలుష్య స్థాయి తగ్గించవచ్చు. అలాగే సాంకేతికపరంగా బీఎస్–3 కంటే బీఎస్–4 మెరుగ్గా ఉంటుంది. బీఎస్–4 వాహనాల ధర బీఎస్–3 వాహనాల కంటే అధికంగా ఉంటుంది. ∙బీఎస్–4 విధానం అమల్లో ఉండటం వల్ల వాహనాల నాణ్యతా ప్రమాణాలు పెరుగుతాయి. ఇక పెట్రోల్ బంక్‌లలో మెరుగైన ఇంధనం కూడా లభ్యం అవుతుంది. దీనికి పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ బా«ధ్యత వహించనుంది. బీఎస్–4 మరో ప్రత్యేకత.. బండి ఆన్ చేయగానే ఆటోమేటిక్‌గా హెడ్ ల్యాంప్ వెలుగుతుంది. దీంతో పగటి వేళల్లో కూడా హెడ్‌లైట్ వెలుగుతూ ఉంటుంది. ఈ విధానం వల్ల మంచు ఎక్కువగా కురిసే ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎదురుగా వచ్చే వాహనదారులను అప్రమత్తంగా ఉంచేందుకు, ఉపయోగపడుతోందని, ప్రమాదాలను నివారించవచ్చునేది నిపుణుల ఆలోచన. ఇప్పటికే బీఎస్–4 కార్ల విక్రయాలు ప్రారంభమైనప్పటికీ ద్విచక్ర వాహనాలకు మినహాయింపు ఉండేది. ఏప్రిల్ ఒకటి నుంచి బీఎస్–4 ప్రమాణాలు గల ద్విచక్ర వాహనాలు మాత్రమే షాపుల్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.∙బీఎస్–4 ద్విచక్ర వాహనాలకు హెడ్‌లైట్ స్విచ్ లేకుండా మార్చు చేశారు. బీఎస్–4 ద్విచక్రవాహనం స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇంజన్‌కు ఉన్న అనుసంధానంతో హెడ్ లైట్ వెలుగుతుంది. కొత్త టెక్నాలజీతో వచ్చిన ద్విచక్ర వాహనానికి స్విచ్ వేసే అవకాశం ఇప్పుడు లేదు. బీఎస్–4లో మరో ప్రత్యేకత ఏమిటింటే.. ఐ3ఎస్ (ఐడియల్ స్టాప్ సిస్టం)గా మార్చుచేశారు. ఈ విధానంతో వాహనంపై వెళ్లినప్పుడు సిగ్నల్ వద్ద లేదా ఏదైనా చోట నిలిపినప్పుడు 30 సెంకడ్లలో వాహనం ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. మళ్లీ మనం వాహనం స్టార్ట్ చేసే అవకాశం లేకుండానే క్లచ్ నొక్కితే వాహనం స్టార్ట్ అవ్వడం ఐ3ఎస్ ప్రత్యేకత అని వాహన డీలర్లు చెబుతున్నారు. -
ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్
- బీఎస్–4 ప్రమాణాలపై రవాణాశాఖకు అందని స్పష్టత - ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ తిరస్కరణ - తెలంగాణ వ్యాప్తంగా 750 వాహనాల ఎదురుచూపు - కేంద్రాన్ని స్పష్టత కోరాలని రవాణాశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కొత్త ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. భారత్ స్టేజ్–4 ప్రమాణాలను అందుకోని వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించిన నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి తదను గుణంగా ఉన్న వాహనాలనే అమ్మాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయటమే దీనికి కారణం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్లో కొంత అయోమయం నెలకొనడంతో రవాణాశాఖ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లను ఆపేసింది. బీఎస్–4 ప్రమాణాలు ట్రాక్టర్లకు వర్తించవు. సాధారణ వాహనాల్లాగా ప్రయాణికులను తరలించేందుకో, సరుకు రవాణాకో ఉద్దేశించినవి కాకపోవడంతో వాటిని ఆఫ్ రోడ్ వాహనాల కేటగిరీలో ఉంచారు. దీంతో భారత స్టేజ్ ప్రమాణాలు దీనికి వర్తించవు. సుప్రీం ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి బీఎస్ –4 ప్రమాణాల మేరకు లేని వాహనాలను రిజిస్ట్రేషన్ చేయ డానికి వీలులేదు. అంటే ఆ ప్రమా ణాలకు లోబడి మార్పుచేర్పులు చేసిన వాహనాలనే విక్రయించాలి. ట్రాక్టర్లు బీఎస్–4 పరిధిలోకి కాకుండా ట్రాక్టర్ ఎమిషన్ (టీఆర్ఈఎం) కోవలోకి వస్తాయి. కానీ దీనికి సంబంధించిన స్పష్టతను కేంద్రం రాష్ట్ర రవాణా శాఖకు అందించలేదు. దీంతో ట్రాక్టర్లను కూడా బీఎస్–4 కేటగిరీలోకి చేరుస్తూ అవి ఆ ప్రమాణాలకు అనుగుణంగా లేనందున వాటి రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని రాష్ట్ర రవాణాశాఖ తేల్చింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాటి రిజిస్ట్రేషన్లను నిలిపివే సింది. దీంతో కొత్తగా ట్రాక్టర్లు కొనుగోలు చేసిన రైతులు వాటి రిజిస్ట్రేషన్ లేకపోవటంతో ఇబ్బందు లకు గురవుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీతో ట్రాక్టర్లను సరఫరా చేసింది. దీని కింద ట్రాక్టర్లు పొందిన వారికి కూడా రిజి స్ట్రేషన్లు నిలిపివేశా రు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 750 వరకు కొత్త ట్రాక్ట ర్లకు అధికారులు రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. రిజిస్ట్రేషన్ లేని ట్రాక్టర్లు ఎక్కడైనా ప్రమాదానికి గురైతే దానికి బీమా మొత్తం వచ్చే అవకాశం లేకపోవటంతో వాటిని తిప్పటానికి కొనుగోలుదారులు భయపడు తున్నారు. మరో వైపు రిజిస్ట్రేషన్ లేకుండా తిప్పితే వాటిని స్వాధీనం చేసుకుంటామని రవాణాశాఖ అధికారులు హెచ్చరించటంతో కొనుగోలుదారుల పరిస్థితి గందరగోళంలో పడింది. రిజిస్ట్రేషన్లు ఆపాం ‘రాష్ట్రవ్యాప్తంగా కొత్త ట్రాక్టర్లకు ఏప్రిల్ ఒకటి తర్వాత రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన మాట నిజమే. అవి బీఎస్–4 పరిధిలోకి రావన్న స్పష్టత మాకు అందలేదు. ట్రాక్టర్ డీలర్లు మాకు ఈ మేరకు వినతులు అందించారు. దీంతో దానిపై కేంద్రం నుంచి స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నాం. స్పష్టమైన ఆదేశాలు పొందిన తర్వాత తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం’ – వెంకటేశ్వర్లు, జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ -
2020 నాటికి బీఎస్–6 వాహనాలు!
హోండా మోటార్‌సైకిల్స్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ కీటా మురమత్సు • ప్రస్తుతానికి మార్కెట్లో బీఎస్–4తో సీబీ హార్నెట్, షైన్ బైక్స్ • ఈ నెలాఖరున మార్కెట్లోకి బీఎస్–4 తొలి స్కూటర్ • పెద్ద నోట్ల ప్రభావం నుంచి పట్టణాల్లో కోలుకున్నాం • గ్రామాల్లో సాధారణ స్థితికి మరో మూడునెలలు పట్టొచ్చు • వంద శాతం ప్లాంట్ల వినియోగం తర్వాతే కొత్త ప్లాంట్ శ్రీనాథ్ అడెపు హోండా మోటర్స్ త్వరలో దేశంలోని తన బైకులన్నిటినీ బీఎస్–4 ప్రమాణాలకు తగ్గట్టుగా మార్చటానికి అన్నీ సిద్ధం చేసింది. అంతేకాక... మరో మూడేళ్లలో బీఎస్–6 ప్రమాణాలతో బైకులు తేవటానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఏ) ప్రెసిడెంట్, సీఈఓ కీటా మురమత్సు చెప్పారు. భారత్ స్టేజ్ –4 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన సీబీ షైన్‌ను రాజస్థాన్‌లోని తపుకర ప్లాంట్‌లో విడుదల చేసిన సందర్భంగా ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేదన్న మురమత్సు... తమ సంస్థ తరఫున కూడా డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించే చర్యలు మొదలు పెట్టినట్లు తెలియజేశారు. ఇంటర్వూ్య ముఖ్యాంశాలివీ... అన్ని బైకులూ బీఎస్–4 ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తున్నట్లున్నారు? అవును! ఎందుకంటే రోజురోజుకూ కాలుష్యంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. బైకుల నుంచి కార్బన్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి కాలుష్య ఉద్గారాలు అధికంగా విడుదలవుతాయి కాబట్టే 2017 నాటికి దేశంలోని వాహనాలన్నీ బీఎస్–4కు, 2020 నాటికి బీఎస్–6కు అప్‌గ్రేడ్ కావాలని కేంద్రం నిబంధనలు పెట్టింది. దానికి తగ్గట్టే మేం మార్పులు చేస్తున్నాం. గతంలో బీఎస్–4 హోండా సీబీ హార్నెట్ 160 ఆర్ బైక్‌ను విడుదల చేశాం. ఇపుడు సీబీ షైన్‌ను తపుకర ప్లాంట్‌లో తయారు చేసి విడుదల చేశాం. మరి మిగిలిన బైకుల సంగతో..? బీఎస్–4 ప్రమాణాలతో తొలి స్కూటర్‌ను ఈ నెలాఖరుకు విడుదల చేస్తాం. అంతకుమించి వివరాలు చెప్పలేను. యాక్టివా, ఏవిఏటర్, నవీ బైకుల్ని కూడా మారుస్తున్నాం. దశలవారీగా మార్కెట్లోకి తెస్తాం. ఫిబ్రవరి ముగిసే నాటికి విపణిలో హోండా బైకులన్నీ బీఎస్–4వే ఉంటాయి. 2020 నాటికి బీఎస్–6 వాహనాలను తెస్తాం. దీనికోసం హర్యానాలోని మనేసర్‌లో ఆర్ అండ్ డీ జరుగుతోంది. అయితే బీఎస్ ప్రమాణాలతో బైకుల ధరలు రూ.500–1,000 వరకూ పెరుగుతాయి. కొత్త ప్లాంట్లు గానీ, విస్తరణ గానీ ఏమైనా ఉందా? ప్రస్తుతం మాకిక్కడ 4 ప్లాంట్లున్నాయి. మనేసర్(హర్యానా) సామర్థ్యం ఏటా 16 లక్షలు. తపుకరా (రాజస్థాన్) 12 లక్షలు. నర్సాపూర్ (కర్ణాటక) 12 లక్షలు కాగా విఠల్పూర్ (గుజరాత్) ప్లాంట్ 12 లక్షలు. జులైలో నర్సాపూర్ ప్లాంట్‌లో 4వ లైన్‌ను ప్రారంభిస్తాం. దీంతో మొత్తం సామర్థ్యం 64 లక్షలకు చేరుతుంది. ఇవన్నీ నూరుశాతం వినియోగించుకున్నాకే కొత్త ప్లాంట్ ఏర్పాటు యోచన చేస్తాం. ప్రస్తుతం దేశంలో 4,500 డీలర్షిప్స్ ఉండగా.. ఈ ఏడాది ముగింపు నాటికి 5,300కు చేరుస్తాం. పెద్ద నోట్ల రద్దు ప్రభావం టూవీలర్ పరిశ్రమపై ఎక్కువగానే ఉన్నట్లుంది? 2016–17లో ద్విచక్ర వాహనాల పరిశ్రమ 6 శాతం వృద్ధి సాధిస్తే హోండా మాత్రమే 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. పెద్ద నోట్ల రద్దు జరిగిన నవంబర్‌లో మాత్రం అమ్మకాలు గ్రామాల్లో 60 శాతం, పట్టనాల్లో 50 శాతానికి పడిపోయాయి. ఇపుడు పట్టణ మార్కెట్ సాధారణ స్థితికి చేరుకుంది. గ్రామాల్లో ఈ పరిస్థితి రావాలంటే మరో రెండు నెలలు పడుతుంది. గతంలో మా మొత్తం నెట్‌వర్క్‌లో 6–7 శాతమే కార్డులను వాడేవారు. ఇపుడది 25 శాతానికి పెరిగింది. నగదు లావాదేవీల్ని ప్రోత్సహించడానికి మేం డౌన్ పేమెంట్‌ను తగ్గించాం. ఎగుమతులు కూడా పెరుగుతున్నట్లున్నాయి? మీ బైకుల్లో ‘షైన్’ బాగా షైన్ అయినట్లుంది...! నిజమే! మా పోర్టుఫోలియోలో షైన్ది ప్రత్యేక స్థానం. 2006లో మార్కెట్లోకి తెచ్చాక ఇప్పటిదాకా 50 లక్షల షైన్ బైకులు విక్రయించాం. 125 సీసీ బైకుల విక్రయాల్లో 36 శాతం వాటా దీనిదే. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మొత్తం షైన్ అమ్మకాల్ని 64 లక్షలకు చేర్చాలని లకి‡్ష్యంచాం. 2016 జనవరిలో 3,61,721 బైకులను విక్రయించిన హోండా.. ఈ ఏడాది జనవరిలో 3,68,145 బైకులను విక్రయించింది. అంటే 2% వృద్ధి నమోదయిందన్న మాట. బీఎస్–4 సీబీ షైన్ ప్రత్యేకతలు.. ⇔ 125సీసీ ఆటోమెటిక్ హెడ్‌లైట్ (ఏహెచ్ఓ) బీఎస్–4 సీబీ షైన్ ధర డ్రమ్ బ్రేక్ వర్షన్ రూ.60,675, డిస్క్ బ్రేక్ వర్షన్ రూ.63,000 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ⇔ సింగిల్ సిలిండర్ ఇంజిన్, హోండా ఎకో టెక్నాలజీ (హె చ్ఈటీ), 10.16 హెచ్‌పీ పవర్, 7,500 ఆర్పీఎం, టర్యూ 10.30 ఎన్ఎం. నీలం, ఎరుపు రంగులు.