బీఎస్‌–3, బీఎస్‌–4 వాహనాల తేడాలివే.. | difference of bs-3 bs-4 vehicles | Sakshi
Sakshi News home page

బీఎస్‌–3, బీఎస్‌–4 వాహనాల తేడాలివే..

Published Mon, Apr 17 2017 10:45 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

బీఎస్‌–3, బీఎస్‌–4 వాహనాల తేడాలివే.. - Sakshi

బీఎస్‌–3, బీఎస్‌–4 వాహనాల తేడాలివే..

పశ్చిమ గోదావరి జిల్లా : కాలుష్యపరంగా వాహన ప్రయాణాలు పెంచడం, రహదారుల ప్రమాదాలకు నివారణకు సుప్రీంకోర్టు చర్యల్లో భాగంగా(బీఎస్‌)–3 వాహనాల అమ్మకాలు మార్చి 31వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఎస్‌–3 ద్విచక్ర వాహనాలను మార్చి 31 తర్వాత కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్‌ చేయవద్దని సుప్రీంకోర్టు అదేశాలతో ద్విచక్ర వాహన కంపెనీలు ప్రత్యేక డిస్కౌంట్‌లు, ఆఫర్లు ఇచ్చి డీలర్ల వద్ద ఉన్న వాహనాల విక్రయాలు ఆగమేఘాల మీద పూర్తిచేశాయి. ఇక ఏప్రిల్‌ 1 నుంచి భారత్‌ స్టేజ్‌(బీఎస్‌)–4 వాహనాలు మాత్రమే విక్రయించాలని సుప్రీంకోర్టు సూచనల మేరకు అన్ని షోరూముల్లో కొత్తగా మార్పు చేసిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అసలు బీఎస్‌–3, బీఎస్‌–4 వాహనాలు అంటే ఏమిటి..? వాటి తేడాలు ఏమిటి..? వాటి ప్రత్యేకతలు ఏమిటి..? వంటి సమాచారం తెలుసుకుందాం.

వాహన ఉద్గార నిబంధనలు ఇలా..
భారత్‌ స్టేజ్‌ ఎమిషన్‌ స్టాండర్స్‌ అనే సంస్థ వాహనాల్లోని  వాయు కాలుష్యం, ఇంజిన్‌లోని అంతర్గత ప్రమాణాలు, స్పార్క్‌–ఇంజన్‌ ఇగ్నిషన్‌  తయారీలో కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి ఆధ్వర్యంలో వాహన ప్రమాణాలను పర్యవేక్షిస్తుంది. ఈ భారత్‌ స్టేజ్‌ని బీఎస్‌గా వ్యవహరిస్తున్నారు. వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యంమే ముఖ్యంగా బీఎస్‌–3 వాహనాలు కోర్టు ఆదేశాల మేర నిలిపివేశారు. బీఎస్‌–3 అనేది వాహన ఉద్గార ప్రమాణాలకు సంబం«ధించిన అంశాల్లో ప్రధానమైంది.

దీని ద్వారా వాహనాల నుంచి వెలువడే కాలుష్యం ఎంత స్థాయి వరకు ఉండాలో నిర్ణయిస్తారు. వాయు కాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్‌ను పరిశీలించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. బీఎస్‌–3 నుంచి వచ్చే ఉద్గారాల కంటే బీఎస్‌–4లో విడువలయ్యే ఉద్గారాల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఉద్గారాల బట్టే కాలుష్య ప్రభావం ఆధారపడి ఉంటుంది. బీఎస్‌–3లో కిలోమీటర్‌కు 2.30 గ్రాముల కార్బన్‌ డయాక్సైడ్‌ వెలువడేందుకు అనుమతి ఉంది. బీఎస్‌–4లో కిలోమీటర్‌కు గ్రాము కార్బన్‌ డయాక్సైడ్‌ వెలువడేందుకే పరిమితం చేశారు.

దేశమంతా ఒకే విధానం కోసం..
ఇప్పటికే బీఎస్‌–4 ప్రమాణాలు కలిగిన వాహనాల వినియోగం కొన్ని నగరాల్లో దీన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ç2010 నుంచి ఢిల్లీ, నోయిడాతోపాటు 13 నగరాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీఎస్‌–4 విధానాన్ని తీసుకువస్తే వాయు కాలుష్యాన్ని లెక్కించవచ్చు. తద్వారా వాహనచోదకులు దేశంలో ఇతర ప్రాంతాల్లో దీన్ని దుర్వినియోగం చేయకుండా వాహన కాలుష్య స్థాయి తగ్గించవచ్చు.  అలాగే సాంకేతికపరంగా బీఎస్‌–3 కంటే బీఎస్‌–4 మెరుగ్గా ఉంటుంది. బీఎస్‌–4 వాహనాల ధర బీఎస్‌–3 వాహనాల కంటే అధికంగా ఉంటుంది. ∙బీఎస్‌–4 విధానం అమల్లో ఉండటం వల్ల వాహనాల నాణ్యతా ప్రమాణాలు పెరుగుతాయి. ఇక పెట్రోల్‌ బంక్‌లలో మెరుగైన ఇంధనం కూడా లభ్యం అవుతుంది. దీనికి పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ బా«ధ్యత వహించనుంది.

బీఎస్‌–4 మరో ప్రత్యేకత..
బండి ఆన్‌ చేయగానే ఆటోమేటిక్‌గా హెడ్‌ ల్యాంప్‌ వెలుగుతుంది. దీంతో పగటి వేళల్లో కూడా హెడ్‌లైట్‌ వెలుగుతూ ఉంటుంది. ఈ విధానం వల్ల మంచు ఎక్కువగా కురిసే ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎదురుగా వచ్చే వాహనదారులను అప్రమత్తంగా ఉంచేందుకు, ఉపయోగపడుతోందని, ప్రమాదాలను నివారించవచ్చునేది నిపుణుల ఆలోచన. ఇప్పటికే బీఎస్‌–4 కార్ల విక్రయాలు ప్రారంభమైనప్పటికీ ద్విచక్ర వాహనాలకు మినహాయింపు ఉండేది.

 ఏప్రిల్‌ ఒకటి నుంచి బీఎస్‌–4 ప్రమాణాలు గల ద్విచక్ర వాహనాలు మాత్రమే షాపుల్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.∙బీఎస్‌–4 ద్విచక్ర వాహనాలకు హెడ్‌లైట్‌ స్విచ్‌ లేకుండా మార్చు చేశారు. బీఎస్‌–4 ద్విచక్రవాహనం స్టార్ట్‌ చేయగానే ఆటోమేటిక్‌గా ఇంజన్‌కు ఉన్న అనుసంధానంతో హెడ్‌ లైట్‌ వెలుగుతుంది. కొత్త టెక్నాలజీతో వచ్చిన ద్విచక్ర వాహనానికి స్విచ్‌ వేసే అవకాశం ఇప్పుడు లేదు. బీఎస్‌–4లో మరో ప్రత్యేకత ఏమిటింటే.. ఐ3ఎస్‌ (ఐడియల్‌ స్టాప్‌ సిస్టం)గా మార్చుచేశారు. ఈ విధానంతో వాహనంపై వెళ్లినప్పుడు సిగ్నల్‌ వద్ద లేదా ఏదైనా చోట నిలిపినప్పుడు 30 సెంకడ్లలో వాహనం ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. మళ్లీ మనం వాహనం స్టార్ట్‌ చేసే అవకాశం లేకుండానే క్లచ్‌ నొక్కితే వాహనం స్టార్ట్‌ అవ్వడం ఐ3ఎస్‌ ప్రత్యేకత అని వాహన డీలర్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement