బీఎస్–3 వాహనాలు విక్రయిస్తే చర్యలు
Published Sat, Apr 8 2017 11:20 PM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM
- రవాణా శాఖ ఉపకమిషనర్ ప్రమీల
కర్నూలు: సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు భారత ప్రభుత్వం బీఎస్–3 ప్రమాణాలు కల్గిన వాహనాలను మార్చి 31 నాటికి నిషేధించిందని, అలాంటి వాహనాలను విక్రయిస్తే డీలర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ ఉపకమిషనర్ ప్రమీల శనివారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు. బీఎస్–4 ప్రమాణాలు కల్గిన వాహనాలు మాత్రమే 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. వినియోగదారులు నూతన వాహన కొనుగోలు సమయంలో వాటి ప్రమాణాలను పరిశీలించి కొనుగోలు చేయాలని సూచించారు. డీలర్ల ప్రలోభాలకు లొంగి తక్కువ ధరలతో నిషేధించిన వాహనాలను కొనుగోలు చేయరాదని సూచించారు.
Advertisement
Advertisement