bses yamuna
-
15లోగా చెల్లించండి
న్యూఢిల్లీ/గుర్గావ్:జనవరి నుంచి జూన్ వరకూ పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఈ నెల 15వ తేదీలోగా చెల్లించాలని బీఎస్ఈఎస్ యుమునా సంస్థను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. మే ఆరో తేదీన తాము ఇచ్చిన ఆదేశాలకు లోబడి విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలకు బకాయిలు చెల్లించాలని తన ఆదేశాల్లో అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. గత నెల 30వ తేదీవరకూ ఉన్న బకాయిలను బీఎస్ఈఎస్ యమునా సంస్థ చెల్లించాలని ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. బీఎస్ఈఎస్ సంస్థ అందజేసిన ఖాతాల తాలూకూ వివరాలపట్ల సంతృప్తి వ్యక్తంచేసింది. బీఎస్ఈఎస్ రాజధాని సంస్థ తన బకాయిలో 94 శాతం మేర చెల్లించిందని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను మరో రెండు నెలలపాటు వాయిదా వేసింది. కాగా బీఎస్ఈఎస్ రాజధాని సంస్థకు తూర్పు, మధ్య ఢిల్లీ పరిధిలో మొత్తం 13.5 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. చాందినీచౌక్, దర్యాగంజ్, పత ్పర్గంజ్, శంకర్రోడ్, పటేల్‌నగర్, కృష్ణానగర్, లక్ష్మీనగర్, మయూర్ విహార్ తదితర ప్రాంతాలకు ఈ సంస్థ విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ఇక బీఎస్ఈఎస్ రాజధాని సంస్థ దక్షిణ, పశ్చిమఢిల్లీ పరిధిలోని అలకానంద, వసంత్‌కుంజ్, సాకేత్, నెహ్రూ ప్లేస్, నిజాముద్దీన్, సరితా విహార్, హౌజ్‌ఖాస్, ఆర్కేపురం, జనక్‌పురి, ద్వారకా తదితర ప్రాంతాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ఫేజ్‌త్రీ వాసులకు త్వరలో ఊరట గుర్గావ్లోని ఫేజ్‌త్రీ పరిసర వాసులకు శుభవార్త. విద్యుత్ సరఫరాలో కోతలనుంచి వీరికి త్వరలో విముక్తి కలగనుంది. ఇందుకు కారణం నాలుగు ఫీడర్లను దక్షిణ హర్యానా బిజిలీ వితరణ్ సంస్థ (డీహెచ్‌బీవీఎన్) త్వరలో ఫేజ్త్రీకి అనుసంధానం చేయనుండడమే. రింగ్ విధానంలో వీటిని కలపనుంది. ఇందువల్ల నాలుగు ఫీడర్లలో ఏదో ఒకదానిపై భారం పడితే దానిని మిగతా వాటికి బదిలీ చేయడానికి వీలవుతుంది. దీంతో ఏ ఒక్క ఫీడర్పైనా భారం పడే అవకాశమే ఉండదు. అయితే ఇదంతా సాకారమయ్యేందుకు కొంతకాలం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా ఫేజ్ త్రీలో కొంతకాలంగా విద్యుత్ సరఫరాలో కోత సర్వసాధారణంగా మారిన సంగతి విదితమే. -
డిస్కమ్‌లకు షాక్..!
సాక్షి, న్యూఢిల్లీ: నగరానికి విద్యుత్‌ను సరఫరా చేస్తున్న మూడు డిస్కమ్‌లకు శుక్రవారం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డిస్కమ్‌ల లెక్కల్లో అవకతవకలున్నాయని, వాటిని కాగ్‌తో ఆడిట్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఎస్ఈఎస్ రాజ ధాని, బీఎస్ఈఎస్ యమునా, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్‌లు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ పిటిషన్‌ను వెంటనే విచారించాలని కోర్టును కోరాయి. ప్రైవేటు కంపెనీల లెక్కలను మదింపు చేసే అధికారం కాగ్‌కు లేదని, ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే స్టే జారీ చేయాలని డిస్కమ్‌లు చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. కాగ్ జరిపే ఆడిట్‌కు సహకరించాల్సింది సూచించింది. కేసు తదుపరి విచారణను మార్చ్ 19కి వాయిదా వేసిన కోర్టు విచారణ పూర్తయ్యేంత వరకు నివేదికను సమర్పించవద్దని కాగ్‌ను ఆదేశించింది. అంతేకాక డిస్కమ్‌ల ఆరోపణలకు సమాధానం ఇవ్వవలసిందిగా హైకోర్టు న్యాయమూర్తి ఢిల్లీ ప్రభుత్వానికి, కాగ్‌కు నోటీసులు జారీచేశారు. వాడివేడిగా వాదనలు... డిస్కమ్‌ల తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, ముకుల్ రోహ్తగీ వాదించగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రశాంత్ భూషణ్ వాదించారు. వీరిద్దరి మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. ముందుగా హరీశ్ సాల్వే మాట్లాడుతూ... ప్రభుత్వం ముందుగా నిర్ధారించుకొని ఆడిట్‌కు ఆదేశించిందని ఆరోపించారు. వాదన వినింపిచే అవకాశాన్ని ప్రభుత్వం తమకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఏదైనా ప్రైవేటు కంపెనీ ఖాతాలను ఆడిట్చేసే అధికారం కాగ్‌కు లేదన్నారు. ప్రభుత్వం మెదడు పెట్టి ఆలోచించకుండా డిస్కమ్‌ల ఆడిట్‌కు ఆదేశించిందని విమర్శించిన ఆయన ప్రభుత్వ ఆదేశాన్ని ‘షేక్ చిల్లీ’ ఉత్తర్వుగా ఆయన అభివర్ణించా రు. కాగ్‌తో ప్రైవేటు కంపెనీల ఖాతాలను ఆడిట్ చేయించడానికి అనుమతించినట్లయితే అన్ని పన్నులు కన్సాలిడేటెడ్ఫండ్ ఆఫ్ ఇండియాలోనే జమ అవుతాయి కనుక దేశంలోని ప్రతి ప్రైవేటు పౌరుని ఖాతాలను ఆడిట్ చేసేందుకు కాగ్‌ను అనుమతించినట్లేనని అన్నారు. టెలికమ్ సంస్థలకు వర్తించే నియమాలు డిస్కమ్‌లకు వర్తించవని ఆయన వాదించారు. డీఈఆర్సీ సిఫారసుల్లోనే ఉంది.. ప్రభుత్వం తరఫున వాదించిన ప్రశాంత్ భూషణ్ కూడా ప్రత్యర్థి వాదనలు తనదైన శైలిలో తిప్పికొట్టారు. డిస్కమ్‌ల ఖాతాలను ఆడిట్ చేయించాలని డీఈఆర్సీ 2010లో సిఫారసు చేసిందని గుర్తుచేశారు. డిస్కమ్‌ల ఖాతాలలో అవకతవకలు జరుగుతున్నాయని, లెక్కల్లో ఎటువంటి అవకతవకలు జరగకపోతే ఆడిట్‌ను ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మన్మోహన్ దీనిపై సమగ్ర విచారణ జరపవలసి న ఉందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో విద్యుత్ పంపిణీని ఢిల్లీ విద్యుత్తు బోర్డు నుంచి డిస్కమ్‌లకు బదిలీ చేసినప్పటి నుంచి.. అంటే 2002 నుంచి డిస్కమ్‌ల ఖాతాలను కాగ్ ఆడిట్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. ఇదిలాఉండగా డిసెంబర్లో ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి వెనువెంటనే ఈ మూడు డిస్కమ్‌ల లెక్కలు తేల్చేందుకు కాగ్‌తో అడిట్ జరిపించాలని నిర్ణయించారు. ఈ మేరకు కాగ్ అధికారితో కూడా సమావేశం అయ్యారు. ఇక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా ఈ మూడు డిస్కమ్‌ల లావాదేవీలను ఆడిడ్ జర పాలంటూ కాగ్‌ను ఆదేశించారు. దీంతో ప్రభు త్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ డిస్కమ్‌లు హైకో ర్టును ఆశ్రయించాయి.