బీఎస్ఎన్ఎల్ సీఎండీగా శ్రీవాస్తవ!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సీఎండీగా అనుపమ్ శ్రీవాస్తవ నియామకాన్ని కేంద్రం ఆమోదించినట్లు తెలుస్తోంది. గత ఎంతో కాలంగా ఈ ఆమోదముద్ర పెండింగులో ఉంది. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి బీఎస్ఎన్ఎల్ ప్రతినిధి నిరాకరించారు. ప్రస్తు తం బీఎస్ఎన్ఎల్ సీఎండీగా ఆ సంస్థ డెరైక్టర్ ఏఎన్ రాయ్ అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు.