budgam encounter
-
ఆత్మహత్య చేసుకోవడానికే వస్తున్నారు: డీజీపీ
శ్రీనగర్: భద్రతా దళాలపై రాళ్లు రువ్వేందుకు ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశాలకు వస్తున్న కశ్మీర్ యువత తీరుపై ఆ రాష్ట్ర డీజీపీ ఎస్పీ వేద్ తాజాగా స్పందించారు. ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశానికి యువత రావడమంటే ఆత్మహత్య చేసుకోవడమేనని పేర్కొన్నారు. అలాంటి చర్యలకు యువత పాల్పడకుండా నిగ్రహంగా ఉండాలని సూచించారు. 'ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు భద్రతా దళాలు, పోలీసులు సైతం రక్షణకు అడ్డుగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేదా ఇల్లు ఉండేలా చూసుకుంటారు. కానీ యువత మాత్రం నేరుగా ఆత్మహత్య చేసుకోవడానికే ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశాలకు వస్తున్నారు' అని ఎస్పీ వేద్ విలేకరులతో అన్నారు. ఎన్కౌంటర్ ప్రదేశాలకు యువత రాకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతికి విఘాతం కలిగించే శక్తులే యువతను తప్పుగా ప్రేరేపించి.. తప్పు దోవ పట్టించేందుకు ఇలా రెచ్చగొడుతున్నాయని చెప్పారు. తమ సంకుచిత రాజకీయాల కోసం యువతను కొందరు వాడుకుంటున్నారని, ఈ విషయాన్ని యువత గుర్తించాలని సూచించారు. ఎన్కౌంటర్ ప్రారంభమైన వెంటనే 300లకుపైగా వాట్సాప్ గ్రూపులలో, ఫేస్‌బుక్‌లలో దుష్రచారం చేసి..యువతను రెచ్చగొడుతున్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో వాట్సాప్, ఇతర సోషల్ మీడియా గ్రూపులలో జరుగుతున్న దుష్ర్పచారంపై కట్టుదిట్టమైన నిఘా పెట్టినట్టు తెలిపారు. బుడ్గామ్ ఎన్కౌంటర్లో ఒక మిలిటెంట్ సహా.. ముగ్గురు యువత చనిపోయిన సంగతి తెలిసిందే. మిలిటెంట్‌కు మద్దతుగా భద్రతా దళాలపై యువత రాళ్లు రువ్వడంతో జవాన్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు విడిచారు. -
బుద్గాం ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
- ఆ సమయంలో బలగాలపై రాళ్లు రువ్విన స్థానికులు - కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి..18 మందికి గాయాలు శ్రీనగర్: కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ముష్క రులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్ సమయంలో ఉగ్రవాదులకు సాయంగా జవాన్లపై స్థానికులు రాళ్లతో దాడిచేశారు. దీంతో భద్రతా దళాలు వారిపైనా కాల్పులు జరిపాయి. దీంతో ఒక ఉగ్రవాది, ముగ్గురు పౌరులు చనిపోయారు. మంగళవారం ఉదయం చదూరాలో ఉగ్రవాదులు ఉన్నారని తెలిసి భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఆ సమయంలో హఠాత్తుగా ఉగ్రవాదుల నుంచి కాల్పులు మొదలయ్యాయి. దీంతో జవాన్లు సైతం ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇదేసమయంలో ఉగ్రవాదులను తప్పించేం దుకు స్థానిక యువకులు.. జవాన్లపై రాళ్లతో విరుచుకుపడ్డారు. దీంతో వారిపైనా జవాన్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. మరణించిన స్థానికులను జహీద్ డర్, సాకీబ్ అహ్మద్, ఇష్ఫక్ అహ్మద్‌వానిగా గుర్తించారు. ఇదే ఘటనలో మరో 18 మంది గాయపడ్డారు. భద్రతా దళాలు అమాయక ప్రజల ప్రాణా లను బలిగొన్నందుకు నిరసనగా వేర్పాటువా దులు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
అల్ బదర్ ఉగ్రవాది ముజఫర్ హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులకు భారత భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో అల్ బదర్ ఉగ్రవాది హతమయ్యాడు. ఆ సంస్థలోని కీలక కమాండర్ ముజఫర్ అహ్మద్ చనిపోయాడు. ఈ ఎన్కౌంటర్ శుక్రవారం తెల్లవారు జామునుంచి కొనసాగుతోంది. జమ్ములోని బుద్గామ్ జిల్లాలోగల మచ్చు ప్రాంతంలో ఉగ్రవాదుల అలికిడి ఉందని సమాచారం తెలుసుకున్న బలగాలు గాలింపులు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరపగా బలగాలు ఎదురుకాల్పులతో ప్రతిఘటించింది. ఈ కాల్పుల్లోనే అల్ బదర్ ఉగ్రవాది ముజఫర్ అహ్మద్ హతమయ్యాడు. ఈ కాల్పుల్లో ఒక జవాను కూడా గాయపడినట్లు సైనికాధికారులు చెప్పారు. ఈ ఉగ్రవాద సంస్థకు మరో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయిబాకు సంబంధాలున్నాయి.