మోదీకి జుకర్‌బర్గ్ ప్రశంస
న్యూయార్క్: ప్రధాని మోదీపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల మధ్య జవాబుదారీతనాన్ని పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఫేస్‌బుక్‌ను వినియోగించుకుంటున్న తీరు అభినందనీయమన్నారు.
‘బిల్డింగ్ గ్లోబల్ కమ్యూనిటీ’ పేరుతో 200 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారులనుఉద్దేశిస్తూ రాసిన పోస్టులో.. ‘ఎన్నికల్లో గెలిచాక చేతులు దులుపుకోవటం కాదు. ఐదేళ్లపాటు వారితో నేరుగా అనుసంధానమై ఉండాలి. అదే ప్రజలు, ప్రజాప్రతినిధుల మధ్య జవాబుదారీగా మారుతుంది. మోదీ తన మంత్రులకు సమావేశాల వివరాలు, ఇతర సమాచారం ఫేస్బుక్ ద్వారా ప్రజలకు చేరాలని కోరారు’ అని ప్రశంసించారు.