bumper listing
-
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బంపర్ లిస్టింగ్
సాక్షి,ముంబై: ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బంపర్ లిస్టింగ్‌ను నమోదు చేసింది. విశ్లేషకుల అంచనాలను మించి లిస్టింగ్‌లో దూసుకు పోయింది. స్టాక్‌మార్కెట్లలో గురువారం లిస్ట్ అయిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు ఏకంగా 60 శాతం ప్రీమియంతో రూ. 62 వద్ద లిస్ట్ అయింది. గత వారం తన 750 కోట్ల ఐపీవోలో 165 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన సంగతి తెలిసిందే. ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.36-37 కాగా ఈ ఇష్యూ 166 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. దీంతో గ్రే మార్కెట్లో ఈ స్టాక్‌పై అంచనాలు అధికమయ్యాయి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇష్యూ ధర రూ.37లతో పోలిస్తే 50 శాతం ప్రీమియంతో షేర్లు లిస్టింగ్ జరగవచ్చని నిపుణలు అంచనా వేశారు. అయితే ఈ అంచనాలను మించి ఇష్యూ ధర కంటే 60 శాతం అధికం కావడం విశేషం. అలాగే పేరెంట్ కంపెనీ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ రూ.4,300 కోట్ల కన్నా ఎక్కువ. -
సౌదీ ఆరామ్‘కింగ్’!
దుబాయ్: సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కో స్టాక్ మార్కెట్ అరంగేట్రం అదిరిపోయింది. ఇష్యూ ధర 32 రియాల్స్‌తో పోలిస్తే 10 శాతం అప్పర్ సర్క్యూట్‌తో 35.3 రియాల్స్ ధరను (9.39 డాలర్లు –రూ.662) తాకింది. ఈ ధర వద్ద కంపెనీ విలువ 1.88 లక్షల కోట్ల డాలర్లు. మన రూపాయల్లో 132.5 లక్షల కోట్లు. గురువారం కూడా ఈ షేర్ మరో 10 శాతం పెరిగితే సౌదీ అరేబియా పాలకులు ఆశించిన 2 లక్షల కోట్ల డాలర్ల విలువ గల కంపెనీ అనే మైలురాయిని సాదీ ఆరామ్కో చేరనున్నదని అంచనా. సౌదీ ఆరామ్కో కంపెనీ తర్వాతి స్థానాల్లో ఉన్న ఇతర ఐదు చమురు కంపెనీల (ఎక్సాన్ మొబిల్, టోటల్, రాయల్ డచ్ షెల్, షెవ్రాన్, బీపీ) మొత్తం మార్కెట్ విలువ కన్నా కూడా సౌదీ ఆరామ్కో కంపెనీ విలువే ఎక్కువ కావడం విశేషం. వచ్చే ఐదేళ్ల పాటు ఏడాదికి 7,500 కోట్ల డాలర్ల చొప్పున డివిడెండ్‌ను ఇవ్వాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఐపీఓ, మార్కెట్ విలువలోనూ అగ్రస్థానం.... ఇటీవలే ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా 1.5 శాతం వాటా షేర్లను విక్రయించి 2,560 కోట్ల డాలర్లు (రూ.1,80,480 కోట్లు) సమీకరించి ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓగా ఈ కంపెనీ అవతరించింది. ఇప్పటివరకూ 2,500 కోట్ల డాలర్లతో అలీబాబా పేరిట ఉన్న అతి పెద్ద ప్రపంచ ఐపీఓ రికార్డ్‌ను సౌదీ ఆరామ్కో బ్రేక్ చేసింది. ఇక బంపర్ లిస్టింగ్‌తో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా ప్రపంచ నెంబర్–1 కంపెనీగా సౌదీ ఆరామ్కో అవతరించింది. అంతే కాకుండా లిస్టెడ్ కంపెనీల పరంగా ప్రపంచంలోనే టాప్ 10 స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ఒకటిగా (తొమ్మిదవ స్థానాన్ని) సౌదీ అరేబియా స్టాక్ ఎక్సే్ఛంజ్ నిలిచేందుకు ఈ కంపెనీ తోడ్పడింది. ఇప్పటిదాకా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువను సాధించిన కంపెనీలు ప్రపంచంలో రెండే ఉన్నాయి. 1.19 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో యాపిల్, 1.15 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్‌తో మైక్రోసాఫ్ట్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల తర్వాతి స్థానాల్లో గూగుల్ మాతృ కంపెనీ ఆల్ఫాబెట్ (92,600 కోట్ల డాలర్లు), ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ (86,200 కోట్ల డాలర్లు), సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ (57,200 కోట్ల డాలర్లు) నిలిచాయి. ► 1938లో ఒక చమురు బావితో సౌదీ ఆరామ్కో ప్రస్థానం మొదలైంది. ► ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత లాభదాయక, అతి పెద్దదైన చమురు కంపెనీగా మారింది. ► ప్రపంచవ్యాప్తంగా మొత్తం ముడి చమురు సరఫరాల్లో 10% ఈ సంస్థేదే. ► 2018లో కంపెనీ నికర లాభం 46% ఎగసి 11,110 కోట్ల డాలర్లకు పెరిగింది. 35,600 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. 13 రిలయన్స్‌లకు మించి... ఇక మన దేశంలో అత్యధిక మార్కెట్ క్యాప్ కంపెనీగా రూ.9,90,564 కోట్లతో(14,050 కోట్ల డాలర్లు) రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి 13 కంపెనీలు కలిసినా... ఒక సౌదీ ఆరామ్కో కన్నా తక్కువే!! -
ఎంఎన్సీ వదిలాడు.. రూ.900కోట్లను ఆర్జించాడు!
ముంబై : డీమార్ట్ రిటైల్ చైన్ నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ బంపర్ లిస్టింగ్ ప్రమోటర్లందర్ని ఒక్కసారిగా దేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా చేర్చింది. అతిరథ మహారథులందర్ని దాటేసి తమ సంపదను అమాంతం పెంచేసుకున్నారు. అయితే కేవలం ప్రమోటర్లను మాత్రమే కాక, ఇటు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ లకు మిలీనియర్ క్లబ్ లో చోటు కల్పించింది. బీఎస్ఈలో లిస్టింగ్ కు వచ్చిన డీమార్ట్ లాభాల ధమాకా మోగించడంతో కంపెనీ ఎండీ నవిల్ నోరోన్హా సంపద ఒక్కసారిగా రూ.900 కోట్లకు పెరిగిపోయిందట. నోరోన్హా అవెన్యూ సూపర్ మార్ట్స్ లో 1.37 కోట్ల షేర్లు కలిగిఉన్నారు. ప్రస్తుతం కంపెనీ షేర్లు రెండింతలు పెరగడంతో ఆయన సంపద రూ.878 కోట్లకు పెరిగినట్టు రిపోర్టులు చెప్పాయి. హెచ్‌యూఎల్ ఎండీ సంజీవ్ మెహతా, ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్, గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఎండీ వివేక్ గంభీర్ సంపదలన్నీ కలిపితే ప్రస్తుత నోరోన్హా సంపదని తెలిసింది. ఎస్ఐఈఎస్ కాలేజీ నుంచి నోరోన్హా సైన్యు గ్రాడ్యుయేట్ గా పట్టా పొందారు. అనంతరం నార్సి మాంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. హెచ్‌యూఎల్ లో మార్కెట్ రీసెర్చ్, సేల్స్, మోడరన్ ట్రేడ్ లో పనిచేసే సమయంలోనే దమానీతో సానిహిత్యం పెరిగింది. అనంతరం డీ-మార్ట్ విస్తరణలో భాగంగా నోరోన్హా ఆ మల్టినేషనల్ దిగ్గజానికి బై చెప్పి, డీ-మార్ట్ లో చేరారు. -
పబ్లిక్ ఆఫర్ల పండగొచ్చింది..!
⇒ మార్చిలో ఇన్వెస్టర్ల చెంతకు ఆరు ఐపీఓలు... ⇒ దాదాపు రూ.5,000 కోట్ల సమీకరణ ⇒ మార్కెట్ల జోరుతో బంపర్ లిస్టింగ్‌పై కన్ను న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు జోరుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం, అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ గెలవడం, ఆయన రక్షణాత్మక విధానాలకు తెర తీయడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచనుండడం వంటి ప్రతికూలతలు ఉన్నా... స్టాక్ మార్కెట్లు మాత్రం పరుగులు తీస్తున్నాయి. మన మార్కెట్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. కొత్త ఏడాది ప్రారంభమైన మూడో నెలలోనే సూచీలు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ఇదే అదునుగా పలు కంపెనీలు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తున్నాయి. ప్రస్తుత మార్చి నెలలో ఏకంగా ఆరు కంపెనీలు సుమారు రూ.5,000 కోట్ల నిధులను సమీకరించనున్నాయి.. వీటిల్లో పెద్దదైన డీ–మార్ట్ రిటైల్ స్టోర్స్‌కు మంచి ఆదరణ ఉండటంతో ఈ స్టోర్స్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్ ఐపీఓకు మంచి స్పందన ఉంటుందనేది విశ్లేషకుల అంచనా.. మిగిలిన ఇష్యూల రేంజ్ రూ.400–600 కోట్లు. దీంతో వీటికీ మంచి డిమాండ్ ఉండగలదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఐపీఓల ద్వారా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణ, రుణాల చెల్లింపునకు, సాధారణ వ్యాపార కార్యకలాపాల కోసం ఆయా కంపెనీలు వినియోగించుకోనున్నాయి. గత ఏడాది 26 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.26,000 కోట్లు సమీకరించాయి. 2010 తర్వాత ఇదే అధిక మొత్తం కావడం గమనార్హం. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్ బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ తాజా షేర్ల జారీ ద్వారా రూ.500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద 66 లక్షల షేర్ల జారీ ద్వారా రూ.100 కోట్లు సమీకరించనున్నది. సీడీఎస్ఎల్ ఈ ఐపీఓ ద్వారా ఈ సంస్థ రూ.500 కోట్లు సమీకరించనున్నది. ఈ నెల 15–17 మధ్య ఈ ఐపీఓ రావచ్చని, రూ.115–135 రేంజ్లో ధరల శ్రేణి ఉండొచ్చని, సమాచారం. ఈ నెల 27న ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ఆఫర్ ఫర్ సేల్ విధానంలో దాదాపు 3.5 కోట్ల షేర్లను జారీ చేయనున్నది. 7 లక్షల షేర్లను ఉద్యోగులకు రిజర్వ్ చేసింది. సీఎల్ ఎడ్యుకేట్ ఐపీఓలో 20,60,652 తాజా షేర్లను, మరో 26,29,881 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ లో జారీ చేయడం ద్వారా రూ.400 కోట్లు సమీకరించనున్నది. కాంటినెంటల్ వేర్‌హౌసింగ్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ కంపెనీ. రూ.10 ముఖ విలువ గల రూ.418.8 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లతో పాటు ఆఫర్ ఫర్ సేల్ విధానంలో 7,98,608 షేర్లను జారీ చేయనున్నది. ఈ ఐపీఓ ఈ నెల 22న ప్రారంభమై, 24న ముగియనున్నదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. డీ–మార్ట్ మార్చి 8 న ప్రారంభమై, 10న ముగిసే ఈ ఐపీఓ ద్వారా అవెన్యూ సూపర్‌మార్ట్స్ రూ.1,870 కోట్లు సమీకరించనున్నది. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన రూ.3,000 కోట్ల పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ. ఈ ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల 6.23 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. ధరల శ్రేణి రూ.290–299గా కంపెనీ నిర్ణయించింది. కనీసం 50 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 21న స్టాక్ మార్కెట్లో లిస్ట్‌కావచ్చు. గ్రే మార్కెట్లో ఇష్యూ ధరకు రూ.175–180 ప్రీమియం ఉన్నట్లు సమాచారం. మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ రేడియో సిటీ ఎఫ్ఎం స్టేషన్లను నిర్వహిస్తున్న జాగరణ్ ప్రకాశన్ గ్రూప్‌కు చెందిన మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ ఐపీఓ మార్చి 6 ప్రారంభమై, 8న ముగియనున్నది. తాజా షేర్లతో పాటు 26.59 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో జారీ చేయడం ద్వారా కనీసం రూ.490 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.324–333 రేంజ్లో, మార్కెట్ లాట్ 45 షేర్లుగా ఉండొచ్చని సమాచారం. మార్చి 17న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఐపీఓకు రానున్న కొన్ని కంపెనీలు... ఎన్ఎస్ఈ ∙ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ∙టాటా సన్స్ టాటా ఇన్ఫోటెక్ ∙యూటీఐ ఎంఎఫ్ ∙హడ్కో ∙సుల్తాన్ చాంద్ ∙లోధా గ్రూప్ డెవలపర్స్ ∙భారత్ మ్యాట్రిమోని -
బీఎస్ఈ.. బంపర్ లిస్టింగ్
• 35 శాతం ప్రీమియమ్‌తో రూ.1,085 వద్ద ఓపెన్ • ఇంట్రాడేలో 49 శాతం లాభంతో రూ.1,200 గరిష్ట స్థాయికి • రూ.1,069 వద్ద క్లోజ్ ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్(ఎన్ఎస్ఈ)లో బీఎస్ఈ షేర్లు శుక్రవారం లిస్టయ్యాయి. లిస్టింగ్‌లోనూ, ట్రేడింగ్‌లోనూ బీఎస్ఈ షేర్లు మెరుపులు మెరిపించాయి. ఆసియాలో అతి పురాతనమైన, 140 ఏళ్ల చరిత్ర గల బీఎస్ఈ షేర్లు ఇష్యూ ధర(రూ.806) తో పోల్చితే 35 శాతం ప్రీమియమ్‌తో రూ. 1,085 వద్ద ఎన్ఎస్ఈలో లిస్టయ్యాయి. ఇంట్రాడేలో 49 శాతం లాభంతో రూ.1,200 గరిష్ట స్థాయికి చేరిన బీఎస్ఈ షేర్ చివరకు 33 శాతం లాభంతో రూ.1,069 వద్ద ముగిసింది. కోటిన్నర షేర్లు ట్రేడయ్యాయి. సొంత ఎక్సే్చంజ్‌లో లిస్ట్ కావడానికి సెబీ నియమనిబంధనలు ఒప్పుకోనందున బీఎస్ఈ షేర్లు ఎన్ఎస్ఈలోనే లిస్టయ్యాయి. మార్కెట్ క్యాప్ ఎట్ రూ.5,750 కోట్లు ట్రేడింగ్ ముగిసేనాటికి బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,750 కోట్లుగా ఉంది. ఇక బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయి, రూ.115 లక్షల కోట్లకు చేరింది. రూ.805–806 ధరల శ్రేణితో వచ్చిన బీఎస్ఈ ఐపీఓ 51 రెట్లు ఓవర్సబ్స్క్రైబయ్యాయి. ఈ ఏడాది వచ్చిన తొలి ఐపీఓ ఇదే, అంతేకాకుండా దేశంలోని తొలి స్టాక్ ఎక్సే్చంజ్ ఐపీఓ కూడా ఇదే. అతి పెద్ద స్టాక్ ఎక్సే్చంజ్.. బీఎస్ఈ షేర్లు భారీ లాభాలతో ఎన్ఎస్ఈలో లిస్ట్ కావడం.. మార్కెట్ సెంటిమెంట్ జోరును సూచిస్తోందని శామ్కో సె క్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ చెప్పారు. బీఎస్ఈలో దాదా పు 3,000 కంపెనీలు లిస్టయ్యాయి. లిస్టైన కంపెనీల పరంగా చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద స్టాక్ ఎక్సే్చంజ్ ఇదే. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే పదో స్థానం. ఎన్ఎస్ఈ షేర్లు తమ స్టాక్ ఎక్సే్చంజ్‌లో లిస్ట్ కావడం కోసం చూస్తున్నామని బీఎస్ఈ చైర్మన్ సుధాకర్ రావు ఈ సందర్భంగా చెప్పారు. త్వరలో ఎన్ఎస్ఈ ఐపీఓ కూడా రానున్నది. ఈ ఐపీఓ ద్వారా ఎన్ఎస్ఈ రూ10,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా.