స్వప్నలిపి
బాస్... మీ కలలో పటాస్ పేలిందా?!
పటాస్ పేలిన శబ్దం వినబడి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తాం. చుట్టూ చూస్తాం. ఎక్కడా పటాసుల జాడ ఉండదు. పటాసుల శబ్దం కలలోనిదనేది అర్థమైపోతుంది. ‘ఇదేం దీపావళి సీజన్ కాదు కదా! ఇలాంటి కల వచ్చింది’ అనే సందేహం కూడా మనకు రావొచ్చు. దీనికి సంబంధించి మానసిక , ధార్మిక కోణాలలో ఎన్నో విశ్లేషణలు ఉన్నాయి.
కలలో పటాసులు పేలడం అనేది చాలా సందర్భాలో మీలో తారాస్థాయికి చేరిన సంతోషాన్ని, జీవనోత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది.
‘జడత్వం’ లో నీరసం తప్ప శబ్దమేదీ వినిపించదు. కార్యశీలతలోనే ‘ఉత్సాహం’ అనే శబ్దం ఉంటుంది. కలలో కనిపించి వినిపించే పటాస్ శబ్దం సరిగ్గా అలాంటిదే! కొన్ని పాశ్చాత్య విశ్లేషణల ప్రకారం... రాబోయే ప్రమాదాన్ని హెచ్చరించే కల ఇది. సందర్భాన్ని బట్టి మీరు ఈ కల గురించి ఒక అంచనాకు రావచ్చు.