Bus Fitness
-
స్కూళ్లు, కాలేజీ బస్సులను తనిఖీ చేసిన అధికారులు
-
ఫిట్'లెస్' బడి బస్సులు... విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్ అయిన స్కూల్ బస్సులు 224 ఉన్నాయి. ఒక్కో బస్ ఫిట్నెస్ పరీక్షకు సంవత్సరానికి ఒకసారి రూ.5వేలు ఖర్చవుతుంది. ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తాయి. ఈ లెక్కన ఒక బస్ సీటింగ్ కెపాసిటీ ఆధారంగా 40 మందికి నెలకు రూ.40 వేలు వసూలు చేస్తారు. కానీ జిల్లా వ్యాప్తంగా 85 బస్సులు ఇప్పటివరకు ఫిట్నెస్ చేయించుకోకుండా వారి స్వలాభం కోసం అలాగే నడుపుతున్నారు. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేసే స్కూలు యాజమాన్యాలు కేవలం ఫిట్నెస్ కోసం రూ.5 వేలు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నాయి. నిర్మల్‌చైన్‌గేట్: విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులను తరలించే వాహనాలకు యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. కానీ పాఠశాలలు ప్రారంభమై పది రోజులు కావస్తున్నా యాజమాన్యాలు ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ నెల 12 వరకు అన్ని బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. అయినా కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు చెందిన బస్సులు 224 ఉండగా ఈ నెల 22 వరకు 139 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా 85 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాల్సి ఉంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం జిల్లాలోని 208 ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 35 వేలకు పైబడి విద్యార్థులు చదువుతున్నారు. పిల్లల ను పాఠశాలల నుంచి తీసువెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన ప్రైవేట్ పాఠశాలల బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. వేలకు వేలు ఫీజులు గుంజుతున్న ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫిట్నెస్ లేని వాహనాలను నడుపుతూ విద్యార్థుల ప్రా ణాలతో చెలగాటమాడుతున్నాయి. జిల్లాలో 224 బ స్సులు ఉండగా 139 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ ధ్రువీకరణ పొందినట్లు సంబంధిత అధికారులు తెలి పారు. పలు ప్రాంతాల్లో కళ్లముందే ప్రమాదాలు కని పిస్తున్నప్పటికీ అటు అధికారులు, ఇటు యాజమాన్యాలు మాత్రం నిర్లక్ష్యం వీడడంలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కొనసాగుతున్న దళారుల దందా... అమ్మానాన్నలకు బైబై చెప్పి బడికి బయలుదేరుతు న్న చిన్నారులను భద్రంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలది. ఈ బస్సులకు ‘ఫిట్నెస్’ జారీ చేయాల్సిన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ) కార్యాలయాల్లో దళా రుల దందా జోరుగా సాగుతోంది. ఒక్కో వాహనానికి వేలల్లో మామూళ్లు ఇస్తేనే సర్టిఫికెట్ జారీ అవుతోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తాము అధికారులకు కమీషన్లు ముట్టజెప్పాల్సి వస్తోందని దళారులు బాహాటంగానే చెబుతున్నారు. చేతులు తడిపిన యా జమాన్యాల వాహనాలకు సర్టిఫికెట్లు జారీచేస్తుండగా కరోనా కష్టాల నుంచి ఇంకా కోలుకోని కొన్ని స్కూల్ యాజమాన్యాలు ఏజెంట్లు అడిగినంత ఇవ్వలేక అవస్థలు పడుతున్నాయి. ఫలితంగా బడులు ప్రారంభమైనా ఇప్పటివరకు 85 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ కాకపోవడం గమనార్హం. తనిఖీల జాడేది? విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికి 11 రోజులు గడుస్తున్నా ఆర్టీఏ అధికారులు మాత్రం తనిఖీలు నిర్వహించడం లేదు. దీంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సులను ఎటువంటి ఫిట్నెస్ లేకుండానే యథేచ్ఛగా తిప్పుతున్నాయి. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇవీ నిబంధనలు.. వాహనాలకు ఫిట్నెస్ పరీక్ష చేయించాలనుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలు, డిజిగ్నీషన్, సెల్ నంబర్, బస్సు మోడల్, డ్రైవర్ వివరాలు, అటెండెంట్, ఫొటోలు, బస్సు నడిచే మార్గం, సీట్ల పరిమితి, తదితర విషయాలను నమోదు చేయాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా వాహనంలో మెడికల్ కిట్లు, గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు, సీట్ల మధ్య రాడ్లు అమర్చి ఉండాలి. విద్యార్థులు బస్సులో ఎక్కేందుకు, దిగేందుకు అనుకులంగా 325 మి.మీ ఎత్తు ఉండేలా బస్సు మెట్లు ఉండాలి. ● ఆపద సమయంలో బయటకు దిగేందుకు అత్యవసర ద్వారం తప్పకుండా ఏర్పాటు చేసి ఉండాలి. ● విద్యార్థులు బస్సు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు డ్రైవర్‌కు కనబడేలా రెండు వైపులా సైడ్ అద్దాలు, అన్ని కిటికీలను కలుపుతూ ఇనుప జాలి అమర్చి ఉండాలి. ● వాహనం టైర్లు, బ్రేక్‌లు నాణ్యతతో ఉండేలా చూసుకోవాలి. బస్సుపై ఏ పాఠశాలకు చెందిందో తెలిపేలా పూర్తి వివరాలు రాసి ఉంచాలి. ● పాఠశాల వాహనాలు నడిపే డ్రైవర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి. ● రాత్రి వేళల్లో బస్సులను గుర్తుపట్టేలా నాలుగు వైపులా రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయాలి. ఫిట్నెస్ లేకుంటే చర్యలు అనుమతులు లేకుండా పాఠశాల యాజమాన్యాలు స్కూల్ బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. స్కూల్ యాజమాన్యాలు వారి వాహనాలకు ఫిట్నెస్ చేయించుకోవాలి. అనుభవం ఉన్న వారిని డ్రైవర్‌గా నియమించుకోవాలి. నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తాం. – అజయ్‌కుమార్, జిల్లా రవాణాశాఖ అధికారి -
నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం.. తల్లిదండ్రుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థల బస్సులు పూర్తిగా దారి తప్పాయి. విద్యార్థులను భద్రంగా ఇళ్లకు చేర్చేందుకు ఉద్దేశించిన నిబంధనల విషయంలో పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. సోమవారం నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ నిర్లక్ష్యం మరోసారి తేటతెల్లమైంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికల్లా ఫిట్నెస్ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉన్నా, ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం వాహనాలు మాత్రమే దాన్ని పూర్తిచేసుకున్నాయి. అధికారులు బస్సుల ఫిట్నెస్ పరిశీలించి అవి రోడ్డుపై నడిచేందుకు యోగ్యంగా ఉన్నదీ లేనిదీ తేలుస్తారు. ఆ మేరకు ఫిట్నెస్ రెన్యూవల్ చేస్తారు. ఇప్పుడు ఫిట్నెస్ రెన్యూవల్ లేకుండానే 80 శాతం బస్సులు రోడ్డెక్కితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 29 వేల పైచిలుకు విద్యాసంస్థల బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ఇప్పటివరకు 6 వేల బస్సులు మాత్రమే ఫిట్నెస్ రెన్యూవల్ చేయించుకున్నాయని సమాచారం. విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న వేళ పరిస్థితిని ముందే గుర్తించి హెచ్చరించాల్సిన రవాణాశాఖ పెద్దగా స్పందించలేదు. సోమవారంలోపు రెన్యూవల్ చేయించుకోని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలైనా జారీ చేయలేదు. సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభం అవుతూనే రవాణాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఫిట్నెస్ రెన్యూవల్ లేని బస్సులను గుర్తించి వాటి గుర్తింపు రద్దు చేయటం లాంటివి చేస్తారు. విద్యాసంస్థలకు పెనాల్టీలు విధిస్తుంటారు. కానీ, ముందుగానే హెచ్చరికలు జారీ చేయటం ద్వారా విద్యాసంస్థల్లో భయాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ప్రారంభమయ్యాక పట్టుబడితే పెనాల్టీలు విధించటం వరకు సరే, అసలు ఫిట్నెస్ లేక బస్సు ప్రమాదానికి గురైతే విద్యార్థుల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శిక్షణ ఏది..? విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యేలోపు విద్యాసంస్థల బస్సులు నడిపే డ్రైవర్లకు ఒకరోజు శిక్షణ ఇవ్వాలన్న నిబంధన ఉంది. సఫర్ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాలుంటాయి. డ్రైవింగ్ నైపుణ్యం, బస్సు నిబంధనలు, విద్యార్థుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించే తీరు.. ఇలా అన్ని అంశాలు అందులో ఉంటాయి. కానీ ఇప్పటివరకు ఆ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించలేదు. విద్యార్థులు ఆ బస్సుల్లో ఎక్కడం ప్రారంభమయ్యేలోపే ఈ శిక్షణ పూర్తి చేస్తే ఉపయోగం ఉంటుంది. తర్వాత ఎప్పటికో శిక్షణ ఇస్తే, ఈలోపు అనుకోని ప్రమాదం చోటు చేసుకుంటే ఏంటన్నది తల్లిదండ్రు ఆందోళన. -
‘ఫిట్’..ఫట్!
రోడ్డుపైకి 151 కండీషన్ లేని స్కూలు బస్సులు నిబంధనలు కాలరాస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు మేల్కొనని ఆర్టీఏ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు: ఆర్టీఓ విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ప్రైవేట్ పాఠశాలల ప్రచారపర్వం ముగిసి, పిల్లల మార్పుచేర్పు కూడా జరిగిపోయింది. కానీ చిన్నారులను స్కూళ్లకు తీసుకెళ్లే బస్సు ఫిట్నెస్ మాత్రం పూర్తికాలేదు. కండీషన్‌లేని బస్సులు రోడ్డుపై తిరుగుతూనే ఉన్నాయి. ఒక్కో బస్సులో రెండింతల విద్యార్థులను కుక్కి స్కూళ్లకు తీసుకెళ్తున్నా.. పట్టించుకునేవారు లేరు. అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్‌స్కూళ్ల యాజమాన్యాల లాభార్జన.. వెరసి విద్యార్థుల భద్రత గాల్లోదీపంగా మారింది . సాక్షి, మహబూబ్‌నగర్/క్రైం: విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపే స్కూలుబస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. జిల్లావ్యాప్తంగా ఉన్న 794 బస్సులకు గాను ఇప్పటి 643 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా 151 బస్సులు కండిషన్ లేకుండానే రోడ్డుపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. దీంతో వందలాది మంది విద్యార్థులు సురక్షితం లేని ప్రయాణం మధ్య చదువుకుంటున్నారని తెలిసింది. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తరువాత కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు. ముందుగానే వాహనాల తనిఖీ బాధ్యతను విస్మరిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభం కాకముందే పిల్లలను తీసుకెళ్లే స్కూలు బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేసి ధ్రువీకరణపత్రాలు జారీచేయాలి. ఆ తర్వాత కూడా రవాణాశాఖ నిబంధనలకు అనుగుణంగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ జిల్లా రవాణాశాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయలేదు. 40 కేసులు..లక్ష జరిమానా! జిల్లాలో ఐదువేలకు పైగా ప్రైవేట్‌స్కూళ్లు బస్సులు ఉన్నాయి. వీటిలో కొన్నింటిలో ఒక్కోస్కూల్లో రెండు నుంచి ఐదుబస్సుల వరకు ఉన్నాయి. ఇలా జిల్లావ్యాప్తంగా 794 బస్సులు ఉన్నట్లు ఆర్టీఏ లెక్కలు చెబుతున్నాయి. అయితే వీటిలో చాలా కండీషన్‌లేని బస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఒక బస్సులో 42 మంది విద్యార్థులు, మినీ బస్సులో 24 మంది విద్యార్థులను కూర్చోబెట్టాలి. కానీ ఒక్కోబస్సులో 50 మంది చిన్నారులను కుక్కుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటివరకు 40కేసులు నమోదుచేసి.. రూ.లక్ష వరకు జరిమానా విధించారు. సాధారణంగా ఒక స్కూలు బస్సు 15 ఏళ్ల లోపు మాత్రమే రోడ్డుపై తిరిగాలి. కానీ మారుమూల ప్రాంతాలైన కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నారాయణపేట, కొడంగల్ తదితర ప్రాంతాల్లో అక్కడక్కడ తిప్పుతున్నట్లు సమాచారం. ఇవీ నిబంధనలు నర్సరీ నుంచి పదో తరగతులను నిర్వహించే పాఠశాలల బస్సులు తప్పనిసరిగా కిటికీలకు ఇనుపగ్రిల్స్ను ఏర్పాటు చేయాలి. బస్సుబ్రేకుల కండీషన్లో ఉన్నాయో? లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉన్న డ్రైవర్లనే స్కూలు బస్సులను నడిపేందుకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు నియమించాలి.బస్సు డ్రైవర్ వయస్సు 60 ఏళ్లకు మించరాదు.బస్సు నడిపే వ్యక్తి డ్రైవింగ్ సామర్థ్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అనుమానాలు ఉంటే వారిని మార్చాలి.ఇందుకోసం బస్సు వెనకభాగంలో ఎడమవైపు పాఠశాల యాజమాన్యం ఫోన్ నంబర్‌ను రాయాలి.బస్సుల్లో చెక్కసీట్లకు బదులు కుషన్ ఉన్న సీట్లను అమర్చాలి.బస్సులో ప్రయాణించే విద్యార్థుల కదలికలు డ్రైవర్ గమనించేందుకు అనువుగా రియల్మిర్రర్ను ఏర్పాటు చేయాలి.బస్సుల్లో సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను తీసుకుపోరాదు.అత్యవసర ద్వారం, ప్రథమచికిత్స పెట్టెలు బస్సులో అందుబాటులో ఉండాలి. ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగితే, వాటిని నివారించేందుకు అగ్నిమాపక యంత్రం నర్సరీ నుంచి ఐదోతరగతి వరకు విద్యార్థులను తరలించే బస్సుల్లో పిల్లలు సులువుగా కిందికి దిగేందుకు వీలుగా మరోమెట్టును కిందివైపునకు అమర్చాలి. ఫిట్నెస్ టెస్టులు త్వరలో పూర్తి స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌కు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. ఇంకా 150బస్సులను పరీక్షించాల్సి ఉంది. ఇప్పటికే అధికారులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించాం. అలాగే నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. రవాణా నిబంధనల అమలు కోసం త్వరలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం.. పిల్లల తల్లిదండ్రులు కూడా వారి బాధ్యతగా స్కూల్బస్సులపై నిఘా ఉంచాలి. ఏమైనా అనుమానాలుంటే తక్షణం ఫిర్యాదు చేయొచ్చు. - ఎల్.కిష్టయ్య, ఆర్టీఓ, మహబూబ్‌నగర్