C Vijayabaskar
-
మహిళా జర్నలిస్ట్ పై మంత్రి వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ఆరోగ్యమంత్రి సి.విజయభాస్కర్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ గురువారం నిర్వహించిన సమావేశానికి హాజరైన విజయభాస్కర్ బయటికొస్తుండగా.. భేటీలో తీసుకున్న నిర్ణయాల విషయమై ఓ మహిళా జర్నలిస్ట్ ఆయనను ప్రశ్నించారు. దీంతో ప్రశ్నల్ని తప్పించుకునేందుకు ‘మేడమ్ మీరు కళ్లద్దాల్లో చాలా అందంగా ఉన్నారు’ అని విజయభాస్కర్ వ్యాఖ్యానించారు. తానెప్పుడూ కళ్లద్దాలు ధరిస్తానన్న ఆమె సమావేశంలో పార్టీ నిర్ణయాలపై మళ్లీ మంత్రిని ప్రశ్నించింది. దీంతో విజయభాస్కర్ ‘మీరు ఈరోజు చాలా అందంగా ఉన్నారు’ అని జవాబిచ్చారు. సమావేశం విషయమై పార్టీ త్వరలోనే ప్రకటన విడుదల చేస్తుందనీ, దీనిపై అన్నాడీఎంకే సీనియర్ నేతలు మాట్లాడతారని స్పష్టం చేశారు. అయినా ఆ మహిళా జర్నలిస్ట్ ప్రశ్నలు అడగటం మానకపోవడంతో ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అని మంత్రి మరోసారి చెప్పారు. తన వ్యాఖ్యలపై తీవ్రదుమారం చెలరేగడంతో విజయభాస్కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రశ్నల్ని తప్పించుకునే క్రమంలోనే తానలా అన్నట్లు చెప్పారు. వ్యాఖ్యలు ఆమెను బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నానన్నారు. -
మంత్రి ఆస్తులపై ఐటీ ఆకస్మిక దాడులు
-
మంత్రి ఆస్తులపై ఐటీ ఆకస్మిక దాడులు
-
మంత్రి ఆస్తులపై ఐటీ ఆకస్మిక దాడులు
చెన్నై: రాష్ట్ర మంత్రి విజయభాస్కర్ కి సంబంధించిన పలు ఆస్తులు, ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు శుక్రవారం వేకువజామున సోదాలు చేపట్టారు. జయలలిత మరణంతో ఆర్కే నగర్ నియోజవర్గానికి ఈ నెల 12న ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార అన్నాడీఎంకే మంత్రులు, నేతలు విచ్చలవిడిగా డబ్బును పంచుతున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వైద్యశాఖమంత్రి విజయభాస్కర్ ధన ప్రవాహంతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని నాలుగు కేసులు నమోదయ్యాయి. మంత్రి విజయభాస్కర్ నేరుగా రంగంలోకి దిగి డబ్బులు పంచుతూ ఓటర్లను కొంటున్నారని ఫిర్యాదులు అందినట్లు ఐటీ శాఖ దర్యాప్తు బృందానికి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇప్పటివరకూ తిరుచ్చి, పుదుకొట్టాయ్ జిల్లాల్లో 13 ప్రాంతాల్లో, చెన్నైలో 19 చోట్ల తనిఖీలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇటీవల కాలంలో ఐటీశాక సోదాలు చేపట్టిన ఏకైక మంత్రి విజయభాస్కర్ కావడం గమనార్హం. కొన్ని కాలేజీలలో, మంత్రి ఇళ్లు, గెస్ట్ హౌస్ లు, ఆయనకు అత్యంత సన్నిహితులకు సంబంధించిన ఆస్తులపై నిఘా పెంచామని.. పట్టుబడ్డ నగదు, ఆస్తుల వివరాలపై త్వరలో ప్రకటన వెల్లడిస్తామని తెలిపారు. అధికార అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోయిన తరుణంలో విజయభాస్కర్ వెలుగులోకి వచ్చారు. ఆపై మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ ఇంట్లో సోదాలు ఐటీశాఖ అధికారులు రాష్ట్ర మంత్రులు, పారిశ్రామికవేత్తల ఆస్తులతో పాటు నటుల ఇళ్లపైనా దాడులు నిర్వహిస్తోంది. శశికళ వర్గానికి మద్దతు ప్రకటించిన మరుసటి రోజే ప్రముఖ నటుడు శరత్ కుమార్ కొట్టివక్కంలోని ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. మంత్రి విజయభాస్కర్ ఇళ్లు, ఆస్తులతో పాటు నటుడు శరత్ కుమార్ కు చెందిన ఆస్తులు, మరికొందరు ప్రముఖ పారిశ్రామిక వేత్తల ఇళ్లలోనూ ఐటీశాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. నేటి వేకువజాము నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నైతో పాటు తిరుచ్చి, పుదుకొట్టాయ్ జిల్లాల్లో దాదాపు 30 చోట్ల తనిఖీలు చేపట్టారు. శశికళ వర్గానికి మద్దతు ప్రకటించిన మరుసటి రోజే ప్రముఖ నటుడు శరత్ కుమార్ కొట్టివక్కంలోని ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించటం గమనార్హం. -
పన్నీర్ సెల్వానికి మంత్రి భారీ ఝలక్
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్ భారీ ఝలక్ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై దర్యాప్తు కోసం పోరాడుతున్న పన్నీర్ సెల్వం నేటి సాయంత్రం తన మద్దతుదారులతో సమావేశం కాగా, మరోవైపు అన్నాడీఎంకే అధికార వర్గ నేతలు పన్నీర్ పై విరుచుకు పడుతున్నారు. మంత్రి విజయభాస్కర్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నంత వరకూ అమ్మ జయలలిత మరణంపై ఎలాంటి అనుమానాలు లేవనెత్తని ఆమె వీర విధేయుడు పన్నీర్ సెల్వం.. అధికారం నుంచి తప్పుకోవాల్సి రావడంతో విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. అపోలో ఆస్పత్రిలో జయకు ఎలాంటి చికిత్స అందించారన్న విషయంలో సీఎం పదవిలో ఉండగా పన్నీర్ సెల్వానికి ఎందుకు గుర్తురాలేదో చెప్పాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అమ్మకు అందించిన ట్రీట్మెంట్, ఆమె మృతిపై అధికారం కోల్పోయిన క్షణం నుంచి పన్నీర్ వదంతులు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో ఏదైనా తప్పు అని తేలితే మాత్రం తొలి దోషి మాత్రం మాజీ సీఎం పన్నీరే అవుతారని, అందరికీ ఆయనే జవాబు చెప్పాల్సి ఉంటుందని విజయభాస్కర్ వ్యాఖ్యానించారు. మరోవైపు పన్నీర్ సెల్వం భవిష్యత్ కార్యాచరణపై తన నివాసంలో ఆదివారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జయలలిత మృతిపై దర్యాప్తు చేపట్టకపోతే మార్చి 8న తన మద్దతుదారులు, పార్టీ నేతలతో కలిసి నిరాహార దీక్షకు దిగుతానని పన్నీర్ సెల్వం హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలైన అన్నాడీఎంకే తమదేనని ఓపీఎస్ వర్గం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి సి.విజయభాస్కర్ మాజీ సీఎం పన్నీర్ అధికారం కోసం కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.