C vitamin
-
25 లక్షల సీ-విటమిన్ టాబ్లెట్ల పంపిణీ: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియోజకవర్గంలోని 1.60 లక్షల కుటుంబాలకు 25 లక్షల సీ–విటమిన్ టాబ్లెట్లు అందించారు. ఒక్కో కుటుంబానికి 15 చొప్పున వీటిని పంపిణీ చేశారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ టాబ్లెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. (ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: మహేష్) చంద్రగిరి నియోజకవర్గంలోసి విటమిన్స్ టాబ్లేడ్స్ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్డు లేని వారికీ ఉచిత రేషన్ చంద్రగిరి నియోజకవర్గంలో రేషన్‌కార్డులేని కుటుంబాలు 6 వేలు ఉన్నాయని, వాటికి ఉచితంగా రేషన్ అందించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం తుమ్మలగుంటలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆదేశించారు. (చంద్రబాబుకు నమస్కరిస్తున్నా: చెవిరెడ్డి) -
కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలంటే!
న్యూఢిల్లీ : కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య నిపుణులు గత రెండు నెలలుగా చెబుతున్న విషయాలను వింటూనే ఉన్నాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి వైరస్ బారిన పడవచ్చు. అప్పుడు ఆ వైరస్‌ను తట్టుకొని ప్రాణాలను నిలబెట్టుకోవడం అందరి అవసరం. మరి అందుకు ఏం చేయాలి. మనుషుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లయితే ఒక్క కరోనానే కాదు, పలు రకాల వైరస్‌లను, బ్యాక్టీరియాలను తట్టుకొని బతికి బట్టకట్టవచ్చు. సహజంగా ఆరోగ్యవంతంగా ఎదుగుతున్న పిల్లల్లో, యువతీ యువకుల్లో రోగ నిరోధక శక్తి సహజంగా ఎక్కువగా ఉంటుంది. వృద్ధులవుతున్నా కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గుతూ వస్తుంది. ఆ శక్తి తగ్గకుండా పలు రకాల విటమిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. సీ విటమిన్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని గత రెండు నెలలుగా తెగ ప్రచారం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సీ విటమిన్ సప్లిమెంట్లు, సైట్రిస్ కలిగిన పండ్లను తెగతింటున్నారు. అయితే ఇది ఒక నమ్మకమే తప్పా సీ విటమిన్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందనడానికి శాస్త్ర విజ్ఞానపరంగా ఎలాంటి ఆధారాలు లేవని బిర్మింగమ్ యూనివర్శిటీ ‘ఇమ్యునిటీ అండ్ ఏజింగ్’ విభాగంలో పని చేస్తోన్న ప్రొఫెసర్ జానెట్ లార్డ్ చెప్పారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వ్యాయామమని, ఏ రకమైన వ్యాయామమైనా ఎంతో కొంత ఉపయోగకరమని ఆయన తెలిపారు. వ్యాయామం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచే ‘టీ–సెల్స్’ను శరీరంలో పెంచడంతోపాటు శరీరమంతా సంచరిస్తూ ఇన్ఫెక్షన్లను ఎప్పటికప్పుడు గుర్తించి రోగ నిరోధక వ్యవస్థకు సంకేతాలు పంపించే ‘మాక్రోఫేజెస్’ ఉత్పత్తి కూడా వ్యాయామం వల్ల పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలిందని ఆయన చెప్పారు. పైగా వ్యాయామం వల్ల వృద్ధాప్యం కూడా తొందరగ రాదని ఆయన తెలిపారు. 60 ఏళ్లు దాటిన వారు రోజుకు పది వేల మెట్లు ఎక్కడానికి సమానమైన దూరం నడిచినట్లయితే రోగ నిరోధక శక్తి బాగా పెరగుతుందని ఆయన చెప్పారు. (కరోనా వైరస్‌తో కొత్త లక్షణాలు) ఇక డైట్లో ఉప్పును బాగా తగ్గించాలని, మోతాదుకు మించి ఉప్పును తీసుకున్నట్లయితే అది రోగ నిరోధక శక్తిని దెబ్బ తీస్తుందని సస్సెక్స్ యూనివర్శిటీలో ఇమ్యునాలోజీ విభాగం లెక్చరర్ జెన్నా మాక్సియోచి చెప్పారు. ఆల్కహాల్ కూడా మోతాదుకు మించి తీసుకోరాదని, అది కూడా రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుందని ఆయన తెలిపారు. డీ విటమిన్ కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ‘బ్రిటిశ్ సొసైటీ ఆఫ్ ఇమ్యునాలోజీ’ అధ్యక్షుడు, లండన్ యూనివర్శిటీ కాలేజ్ ఇమ్యునాలోజీ ప్రొఫెసర్ అర్నే అక్బర్ తెలిపారు. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులో విటమిన్ డీ ఉంటుంది. ఉదయం పూట ఎండలో నిలబడినా డీ విటమిన్ వస్తుంది. రోగ నిరోధక శక్తిలో డీ విటమిన్ తర్వాత ఈ విటమిన్, జింక్ ప్రధాన పాత్రను పోషిస్తాయి. కాజు, పల్లీలు, బాదం గింజలతోపాటు విజిటెబుల్ ఆయిల్స్, సోయాబిన్, సన్ ఫ్లవర్ ఆయిల్స్ ద్వారా ఈ విటమిన్ లభిస్తుందని పలువురు వైద్యులు తెలిపారు. మాంసం, నత్త గుల్లలు, పాల ఉత్పత్తుల్లో, బలవర్థకమైన తృణ ధాన్యాల్లో జింక్ లభిస్తుందని వారు తెలిపారు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా వీటిన్నింటిని తింటున్నాం కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుందనుకుంటే పొరపాటని, ఎంతోకొంత శారీరక శ్రమ ఉంటేనే రోగ నిరోధక శక్తిపై విటమిన్ల ప్రభావం ఉంటుందని, కొన్ని లక్షల కోట్ల వైరస్‌లను, బ్యాక్టీరియాలను ఎదుర్కోవాలంటే శారీరక దృఢత్వం అవసరమని వైద్యులంతా సూచిస్తున్నారు. -
కరోనా వైరస్‌కు ‘సీ’ విటమిన్
సాక్షి, న్యూఢిల్లీ: చలి కాలంలో జలుబు నుంచి తప్పించుకోవడానికి విటమిన్ ‘సీ’ మంచి మందని చాలా మంది వైద్యులు, ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకని నేడు ప్రపంచవ్యాప్తంగా 6,500 కోట్ల రూపాయల విటమిన్ ‘సీ’ సప్లిమెంట్ల వ్యాపారం కొనసాగుతోంది. ఇది 2024 సంవత్సరం నాటికి ఎనిమిది వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందన్నది ఓ అంచనా. నోబెల్ బహుమతి గ్రహీత లైనస్ పాలింగ్ 1970లో విటమిన్ ‘సీ’ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆయన స్వయంగా ప్రతి రోజు మూడు గ్రాముల సీ విటమిన్ తీసుకునేవారు. ఓ మధ్యస్థాయి నారింజ పండులో 70 ఎంజీలు, మధ్యస్థాయి టమోటాలో 20 ఎంజీల సీ విటమిన్ ఉంటుంది. సీ విటమిన్లు తీసుకోవడం వల్ల చాలా వైరస్లు దూరంగా ఉంటాయన్న వాదనతో ఎక్కువ మంది శాస్త్రవేత్తలు అంగీకరించకపోయినా, సీ విటమిన్ వల్ల తెల్ల రక్త కణాలు పెరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే వాదనతో ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఏకీభవించారు. డిమెన్షియా లాంటి మతి మరపు వ్యాధులను తగ్గించడంలో కూడా ఈ విటమిన్ ఉపయోగపడుతుందని వాదిస్తున్న వారూ ఎక్కువ మందే ఉన్నారు. (కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన సర్కార్) ఈ నేపథ్యంలో కొవిడ్ వైరస్‌ను సీ విటమిన్ సప్లిమెంట్లు అరికడతాయనే వాదన వైద్యుల ముందుకు వచ్చింది. దీంతో ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్‌లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. వుహాన్ యూనివర్శిటీలోని ఝాంగ్నాన్ హాస్పటల్లో 120 మంది కొవిడ్ వైరస్ బాధితులకు వరుసగా వారం రోజుల పాటు రోజుకు 24 గ్రాముల (అధిక డోసు) సీ విటమిన్ సప్లిమెంట్లు ఇస్తూ వచ్చారని యూనివర్శిటీ వైద్య వర్గాలు తెలిపాయి. అయితే వారి ప్రయోగ విశేషాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. (‘కరోనాపై భయపడాల్సిన అవసరం లేదు’) -
పచ్చిమామిడిలో పోషకాలు పుష్కలం!
పచ్చి మామిడికాయలో సి, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి దీనిని తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇందులో ప్రి-బయొటిక్ డైటరీ ఫైబర్, మినరల్స్, పోలీ ఫినాలిక్ ఫ్లేవనాయిడ్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని ఇనుమడింపజేయడంలో ఎంతో ఉపకరిస్తాయి. 100 గ్రా. మామిడిలో 156 మిల్లీ గ్రాముల పొటాసియం ఉంటుంది. ఇది శరీర కణాలను బలోపేతం చేసి, అవసరమైన రసాయనాల విడుదలను సుగమం చేస్తుంది. రక్తపోటును అదుపు చేసి గుండెను పదిలంగా ఉంచుతుంది. పచ్చి మామిడి గ్యాస్ట్రో ఇంటస్టైనల్ డిజార్డర్స్ బారి నుంచి కాపాడుతుంది. కొత్త రక్తకణాల నిర్మాణానికి సైతం దోహదపడుతుంది.అయితే మరీ ఎక్కువ తీసుకుంటే గొంతులో మంట, అజీర్తి, విరేచనాల వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి రోజుకి రెండుకి మించి తినకూడదు. తిన్న తర్వాత వెంటనే మంచినీళ్లు తాగాలి. అలాగే జిగురును పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతే వీటిని తినాలి. ఎందుకంటే ఆ జిగురు కడుపులోకి వెళ్తే గ్యాస్ట్రిక్, పేగు సంబంధిత సమస్యలు వస్తాయి. నోటి ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. - సుజాత స్టీఫెన్ న్యూట్రిషనిస్ట్