పచ్చిమామిడిలో పోషకాలు పుష్కలం! | The abundance of nutrients in green mango | Sakshi
Sakshi News home page

పచ్చిమామిడిలో పోషకాలు పుష్కలం!

Published Fri, Apr 17 2015 11:21 PM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM

పచ్చిమామిడిలో పోషకాలు పుష్కలం! - Sakshi

పచ్చిమామిడిలో పోషకాలు పుష్కలం!

పచ్చి మామిడికాయలో సి, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి దీనిని తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇందులో ప్రి-బయొటిక్ డైటరీ ఫైబర్, మినరల్స్, పోలీ ఫినాలిక్ ఫ్లేవనాయిడ్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని ఇనుమడింపజేయడంలో ఎంతో ఉపకరిస్తాయి. 100 గ్రా. మామిడిలో 156 మిల్లీ గ్రాముల పొటాసియం ఉంటుంది. ఇది శరీర కణాలను బలోపేతం చేసి, అవసరమైన రసాయనాల విడుదలను సుగమం చేస్తుంది.

రక్తపోటును అదుపు చేసి గుండెను పదిలంగా ఉంచుతుంది. పచ్చి మామిడి గ్యాస్ట్రో ఇంటస్టైనల్ డిజార్డర్స్ బారి నుంచి కాపాడుతుంది. కొత్త రక్తకణాల నిర్మాణానికి సైతం దోహదపడుతుంది.అయితే మరీ ఎక్కువ తీసుకుంటే గొంతులో మంట, అజీర్తి, విరేచనాల వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి రోజుకి రెండుకి మించి తినకూడదు. తిన్న తర్వాత వెంటనే మంచినీళ్లు తాగాలి. అలాగే జిగురును పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతే వీటిని తినాలి. ఎందుకంటే ఆ జిగురు కడుపులోకి వెళ్తే గ్యాస్ట్రిక్, పేగు సంబంధిత సమస్యలు వస్తాయి. నోటి ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
                          -    సుజాత స్టీఫెన్ న్యూట్రిషనిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement