Cabbie
-
పబ్లిక్ టాయ్‌లెట్ గోడపై యువతి సెల్ నంబర్
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): క్యాబ్ చార్జీ ఎక్కువ ఇవ్వనందుకు ప్రయాణికురాలి సెల్‌నంబర్‌ను పబ్లిక్ టాయ్‌లెట్ గోడపై రాసి వేధింపులకు కారణమైన డ్రైవర్‌ను సైబరాబాద్ షీ బృందాలు అరెస్టు చేశాయి. ఓ మహిళ కోకాపేట్ నుంచి మాదాపూర్‌కు క్యాబ్ బుక్ చేసిన సమయంలో ప్రయాణ చార్జీ రూ.200 చూపించగా డ్రైవర్ ఇతర మార్గాల్లో తిప్పి రూ.800 చార్జీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు అంగీకరించని ఆమె రూ.200 మాత్రమే ఇచ్చింది. దీనిని మనస్సులో పెట్టుకున్న డ్రైవర్ ఆమె సెల్‌ఫోన్ నంబర్‌ను పబ్లిక్‌టాయ్‌లెట్ గోడపై రాయడంతో బాధితురాలికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. దీంతో బాధితురాలు డ్రైవర్‌పై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అతను నేరం అంగీకరించాడు. కరాటే శిక్షణ కోసం వెళ్లిన తన కుమార్తెకు మాస్టర్ అశ్లీల దృశ్యాలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడంటూ వాట్సాప్ ద్వారా ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో షీ బృందాలు నిందితుడిని పట్టుకున్నాయి. గత రెండు వారాల్లో 47 మంది ఈవ్‌టీజర్లపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశాయి. సైబరాబాద్ షీ టీమ్ ఇన్చార్జ్ అనసూయ ఈవ్‌టీజర్లకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. సామాజిక మాధ్యమాల ద్వారా 64 ఫిర్యాదులు అందగా 47 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
మహిళా ప్యాసింజర్ని వీడియోలు తీసి..
న్యూఢిల్లీ: క్యాబ్ డ్రైవర్ల తీరు మారడం లేదు. పలు సంఘటనలు.. వాటి అనంతర పరిణామాలు ఇప్పటికే వెలుగుచూస్తున్నా కనీసం వాటిని చూసైనా తమ ఆలోచనలు మార్చుకోవడం లేదు. ఆఫీసుకు వెళ్తున్న ఓ మహిళ ఉద్యోగిని తన ఫోన్లో వీడియో తీస్తూ ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ తప్పిదానికి పాల్పడ్డాడు. అసభ్యంగా మాటలంటూ.. ఆమెను చూసి తప్పుడు సంకేతాలు చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమె చాణక్యపురిలో ఉన్న తన కార్యాలయానికి వెళ్లేందుకు ఓ ఓలా క్యాబ్ ను బుక్ చేసుకుంది. అయితే వాళ్లు వెళుతుండగా అతడు కార్లోని అద్దంలో చూస్తూ ఫోన్లో కెమెరా ఆన్ చేసి వీడియో తీయడం ఆమె గమనించింది. ఎందుకలా చేస్తున్నావని ప్రశ్నిస్తే తాను ఫొటోలు తీయడం లేదని తన కూతురు ఫొటోలు చూస్తున్నానని అబద్ధం చెప్పాడు. దీంతో ఆమె అతడి చేతిలో నుంచి ఫోన్ లాక్కోని చూడగా అందులో ఆమె కొన్ని ఫొటోలు, వీడియోలు దర్శనం ఇచ్చాయి. కోపంతో ఊగిపోయిన ఆ మహిళ పోలీసులకు చెప్పింది. అసలు ఇలాంటి డ్రైవర్లను ఎలా పెట్టుకుంటారో అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.