Cadapa
-
చిత్తూరు, అనంత జట్ల జయకేతనం
కడప: ఏసీఏ అండర్–23 అంతర్ జిల్లాల మల్టీడేస్ క్రికెట్ టోర్నమెంట్లో చిత్తూరు, అనంతపురం జట్లు జయకేతనం ఎగురవేశాయి. కడప నగరంలోని కేఓఆర్ఎం మైదానంలో 41 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం బరిలోకి దిగిన చిత్తూరు జట్టు 11.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 72 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జట్టులోని శశాంక్ శ్రీవాత్సవ్ 29 పరుగులు చేశాడు. కర్నూలు బౌలర్ సాత్విక్ 2 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 54.4 ఓవర్లలో 220 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని సాయిసూర్యతేజారెడ్డి 140 పరుగులు చేశాడు. చిత్తూరు బౌలర్లు ఆశిష్‌రెడ్డి 4, మల్లేశన్ 3 వికెట్లు తీశారు. కాగా చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 550 పరుగులు చేయగా, కర్నూలు జట్టు 226 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిత్తూరు జట్టు 176 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. ‘అనంత’ విజయం కేఎస్ఆర్ఎం మైదానంలో 282 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు 64.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. జట్టులోని దత్తారెడ్డి 87 పరుగులు చేశాడు. కడప బౌలర్లు అస్లాం 3, విజయ భువనేంద్ర 2, ఆదిల్ హుస్సేన్ 2, సాయికుమార్‌రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 38.4 ఓవర్లలో 172 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని శివకేశవరాయల్ 24 పరుగులు చేశాడు. అనంతపురం బౌలర్లు లోహిత్సాయికిశోర్ 6 వికెట్లు, మల్లికార్జున 3 వికెట్లు తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో అనంత జట్టు 207 పరుగులు చేయగా, కడప 171 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అనంతపురం జట్టు 182 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. -
బాబు వెంటే కరువు, అనావృష్టి
రాజంపేట రూరల్: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన వెంటే కరువు, అతివృష్టి, అనావృష్టి తోడుగా వస్తాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఎద్దేవా చేశారు. స్థానిక ఆకేపాటి భవన్లో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గిట్టుబాటు ధరలేక రైతులు ఎంతో నష్టపోతున్నారని పేర్కొన్నారు. టీడీపీ మెనిఫెస్టోలో రూ.500కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని పొందుపరచారని, ఆ మాటను నిలుపుకోలేదని విమర్శించారు. గుంటూరులో మిర్చి రైతుల కోసం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు దీక్షకు ఎంతో స్పందన వచ్చిందన్నారు. అలాగే రాయలసీమలో పసుపు, మామిడి, అరటి తదితర పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు కుదేలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల తరఫున పోరాడుతున్న జగన్‌పై తమ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గంచే విమర్శలు చేయించడం చంద్రబాబు మానుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రంలో నీటి జలాలు పూర్తిస్థాయిలో అడుగంటిపోయాయన్నారు. మిర్చి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంలో చలనం వస్తోందంటే అది జగన్మోహన్రెడ్డి వల్లేనని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
అంత్యక్రియలను అడ్డుకున్నారు
► విప్ మేడా ప్రోద్బలంతో పోలీసుల అత్యుత్సాహం ►విద్యుదాఘాతంతో మృతిచెందాడని బలవంతంగా కేసు నమోదు ►కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి కడప అర్బన్/సిద్దవటం: కుటుంబ పెద్ద అకాలమరణం చెందడంతో కన్నీరుమున్నీరవుతూ కుటుంబసభ్యులు అంత్యక్రియలు తీసుకువెళుతున్న సమయంలో అధికారపార్టీ నేతలు తమ దర్పాన్ని ప్రదర్శించి అడ్డుకున్నారు. వారికి పోలీసులు సైతం వత్తాసు పలికారు. మరోవైపు కుటుంబసభ్యులు తమకు కేసు అవసరం లేదని నెత్తినోరు మొత్తుకుని చెబుతున్నా విద్యుత్‌షాక్‌తో మరణించాడని బలవంతంగా కేసు బనాయించి పోస్టుమార్టం చేయించాలని ప్రయత్నించారు. ఈ సంఘటన సిద్దవటం మండలం పొన్నవోలు గ్రామపంచాయతీ వెంకటాంపల్లెలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. వెంకటాంపల్లెకు చెందిన గువ్వల ఓబయ్య (55)బుధవారం తెల్లవారుజామున పొ లం పనికి వెళ్లి అక్కడ ఆకస్మికంగా మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు ఓబులయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. చివరిచూపు కోసం సాయంత్రం దాకా అలాగే ఉంచారు. బంధుమిత్రులు వచ్చి మృతదేహానికి నివాళులరి్పంచారు. అనంతరం సాయంత్రం అంత్యక్రియలకు తీసుకు వెళుతున్న సమయంలో రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి అనుచరులు ఆగమేఘాల మీద వచ్చి అడ్డుకున్నా రు. విద్యుదాఘాతంతో మృతిచెందిన వ్యక్తిని ఎందుకు కేసు పెట్టకుండా అంత్యక్రియలకు తీసుకువెళుతున్నారని గదమాయించారు. ఈక్రమంలో తెల్లబోయిన మృతుని కుమారుడు ఓబులయ్య, బంధువులు ఏం చేయాలో పాలుపోక తమకెందుకు కేసు అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ టీడీపీ నాయకులు ఆగకుండా సిద్దవటం పోలీసులను సంఘటనాస్థలానికి ఫోన్ చేసి మరీ పిలిపిం చారు. షాక్‌తో ఓబయ్య మృతిచెందాడని, కేసు నమోదు చేయాల్సిందేనని బలవంతంగా ఓబులయ్య చేతుల మీదుగా ఫిర్యాదు చేయించారు. అనంతరం కేసు నమోదు చేయడం పోలీసుల వంతైంది. ఈ సందర్భం గా ఓబులయ్య విలేకరులతో మాట్లాడుతూ పోస్టుమార్టం ఎందుకు చేయించాలి? తమకు కేసు వద్దని కోరుకుంటున్నప్పటికీ బాధితుని ఆవేదన అరణ్య రోదనగా మారింది. పోస్టుమార్టం కోసం మృతదేహం పోలీసులు మృతదేహాన్ని ఖననం చేయనీయకుండా పోలీసుస్టేషన్‌కు బుధవారం రాత్రి తీసుకొచ్చారు. అక్కడ కేసు బలవంతంగా నమోదు చేయించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. గురువారం పోస్టుమార్టం నిర్వహిస్తారని సమాచారం. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఒంటిమిట్ట సీఐ రవికుమార్ తెలిపారు. ఆకేపాటి పరామర్శ బుధవారం రాత్రి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి స్వయంగా గ్రామానికి చేరుకుని ఓబయ్య మృతికి సంతాపం తెలిపారు. ఓబులయ్యను, కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్బంగా ఆకేపాటి మాట్లాడుతూ ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా అనవసరంగా పోలీసులు టీడీపీ వారు చెప్పారని, మృతదేహాన్ని అంత్యక్రియలకు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఇటువంటి సంఘటనలు వారి కుటుంబాలకు జరగవా? అని అన్నారు. కుటుంబసభ్యులు, బంధువులు అందరూ వచ్చి నివాళులర్పించి మృతదేహాన్ని ఖననం చేయడానికి తీసుకు వెళుతున్న సమయంలో అడ్డగించడం ఏమిటని ఆయన పోలీసులను ప్రశ్నించారు. -
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
కడప: ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన కడప పోలీసులు ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.