call bullying
-
నయీం గ్యాంగ్ పేరుతో ఆకతాయిల బెదిరింపులు ?
ములుగు : పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ పేరుతో కొంతమంది ఆకతాయిలు మండల కేంద్రానికి చెంది న ఓ ఫర్టిలైజర్ వ్యాపారికి బెదిరింపు కాల్ చేసినట్లు తెలిసింది. రెండు నెలల క్రితం గ్యాంగ్‌స్టర్ నయీమ్ పోలీసుల చేతిలో ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నయీ మ్ కథ ముగిసింది. అయినా కొంతమంది ఆకతాయిలు న యీమ్ గ్యాంగ్ పేరుతో ములుగు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారిని డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు తెలి సింది. దీంతో బాధిత వ్యాపారి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్సీకి ‘డాన్’ నుంచి కాల్
రూ. 10 కోట్లు ఇవ్వాలని హుకుం కుమారుడిని చంపేస్తానని బెదిరింపు పోలీసులను ఆశ్రయించిన రేవణ్ణ కుమారుడితో పాటు ‘లక్ష్మణ’ చిత్ర దర్శకుడికి పోలీసు భద్రత బెంగళూరు: అధికార కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడు హెచ్.ఎం రేవణ్ణకు మాఫియా డాన్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. రూ.10 కోట్ల సొమ్ము ఇవ్వకపోతే అతని కుమారుడు, నటుడు అనూప్తోపాటు ‘లక్ష్మణ’ చిత్ర దర్శకుడు చంద్రను చంపుతాననేది సదరు కాల్ సారాంశం. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితులకు పోలీసు భద్రతను పెంచి కేసును దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు... జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఈనెల 11న హెచ్.ఎం రేవణ్ణ బెళగావికి వెళ్లారు. అక్కడి పనులను ముగించుకుని అదే రోజు సాయంత్రం బెంగళూరుకు రావడానికి స్థానిక విమానాశ్రయంలో వేచి ఉన్న సమయంలో సుమారు 4:40గంటలకు ఆయన సెల్‌ఫోన్‌కు ఒక కాల్ వచ్చింది. అయితే సదరు నంబర్ హెచ్.ఎం రేవణ్ణ సెల్‌ఫోన్ స్క్రీన్‌పై కనిపించలేదు. అయినా రేవణ్ణ కాల్ రిసీవ్ చేసుకున్నారు. వెంటనే...‘నేను రవి పూజారి. బాగున్నారా. మీ కుమారుడు నటిస్తున్న లక్ష్మణ సినిమాకు భారీగానే ఖర్చు పెట్టినట్లు ఉన్నారు. నాకు రూ.10 కోట్లు ఇవ్వండి. అకౌంట్ నంబర్ పంపిస్తాను. లేదంటే...’ అని బెదిరించాడు. దీంతో కోపగించుకున్న రేవణ్ణ కాల్‌ను కట్ చేశారు. అనంతరం సాయంత్రం 5:10 గంటలకు మరోసారి కాల్ చేసి నేను చెప్పినంత డబ్బు ఇవ్వక పోతే నీ కుమారుడితో పాటు చిత్రదర్శకుడి ప్రాణాలు దక్కవు.’ అని బెదిరించారు. ఫోన్లో ఏ విషయమూ చెప్పని రేవణ్ణ నేరుగా బెంగళూరు చేరుకుని నగర కమిషనర్ మేఘరిక్‌కు పరిస్థితి మొత్తం వివరించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేవణ్ణ, అతని కుమారుడు అనూప్, లక్ష్మణ చిత్ర దర్శకుడు చంద్రకు పోలీసు భద్రత పెంచారు. ఈ బెదిరింపు కాల్ విషయమై రేవణ్ణ మాట్లాడుతూ...‘నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదు. భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మిస్తుండటం వల్లే బెదిరింపు కాల్ వచ్చింది. నేను ఇలాంటి వాటికి భయపడను. పోలీసులు నాకు భద్రత పెంచడమే కాకుండా నా కుమారుడు అనూప్‌తో పాటు చిత్రదర్శకుడు చంద్రుకు పోలీసు భద్రత కల్పించారు.’ అని అన్నారు. ఇదిలా ఉండగా, రేవణ్ణ నివసిస్తున్న ప్రాంతమైన మహాలక్ష్మీలే అవుట్ పోలీస్ స్టేషన్లో బెదిరింపుకాల్ విషయమై కేసు నమోదైంది. అనంతరం ఈ కేసు సీసీబీకు బదిలీ అయ్యింది. ప్రస్తుతం సీసీబీ పోలీసులు బెళగావి పోలీసు సహకారంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రేపిస్టులకు రాజకీయ అండ!
ప్రధాన నిందితుడి తండ్రి బీఎస్పీ నేత బాధితురాలికి బెదిరింపు కాల్ కాంగ్రెస్ నేత హస్తం ? సీపీకు ఫిర్యాదు చేసిన యువతి కామాంధులను ఎన్కౌంటర్ చేయాలంటూ విద్యార్థుల డిమాండ్ నిందితుల కోసం ఇతర రాష్ట్రాల్లోనూ గాలింపు బెంగళూరు : నగరంలో పీజీ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కామాంధులకు రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. అందుకే వారు చాకచక్యంగా తప్పించుకుంటున్నారని విద్యార్థులు విమర్శిస్తున్నారు. నిందితులను ఎన్కౌంటర్ చేయాలంటూ రాష్ర్ట వ్యాప్తంగా విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. మంగళూరు విశ్వవిద్యాలయంలో పీజీ చేస్తున్న ఆ యువతి వారం రోజులు సెలవులు రావడంతో బెంగళూరులో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చిన సమయంలో ఈ ఘోరం జరిగింది. కేసు తప్పుదోవ..: ఈ కేసులో ప్రధాన నిందితుడు నాసీర్ అహ్మద్ అలియాస్ హైదర్ (24) తండ్రి బహుద్దూర్ బహుజన సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ) ప్రముఖ నేత. ఆయన ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. దీంతో కేసు తప్పుదోవపట్టించడానికి పలువురు రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలున్నాయి. కేజీ హళ్ళి నివాసి వాసీం (25), మహ్మద్ ఆలీ (26), ఫ్రేజర్‌టౌన్ నివాసి ఆతీష్ (26), ఇమ్తియాజ్ (22) ఆ యువతిపై అత్యాచారం చేసినట్లు ప్రధాన నిందితుడు నాసీర్ అహ్మద్ తెలిపారు. దీంతో పోలీసులు ఆ నలుగురి కోసం పక్క రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నట్లు బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ శరత్చంద్ర బుధవారం తెలిపారు. నాసీర్ అహ్మద్‌పై గతంలోనే భారతీనగర పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైందని, మిగిలిన నిందితులపై ఏవైనా కేసులు ఉన్నాయా అని ఆరా తీస్తున్నామని చెప్పారు. నిందితులు అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పాత కార్లు విక్రయించే వ్యాపారం చేసేవారన్నారు. బెదిరింపు ఫోన్.. : బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌ను బాధితురాలు, తన స్నేహితుడు బుధవారం సాయంత్రం కలుసుకున్నారు. సుమారు అరగంట సేపు మాట్లాడారు. తనకు గుర్తు తెలీని వ్యక్తులు ఫోన్ చేస్తున్నారని, కేసు ఉపసంహరించుకోకుంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోయినట్లు సమాచారం. కాగా అధికార పార్టీకి చెందిన ఓ నేతే ఇలా బెదిరిస్తున్నానే ఆరోపణలున్నాయి. సీఐపై వేటు : యువతిపై అత్యాచారం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇక్కడి పులకేశీనగర పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహ్మద్ రఫీక్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.