Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On TDP Mahanadu1
మహానాడు ‘ఆత్మ’కథ!

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించుకొని చనిపోయిన వారి ఆత్మలను ఆవాహన చేయొచ్చన్న మాట. తెలుగుదేశం పార్టీ మహానాడును చూసిన తరువాత ఈ సంగతి తెలిసి వచ్చింది. ఆవాహన చేసుకున్న ఆత్మలతో మన పుర్రెకు తోచిన విధంగా మాట్లాడించవచ్చు. చరిత్రను చెరిపేయవచ్చు. వక్రీక రించవచ్చు. నిజాలపై నీళ్లు చల్లవచ్చు. అసత్యాలకు ఆజ్యం పోయవచ్చు. మన మేధోజనిత స్క్రిప్టును చనిపోయిన వారి ఆత్మలతో చదివించవచ్చు. కొత్త పుంతలు తొక్కిన ఈ టెక్నాలజీ వాడకాన్ని చూసిన తర్వాత వింత వింత అనుమానాలు కలుగు తున్నాయి. ముందు ముందు మహాత్ముడి ఆత్మను ఆవాహన చేయించి గాడ్సేకు కితాబునిప్పించే రోజులు కూడా వస్తాయేమో! గాడ్సే భక్తులు పుట్టుకొస్తున్న కాలం కదా ఇది.మహానాడు వేదికపై స్క్రీన్‌ మీద కనిపించిన ఎన్టీఆర్‌ బొమ్మ విచిత్రంగా మాట్లాడుతుంది. తెలుగుదేశం పార్టీ ఆశయాలను తన తర్వాత చంద్రబాబు గొప్పగా కొనసాగిస్తున్నారట! హైదరా బాదుకు తాను సాంస్కృతిక వారథిగా నిలబడితే, చంద్రబాబు సాంకేతిక వారథిగా నిలిచిపోయారట! రెండు రూపాయలకు కిలో బియ్యంతో తాను పేదవారి కడుపు నింపితే, ‘పి–4’ పథకం తెచ్చి పేదరికాన్ని పారద్రోలేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట! ఎన్టీఆర్‌ బొమ్మలోని కృత్రిమ ఆత్మ పలికిన పలుకులే ఇవి. ఎన్టీఆర్‌కు వారసుడు ఎవరో కూడా ఆత్మ తేల్చే సింది. తన వారసత్వానికి వన్నె తెస్తున్న లోకేష్‌ను ‘భళా మన వడా’ అని కూడా ఏఐ ఆత్మ ఆశీర్వదించింది.ఎన్టీఆర్‌ జీవించి ఉన్న రోజుల్లో ఒకసారి తన వారసునిగా బాలకృష్ణ పేరును ఆయన ప్రకటించిన సంగతి అప్పటి వారికి గుర్తుండే ఉంటుంది. మహానాడులో ఎన్టీఆర్‌ ఆత్మ ప్లేట్‌ మారు స్తుందని బాలయ్యకు ముందే తెలుసా? అందుకే ఈ కార్య క్రమానికి డుమ్మా కొట్టారా? మహానాడు కంటే అతి ముఖ్యమైన మరో కార్యంలో లగ్నమై ఉన్నందువల్ల కూడా రాకపోయి ఉండవచ్చు. ఒక్క బాలయ్యే కాదు... నందమూరి వంశాంకురాలేవీ ఈ జాతరలో కనిపించలేదని మీడియా రిపోర్టులు వెల్లడి స్తున్నాయి. ఈ మహానాడులో నారా వారసుడే చక్రం తిప్పు తారని అందరూ ఊహించిందే. కాకపోతే పార్టీని శాసించే స్థాయి తనదేనని ఆయనే స్వయంగా ప్రకటించుకుంటారని ఎవరూ ఊహించలేదు.పార్టీ కోసం లోకేష్‌ ఆరు శాసనాలను ప్రకటించారు. శాసనమంటే అందరూ శిరసా వహించవలసిందే కదా! ఆరు శాసనాల పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి. సామాన్య కార్యకర్తలు ఆ పేర్ల భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఎల్లో బుక్కును అచ్చేయవలసిన అవసరం రావచ్చు. సరిగ్గా 30 ఏళ్ళ కింద ఎన్టీఆర్‌కు చంద్రబాబు బృందం వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్న సంగతి జగమెరిగిన చరిత్ర. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆయన ఆత్మకు సైతం బాబు పార్టీ వెన్నుపోటు పొడవడం విస్మయానికి గురి చేస్తు న్నది. మరణానికి ముందు వివిధ ఇంటర్వ్యూలలో, ప్రెస్‌ మీట్‌ లలో చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ ఏమని మాట్లాడారో తెలి యని వారెవరు?తండ్రిని కారాగారంలో బంధించి, సోదరులను హతమార్చి సింహాసనాన్ని హస్తగతం చేసుకున్న ఔరంగజేబుతో చంద్ర బాబును ఎన్టీఆర్‌ పోల్చారు. తన దగ్గర వినయం నటిస్తూనే పథకం ప్రకారం గోతులు తవ్విన నమ్మకద్రోహిగా నిందించారు. చరిత్ర హీనుడు అతగాడని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై ఎన్టీఆర్‌ చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. అంతలోనే ఆయన ఆత్మ (అటువంటివి ఉంటాయని నమ్మితే) యూ–టర్న్‌ తీసుకున్నట్టు ఎలా చిత్రించగలిగారు? జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న పార్టీ వెయ్యేళ్ల భారత చరిత్రను తిరగరాసే పనిలో ఉన్నది. అదే స్ఫూర్తితో ఈ ముప్ఫయ్యేళ్ల ఆంధ్ర చరిత్రను బాబు కూటమి తిరగరాయాలని భావిస్తున్నదా? గూగుల్‌లో వెన్నుపోటు అనే అక్షరాలు టైప్‌ చేస్తే చంద్రబాబు బొమ్మ కనిపించని రోజు రావాలని ప్రయత్నిస్తున్నదా? ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోతుందనే గోబెల్స్‌ సూత్రాన్ని గడచిన 30 ఏళ్లుగా చంద్రబాబు పార్టీ, ఎల్లో మీడియా బాగా ఒంట పట్టించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటినుంచే ప్రయత్నం చేస్తే ఇంకో పదేళ్లకో, ఇరవై ఏళ్లకో వెన్నుపోటు కథను బుట్టదాఖలు చేయవచ్చనే విశ్వాసంతో ఉన్నట్టు కనిపిస్తున్నది. అటువంటిదేమీ జరగలేదని, ఎన్టీఆర్‌ ప్రోద్బలంతోనే, ఆయన ఆశీర్వాదంతోనే చంద్రబాబు ఈ పవిత్ర కార్యాన్ని నెరవేర్చారని చెప్పే కొత్త పరిశోధనలు కూడా ఎల్లో మీడియా వెలువరించవచ్చు. అందుకు ఈ మహానాడులో నాంది పలికారనుకోవాలి.ఒక పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలో జరుగుతున్న పార్టీ మహాసభల మీద ప్రజలకు కొంత ఆసక్తి ఉంటుంది. ఎన్నికల హామీల అమలుపై సమీక్ష ఉంటుందని, అమలు చేయలేకపోయిన అంశాలపై వివరణ ఉంటుందని, పరిపాలనా తీరుతెన్నులపై ఆడిట్‌ ఉంటుందని ఆశిస్తారు. విచిత్రంగా ఈ మహానాడులో ఇవేమీ జరగలేదు. ప్రతిపక్ష నాయకుడైన జగన్‌ మోహన్‌ రెడ్డిని తిట్టిపోయడమనేది ప్రతి వక్త ప్రసంగంలోనూ తప్పనిసరి అంశంగా నిర్ధారించినట్టున్నారు. అధి నేతల దగ్గర మార్కులు కొట్టేయడానికి వక్తలందరూ దాన్ని తూచా తప్పకుండా పాటించారు.మహానాడు తేదీలకు ముందే తెనాలిలో జరిగిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. దళిత యువకులను బహిరంగంగా నడిరోడ్డుపై పడుకోబెట్టి వారి కాళ్లు కదలకుండా ఒక పోలీసు తొక్కిపట్టి మరో పోలీసు అధికారి వారి అరికాళ్ళ మీద లాఠీతో బాదుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. బాధతో ఆ యువకులు చేస్తున్న ఆర్తనాదాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ అమానుష ఘటన మహానాడులో చర్చకు వచ్చి ఉండాలి. హోం మంత్రి సంజాయిషీ ఇచ్చి ఉండాలి. అటువంటి దేమీ లేకపోగా జరిగిన సంఘటనను పోలీసు ఉన్నతాధికారులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు.మహానాడు సమయంలోనే టెన్త్‌ క్లాస్‌ పరీక్ష పత్రాల రీవాల్యుయేషన్‌ బాగోతం బయటపడింది. పరీక్ష పత్రాల మూల్యాంకనం ఒక ప్రణాళిక, పద్ధతి లేకుండా ఇష్టారాజ్యంగా జరిగి, ఆరు లక్షల కుటుంబాల్లో ఆవేదన నింపింది. ఫలితంగా ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు పెట్టుకున్నారు. పదకొండు వేల పరీక్షా పత్రాల మార్కుల లెక్కింపులో పొరపాట్లు జరిగినట్టు వెల్లడైంది. ఆ పొరపాటు ఒకటి రెండు మార్కులు కాదు. కొన్ని పేపర్లలో యాభై మార్కుల వరకు తేడాలొచ్చాయి. కొన్ని సమాధానాలకు మార్కులే వేయని వైనం కూడా బయటపడింది. ఇది అసా ధారణం. రికార్డు సమయంలో ఫలితాలు వెల్లడించాలన్న దుగ్ధతో టీచర్ల మెడ మీద కత్తి పెట్టినందువల్లనే ఇలా జరిగిందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.జగన్‌ మోహన్‌ రెడ్డి అపురూపంగా చూసుకున్న విద్యా వ్యవస్థను ఒక్క ఏడాదిలోనే నేలకేసి కొట్టిన ఈ నిర్లక్ష్యంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతున్నది. దీనిపై మహానాడులో చర్చ జరిగి ఉండాలని జనం కోరుకుంటారు. విద్యామంత్రి వివరణ ఇస్తారని ఆశిస్తారు. కానీ ఆయన వివరణ ఇవ్వలేదు. హాజరైన ప్రతినిధులు అడిగే సాహసం చేయలేదు. ఈ రెండు అంశాలే కాదు, పాలనాపరమైన ఏ అంశం పైనా చర్చ జరగ లేదు. నిర్వాహకులు రాసిచ్చిన తీర్మానం కాపీని చదవటమే నాయకులు చేసిన పని. ఎన్నికలకు ముందు ఇబ్బడిముబ్బడిగా చేసిన వాగ్దానాల గురించి గానీ, అందులో ముఖ్యమైన ‘సూపర్‌ సిక్స్‌’ గురించి గానీ ఏ చర్చా లేదు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి నట్టున్నారు. 15 నెలల అధికారం కరిగిపోయిన తర్వాత అమలు చేస్తారట! త్వరలో ‘తల్లికి వందనం’ ఇస్తామని చెబుతున్నారు. 80 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన గత సంవత్సరపు బకాయి గురించి మాత్రం మాట్లాడటం లేదు. ‘అన్నదాతా సుఖీభవ’, ‘నిరుద్యోగ భృతి’, ‘ఆడబిడ్డ నిధి’ వంటి కీలకమైన హామీల సంగతి మాట మాత్రంగానైనా మహానాడులో ప్రస్తావనకు రాలేదు.మరి మహానాడులో ఏం మాట్లాడారు? తండ్రి–కొడుకుల భజన, ప్రతిపక్ష నేతపై దూషణ... ఈ రెండూ కంపల్సరీ సబ్జెక్టులుగా కనిపించాయి. వీటితో పాటు అసత్య వాణి, మోసపూరిత వైఖరి, వంచనా శిల్పం, అధికార దాహం అనే నాలుగు అంశాలు మహానాడులో అంతర్లీనంగా ప్రవహించాయి. చరిత్రను వక్రీకరించే విధంగా కృత్రిమ మేధ సాయంతో ఎన్టీఆర్‌ ’ఆత్మ’ పేరుతో చెప్పించిన మాటల దగ్గర నుంచి మూడు రోజులపాటు జరిగిన అన్ని ఉపన్యాసాల్లో అసత్యాలు, అర్ధసత్యాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఎన్టీఆర్‌ పట్ల ప్రకటించిన భక్తి, వినయం అన్నీ బూటకమేనని, మోసపూరితమైనవని సభ జరిగిన తీరే తేటతెల్లం చేసింది.ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారం దక్కాలన్న కోరిక తెలుగుదేశం శ్రేణులతో పాటు తెలుగు ప్రజల్లో చాలామందికి ఎప్పటినుంచో ఉన్నది. ఆ కోరిక మేరకు కనీసం కంటి తుడుపుగా ఒక తీర్మానాన్ని కూడా మహానాడు ఆమోదించలేదు. నిజానికి ఆ పురస్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేగల స్థితిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఆ పార్టీ మద్దతుపైనే కేంద్ర సర్కార్‌ ఆధారపడి ఉన్నది. అయినా చంద్రబాబు ఆ డిమాండ్‌ చేయరు. గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను చక్రం తిప్పానని చంద్రబాబు పలుమార్లు చెప్పుకున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కావాలనే డిమాండ్‌ మాత్రం ఆయన ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు కూడా చేయబోరని మహానాడు మరోసారి నిరూపించింది. ఈ మహానాడులో నందమూరి వంశస్థులు ఎవరూ కనిపించలేదని చెబుతున్నారు. బహుశా వచ్చే మహానాడులో నందమూరి తారక రామారావు బొమ్మ కూడా అదృశ్యం కావచ్చు.వంచనా శిల్పం కూడా అడుగడుగునా కనిపించింది. ఎన్నికలకు ముందు చేసిన ‘సూపర్‌ సిక్స్‌’ను పక్కన పెట్టి యువనేత శాసన ‘సిక్స్‌’ను ప్రవేశపెట్టారు. ఈ శాసనాలకు రూపకర్తలు ఎవరో చెప్పలేదు గనుక వాటి గురించి ప్రసంగించిన ఆయననే ఏకసభ్య శాసనసభగా పరిగణించాలి. అందులో 1) తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2) యువగళం, 3) స్త్రీ శక్తి,4) పేదల సేవలో సోషల్‌ రీ ఇంజనీరింగ్, 5) అన్నదాతకు అండగా, 6) కార్యకర్తే అధినేత. ఈ పదబంధాల అర్థతాత్పర్యాలను ఏలినవారు ప్రత్యేకంగా విడుదల చేసిన తర్వాతే వీటి గుణ దోషాల గురించి మాట్లాడగలుగుతాము. మహానాడులో కనిపించిన మరో అంశం అంతులేని అధికార దాహం. స్వయంగా పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి తరతరాలు తమ కుటుంబమే పరిపాలించాలన్న కోరికను ఎటువంటి శషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టి చెప్పారు. ఒకసారి గెలిపించటం మరోసారి ఓడించడం వంటి వైకుంఠపాళీ వద్దని, ఎప్పటికీ తమనే గెలిపించినట్లయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లేదంటే లేదని ఆయన మనోగతాన్ని బయటపెట్టారు. ఇదీ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

YS Jagan Slams Nara Lokesh Chandrababu Over 10th Valuation Errors2
బాబుగారూ.. ‘టెన్త్‌’లో మీరు, మీ కొడుకు ఫెయిల్‌: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, విద్యా వ్యవస్థే ఇలా ఉంటే మిగతా వాటిని ఎంత ఘోరంగా నడుపుతున్నారోనని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) చురకలంటించారు. ఈ మేరకు నాలుగు పాయింట్లతో కూడిన సందేశాన్ని ఆయన తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌(Nara Lokesh) టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని(10th Papers Valuation) కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది.సుమారు 6.14 లక్షల మంది రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు, ఘోరంగా విఫలమై, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్‌కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తంచేసే పరిస్థితిని తీసుకు వచ్చారు. మీరు చేసిన తప్పులు కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్‌ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 1.@ncbn గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌ టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2025 .. చంద్రబాబుగారూ(Chandrababu Gaaru) దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా?మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దుచేశారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు.చంద్రబాబుగారూ… మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్‌ చేయండి. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్‌ మార్క్స్‌ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజులపాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను’’ అని జగన్‌ తన పోస్టులో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీ టెన్త్‌ ఫలితాలు సరైనవేనా?

bridge collapse Bryansk region Train Accident in Russia3
రష్యాలో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి, గాయాలు

మాస్కో: రష్యాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు ప్రయాణికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం రాత్రి వంతెన కూలిపోయింది. అదే సమయంలో ప్యాసింజర్‌ రైలు వెళ్తున్న కారణంగా సదరు రైలు ప్రమాదానికి గురైంది. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలోని రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, దాదాపు 30 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.⚡ BREAKING Russian Emergency crews are cutting through metal train cars to rescue trapped passengers. The Klimov–Moscow train was crushed after the blast, caused by the detonation of a bridge support in the Vygonichsky district of Russia’s Bryansk region.#Russia #Bryansk https://t.co/X6oD1mZJUk pic.twitter.com/RZoahsb4wC— ⚡𝙉𝙊𝙄𝙎𝙀 𝘼𝙇𝙀𝙍𝙏𝙎 (@NoiseAlerts) May 31, 2025ఈ సందర్భంగా బ్రయాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ అలెగ్జాండర్ బొగోమాజ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాదం నేపథ్యంలో అత్యవసర సేవలు, ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. మృతిచెందిన వారిలో రైలు లోకో పైలట్‌ కూడా ఉన్నారు. ప్యాసింజర్‌ రైలు మాస్కో నుండి క్లిమోవ్‌కు వెళుతోందని అన్నారు.BREAKING: Multiple dead and wounded after bridge collapses onto passenger train in Russia's Bryansk region, according to BazaSabotage is suspected pic.twitter.com/S4v4c0aXfJ— Faytuks News (@Faytuks) May 31, 2025అయితే, గత మూడేళ్లుగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రయాన్స్క్‌ ప్రాంతం రష్యా, ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉండటంతో డ్రోన్‌ దాడులు, బాంబు దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే దాడుల ప్రభావంతో వంతెన కూలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.

9 Killed in Arunachal After Landslide 5 Killed in Assam4
ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి

గౌహతి: దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇదే తరుణంలో గత రెండు రోజుల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 30 మంది మృతి చెందారు. అస్సాం, అరుణాచల్, మేఘాలయ, మణిపూర్, మిజోరం(Assam, Arunachal, Meghalaya, Manipur, Mizoram) రాష్ట్రాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలతో అతలాకుతలమవుతున్నాయి. అస్సాంలోని 12 జిల్లాల్లోని 60 వేల మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు.అరుణాచల్ ప్రదేశ్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో తొమ్మిది మంది మృతిచెందారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కామెంగ్ జిల్లాలో ఒక కారులపై కొండచరియలు విరిగిపడటంతో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో గత 24 గంటల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఆరు జిల్లాల్లో వరదలు సంభవించాయి. 10 వేలకుపైగా జనం వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.గౌహతి శివార్లలోని బోండా ప్రాంతంలో కొండచరియలు(Landslides) విరిగిపడి, ముగ్గురు మహిళలు మరణించారని పట్టణ వ్యవహారాల మంత్రి జయంత మల్లా బారువా తెలిపారు. గౌహతిలో 111 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది 67 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. బ్రహ్మపుత్రతో సహా ఈశాన్యంలోని పలు నదులలోని నీటి మట్టం పెరిగింది. శనివారం రాత్రి జిరోలోని పైన్ గ్రోవ్ సమీపంలోని ఒక రెస్టారెంట్‌పై కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌), ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు (ఐటీబీపీ) సహాయక చర్యలు చేపడుతున్నారు.ఇది కూడా చదవండి: మావోయిజం అంతం? గణాంకాలివే..

England Lions Fight Back After Karun Nairs Double Ton Takes India A To Big Total5
కరుణ్ డబుల్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఎ భారీ స్కోర్‌

కాంటర్‌బరీ వేదికగా ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో జ‌రుగుతున్న మొద‌టి అన‌ధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ జట్టు భారీ స్కోరు చేసింది. దేశవాళీల్లో నిలకడైన ప్రదర్శన కనబర్చి ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికైన కరుణ్‌ నాయర్‌ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కరుణ్‌ నాయర్‌ 281 బంతుల్లో 26 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 204 ప‌రుగులు చేశాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 409/3తో శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ ‘ఎ’ చివరకు 125.1 ఓవర్లలో 557 పరుగులకు ఆలౌటైంది.వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురేల్‌ (120 బంతుల్లో 94; 11 ఫోర్లు, 1 సిక్స్‌) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొట్టిన ఆంధ్రప్రదేశ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (7) విఫలమయ్యాడు. శార్దుల్‌ ఠాకూర్‌ (27), హర్ష్‌ దూబే (32), అన్షుల్‌ కంబోజ్‌ (23) తలా కొన్ని పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ లయన్స్‌ బౌలర్లలో జోష్‌ హాల్, జమాన్‌ అక్తర్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 52 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. టామ్‌ హైన్స్‌ (147 బంతుల్లో 103 నాటౌట్‌; 11 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా... మ్యాక్స్‌ హోల్డెన్‌ (61 బంతుల్లో 64 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. ఎమిలియో (46) ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్‌లో సత్తాచాటిన భారత ‘ఎ’ ఆటగాళ్లు... బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఇంగ్లండ్‌ లయన్స్‌ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు.అన్షుల్‌ కంబోజ్, హర్ష్‌ దూబే చెరో వికెట్‌ పడగొట్టగా... ముకేశ్‌ కుమార్, హర్షిత్‌ రాణా భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయిన నితీశ్‌ రెడ్డి బౌలింగ్‌లో 3 ఓవర్లే వేసి 27 పరుగులు సమరి్పంచుకున్నాడు. నాలుగు రోజుల ఈ పోరులో... చేతిలో 8 వికెట్లు ఉన్న ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టు భారత్‌ ‘ఎ’ స్కోరుకు ఇంకా 320 పరుగులు వెనుకబడి ఉంది. టామ్‌ హైన్స్, హోల్డన్‌ క్రీజులో ఉన్నారు. మూడో రోజు భారత బౌలర్లు ఎలాంటి ప్రభావం కనబరుస్తారో చూడాలి.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌ టూర్‌.. టీమిండియా మేనేజ‌ర్‌గా యుధ్‌వీర్‌

Will Pawan Kalyan Priority Decrease In The Coalition Government6
పొత్తుపై పవన్ పునరాలోచన!.. వైరాగ్యమా.. వికారమా!!

పవన్ కళ్యాణ్‌కు అధికారం సంపాదించడంలో ఉన్నంత ఆరాటం.. నేడు ప్రజల కోసం చేస్తున్న పోరాటంలో కనిపించడంలేదు.. ఏదో చేసేద్దాం అనుకుని వచ్చాను.. ఏమీ చేయలేకపోతున్నానంటున్నారు. తనకు జ్ఞనోదయం అయిందా?. విషయం అవగతమైందా?. చంద్రబాబు నీడలో తన ఉనికి తనకే కనిపించక కళ్లు మసకలు.. బైర్లు కుమ్ముతున్నాయా తెలియని పరిస్థితుల్లో పవన్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తనలోని నైరాశ్యాన్ని నిర్వేదాన్ని వెళ్లగక్కారు..వాస్తవానికి ఆయన ప్రభుత్వ పరంగా డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయనకు ప్రభుత్వ నిర్ణయాలు.. పాలసీలతో సంబంధం లేకుండా పోతోంది. ఎంతసేపు లోకేష్‌ను ఎలివేట్ చేసి రేపు ఆయన్ను సీఎంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న చంద్రబాబు పవన్ను జస్ట్ పెయిడ్ రౌడీ మాదిరిగా మాత్రమే వాడుకుంటూ పక్కన పెట్టేస్తున్నారు. అంటే పాత సినిమాల్లో సత్యనారాయణ జస్ట్ ఇలా చప్పట్లు కొట్టి జగ్గూ అనగానే పెద్ద కండలతో ఒక రౌడీ వచ్చి హీరో మీద దాడి చేస్తాడు కదా.. ఆ టైప్ పాత్రకు తనను వాడుకుంటున్నట్లు పవన్ గ్రహించారు.ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పరిణామాలు ఎదురైనప్పుడు మాత్రమే తనను వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టేస్తున్న విషయం పవన్ గ్రహించారు.. అందుకే తన అసంతృప్తిని తాజాగా వెళ్లగక్కారు. తన 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్నాను కానీ పరిస్థితులు చూస్తుంటే మాట మార్చాల్సి వచ్చేలా ఉందని చెప్పేశారు. రాష్ట్రంలో క్రైమ్ పెరిగిపోతుందని అంటూ అధికారులు ఇంకా ప్రభుత్వానికి సహకరించడం లేదని పవన్ నిందారోపణ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో అధికారం మొత్తం చంద్రబాబు.. లోకేష్ చేతిలో మాత్రమే ఉంది వారు చెప్తే తప్ప పూచిక పుల్ల కూడా కదలని పరిస్థితి.ఆఖరికి తన పంచాయతీరాజ్ అటవీ శాఖల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది. లోకేష్ చెబితే తప్ప పవన్ శాఖలో కూడా ఏమీ జరగడం లేదు. అంటే కేవలం తన ఇమేజ్ ద్వారా ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు ఇప్పుడు తన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు పాటలు వేస్తున్నారు తప్ప తనకు ఏ రకమైన గౌరవ మర్యాదలు రాజకీయ ప్రాధాన్యం దక్కనివ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తన అంతరంగికుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది. తనను కేవలం ఓట్ల తెచ్చే యంత్రంగా వాడుకొని ఇప్పుడునట్లు లూజ్ చేసి పక్కన పడేస్తున్నారు అని పవన్ గ్రహించారు. అందుకే పొత్తుల విషయమై ఆయన బరస్ట్ అయినట్లుగా తెలుస్తుంది.దీంతోపాటు రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆగడాలు రౌడీయిజం కూడా పవన్‌లో ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ హత్యలు. అత్యాచారాలు సాధారణమైనాయి.. ఉద్యోగుల పట్ల కూడా తెలుగుదేశం నాయకులు అమర్యాదగా ప్రవర్తిస్తూ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేస్తున్నారు. వాస్తవానికి అధికరణకు వచ్చిన కొత్తల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను కక్ష పూర్తి రాజకీయాలు చేయబోనని.. వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై దాడులకు తాను వ్యతిరేకం అని చెప్పారు. కానీ నేడు జరుగుతున్నది దానికి విరుద్ధంగా ఉన్నది. పల్లెలు పట్టణాలు గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు పూర్తిగా ఆధిపత్యం సాధించే దిశగా వెళుతూ ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మీద దాడులు హత్యలకు పాల్పడుతున్నారు.ఇదంతా పవన్ కళ్యాణ్ గమనించి తన అసంతృప్తిని ఇలా వెళ్లగక్కారని అంటున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఆరోపించారు. నేడు అంతకుమించి దారుణాల జరుగుతున్నాయి దీనికి పవన్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. అందుకే తాను 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్న పరిస్థితులు అలా లేవంటూ ఇప్పుడు తాను పునర్ ఆలోచిస్తున్నట్లుగా ఆయన మాటలు చెబుతున్నాయి.వచ్చే నాలుగేళ్లలో పవన్ పరిస్థితి ప్రభుత్వంలో మరింత దిగజారితే.. లోకేష్ ప్రాబల్యం ప్రాధాన్యం పెరిగితే అప్పుడు జనసేన ని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం తనను డిప్యూటీ సీఎం హోదాలో ప్రోటోకాల్.. బుగ్గ కారు.. ఓ ఆఫీసు ఓ పదిమంది స్టాఫ్ మినహా ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం పాలసీల విషయంలో తన సంప్రదించకపోవడం వంటి అంశాలు పవన్ను ఇబ్బంది పెడుతున్నాయి. తనకు రాజకీయంగా జీరో నాలెడ్జ్ అని భావించడం వల్లనే చంద్రబాబు కూడా తనను చిన్నచూపు చూస్తున్నారని పవన్ లోలోన మదన పడుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన మనసులోని ఆవేదనను ఈ విధంగా వెళ్లగక్కి చంద్రబాబుకు ఇండికేషన్ పంపించినట్లుగా జన సైనికులు భావిస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న

WhatsApp Will Stop Working on These iPhones and Android Phones7
ఈ ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు!

ఒకటో తేదీ వచ్చిందంటే.. దాదాపు చాలా రూల్స్ మారిపోతాయి. క్రెడిట్ కార్డుల దగ్గర నుంచి గ్యాస్ ధరల వరకు.. చాలా మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా ఈ రోజు (జూన్ 1) నుంచి కొన్ని ఐఫోన్‌లు & ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ చర్య 2025 మే 1వ తేదీ నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కొంచెం ఆలస్యం కావడంతో.. వినియోగదారులు తమ ఫోన్‌లను మార్చుకోవడానికి సమయం దొరికింది.వాట్సప్‌కు సపోర్ట్ చేయని మొబైల్స్..➤ఐఫోన్ 5ఎస్➤ఐఫోన్ 6➤ఐఫోన్ 6 ప్లస్➤ఐఫోన్ 6ఎస్➤ఐఫోన్ 6s ప్లస్➤ఐఫోన్ ఎస్ఈ (ఫస్ట్ జనరేషన్)➤శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4➤శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3➤సోనీ జెడ్‌పీరియా జెడ్1➤ఎల్‌జీ జీ2➤హువావే అసెండ్ పీ6➤మోటో జీ (ఫస్ట్ జనరేషన్)➤మోటరోలా రేజర్ హెచ్‌డీ➤మోటో ఈ 2014జాబితాలోని అన్ని ఫోన్‌లు చాలా పాత వెర్షన్‌లు. అయితే కొన్ని ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్ అప్డేట్ సాధ్యమైతే.. వాట్సప్‌ పనిచేసే అవకాశం ఉంది.ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయకపోవడానికి ప్రధాన కారణం.. భద్రతా ప్రమాణాలే అని తెలుస్తోంది. యాపిల్ ఇకపై పాత iOS వెర్షన్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందించదు. కాబట్టి ఈ పరికరాల్లో భద్రత లోపిస్తుంది. భద్రతా లోపం సమస్యలను తీసుకొచ్చే ప్రమాదం ఉంది.గత కొన్ని నెలలుగా, వాట్సాప్ వినియోగదారుల గోప్యతను బలోపేతం చేయడం.. వ్యక్తిగత డేటాను రక్షించడం లక్ష్యంగా అనేక అప్డేట్స్ చేస్తూనే ఉంది. చాట్‌లు, సమూహ సంభాషణల నుంచి ఇతరులు టెక్స్ట్, ఫోటోలు లేదా వీడియోలను కాపీ చేయకుండా నిరోధిచడమే లక్ష్యంగా సంస్థ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తీసుకొస్తోంది. అంతే కాకుండా.. వాట్సాప్ చాట్ లాక్ వంటి మెరుగైన ఫీచర్స్ కూడా ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులు పాస్‌వర్డ్, వేలిముద్ర లేదా ఫేస్ ఐడితో వ్యక్తిగత చాట్‌లను సురక్షితంగా ఉంచడానికి అనుమతిస్తుంది.

The Most Life-Destroying Word of All is Tomorrow Says Robert Kiyosaki8
జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

ప్రముఖ ఆర్థిక విద్యావేత్త రాబర్ట్ కియోసాకి పేరు చెప్పగానే.. ముందుగా గుర్తొచ్చేది ఆయన రాసిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తకమే. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతాయి, ఆర్ధిక సంక్షోభం రానుంది అని సంచనల ప్రకటనలు చేసిన.. ఈయన మరో గొప్ప మాట సెప్పరూ. జీవితాన్ని నాశనం చేసే పదం, అన్నినీటికంటే ప్రమాదమైంది ఏదనే విషయాన్ని స్పష్టం చేశారు.జీవితాన్ని అన్నింటికంటే ఎక్కువ నాశనం చేసేది 'రేపు' అని వాయిదా వేయడం. వాయిదా వేయడం వల్ల కలిగే నష్టాల గురించి చెబుతూ.. పెట్టుబడి పెట్టడానికి, రుణాలను పరిష్కరించడానికి లేదా ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి వేచి ఉండటం ఒక వ్యక్తి ఆర్థిక భవిష్యత్తును గణనీయంగా దెబ్బతీస్తుందని, ఆలస్యం చిన్న సమస్యలను సైతం అధిగమించలేని అడ్డంకులను తీసుకొస్తుందని పేర్కొన్నారు.రిచ్ డాడ్ పూర్ డాడ్ ద్వారా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన కియోసాకి.. దశాబ్దాలుగా ఆర్థిక అక్షరాస్యత, సాధికారత & తక్షణ చర్య వంటి వాటి గురించి చెబుతూనే ఉన్నారు. పెట్టుబడులు లేదా ఆర్థిక విద్యను ఆలస్యం చేయడం వల్ల అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని, ఇది కాలక్రమేణా గణనీయమైన నష్టాలకు దారితీస్తుందని అతని బోధనలు నిరంతరం హైలైట్ చేస్తాయి.రేపు అన్న పదం కేవలం అప్పటికి ఉపశమనం కలిగించవచ్చు. కానీ ఇది బరువును పెంచేస్తుంది. వాయిదా లేదా ఆలస్యం అనేది కేవలం ఒక తాత్విక అంశం కాదు. ఇది మారుతున్న ఆర్థిక వాతావరణంలో లోతుగా ప్రతిధ్వనించే ఆచరణాత్మక హెచ్చరిక. 'రేపు' అనే పదం చిన్నదే కావచ్చు, కానీ పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇది ఒకరి ఆర్థిక భవిష్యత్తును నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి 2024 - 2025 అంతటా, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మార్కెట్ అనూహ్యత ప్రపంచవ్యాప్తంగా చాలా కుటుంబాలపై విపరీతమైన ఒత్తిడిని కలిగించాయి. కియోసాకి సలహాను పాటించిన వ్యక్తులు, రుణాన్ని నిర్వహించడం, అత్యవసర పొదుపులను సృష్టించడం లేదా వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితులను ముందుగానే పరిష్కరించుకున్న వ్యక్తులు, సాధారణంగా చర్యను వాయిదా వేసిన వారి కంటే ఈ తుఫానులను మరింత విజయవంతంగా ఎదుర్కొన్నారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి "రేపు"పై ఆధారపడిన వారు ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుల్లో కూరుకుపోయారు.. ఆర్థిక స్వాతంత్ర్యానికి దూరంగా ఉన్నారని పలువురు చెబుతున్నారు.

Milk is a must have for Children9
బొద్దింక పాలు: మీరు ఎప్పుడూ చూడని సూపర్‌ఫుడ్!

ఒక పూట పాలు లేకపోతే, ఆ రోజు ఎంత కష్టంగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఉదయాన్నే టీ, కాఫీలు పెట్టుకోవడం దగ్గర నుంచి, రాత్రిపూట మజ్జిగ తాగే వరకు ఇంట్లో ఏదోరకంగా పాల అవసరం కనిపిస్తూనే ఉంటుంది. పెరుగు, వెన్న, నెయ్యి ఇలా ప్రతి పాల ఉత్పత్తితోనూ రోజువారీ అవసరాలు, అలవాట్లు ముడిపడే ఉంటాయి. అందుకే, కుదిరితే పాడినయినా పెంచుకుంటాం, లేదా పాలకేంద్రంలో ఖాతానైనా పెట్టుకుంటాం. ఏదేమైనా రోజుకు లీటరో అరలీటరో పాలు స్టవ్‌ మీద కాగాల్సిందే! ప్రతి ఇంట్లోనూ పాలకున్న డిమాండ్‌ అలాంటిది.నిజానికి పాలు ఒక సంపూర్ణ ఆహారం. పాలు మన శరీరానికి కావలసిన కాల్షియం, ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు ఇలా చాలా పోషకాలనే అందిస్తాయి. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కాల్షియం చాలా ఉపయోగపడుతుంది. అలాగే కండరాలు, కణజాలాల నిర్మాణానికి ప్రొటీన్‌ ఎంతగానో సహాయపడుతుంది. పాలలో విటమిన్‌–డి, విటమిన్‌–బి12తో పాటు పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. పాలు తాగటంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పాలు ఎముకలను బలపరుస్తాయి, కండరాలను అభివృద్ధి చేస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అన్ని వయసుల వారికి పాలు ఒక ముఖ్యమైన పోషకం. పిల్లలు ఎదగడానికి, పెద్దలు ఆరోగ్యంగా ఉండటానికి పాలు చాలా అవసరమని డాక్టర్లు ఎప్పుడూ చెబుతుంటారు.మనిషి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి పాడిని పెంచి, పాలను వినియోగించుకోవడం మొదలుపెట్టాడని చరిత్ర చెబుతోంది. అంటే దాదాపు పదివేల సంవత్సరాల క్రితం నుంచే, పశువుల పాలతో ప్రయోజనాలను అందుకుంటున్నాం.ఏ జంతువుల పాలు.. ఏమేమి ఫలితాలు?పాలల్లో ఆవు పాలు శ్రేష్ఠమైనవి. ఇక గేదె పాలు, మేక పాలు, ఒంటె పాలు కూడా అనేక సంస్కృతులలో ప్రత్యేకంగా వినియోగిస్తారు. ప్రత్యేక రుచి, పోషక విలువలు, ప్రత్యేక లక్షణాల కారణంగా వాటి పాలను వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.బొద్దింక పాలుకీటకమైన ఈ బొద్దింకల నుంచి పాలను తియ్యడం చాలా అసాధారణమైన పని. పసిఫిక్‌ బీటిల్‌ బొద్దింకలు ‘బొద్దింక పాలు’ అని పిలవబడే ఒక పోషకసమృద్ధ స్ఫటికాకార పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి బొద్దింకల గర్భధారణ సమయంలో వాటి పిల్లలకు పోషణను అందించడానికి ఉపయోగపడతాయి. ఇవి అధిక ప్రొటీన్‌ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. వీటిని మనుషులు వినియోగించుకోవడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వాణిజ్యపరంగా బొద్దింకల పాలను ఉత్పత్తి చేయడం లేదు. దీనిని ఒక ‘సూపర్‌ ఫుడ్‌’గా మార్కెట్‌ చేసే ప్రయత్నాలను కొన్ని పరిశోధనా సంస్థలు సాగిస్తున్నాయి. కానీ ఇది కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సాంకేతిక, ఆర్థిక, సామాజిక అడ్డంకులు చాలా ఉన్నాయి.ఆవు పాలుఇవి ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పాలు. ఇవి కాల్షియం, ప్రొటీన్, విటమిన్‌–డిలతో నిండి ఉంటాయి. ఈ పాలను నేరుగా తాగడానికి, పెరుగు, వెన్న, చీజ్‌ వంటి ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు.గొర్రె పాలు ఇవి చాలా పోషకమైనవి, వీటిలో కొవ్వు, ప్రొటీన్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. గొర్రె పాలను ఎక్కువగా చీజ్‌ తయారీకి వినియోగిస్తారు. ముఖ్యంగా ఫెటా, రోక్ఫోర్ట్‌ వంటి చీజ్‌లు వీటితోనే తయారు చేస్తారు.గేదె పాలుఆవు పాల కంటే ఈ పాలల్లో కొవ్వు, మినరల్స్, ప్రొటీన్‌లు కొంత ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా భారతదేశం, పాకిస్తాన్, ఇటలీ వంటి దేశాలలో ఎక్కువగా దొరుకుతాయి. పెరుగు, మొజారెల్లా చీజ్, ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ఈ పాలనే వినియోగిస్తారు. గేదె పాలు చాలా క్రీమీగా ఉంటాయి. ఇందులో లాక్టోస్‌ కూడా ఎక్కువ.గాడిద పాలుఇవి చాలా అరుదుగా లభిస్తాయి, కానీ వాటి పోషక విలువలు చర్మ సంరక్షణకు, ఉబ్బసం నయం చేయడానికి ప్రసిద్ధి చెందాయి. అందుకే వీటిని చర్మ సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. శిశువులకిచ్చే ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా కూడా సూచిస్తారు.మేక పాలు ఆవు పాల కంటే తేలికగా జీర్ణమవుతాయి. కొంత భిన్నమైన రుచిని కలిగి ఉంటాయి. వీటిలో కాల్షియం, విటమిన్‌–ఎ అధికంగా ఉంటాయి. మేక పాల నుంచి చీజ్, పెరుగులతో పాటు సబ్బులు కూడా తయారు చేస్తారు. ఈ మేక పాలు ప్రపంచ పాల ఉత్పత్తిలో సుమారు 2% వాటాను కలిగి ఉన్నాయి. పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో గత 20 సంవత్సరాలలో దీని ఉత్పత్తి దాదాపు 60% పెరిగింది. మేకపాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అవయవాల పనితీరుకు సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి మంచివి.ఒంటె పాలుపశ్చిమాసియా, ఆఫ్రికాలోని ఎడారి ప్రాంతాలలో ఒంటె పాలు శతాబ్దాలుగా ఒక ముఖ్యమైన ఆహారం. ఈ పాలలో విటమిన్‌–సి, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఒంటె పాలు తేలికగా జీర్ణమవుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్యలకు ఈ పాలు మంచి ఔషధం. ఈ పాలు కొన్ని వైద్యపరమైన ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఈ పాలను ఐస్‌క్రీమ్, చీజ్‌ వంటి ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.గుర్రపు పాలుఖజక్‌స్తాన్, మంగోలియా, తూర్పు ఐరోపాలో గుర్రపు పాలను కూమిస్, అయిరాగ్‌ వంటి సంప్రదాయకంగా పులియబెట్టే పానీయాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పానీయాలు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండటమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. గుర్రపు పాలు తల్లి పాలను పోలి ఉంటాయి. అమైనో ఆమ్లాలు, కొవ్వు శాతం ఈ పాలలో ఎక్కువగా ఉండటంతో చీజ్‌ తయారీకి ఇవి చక్కగా పనికొస్తాయి.మూస్‌ పాలుఇవి చాలా అరుదుగా లభిస్తాయి. వీటిని స్వీడన్, రష్యా, కెనడాలో వాణిజ్యపరంగా ఉపయోగిస్తాయి. మూస్‌ పాలను చీజ్, పెరుగు, ఐస్‌ క్రీమ్‌ తయారీకి ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్‌లలో మూస్‌ చీజ్‌ ఒకటి.రెయిన్‌ డీర్‌ పాలుసైబీరియా, ఉత్తర స్కాండినేవియా వంటి చల్లని ప్రాంతాలలో నివసించే ప్రజలు రెయిన్‌ డీర్‌ పాలను వినియోగిస్తారు. ఆవు పాల కంటే వీటిలో కొవ్వు, ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటాయి, ఇవి చాలా శక్తిమంతమైన ఆహారం.జిరాఫీ పాలు జిరాఫీ పాలు అసాధారణమైనవి. మానవ వినియోగానికి సాధారణంగా లభ్యం కావు. వీటి పాలలో కొవ్వు, ప్రొటీన్‌ అధికంగా ఉంటాయి. ఇవి జిరాఫీ పిల్లల వేగవంతమైన పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి. అయితే, జిరాఫీల నుంచి పాలు తీయడం చాలా కష్టం. అది పెద్ద సవాలుతో కూడుకున్న పని.యాక్‌ పాలుహిమాలయ ప్రాంతంలో ఈ యాక్‌ పాలు చాలా ప్రత్యేకం. ఇవి ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి, టిబెటన్లు, ఇతర పర్వత నివాసుల ఆహారంలో ఈ పాలను తప్పనిసరి తీసుకుంటారు. ఈ పాలు చిక్కగా, ఎక్కువ కొవ్వులతో ఉండటంతో వెన్న, చీజ్‌ తయారీకి అనుకూలంగా ఉంటాయి.అపోహలు నిజాలుపాలు తాగితే బరువు పెరుగుతారు!ఇది నిజం కాదు. పాలలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా అవసరం. పాలు బరువును పెంచుతాయా లేదా అనేది మీరు తీసుకునే పాల రకం (ఫుల్‌ క్రీమ్, స్కిమ్డ్‌ మిల్క్‌), తీసుకునే పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. క్రీమ్‌ తొలగించిన పాలను తీసుకుంటే క్యాలరీ కంటెంట్‌ తగ్గుతుంది, ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.పాలను ఎక్కువగా కాగబెడితే పోషకాలు తగ్గుతాయి!ఇది పూర్తిగా తప్పు. పాలను కాగబెట్టడంతో అందులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది, పాలు తాగడానికి సురక్షితంగా మారతాయి. పదేపదే మరిగించడంతో పోషకాలకు ఎటువంటి హాని జరగదు.పాలు ఎముకల నుంచి కాల్షియంను బయటకు తీస్తాయి!ఈ అపోహకు శాస్త్రీయ ఆధారాలు లేవు. వాస్తవానికి, పాలు కాల్షియంకు అద్భుతమైన వనరు. ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.పాలు తాగితే కఫం ఉత్పత్తి అవుతుంది!ఈ వాదన పూర్తిగా సరైనది కాదు. దగ్గు సమయంలో స్కిమ్డ్‌ మిల్క్‌ తీసుకోవడంతో కఫం పెరుగుతుందని కొందరు నమ్ముతారు, కానీ పాలు తాగడానికి, కఫం ఉత్పత్తికి ప్రత్యక్ష సంబంధం లేదు.పాలు మొటిమలు రావడానికి కారణమవుతాయి!పాల వినియోగం, మొటిమల మధ్య ప్రత్యక్ష సంబంధానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. జన్యుశాస్త్రం, హార్మోన్లు, మనం తీసుకునే ఆహారం వంటి ఎన్నో అంశాలు చర్మ ఆరోగ్యంలో కీలకంగా మారతాయి.తల్లిపాలు పట్టిస్తున్నప్పుడు తల్లి అనారోగ్యంతో ఉంటే బిడ్డకు పాలు ఇవ్వకూడదు!అనారోగ్యంతో ఉన్న తల్లి, తన పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎటువంటి సమస్య ఉండదు. తల్లికి అనారోగ్యంగా ఉంటే, ఆమె శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. అవి శిశువులకు రక్షణనిస్తాయి. తల్లి నుంచి పిల్లలకు వ్యాధి వ్యాపించడం చాలా అరుదుగా జరుగుతుంది.ముర్రుపాలు బిడ్డకు పట్టించకూడదు!ప్రసవానంతరం లేత పసుపు రంగులో వచ్చే ముర్రుపాలు బిడ్డకు చాలా ముఖ్యమైనవి. అవి రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు, పోషకాలను నిండి ఉంటాయి.పాలు లాభాలుపాలు కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అవి పోషకాల మిశ్రమం. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో పాటు కీలకమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. మన రోజువారీ ఆరోగ్యానికి పాలు ఎంతగానో దోహదపడతాయి. పాలలో ఉండే ప్రధాన పోషకాలు, అవి మన శరీరానికి చేసే మేలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.విటమిన్‌–ఎఇది కంటిచూపుకు ఎంతో అవసరం. కణాల పెరుగుదలను ప్రోత్సహించి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.విటమిన్‌–డిఎముకల ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. శరీరం క్యాల్షియంను సమర్థంగా గ్రహించేలా చేస్తుంది. దాంతో ఎముకలకు పటుత్వం లభిస్తుంది.విటమిన్‌–బి3 (నియాసిన్‌) మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.విటమిన్‌–బి5 (పాంటోథెనిక్‌ ఆమ్లం)శరీరంలోని జీవక్రియలు సజావుగా సాగేందుకు ఈ విటమిన్‌ తోడ్పడుతుంది.విటమిన్‌–బి12నాడీవ్యవస్థ పనితీరుకు, డీఎన్‌ఏ నిర్మాణానికి ఇది అత్యవసరం.విటమిన్‌–ఈఇవి పాలలో తక్కువ శాతం ఉంటాయి. అయితే పాలిచ్చే జంతువులను బట్టి, అవి తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా వ్యత్యాసం ఉంటుంది. మనిషి పాలలో విటమిన్‌ ఈ ఎక్కువగా లభిస్తుంది.క్యాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి, వాటి దారుఢ్యాన్ని కాపాడటానికి ఇది ప్రధాన పోషకం.ఫాస్ఫరస్‌క్యాల్షియంతో కలిసి ఎముకలు, దంతాల నిర్మాణానికి ఫాస్ఫరస్‌ దోహదపడుతుంది.అయోడిన్‌థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తికి అయోడిన్‌ కీలకమైనది, ఇది శరీర విధులను నియంత్రిస్తుంది.సెలీనియంఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌. కణాలను ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షించి, వాటికి రక్షణ కల్పిస్తుంది.జింక్‌రోగనిరోధక శక్తిని కాపాడటంలో జింక్‌ ముఖ్యపాత్ర పోషిస్తుంది. గాయాలు త్వరగా మానేలా కూడా చేస్తుంది.ప్రొటీన్‌కండరాల పెరుగుదలకు ప్రొటీన్‌ అత్యవసరం. కణజాలం నిర్మాణానికి, దెబ్బతిన్న కణజాలం కోలుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది.కార్బోహైడ్రేట్స్‌పాలలోని లాక్టోస్‌ ఒక కీలకమైన కార్బోహైడ్రేట్‌. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.కొవ్వులుకొవ్వులు శరీరానికి శక్తినిస్తాయి. అలాగే విటమిన్లు(ఎ, డి, ఈ వంటివి), శరీరంలో ఇముడ్చుకోవడానికి ఈ కొవ్వులు ఎంతగానో తోడ్పడతాయి.నిజానికి లాక్టోస్‌ అలర్జీ ఉన్నవారు పాలు, పాల పదార్థాలను తీసుకోకూడదు. వాటికి బదులుగా, కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, మొక్కల ఆధారిత పాలు (సోయా మిల్క్, బాదం మిల్క్‌) వంటివి తీసుకోవచ్చు. పాలు అలవాటు ఉన్నవారు, పాలు తాగడంతో ఎలాంటి సమస్య లేనివారు ఏదో ఒక రూపంలో, తగిన మోతాదులో తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

Rasi Phalalu: Daily Horoscope On 01-06-2025 In Telugu10
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. పాతబాకీలు వసూలవుతాయి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి: శు.షష్ఠి రా.12.02 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం: ఆశ్లేష రా.1.42 వరకు, తదుపరి మఖ,వర్జ్యం: ప.2.24 నుండి 4.01 వరకు, దుర్ముహూర్తం: సా.4.46 నుండి 5.38 వరకు, అమృత ఘడియలు: రా.12.15 నుండి 1.50 వరకు.సూర్యోదయం : 5.28సూర్యాస్తమయం : 6.27రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు మేషం... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.వృషభం.... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.మిథునం.... బంధువిరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ధనవ్యయం. కుటుంబసమస్యలు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడులు.కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.సింహం... ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.కన్య.... చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి. భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. నూతన పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.తుల.... దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.వృశ్చికం...... పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. మిత్రులు, కుటుంబసభ్యులతో అకారణంగా వైరం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.ధనుస్సు.... కుటుంబసభ్యులతో వివాదాలు. రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మకరం..... పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కుంభం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.మీనం... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement