కాల్ డ్రాప్ సమస్య గణనీయంగా తగ్గింది..
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించే దిశగా టెలికాం కంపెనీల ప్రయత్నాలు ఫలించినట్టు తెలుస్తోంది. 100 రోజుల కాల్ డ్రాప్ ప్రణాళిక అను అనేక టెలికాంలు విజయవంతంగా అమలు చేశాయి. అనేక టెలికం సర్వీసు ప్రొవైడర్లు కాల్ అమలుచేసిన 100 డేస్ ప్లాన్ సానుకూల ఫలితాలు సాధించినట్టు సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీఓఏఐ)డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ సోమవారం తెలిపారు. కాల్ డ్రాప్ సమస్య వివాదంలో గణనీయమైన వృద్ధిని సాధించినట్టు పేర్కొన్నారు. అయితే ఢిల్లీ లో కొన్ని ప్రదేశాల్లో ఇంకా కాల్ డ్రాప్ సమస్య ఉందన్నారు.
ప్రభుత్వం టెలికాం కంపెనీలకు కాల్ డ్రాప్ సమస్యను మెరుగుపరిచేందుకు జూన్ లో 100 రోజుల రోడ్ మ్యాప్ ఇచ్చింది. దీంతో కాల్ డ్రాప్ పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల నమోదైనట్టు ట్రాయ్ వెల్లడించినట్టు టెలికాం సెక్రటరీ జెఎస్ దీపక్ తెలిపారు. గత జూన్ లో సర్వీస్ ప్రొడైవర్ల సమావేశం నిర్వహించామని, ఆ సందర్భంగా వారు ఈ వందరోజుల ప్లాన్ అమలుకు అంగీకరించినట్టు చెప్పారు. అప్పటినుంచి ట్రాయ్ సమర్పిస్తున్న నివేదికల్లో కాల్ డ్రాప్స్‌లో మెరుగైన ఫలితాలు కనిపించాయని తెలిపారు. 2015 డిసెంబర్ వరకు 54 నెట్‌వర్క్స్‌లో ఎలాంటి పనితీరు కనిపించలేదని, ప్రస్తుతం ఆ నెట్‌వర్క్‌లు 19శాతానికి మాత్రమే తగ్గినట్టు వివరించారు. మొదటి 45 రోజుల్లో 48,000 లకు అదనంగా దేశం అంతటా 100 రోజుల్లో 60,000 బీటీఎస్ బేస్ ట్రాన్సీవర్ స్టేషన్లను)జోడించనున్నట్టు జులై 25న మంత్రి మనోజ్ సిన్హా ప్రకటించారు. ఈ నేపథ్యంలో12 వందల కోట్ల పెట్టుబడితో 60,000 బీటీఎస్ లను ఇన్ స్టాల్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా .ఇదేసమస్యపై టెలికాం కంపెనీల సీఈవోలతో కమ్యూనికేషన్స్ మంత్రి మనోజ్ సిన్హా రేపు(నవంబర్ 1) సమావేశం కానున్నారు.