క్యాంపస్‌లో తుపాకులకు అనుమతి!
చికాగో: యూనివర్సిటీల్లోకి తుపాకులను అనుమతిస్తూ టెక్సాస్ ప్రభుత్వం వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాలో క్యాంపస్‌లోకి తుపాకులను అనుమతిస్తోన్న ఎనిమిదో రాష్ట్రంగా టెక్సాస్ నిలిచింది. 1966లో టెక్సాస్ యూనివర్సిటీలో తీవ్రవాదులు మారణహోమం సృష్టించిన 50 ఏళ్ల తర్వాతా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
న్యాయవాదులతో పాటు యూనివర్సిటీకి చెందిన కొంతమంది ప్రొఫెసర్లు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల శాంతికి విఘాతం కలుగుతుందన్నది వారి ఆందోళన. ఈ విషయంపై డల్లాస్‌కి చెందిన ప్రొఫెసర్ సీమా యాస్మీన్ మాట్లాడుతూ...‘నేను తుపాకులను అనుమతించడానికి భయపడట్లేదు, కానీ విద్యార్థుల మానసిక స్థితి, పరీక్షల ఒత్తిడిలాంటి అంశాలు ఎలాంటి విపరీత పరిణామాలకు దారి తీస్తాయో అన్నదే ఆందోళన కలిగిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.