Canada Open Badminton Tournament
-
కెనడా ఓపెన్ ఫైనల్లో కశ్యప్
కాల్గరి : ఎట్టకేలకు ఈ ఏడాది తొలిసారి ఓ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ ఫైనల్లోకి ప్రవేశించాడు. కెనడా ఓపెన్ సూపర్–100 టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ ఏడాది ఇప్పటివరకు తొమ్మిది టోర్నీల్లో ఆడిన కశ్యప్ ఏ ఒక్క టోర్నీలోనూ ఫైనల్ బెర్త్ దక్కించుకోలేకపోయాడు. కానీ కెనడా ఓపెన్‌లో మాత్రం ఆద్యంతం నిలకడగా రాణిస్తూ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. 70 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ కశ్యప్ 14–21, 21–17, 21–18తో నాలుగో సీడ్ వాంగ్ జూ వీ (చైనీస్ తైపీ)పై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ఫైనల్లో చైనా షట్లర్, ప్రపంచ 126వ ర్యాంకర్ లీ షి ఫెంగ్‌తో కశ్యప్ తలపడతాడు. -
ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్
కాల్గరీ: కెనడా ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ కశ్యప్ 21–12, 21–17తో ల్యుకాస్ కోర్వీ (ఫ్రాన్స్)పై ఘన విజయం సాధించగా... జాతీయ చాంపియన్ సౌరభ్ 21–14, 21–11 తేడాతో బీఆర్ సంకీర్త్ (కెనడా)ను చిత్తు చేశాడు. తర్వాతి మ్యాచ్‌లలో రెన్ పెంగ్ బో (చైనా)తో కశ్యప్, సున్ ఫీ జియాంగ్ (చైనా)తో సౌరభ్ తలపడతారు. టోర్నీలో ఇతర భారత ఆటగాళ్లు అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ మాత్రం ఓటమితో నిష్క్రమించారు. జయరామ్ 19–21, 17–21 స్కోరుతో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. జపాన్‌కు చెందిన కోకి వతనబే 21–16, 21–10తో ప్రణయ్‌ను... వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) 21–7, 21–13తో లక్ష్య సేన్‌ను పరాజయం పాల్జేశారు. -
కశ్యప్ ఓటమి... ప్రణయ్ ముందంజ
కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ కాలగ్రి (కెనడా): భారత సీనియర్ బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్‌లో 16వ సీడ్‌గా బరిలోకి దిగిన కశ్యప్‌కు 10–21, 21–10, 15–21తో కొకి వతనబి (జపాన్) చేతిలో చుక్కెదురైంది. రెండో సీడ్ హెచ్.ఎస్.ప్రణయ్‌తో పాటు అభిషేక్ యెలెగార్, కరణ్ రాజన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో ప్రణయ్ 21–17, 16–21, 21–15తో కియెరన్ మెర్రిలీస్ (స్కాట్లాండ్)పై గెలుపొందగా, అభిషేక్ 21–10, 19–21, 21–17తో హోవార్డ్ షు (అమెరికా)ను ఓడించాడు. కరణ్ రాజన్ 21–16, 21–14తో సామ్ పార్సన్స్ (ఇంగ్లండ్)పై విజయం సాధించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా, తరుణ్ కోన–మేఘన జోడీలు ప్రిక్వార్టర్స్ చేరాయి. తొలిరౌండ్లో సిక్కిరెడ్డి జంట 21–10, 21–19తో డానియెల్–డానిక నిషిముర (పెరూ) ద్వయంపై, తరుణ్ జోడి 21–13, 22–20తో నైల్ యకుర–బ్రిట్నీ టామ్ (కెనడా) జంటపై గెలుపొందాయి. మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో రుత్వికా శివాని 6–21, 21–9, 21–13తో గా యున్ కిమ్ (దక్షిణ కొరియా)పై గెలువగా, రీతుపర్ణా దాస్ 21–9, 18–21, 16–21తో హరుకో సుజుకి (జపాన్) చేతిలో ఓడింది.