మా ఆయన బెయిల్‌ను రద్దు చేయండి
న్యూఢిల్లీ: తన భర్తకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఓ మైనర్ బాలిక ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్త, అతని కుటుంబ సభ్యులు తనను హింసిస్తున్నారని కోర్టుకు మొరపెట్టుకుంది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.
2014లో ఓ యువకుడు బాధిత బాలిక (15)ను అత్యాచారం చేశాడు. ఆ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకే అదే ఏడాది సెప్టెంబర్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ రాజీపడ్డారు. బెయిల్‌పై వచ్చిన నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి అయిన తర్వాత కట్నం కోసం తన భర్త, అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ ఆమె ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. బాలిక మైనర్ అయినందున చట్టప్రకారం ఈ వివాహం చెల్లదని పేర్కొంది. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.