canceld
-
సీపీఎస్ రద్దు కోసం పోరుబాట
గోనెగండ్ల: కొత్త పెన్షన్ విధానం సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వంపై పోరుబాట తప్పదని యూటీఎఫ్ మండల అధ్యక్షకార్యదర్శులు జిక్రియ, నరసింహులు అన్నారు. గురువారం స్థానిక బస్టాండ్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో యూటీఫ్ మండల గౌరవాధ్యక్షుడు రామ్మోహన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సీపీఎస్ విధానం రద్దు కోసం ఉపాధ్యాయులు పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు యూటీఎఫ్ ప్రత్యేక కార్యాచణ రూపొందించిందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి ఆగష్టు 5వ తేదీ వరకు జీపుజాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో మొదలయ్యే ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనుందన్నారు. ఆగష్టు 5న విజయవాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాఘవేంద్ర ఆధ్వర్యంలో సీపీఎస్ మండల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్‌గా లింగన్న, కో–కన్వీనర్‌గా రామచంద్ర, ఉసేన్, సభ్యులుగా శ్రీనివాసరెడ్డి, పురుషోత్తంతోపాటు మరో నలుగురిని ఎన్నుకున్నారు. సమావేశంలో యూటీఎఫ్ నాయకులు శాంతిరాజు, కాశయ్య, నాయక్, పౌల్, రంగన్న, నాగేశ్వరరావు, నజీర్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. 14న సీపీఎస్‌పై దండయాత్ర ఎమ్మిగనూరు రూరల్: సీపీఎస్‌పై ఈ నెల 14న జరపతలపెట్టిన దండయాత్రను జయప్రదం చేయలని ఏపీసీపీఎస్ఈఏ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు కోరారు. గురువారం దండయాత్రకు సంబంధించిన పోస్టరును విడుదల చేశారు. ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని చెప్పారు. ఈ నెల 14న కర్నూలులోని కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు చేపట్టే భారీ ర్యాలీకి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు రాముడు, రామకృష్ణ, నారాయణ, పరుశరాము, ప్రేమకుమార్, రంగన్న, హేమంత్‌కుమార్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఈ బ్యాంక్ లైసెన్స్ రద్దు
లక్నో: ఉత్తరప్రదేశ్ కు చెందిన మెర్కంటైల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ క్యాన్సిల్ చేసింది. గత కొంతకాలంగా ఆంక్షలువిధిస్తూ వచ్చిన మీరట్ లోని ఈ బ్యాంకు లైసెన్స్ ను రద్దు చేస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 5వ తేదీతో ముగియనున్న బ్యాంక్ చెల్లుబాటును సోమవారం రద్దు చేసింది. గత ఏడాది అక్టోబర్ లో సమీక్షించిన కేంద్ర బ్యాంకు ఆరు నెలల పాటు గడువును పొడిగించింది. కాగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్షన్ 35A, సబ్ సెక్షన్ (1) కింద ప్రకారం సెప్టెంబర్ 30, 2015 మొదట ఆంక్షలు విధించింది. అనంతరం అక్టోబర్ 06, 2015 ఆ తర్వాత ఏప్రిల్ 05, 2017 వరకు పొడిగించింది. మార్చి 29, 2016న జారీ చేసిన ఉత్తరువుల ద్వారా బ్యాంకు గడువును పొడిగించారు/సవరించిన సంగతి తెలిసిందే. -
లేఖ కలకలం
ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు రద్దు చేయాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ గ్రామపాలన అధ్వానంగా మారుతుందంటున్న నేతలు కేంద్రం ఆమోదిస్తే జిల్లాలో 1,102 ఎంపీటీసీ, 60 జెడ్పీటీసీ పదవులకు ఎసరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయం జిల్లాలో కలకలం రేపింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే జిల్లాలోని 1,102 ఎంపీటీసీ, 60 జెడ్పీటీసీ పదవులు రద్దవుతాయి. అదే జరిగితే గ్రామ పాలన మరింత అధ్వానంగా మారుతుందని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. మండపేట : పంచాయతీరాజ్ వ్యవస్థలో గతంలో మూడంచెలు ఉండేవి. గ్రామ సర్పంచ్, మండల అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ ఉండేవారు. పరిపాలన సౌలభ్యం కోసం 1994లో అప్పటి ప్రభుత్వం మూడంచెల స్థానంలో ఐదంచెల వ్యవస్థ ఏర్పాటు చేసింది. దీని ప్రకారం పై ముగ్గురితోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు కూడా తోడయ్యారు. మండల పరిషత్ నుంచి ఎంపీటీసీ సభ్యులకు, జిల్లా పరిషత్ నుంచి జెడ్పీటీసీ సభ్యులకు నిధుల కేటాయింపులు జరిగేవి. వారు తమ పరిధిలో అభివృద్ధి పనులకు ఆ నిధులు వెచ్చించేవారు. తమ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మండల, జెడ్పీ సమావేశాల్లో ఆయా సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేసేవారు. ఫలితంగా గ్రామ పాలనలో సౌలభ్యం మరింత పెరిగింది. ఇటువంటి కీలక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని చూడడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు రద్దయితే గతంలో మాదిరిగా సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులు మాత్రమే కొనసాగుతాయి. గ్రామస్థాయిలో ఎన్నికైన సర్పంచులు మండల స్థాయిలో ఎంపీపీలను ఎన్నుకుంటే, ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునేవిధంగా మూడంచెల విధానం ఉంటుంది. కాగా, దాదాపు ఆరు నెలలుగా ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనాల చెల్లింపును నిలిపివేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మొత్తం ఆ పదవుల రద్దుకే పావులు కదుపుతోందన్న విమర్శలు వస్తున్నాయి. కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనం ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు నిధులు, విధులు లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చిన చంద్రబాబు.. నేడు ఆ పదవులనే రద్దు చేయాలని లేఖ రాయడం ఆయన కుట్ర పూరిత రాజకీయాలకు నిదర్శనం. అధికార వికేంద్రీకరణ జరగకుండా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనం. 93వ రాజ్యాంగ సవరణ ప్రకారం కొన్ని అధికారాల బదలాయింపులో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిధులు, విధులు కేటాయిస్తే గ్రామాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే వ్యవస్థ ఇది. దీనిని రద్దు చేయాలనుకోవడం దురదృష్టకరం. – సాకా ప్రనన్నకుమార్, జెడ్పీ ప్రతిపక్ష నేత, రావులపాలెం సరైన ఆలోచన కాదు జెడ్పీటీసీ, ఎంపీటీసీల వ్యవస్థను రద్దు చేయాలన్న ఆలోచన సరైంది కాదు. నాలాంటి గృహిణులు ఈ వ్యవస్థ వల్లే జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నిక కాగలుగుతున్నారు. మండల వ్యవస్థలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఆ మండల స్థాయి అభివృద్ధి కోసం చర్చించుకుంటారు. మండలాల్లో జిల్లా పరిషత్ పనులు, నిధులకు సంబంధించి చర్చించేందుకు కచ్చితంగా మండలం నుంచి ఎన్నికయ్యే జెడ్పీటీసీ సభ్యుడు ఉన్నప్పుడే వాటికి సరైన న్యాయం జరుగుతుంది. – అధికారి జయవెంకటలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు, అమలాపురం రూరల్ పరిషత్తుల్లో ప్రాతినిధ్యం తొలగించేందుకే.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్థానిక సంస్థల అధికారాలను నిర్వీర్యం చేసేదిగా ఉంది. ఐదంచెల పరిపాలనతో గ్రామాభివృద్ధే ఆశయంగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను మూడంచెలకు కుదిస్తే పాలన స్థంభిస్తుంది. గ్రామాల నుంచి మండల, జిల్లా పరిషత్‌లలో ప్రాతినిధ్యం తొలగించేందుకే ఈ వ్యవస్థ రద్దుకు ప్రభుత్వం పూనుకుంటోంది. – పల్లేటి నీరజ, ఎంపీపీ, తుని -
సీపీఎస్ రద్దుకు కేంద్రంతో పోరాటం
–వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకొంది –ఎంపీ మిధున్‌రెడ్డి వెల్లడి బి.కొత్తకోట: ఉద్యోగులకు కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేసేలా కేంద్రంతో పోరాటం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించిందని రాజంపేట పార్లమెంటు సభ్యులు పీవీ.మిధున్‌రెడ్డి వెల్లడించారు. దీనిపై పార్టీ ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. చిత్తూరుజిల్లా బి.కొత్తకోటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దుకు టీడీపీ ప్రభుత్వం కేంద్రం వద్ద గట్టిగా వాదించలేకపోతోందని అన్నారు. ఈ విధానంవల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని, ఇప్పటికే సమస్యపై పార్టీ చర్చించి ఉద్యోగులకు అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కడప–బెంగళూరు రైల్వేలైను పనులకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉన్నా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. రైల్వేమార్గానికి కేంద్ర, రాష్ట్రాలు 50శాతం నిధులు భరించాల్సివుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పనుల్లో తీవ్ర జాప్యం నెలకొందని అన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించానని అన్నారు. విభజన హామీల అమలు కోసం ప్రభుత్వం కేంద్రంవద్ద నోరువిప్పే పరిస్థితుల్లో లేదని అన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.